అధిక చెమటలు (హైపర్ హైడ్రోసిస్) - Hyperhidrosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 03, 2018

March 06, 2020

అధిక చెమటలు
అధిక చెమటలు

అధిక చెమట లేక హైపర్ హైడ్రోసిస్ అంటే ఏమిటి?

మానవ శరీరం యొక్క ప్రధాన స్వేద గ్రంధుల మీది గ్రాహకాలు అధికంగా ప్రేరేపణ కావడంవల్ల “అధిక చెమట” (hyperhidrosis) పడుతుంది. ఈ రుగ్మతనే ‘హైపర్ హైడ్రోసిస్ అని కూడా పిలుస్తారు. శరీరంలో ఎక్కడెక్కడ ఈ అధిక ప్రేరేపణతో కూడిన చెమట గ్రంథులు ఉంటాయో ఆయా భాగాల్లో అధిక చెమట పట్టే ఈ రుగ్మతవల్ల వ్యక్తి బాధింపబడడం జరుగుతుంది.

అధిక చెమట రుగ్మత (హైపర్ హైడ్రోసిస్)లో రెండు రకాలు ఉన్నాయి, అవి,

  • ప్రాధమిక హైపర్ హైడ్రోసిస్ - ఇది స్వయంగా వైద్య స్థితిలో సంభవిస్తుంది.
  • సెకండరీ హైపెర్ హైడ్రోసిస్ - ఇది కొన్ని ఇతర అంతర్లీన పరిస్థితుల ఫలితంగా సంభవిస్తుంది.

అధిక చెమట రుగ్మత యొక్క సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అధికంగా చెమట పట్టడంవల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరియు ఇది సామాజిక ఆందోళన (అంటే ఈ రుగ్మతతో వ్యక్తి నలుగురిలో కలిసినపుడు) ను పెంచుతుంది.

ప్రాధమిక హైపర్ హైడ్రోసిస్ తో సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఎడమ మరియు కుడి చంకలు (axillae), అరచేతులు, అరికాళ్ళు (soles), మరియు ముఖం వంటి చిన్న చిన్నభాగాల్లో చెమట పట్టడం జరుగుతుంది.
  • రెండు చేతుల్లో మరియు రెండు అరిపాదాల్లో(అడుగులు) సమానరీతిలో అధిక చెమట పట్టడం సంభవించవచ్చు.
  • నిద్రపోతున్నప్పుడు చెమట;పట్టడం జరగదు.
  • ఈ అధికచెమట రుగ్మత సాధారణంగా కౌమారదశలో లేదా 25 ఏళ్ల వయసుకు ముందు ప్రారంభమవుతుంది.

ద్వితీయ రకం అధిక చెమట రుగ్మతతో (సెకండరీ హైపర్ హైడ్రోసిస్) సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • నిర్దిష్ట ప్రాంతాల్లో చెమట పట్టదు కానీ ఎక్కువగా సాధారణీకరించబడింది.
  • ఇది సాధారణంగా అంతర్లీన వైద్య పరిస్థితితో సంభవిస్తుంది.
  • నిద్రపోతున్నప్పుడు కూడా అధికమైన చెమట పడుతూ ఉంటుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అధిక చెమటకు కారణం స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. ప్రాధమిక అధిక చెమట రుగ్మతకు జన్యుపరమైన కారకాలు పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ హైడ్రోసిస్ యొక్క యంత్రాంగం కిందివిధంగా ఉంటుంది.

  • శరీరంలోని ప్రధాన స్వేద గ్రంధుల యొక్క అధిక ప్రేరేపణ
  • హార్మోన్ ప్రతిపుష్టి (feedback) యంత్రాంగం పనిచేయకపోవడం

క్రింద తెలిపిన కొన్ని ప్రాథమిక వైద్య పరిస్థితులు రెండోరకం అధిక చెమట రుగ్మతకు (ద్వితీయ హైపర్ హైడ్రోసిస్కు) కారణమవుతాయి:

ఈ అధిక చెమట రుగ్మత ఇన్సులిన్ మరియు యాంటిసైకోటిక్స్ వంటి కొన్ని మందులతో  కూడా సంబంధం కలిగి ఉంటుంది.

అధిక చెమట రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రుగ్మత యొక్క పూర్తి చరిత్ర మరియు దృశ్య అంచనా, అంటే వైద్యుడు నేరుగా అధిక చెమట రుగ్మత స్థితిని చూడ్డం రోగనిర్ధారణకు చాలా ముఖ్యమైనది.

  • వైద్యపరిశోధనలు ఇలా ఉంటాయి
    • అయోడిన్-స్టార్చ్ పరీక్ష
    • థర్మోరెగులేటరీ చెమట పరీక్ష
    • పూర్తి రక్త గణన పరీక్ష
    • ఛాతీ ఎక్స్-రే
    • హీమోగ్లోబిన్ A1C
    • థైరాయిడ్ హార్మోన్ పరీక్ష

అధిక చెమట (హైపర్ హైడ్రోసిస్) యొక్క చికిత్స అంతర్లీన స్థితి మరియు దాని చికిత్సపై దృష్టి పెడుతుంది.

ప్రాధమిక అధిక చెమట (హైపర్ హైడ్రోసిస్) రుగ్మత విషయంలో, సంబంధిత లక్షణాలను గుర్తించడమనేది చికిత్సలో ఉంటుంది. వైద్యుడు చెమట నివారణ మందులు (antiperspirants), గ్లైకోపైర్రోట్లున్న (glycopyrrolate) క్రీమ్లు, నరాలను (రక్తప్రసరణను) అడ్డుకునే మందులు, లేదా కుంగుబాటు నివారణా మందులు (యాంటీ-డిప్రెసెంట్స్) ను సూచించవచ్చు.

ప్రాథమిక చికిత్సలో ప్రధానంగా 15-25% అల్యూమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్తో పాటు చెమట నివారణ మందులు (యాంటిపెర్స్పిరెంట్స్) ఉంటాయి. రోగి ఈ చికిత్సకు అనుకూలంగా స్పందించకపోతే, వైద్యుడు స్వేద గ్రంథుల గ్రాహకాలను నిరోధించడానికి మందులను సూఛిస్తాడు. అవసరమైతే, అధిక చెమటను తగ్గించడానికి అదనపు బోటులినమ్ సూది మందులు లేదా (విద్యుత్ సహాయంతో ఇచ్చే) ఇఒంటోఫోరేసిస్ (iontophoresis) నిర్వహిస్తారు.

శస్త్రచికిత్సా ఎంపికల్లో స్వేద గ్రంథి తొలగింపు లేదా నరాల శస్త్రచికిత్సను ఈ రుగ్మతకు లభ్యతలో కలిగి ఉంటాయి.



వనరులు

  1. Brackenrich J, Fagg C.Hyperhidrosis. [Updated 2019 May 5]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  2. Tanja Schlereth. et al. Hyperhidrosis—Causes and Treatment of Enhanced Sweating. Dtsch Arztebl Int. 2009 Jan; 106(3): 32–37. PMID: 19564960
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hyperhidrosis.
  4. National Organization for Rare Disorders. [Internet]. Danbury; Hyperhidrosis, Primary.
  5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. VASER Treatment of Axillary Hyperhidrosis/Bromidrosis (VASER AxHH).

అధిక చెమటలు (హైపర్ హైడ్రోసిస్) వైద్యులు

Dr Shishpal Singh Dr Shishpal Singh Dermatology
5 Years of Experience
Dr. Sarish Kaur Walia Dr. Sarish Kaur Walia Dermatology
3 Years of Experience
Dr. Rashmi Aderao Dr. Rashmi Aderao Dermatology
13 Years of Experience
Dr. Moin Ahmad Siddiqui Dr. Moin Ahmad Siddiqui Dermatology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

అధిక చెమటలు (హైపర్ హైడ్రోసిస్) కొరకు మందులు

Medicines listed below are available for అధిక చెమటలు (హైపర్ హైడ్రోసిస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.