కోల్డ్ సోర్స్ - Cold Sores in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

కోల్డ్ సోర్స్
కోల్డ్ సోర్స్

కోల్డ్ సోర్స్ అంటే ఏమిటి?

కోల్డ్ సోర్స్ అనేవి ద్రవంతో నిండిన చిన్న చిన్న బొబ్బలు, ఇవి చివరికి పగిలి పోతాయి, అటుపై పొక్కు కడతాయి. ఇవి నోటి చివర్ల వద్ద పెదవుల చివర్లలో సాధారణంగా వస్తుంటాయి. అయినప్పటికీ, కోల్డ్ సోర్స్ ముఖం, చేతులు లేదా శరీరం యొక్క ఇతర భాగాలలో కూడా రావచ్చు.
ఇదో అంటువ్యాధి, అంటే ఒకరి నుండి మరొకరికి అంటుకొంటుంది. ఒక సూక్ష్మక్రిమి కారణంగా సంభవిస్తుందిది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • కోల్డ్ సోర్ బొబ్బ కనిపించే ముందు, అది ఏర్పడే చోట చర్మంపై అసౌకర్యంతో కూడిన  అనుభూతి చెందుతారు. దురద లేదా మంటతో కూడిన నొప్పి సాధారణంగా అనుభవించే లక్షణాలు. కోల్డ్ సోర్ ను తాకినప్పుడు నొప్పి పెడుతుంది.
  • కోల్డ్ సోర్ పూర్తిగా ఏర్పడినప్పుడు, పసుపు రంగుతో కూడిన ద్రవంతో ఇది నిండి ఉంటుంది, ఒత్తితే ఈ ద్రవం బయటికి విరజిమ్ముతుంది.
  • ద్రవంతో నిండిన కోల్డ్ సోర్ బొబ్బ పగిలినపుడు, అది ఒక చిన్న పండును మిగిలిస్తుంది. అటుపై ఈ పుండు పొక్కు కడుతుంది. ఈ కోల్డ్ సోర్ పుళ్ళు ఒక వారం వరకు సాధారణంగా ఉంటాయి.
  • ఈ కోల్డ్ సోర్ పుళ్ళు (వైరల్ సంక్రమణ) చాలా తీవ్రంగా ఉంటే, మీకు ఈ జ్వరంతో పాటు రసగ్రంధుల (lymph node) వాపు మరియు చిగుళ్లలో అసౌకర్యం పెరగడం జరుగుతుంది. .
  • నోటి ద్వారా చేసే లైంగిక చర్యల ద్వారా కోల్డ్ సోర్ పుళ్ళు లైంగిక అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV) అనే సూక్ష్మ జీవి కారణంగా కోల్డ్ సోర్ పుళ్ళు ఏర్పడతాయి. ఈ HSV సూక్ష్మజీవులు రెండు రకాలు, అవి: - HSV-1 మరియు HSV-2.
  • నోరు లేదా నోటి చుట్టుపక్కల భాగాల్లో HSV-1, (లేకపోతే దీన్నే “హెర్పెస్ సింప్లెక్స్ లాబియాలిస్” అని పిలుస్తారు) సోకుతుంది, కోల్డ్ సోర్ పుండ్లు ఏర్పడతాయి. HSV-2 సూక్ష్మజీవి జననాంగాల చుట్టూ ఈ పుళ్ళకు కారణమవుతుంది.
  • ఈ వైరస్ను ముద్దు పెట్టుకోవడం మరియు తువ్వాళ్లు, పెదవి ఔషధతైలం, వంట పాత్రలు మరియు ఇతర వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా వ్యక్తి నుండి  వ్యక్తికి అంటుకోవడం జరుగుతుంది.
  • నరాలలో ఈ వైరస్ నిద్రాణంగా ఉంటుంది కాబట్టి ఈ బొబ్బలవంటి పండ్ల వ్యాధి (కోల్డ్ సోర్స్)  పునరావృతమవుతుంది. బలహీన రోగనిరోధక వ్యవస్థ, ఎండ లేదా సూర్యరశ్మి, ఒత్తిడి మరియు హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటి కారణాల వలన ఇది ప్రేరేపించబడుతుంది .

కోల్డ్ సోర్స్ ను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

  • వైద్యుడు సాధారణంగా కోల్డ్ సోర్స్ పుళ్ళు చూడటం ద్వారా రోగనిర్ధారణ చేయగలడు మరియు పొక్కును, మధ్యలో ద్రవాన్ని పరీక్షించడం ద్వారా కూడా నిర్ధారించవచ్చు.
  • ఒక సంక్రమణం కూడా మీ ఒంట్లోని తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.
  • కోల్డ్ సోర్స్ కు చికిత్స చేసేందుకు యాంటీ వైరల్ మందులు కీలకం. .
  • కడుపుకు ఔషధంగా మాత్రలు సూచించబడవచ్చు, తీవ్రమైన సందర్భాల్లో, ఇంజెక్షన్ కూడా చేయవచ్చు
  • పుండు ఉపరితల లక్షణాలైన దురద మరియు మంట లను ఉపశమింపజేయడానికి పైపూత మందులు సహాయపడతాయి.
  • రోగి ఏవైనా వ్యక్తిగత వస్తువులను పంచుకోవడాన్ని మరియు ముద్దులు పెట్టుకోవడం,  మరియు లైంగిక సంబంధాల సంపర్కాన్ని నిరోధించాల్సిందిగా వైద్యులు సలహా ఇస్తారు.



వనరులు

  1. Richardson VN, Davis SA, Gustafson CJ, West CE, Feldman SR. Patterns of disease and treatment of cold sores. J Dermatolog Treat. 2013 Dec;24(6):439-43. PMID: 23541214
  2. American Society of microbiology. [internet]; High-Dose, Short-Duration, Early Valacyclovir Therapy for Episodic Treatment of Cold Sores: Results of Two Randomized, Placebo-Controlled, Multicenter Studies
  3. Healthdirect Australia. Cold sores. Australian government: Department of Health
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Cold sores
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cold sores

కోల్డ్ సోర్స్ కొరకు మందులు

Medicines listed below are available for కోల్డ్ సోర్స్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.