myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కీళ్ల పెడసరం అంటే ఏమిటి?

కీళ్ల పెడసరం అంటే కదపడానికి కష్టమైన కీళ్ల పరిస్థితి. లేదా ఈ కీళ్ల పెడసరంవల్ల తగ్గిపోయిన కీళ్ల కదలికలు. కీళ్లు పట్టేసినట్లుండడాన్నే “కీళ్ల పెడసరం” అంటారు. కీళ్ల పెడసరం మణికట్టు వంటి ఏక కీలు (single joint) లేదా చేతుల్లోని చాలా చిన్నచిన్న కీళ్లనూ కలిగి ఉంటుంది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కీళ్ల పెడసరంవల్ల  మనిషి కదలికలకు నిర్బంధమేర్పడి, అటు ఇటు తిరగడానికి కష్టమవుతుంది. దీనికితోడు, కీళ్లు బీటలువారడం, కీళ్లలో నొప్పి మరియు సంబంధిత మంట లేదా వాపు బాధిస్తుంటాయి. కీళ్ల పెడసరం రోజులోని కొన్ని సమయాల్లో, ముఖ్యంగా ఉదయం సమయంలో తీవ్రతరం అవుతుంది. ఇలా ఎందుకవుతుందంటే, రాత్రి సమయంలో కీళ్ళు చురుగ్గా ఉండవు కాబట్టి మరియు కీలు ఎముకల మధ్య ఎటువంటి ద్రవప్రసరణ రాత్రిపూట ఉండదు గనుక. అయితే రోజు గడిచేకొద్దీ, కీళ్ళు తమ మధ్య  ద్రవపదార్థాన్ని సంతరించుకుంటాయి, తద్వారా నొప్పి తగ్గి వ్యక్తి సౌకర్యవంతమైన మంచి అనుభూతిని పొందుతారు. దీర్ఘకాలిక కీళ్ల పెడసరం శాశ్వత వైకల్యానికి దారి తీయవచ్చు.

కీళ్ల పెడసరానికి ప్రధాన కారణాలు ఏమిటి?

కీళ్ల పెడసరానికి గాయమవడం కారణం కావచ్చు, ఇది స్వీయ పరిమితికి లోబడి ఉంటుంది. కాని తీవ్రమైన కీళ్ల పెడసరం, లేదా వివిధ అంతర్లీన వైద్య పరిస్థితుల వలన కావచ్చు, కాలక్రమేణా మరింత చెడుబాటుకు గురై సుదీర్ఘకాల రుగ్మతకు దారితీస్తుంది. కీళ్ల పెడసరానికి ప్రాధమిక కారణం కీళ్ళనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అత్యంత సాధారణమైన కారణం. కీళ్ల పెడసరం కీళ్ళ యొక్క ఆరోగ్యకరమైన కణాలను బాధించే స్వయంప్రతిష్కృత రుగ్మత. ఇది ఆరోగ్యకరమైన కణాలను వాపెక్కేలా, నొప్పి కలిగేలా, పెడసరం కలిగేలా చేసి మనిషిని బాధిస్తుంది. వృద్ధులలో కీళ్ల పెడసరం సాధారణంగా ఆస్టియోఅర్థిరైటిస్ వలన సంభవిస్తుంది, ఇది మోకాలు, తుంటి (హిప్) మరియు వీపు వంటి ఏక   (సింగిల్) కీళ్ళలో సంభవిస్తుంది. కీళ్ల పెడసరం యొక్క ఇతర కారణాలు జీవనశైలి అలవాట్లకు సంబంధించినవి, వీటిలో నిశ్చల జీవనశైలి, అధిక బరువు మరియు తప్పు భంగిమలు ఉంటాయి. ఎముక క్యాన్సర్ కీళ్ల పెడసరానికి ఓ అరుదైన కారణం.

కీళ్ల పెడసరాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కీళ్ల పెడసరం అనేది ఓ అంతర్లీన వైద్య రుగ్మత లేదా జీవనశైలి రుగ్మత. కాబట్టి, కీళ్ల పెడసరం  రుగ్మత నిర్ధారణకు ఒక వివరణాత్మక మూల్యాంకనం అవసరం. రోగ నిర్ధారణకు ముందుగా, వైద్యుడు వ్యక్తి వయస్సు, జీవనశైలి మరియు వైద్య చరిత్ర ఆధారంగా, కీళ్ల పెడసరం సోకిన భాగాల యొక్క రక్తం పరీక్షలు మరియు ఎక్స్-కిరణాలను చేయించమని రోగిని అడగొచ్చు. రోగనిర్ధారణ ఆధారంగా కీళ్ల పెడసరం రుగ్మతను వాపు-మంట నిరోధక మందులు, స్టెరాయిడ్స్ మరియు నొప్పి నివారిణులైన మందులతో పరిస్థితిని నిర్వహించబడుతుంది. కీళ్ల పెడసరం నొప్పి నుండి ఉపశమనానికి ఉత్తమ మార్గం, కొన్ని నిమిషాలపాటు పెడసరం ఉన్నచోట వేడి కాపాడాన్ని పెట్టడం. ఇలా, వేడికాపాడాన్ని రోజుకు అనేక సార్లు పెట్టొచ్చు. రుగ్మతతో కూడిన కీళ్ళకు వేడికాపడం పెట్టడం అనేది ఓ మంచి చికిత్స అని భావిస్తారు, ఎందుకంటే వేడి కాపడంవల్ల రుగ్మతకు గురైన కీళ్లు సడలింపు (relax) చెంది కీళ్లలో రక్త ప్రసరణను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా, చేప నూనె సప్లిమెంట్లను తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించుకోవడం ద్వారా కూడా కీళ్ల పేదసరాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

  1. కీళ్ల పెడసరం (జాయింట్ స్టిఫ్నెస్) కొరకు మందులు

కీళ్ల పెడసరం (జాయింట్ స్టిఫ్నెస్) కొరకు మందులు

కీళ్ల పెడసరం (జాయింట్ స్టిఫ్నెస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Oxalgin DpOxalgin Dp 50 Mg/325 Mg Tablet27
Diclogesic RrDiclogesic Rr 75 Mg Injection25
DivonDIVON GEL 10GM0
VoveranVOVERAN 1% EMULGEL 30GM105
EnzoflamENZOFLAM-SV TABLET168
DolserDolser 400 Mg/50 Mg Tablet Mr0
Renac SpRenac Sp Tablet51
Dicser PlusDicser Plus 50 Mg/10 Mg/500 Mg Tablet46
D P ZoxD P Zox 50 Mg/325 Mg/250 Mg Tablet20
Unofen KUnofen K 50 Mg Tablet0
ExflamExflam 1.16%W/W Gel48
Rid SRid S 50 Mg/10 Mg Capsule32
Diclonova PDiclonova P 25 Mg/500 Mg Tablet13
Dil Se PlusDil Se Plus 50 Mg/10 Mg/325 Mg Tablet44
Dynaford MrDynaford Mr 50 Mg/325 Mg/250 Mg Tablet29
ValfenValfen 100 Mg Injection10
FeganFegan Eye Drop16
RolosolRolosol 50 Mg/10 Mg Tablet67
DiclopalDiclopal 50 Mg/500 Mg Tablet16
DipseeDipsee Gel57
FlexicamFlexicam 50 Mg/325 Mg/250 Mg Tablet25
VivianVivian 1.16% Gel0
I GesicI Gesic 0.1% Eye Drop26
Rolosol ERolosol E 50 Mg/10 Mg Capsule51

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

  1. Straub RH, Cutolo M. Circadian rhythms in rheumatoid arthritis: implications for pathophysiology and therapeutic management.. Arthritis Rheum. 2007 Feb;56(2):399-408. PMID: 17265475
  2. M Cutolo et al. Circadian rhythms in RA. Ann Rheum Dis. 2003 Jul; 62(7): 593–596. PMID: 12810417
  3. Arnett FC et al. The American Rheumatism Association 1987 revised criteria for the classification of rheumatoid arthritis.. Arthritis Rheum. 1988 Mar;31(3):315-24. PMID: 3358796
  4. Anderson JJ et al. Which traditional measures should be used in rheumatoid arthritis clinical trials?. Arthritis Rheum. 1989 Sep;32(9):1093-9. PMID: 2505779
  5. Verna Wright, Richard J. Johns. Quantitative and Qualitative Analysis of Joint Stiffness in Normal Subjects and in Patients with Connective Tissue Diseases. Ann Rheum Dis. 1961 Mar; 20(1): 36–46. PMID: 13786829
और पढ़ें ...