myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి (మైగ్రెయిన్) అంటే ఏమిటి ?

పార్శ్వపు తలనొప్పి (migraine) కేవలం పెద్దలకు  మాత్రమే వస్తుంది అని మనం తరచుగా అనుకుంటాం, గాని, ఇది పిల్లలక్కూడా వచ్చే అవకాశం ఉంది. పార్శ్వపు తలనొప్పినే ఒంటిచెంప తలనొప్పి అని “మైగ్రైన్ తలనొప్పి” అనికూడా పిలుస్తారు. వాస్తవానికి, పాఠశాల వయస్కులైన పిల్లల్లో 5 శాతం మంది ఈ పార్శ్వపు తలనొప్పులు గురించి వైద్యులకు ఫిర్యాదు చేస్తుంటారు. మైగ్రైన్స్ అనేవి తీవ్రమైన తలనొప్పిని కల్గిస్తాయి మరియు తరచుగా పునరావృతమవుంటుంటాయి. పార్శ్వపు తలనొప్పి అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే దీని అత్యంత తీవ్రమైన, సాధారణంగా అనుభవించే  లక్షణంగా తలనొప్పి ఉంటుంది.

పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పార్శ్వపు తలనొప్పి యొక్క లక్షణమైన తలనొప్పి ఒకటే కాకుండా, ఈ రుగ్మత ఉన్న పిల్లలు ఇతర లక్షణాలను కూడా అనుభవిస్తారు. అవేమంటే :

 • వికారం మరియు పొత్తికడుపు తిమ్మిరి
 • కాంతి, ధ్వని మరియు వాసన సున్నితత్వం
 • మగత
 • కళ్ళు కింద నల్లటి వృత్తాలు ఏర్పడుతాయి, అక్కడ చర్మం పాలిపోతుంది
 • మితిమీరిన చెమట మరియు దాహం

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

పార్శ్వపు తలనొప్పికి కారణాన్నిమామూలుగా ఇదేనని చెప్పటం కష్టం లేదా దీనికి గల ప్రేరేపక కారణాల్ని ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా కష్టం. పార్శ్వపు తలనొప్పికి గల కొన్ని సాధారణ కారణాలు ఇలా ఉండవచ్చు:

 • మెదడులోని రసాయన సెరోటోనిన్ యొక్క లోపం
 • మద్యం
 • మోనోసోడియం గ్లుటామాట్ (MSG) కలిగిన ఆహారాలు
 • చక్కెర మరియు కెఫిన్
 • ఎండు పండ్లు మరియు షెల్ఫిష్ లేదా గుల్లపురుగు (లాంటి) చేపలు
 • కొన్ని పాల ఉత్పత్తులు
 • ఒత్తిడి , ఆందోళన
 • తగినంత ఆహారం, ఆర్ద్రీకరణ (జాలీకరణం) లేదా నిద్ర
 • ప్రకాశ వంతమైన దీపాలు,
 • కంప్యూటర్లో ఎక్కువ గంటలు పనిచేయడం
 • బలమైన వాసనలు

పార్శ్వపు తలనొప్పిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణకు రావడానికి ముందుగా వైద్యులు సాధారణంగా రోగిని కొన్ని ప్రశ్నలడుగుతారు. పార్శ్వపు తలనొప్పి ఎప్పుడొస్తుంది, తలలోని ఏభాగంలో నొప్పి సాధారణంగా వస్తుంది, ఆ నొప్పి వచ్చినపుడు గాని, నొప్పి తర్వాతగాని ఏదైనా శబ్దం గాని, కళ్ళ ముందేవైనా దృశ్యాల ఉనికి గాని ఉన్నట్లనిపిస్తుందా, పార్శ్వపు తలనొప్పి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది వంటి ప్రశ్నల్ని వైద్యులు రోగిని అడిగి తెలుసుకుంటారు.

ఇతర ఆరోగ్య పరిస్థితులేవీ లేవని నిర్ధారించుకునేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించబడవచ్చు. ఒక వివరణాత్మక న్యూరోలాజికల్ పరీక్షతో కూడిన అంచనాతో  సహా భౌతిక పరీక్ష నిర్వహిస్తారు. పార్శ్వపు తలనొప్పితో బాధపడే చిన్నపిల్ల లేదా చిన్న పిల్లాడికి జ్వరం, మెడ పెడసరం, నరాల అసాధారణతలు, ఆప్టిక్ డిస్క్ (దృగ్ వృత్తం) లేదా అసమాన సంకేతాల వాపు (శరీరం యొక్క ఒక వైపు బలహీనత) కలిగి ఉంటే అదనపు పరీక్షలు నిర్వహిస్తారు. పార్శ్వపు తలనొప్పి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటే ఎలక్ట్రోఎన్సుఫలోగ్రఫీ (EEG) కూడా కూడా చేయవచ్చు.

తేలికపాటి మైగ్రేన్స్ విషయంలో, వైద్యులు సాధారణంగా విశ్రాంతి తీసుకోమని చెబుతారు.ఇంకా ఒత్తిడిని నివారించడం మరియు వ్యాధి కారకాల్ని జాగ్రత్తగా గమనించమని కూడా డాక్టర్ సలహా ఇస్తారు. పార్శ్వపు తలనొప్పితో బాధపడే శిశువును ఎలా పడుకోబెట్టాలి అన్నవిషయమై కూడా వైద్యసలహాలివ్వబడతాయి. పిండం ఎలాంటి భంగిమలో ఉంటుందో (అంటే ఎడమ పక్కన, గర్భస్థ శిశువులాగా ముడుచుకునిఉండేట్టు పడుకోబెట్టటం) అలా శిశువును పాడుకోబెట్టాలి. అవసరమైతే నొప్పి తగ్గించే మందులు లేదా మంట నివారణా (యాంటీ ఇన్ఫ్లమేటరీలు) మందులు సూచించబడతాయి. కొన్ని సందర్భాల్లో, సేదదీరుడు చికిత్సల్ని, హిప్నోటిక్ థెరపీ కూడా చేయమని వైద్యుల సలహా ఉంటుంది. MSG (monosodium glutamate) మరియు సిట్రిక్ యాసిడ్ కలిగి ఉన్న ఆహారాలు మినహాయిస్తూ ఆహారంలో మార్పులు చేస్తారు. ప్రయాణంలో గాని ఎక్కువ చలన-వలనాదులలో పార్శ్వపు తలనొప్పితో బాధపడుతున్నవారికి సరైన మందులు ఇవ్వబడతాయి.

తీవ్రమైన పార్శ్వపు తలనొప్పి విషయంలో త్రిప్తామైన్ అనే పదార్థంతో కూడిన (triptans) మందుల అవసరం ఉంటుంది.

 1. పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి కొరకు మందులు
 2. పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి వైద్యులు
Dr. Prachi Jain

Dr. Prachi Jain

General Physician
2 वर्षों का अनुभव

Dr. Anwar Hussain

Dr. Anwar Hussain

General Physician
13 वर्षों का अनुभव

Dr. Siddharth Rawat

Dr. Siddharth Rawat

General Physician
8 वर्षों का अनुभव

Dr. Syed Mukhtar Mohiuddin

Dr. Syed Mukhtar Mohiuddin

General Physician
7 वर्षों का अनुभव

పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి కొరకు మందులు

పిల్లల్లో పార్శ్వపు తలనొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Practin खरीदें
Hungree Syrup खरीदें
Normatone खरीदें
Hiliv Ds खरीदें
Hysin खरीदें
Tricyp खरीदें
Ciporil Plus खरीदें
Powerlactin खरीदें
Yopon खरीदें
Cyaptin खरीदें
Cypiza खरीदें
Abitol खरीदें
Cypon खरीदें
Apetamin खरीदें
Ciplactin खरीदें
Cyprosine (Libra) खरीदें
Heptidin खरीदें
Hiliv खरीदें
Peritol खरीदें
Acmetin खरीदें
Add App खरीदें
Anabol खरीदें

References

 1. Raluca Ioana Teleanu et al. Treatment of Pediatric Migraine: a Review. Maedica (Buchar). 2016 Jun; 11(2): 136–143. PMID: 28461833
 2. Cleveland Clinic. Migraines in Children and Adolescents. [Internet]
 3. The Nemours Foundation. migraines. [Internet]
 4. Nick Peter Barnes. Migraine headache in children. BMJ Clin Evid. 2011; 2011: 0318. PMID: 21481285
 5. Joanne Kacperski et al. The optimal management of headaches in children and adolescents. Ther Adv Neurol Disord. 2016 Jan; 9(1): 53–68. PMID: 26788131
और पढ़ें ...
ऐप पर पढ़ें