కాలిన గాయాలు - Burns in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 29, 2018

March 06, 2020

ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు
కాలిన గాయాలు
सुनिए ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కాలిన గాయాలు అంటే ఏమిటి?

కాలిన బొబ్బలు లేక కాలిన గాయాలు బహుశా అత్యంత సాధారణ గాయాల్లో ఒకటి. ఇంట్లోనే, రహదారిపై, పనిచేసేచోట ఇలా ఎక్కడైనా ఓ వ్యక్తి మంటలు బారిన పడి కాలినబొబ్బలతో బాధపడొచ్చు. మనలో ఎక్కువమంది కాలిన గాయం కారణంగా సంభవించిన వేదనను పరిగణలోకి తీసుకుంటారు, అయినప్పటికీ, కాలిన బొబ్బల వల్ల చర్మ కణజాలానికి అయిన హాని వలన, ఆ హానికి గురైన కణాలు చచ్చిపోతాయి.

కాల్పుల కారణంగా ఏర్పడ్డ హాని పరిధిని బట్టి కాలిన బొబ్బలు మారుతూ ఉంటాయి. కాలినగాయాల తీవ్రతను బట్టి వాటిని మొదటి, రెండవ లేదా మూడవ-డిగ్రీ కాలిన బొబ్బలుగా వర్గీకరించడమైంది. నాల్గవ-గ్రేడ్ కాలినబొబ్బలు అంటే ఏమంటే మంటలవల్ల అయిన హాని చర్మం పరిధి దాటి శరీరం లోపలి కండరాలకు, ఎముకలకు మరియు స్నాయువులకు తాకి బాధించినట్లైన వాటినే నాలుగో-గ్రేడ్ కాలినబొబ్బలుగా పేర్కొంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కాలిన బొబ్బల యొక్క స్థాయిని బట్టి దానివల్ల అయినా హాని యొక్క సంకేతాలు మరియు లక్షణాలు చాలా మారుతూ ఉంటాయి.

 • ఫస్ట్ డిగ్రీ కాల్పుబొబ్బలు :
  • కొంచెం వాపు
  • ఎర్రగా మారుతుంది
  • తీవ్రమైన (పదునైన) నొప్పి
  • కాల్పు గాయాలు మానే కొద్దీ చర్మం పొడిగా మరియు చర్మంపై పొర లేచొస్తూంటుంది.
  • కాలిన చర్మం ఊడిపోతే కాల్పులవల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా దాదాపు పూర్తిగా అదృశ్యం అవుతాయి.
 • రెండవ డిగ్రీ కాల్పుబొబ్బలు :
  • కాలిన గాయం చర్మం యొక్క మొదటి పొర దాటి వెళ్లి లోపల భాగాలకు హాని చేసి ఉంటుంది.
  • కాలిన గాయాలు తీవ్రమైన మంట పుట్టిస్తాయి మరియు ఎరుపుదేలుతాయి
  • చర్మంపై బొబ్బలు
  • బొబ్బలు పగలడంతో బొబ్బల లోపల నీళ్ళు, నీరులాంటి ద్రవం చిమ్ముతుంది.   
  • మందమైన, మృదు కణజాలంతో కూడిన చర్మం గాయం మీద ఏర్పడుతుంది.
  • చర్మంపై కాలిన చోట చర్మం రంగులో మార్పు వస్తుంది.
  • చర్మం కాల్పుకు గురై శాశ్వతంగా పాడైపోయి ఉంటే “గ్రాఫింగ్” అవసరం రావచ్చు
 • మూడవ-స్థాయి కాల్పుబొబ్బలు:
  • చర్మం అన్ని పొరలకూ కాల్పుల హాని సోకుతుంది
  • నరాలకూ హాని కల్గి, స్పర్శజ్ఞానాన్నికోల్పోవడం
  • చర్మం పాలిపోవడం, చర్మంఉ పరితలం మైనపు స్వభావాన్ని సంతరించుకుంటుంది.నల్లగా లేదా గోధుమ రంగులా మారచ్చు.
  • కాలిన చోట్లలో నున్నగా (leathery), ఉబ్బెత్తుగా తయారవుతుంది.  
  • ప్రధాన మచ్చలు మరియు ఇతర చర్మ హానిని నివారించడానికి శస్త్రచికిత్స అవసరం
  • పూర్తిగా నయం చేయడానికి చాలా సమయం పడుతుంది

కాలిన బొబ్బలకు ప్రధాన కారణాలు ఏమిటి?

కాలిన బొబ్బలకు అనేక కారకాలు కారణం కావచ్చు:

 • కెమికల్స్ మరియు విద్యుత్ కరెంట్
 • అగ్గి మరియు మంటలు
 • వేడి వస్తువులు (హాట్ ఆబ్జెక్ట్స్)
 • కాలుతున్న (బాష్పీభవన) వేడి ద్రవాలవల్ల గాయాలు  
 • ఎక్కువ కాలం ఎండవేడిమికి గురవటంవల్ల

కాలిన బొబ్బల నిర్ధారణ చేసేది ఎలా మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణకు మొట్టమొదటగా చేసేది కాలిన గాయం యొక్క పరిమితి మరియు తీవ్రతను పూర్తిగా పరిశీలించడం. కాల్పువల్ల నష్టం విపరీతంగా ఉంటే రోగి వాటికోసమే ప్రత్యేకంగా  ఉండే క్లినిక్లు లేదా బర్న్ సెంటర్లకు సూచించబడవచ్చు. X- కిరణాలు వంటి పరీక్షలద్వారా శరీరంలో ఇతర నష్టం పరిశీలనను నిర్వహించవచ్చు.

చికిత్స కాలిన బొబ్బల యొక్క స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కాలిన బొబ్బలకు ఇంటివద్దనే చికిత్స చేయచ్చు. మరికొన్ని తీవ్రమైన కాలిన బొబ్బలకు తక్షణమే వైద్య సంరక్షణ అవసరం కావచ్చు.

 • ఫస్ట్ డిగ్రీ కాల్పులు
  • 10 నిముషాల వరకు శరీరంపై కాలిన చోటును చల్లని నీటిలో ముంచి ఉంచడం
  • నొప్పినివారిణుల్ని (పెయిన్కిల్లర్ మందుల్ని) తీసుకోవడం.
  • సిల్వర్ నైట్రేట్ లేపనం లాంటి మృదువైన జెల్ లేదా క్రీం లను పూయడం
  • యాంటిబయోటిక్ మరియు గాజుగుడ్డతో ప్రాంకాలిన ప్రాంతాన్ని పరిరక్షించటం
 • రెండవ డిగ్రీ కాలిన గాయాలు
  • శరీరంలో కాలిన చోటును శుభ్రంగా ను, మరియు కప్పి ఉంచడం
  • కాలిన చోటును సుమారు 15 నిముషాల పాటు పారుతున్న చల్లటి నీటి (running water) ప్రవాహం కింది పట్టి ఉంచడం.  
  • బొబ్బలకు యాంటీబయోటిక్ క్రీమ్ ఉపయోగించడం
  • పత్తిని ఉపయోగించవద్దు, బిగుతుగా కట్టు కూడా కట్టవద్దు
 • మూడవ-స్థాయి కాల్పులు
  • అత్యవసర వైద్య సహాయం కోరండి/పొందండి
  • ఇంటివద్దనే చికిత్సను, మందులు తీసుకోవడం ఈ స్థాయిలో నివారించడం చాలా అవసరం.  
  • ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ మరియు ద్రవాలు.
  • ప్రత్యేక గాయం డ్రెస్సింగ్
  • నొప్పిని తగ్గించడానికి మందులు
  • కాల్పుల గాయాల మచ్చల నివారణకు స్కిన్ అంటుకట్టుట
  • శ్వాస సహాయం మరియు ఆహార గొట్టాలు, అవసరమైతే
  • ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతేవనరులు

 1. American Society for Surgery of the Hand. Burns. Chicago, USA. [internet].
 2. National Health Portal. Burns. Centre for Health Informatics; National Institute of Health and Family Welfare
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Burns
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Burns
 5. National Institute of General Medical Sciences. Burns. U.S. Department of Health and Human Services. [internet].

కాలిన గాయాలు వైద్యులు

Dr. Abhishek Bunker Dr. Abhishek Bunker General Physician
2 वर्षों का अनुभव
Dr. Vishwas Pahuja Dr. Vishwas Pahuja General Physician
1 वर्षों का अनुभव
Dr. Nilofer Patel Dr. Nilofer Patel General Physician
3 वर्षों का अनुभव
Dr. Prachi Jain Dr. Prachi Jain General Physician
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కాలిన గాయాలు కొరకు మందులు

కాలిన గాయాలు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

दवा का नाम

कीमत

₹356.72

20% छूट + 5% कैशबैक


₹46.55

20% छूट + 5% कैशबैक


₹123.83

20% छूट + 5% कैशबैक


₹89.6

20% छूट + 5% कैशबैक


₹143.52

20% छूट + 5% कैशबैक


₹81.38

20% छूट + 5% कैशबैक


₹94.5

20% छूट + 5% कैशबैक


₹36.22

20% छूट + 5% कैशबैक


₹105.0

20% छूट + 5% कैशबैक


₹4.5

20% छूट + 5% कैशबैक


Showing 1 to 10 of 990 entries