myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

ఎపిడిడిమిటిస్ అంటేఏమిటి?

ఎపిడిడిమిటిస్   అంటే వృషణముకు వెనుక భాగమున అంటిపెట్టుకుని ఉండే ప్రాంతం (ఎపిడిడిమిస్,epididymis) యొక్క వాపు, ఇది వృషణాల నుండి పురుషాంగానికి  వీర్యకణాలు తీసుకు వెళ్లే ఒక గొట్టం వంటిది. ఎపిడిడిమిటిస్ సమస్యలో ఎపిడిడిమిస్ రేగిపోతుంది లేదా వాచిపోతుంది. ఈ సమస్య ఏ వయసులో అయినా ఏర్పడవచ్చు, కానీ 14 మరియు 35 సంవత్సరాల మధ్య వయసులో సర్వసాధారణంగా సంభవిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా కలిగే లక్షణాలు:

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

అత్యంత సాధారణ కారణం సి. ట్రకోమెటిస్ (C. trachomatis) లేదా ఎన్. గోనేరియే (N. gonorrhoeae)  వలన సంక్రమణం (ఇన్ఫెక్షన్), ఇది ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎపిడిడిమిటిస్ కు  కారణమయ్యే ఇతర అంటువ్యాధులు గవదబిళ్ళలు (mumps, ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్) మరియు క్షయవ్యాధి (tuberculosis, ఒక రకమైన బ్యాక్టీరియల్ సంక్రమణ). పిల్లలు, వృద్ధులు మరియు యానల్ సంపర్కంలో పాల్గొనే వ్యక్తులలో సాధారణంగా ఇది ఇ. కోలి (E. coli) బాక్టీరియా వలన సంభవిస్తుంది. కొన్ని మందులు కూడా ఎపిడిడిమిటిస్ కు కారణం కావచ్చు. భారీ బరువులు ఎత్తినప్పుడు అప్పుడప్పుడు మూత్రం వెనుకకు ప్రవహించిన కారణంగా కూడా ఎపిడిడిమిటిస్ సంభవించవచ్చు. దీనికి చికిత్స చేయకపోతే, వృషణాలలో చీము పెరిగేటట్లు చేస్తుంది. అలాగే పురుషులు సంతానోత్పత్తి సమస్యలకు కూడా దారితీస్తుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఏదైన సున్నితత్వం లేదా గడ్డ యొక్క తనిఖీ కోసం భౌతిక పరీక్ష చేయబడుతుంది. ఏదైన బాక్టీరియల్ సంక్రమణను గుర్తించడానికి మూత్ర పరీక్షను చేయవచ్చు. మరింతగా బీజకోశ ప్రాంతాన్ని పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షను ఆదేశించవచ్చు.

ఇతర పరీక్షలు వీటిని కలిగి ఉండవచ్చు:

 • పూర్తి రక్త గణన (Complete blood count)
 • క్లమిడియా మరియు గోనేరియాల సంక్రమణ యొక్క పరిశోధనకు రక్త పరీక్షలు

చికిత్సలో ప్రధానంగా సంక్రమణ (ఇన్ఫెక్షన్) కలిగించే బాక్టీరియా యొక్క రకం ఆధారంగా యాంటీబయాటిక్స్ ఉపయోగం అనేది ఉంటుంది.

స్వీయ సంరక్షణ చిట్కాలు:

 • తగినంత విశ్రాంతి  తీసుకోవాలి
 • అసౌకర్యం నుండి ఉపశమనం పొందడానికి బీజకోశము పైకి ఉండేలా పడుకోవాలి
 • నొప్పి ఉన్న ప్రాంతంలో  తట్టుకునేంత వరకు ఐస్ (చల్లని నీళ్ల ) కాపడాన్ని పెట్టాలి
 • ద్రవ పదార్దాలు ఎక్కువగా  తీసుకోవాలి
 • నొప్పినివారణ మందులు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి

నివారణ చర్యలు:

 • సంభోగం సమయంలో కండోమ్లను ఉపయోగించాలి
 • సమస్య తగ్గేంత వరకు భారీ బరువులను ఎత్తడం పూర్తిగా మానివేయాలి
 • ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండరాదు

ఆకస్మికంగా  తీవ్ర నొప్పి సంభవించినట్లయితే, అప్పుడు అది వైద్య అత్యవసరమని గమనించి వెంటనే వైద్యపరమైన శ్రద్ధగా తీసుకోవాలి.

 1. ఎపిడిడిమిటిస్ కొరకు మందులు

ఎపిడిడిమిటిస్ కొరకు మందులు

ఎపిడిడిమిటిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
ResteclinResteclin 250 Mg Capsule11
TetlinTetlin 250 Mg Capsule0
TetracylineTETRACYCLINE 500MG CAPSULE 10S0
TetrastarTetrastar 500 Mg Capsule8
CortecyclineCortecycline Eye Ointment8
TerracortTerracort Eye/Ear Drops23
AtrocinAtrocin 1% W/W/1% W/W Ointment32
SBL Oleum animale DilutionSBL Oleum animale Dilution 1000 CH86
Bjain Oleum animale DilutionBjain Oleum animale Dilution 1000 CH63
Schwabe Oleum animale CHSchwabe Oleum animale 1000 CH96
Entakon MEntakon M 400 Mg/333 Mg Capsule0
EntakonEntakon Tablet0
LancetLancet 400 Mg/333 Mg Tablet0
MeklinMeklin 400 Mg/333 Mg Capsule0
MetroclineMetrocline Capsule25
AlcizonAlcizon 1 Gm Injection16
Ancef XpAncef Xp 1.125 Gm Injection117
CefadinCefadin 125 Mg Injection16
ReflinReflin 1 Gm Injection20

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Epididymitis
 2. Cleveland Clinic. [Internet]. Euclid Avenue, Cleveland, Ohio, United States; Epididymitis.
 3. Adrian Pilatz. et al. Acute and Chronic Epididymitis. European Association of Urology. Arnhem, Netherlands. [Internet].
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Epididymitis
 5. Rupp TJ, Leslie SW. Epididymitis. [Updated 2019 May 2]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
और पढ़ें ...