బెణుకు - Sprain in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 14, 2018

July 31, 2020

బెణుకు
బెణుకు

బెణుకు అంటే ఏమిటి ?

భౌతిక కార్యకలాపాల్లో కీళ్లవద్ద ఎముకల్ని కలిపే నరాలు వాటి సామర్థ్యానికి మించి సాగుతీతకు, స్థితిస్థాపకతకు లేదా ఒత్తిడికి గురైనపుడు ఏర్పడే నొప్పిని లేదా బాధతో కూడిన రుగ్మతనే “బెణుకు” గా చెప్పబడింది. అతి సాధారణంగా కాలిచీలమండలాల్ని (మిడాలు) బెణుకులు బాధిస్తాయి, చేతుల్లోని నరబంధనాలను కూడా బెణుకులు బాధించొచ్చు. అమెరికాలో రోజుకు బెణుకుల రుగ్మతకు సంబంధించిన 30,000 కేసులు వివేదించబడుతున్నాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రధాన లక్షణాలు ఇలా ఉన్నాయి

  • బాధిత భాగానికి వాపు (ఎడెమా) రావడం
  • నొప్పి
  • బాధిత శరీర భాగాన్ని కదల్చలేని అసమర్థత
  • బాధిత భాగంలో కమిలిన గాయాలవడం
  • రుగ్మత బాధిత భాగంలో సున్నితత్వం కల్గుతుంది

బెణుకుల్ని వాటి తరగతుల ప్రకారం విభజించవచ్చు:

  • గ్రేడ్ 1 తేలికపాటి బెణుకులు: బరువులను భరించగలిగే స్థాయి ఉంటుంది
  • గ్రేడ్ 2 ఓ మోస్తరు పాటి బెణుకులు: కుంటడం (చీలమండ బెణుకులు విషయంలో)
  • గ్రేడ్ 3 తీవ్రమైన బెణుకులు: నడవడానికి అసమర్థత

బెణుకులకు ప్రధాన కారణాలు ఏమిటి?

స్నాయువు పై అధిక ఒత్తిడిని కల్గించడంవల్ల కీళ్లుజారటం కలుగుతుంది మరియు కీలు స్థానభ్రంశం చెందుతుంది. ఇది కీలు యొక్క సాగతీతకు లేదా కీలు దెబ్బ తినడానికి దారితీస్తుంది. నడుస్తున్నప్పుడు అక్రమమైన భంగిమ వంటి కొన్ని చర్యలు, నడుస్తున్నపుడు లేదా పరుగెడుతున్నపుడు లేదా పడ్డపుడు చీలమండ మెలితిప్పినట్లు అయి బెణుకు కు  కారణం కావచ్చు. పునరావృతమయ్యే తీవ్రమైన బెణుకులు స్నాయువుల్ని మరియు కీళ్లను శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

బెణుకును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ప్రధాన రోగ నిర్ధారణ రోగిని బెణుకు ఏర్పడడానికి గల కారణము గురించి అడగటంతో జరుగుతుంది. వైద్యుడు బాధిత భాగాన్ని శారీరక పరీక్ష చేయడం, దాన్ని ఇతర పరిస్థితుల నుండి వేరు చేయడం చేస్తాడు. బాధిత భాగం చుట్టూ ఉన్న భాగాన్ని తాకుతూ పరీక్ష చేయడంవల్ల కూడా బెణుకును నిర్ధారించడానికి సహాయపడుతుంది. ప్రభావిత ప్రాంతం యొక్క చర్య పరిధిని గమనించవచ్చు. ఇమేజింగ్ పద్ధతులు X- రే, ఒత్తిడి X- కిరణాలు, MRI స్కాన్లు మరియు అల్ట్రాసౌండ్ వంటివి పరిస్థితులను పరిశీలించడానికి ఉపయోగించవచ్చు.

బెణుకు చికిత్స బాధకు గురైన అవయవం కదలకుండా (immobilizing) ఉండేట్టుగా జాగ్రత్తపడడంపై దృష్టి పెడుతుంది. రుగ్మతకు గురైన భాగానికి విశ్రాంతినివ్వడం  ఉత్తమం; మంచు అద్దకం ద్వారా నొప్పి నిర్వహణలో బాధాకరమైన అధ్యాయాల్ని పరిష్కరించడానికి సహాయపడవచ్చు. సరైన పద్ధతిలో కట్టు కట్టడం ద్వారా రుగ్మత భాగానికి అదనపు మద్దతును అందించవచ్చు మరియు ఈ కట్టు వాపును తగ్గిస్తుంది. శస్త్రచికిత్సేతర పద్ధతులే చాలా సందర్భాలలో సాధారణంగా బెణుకు చికిత్సకు సరిపోతాయి. ఫిజియోథెరపీ పూర్తి కోర్సు కదలికల్ని మరియు బలాన్ని పూర్తి స్థాయిలో తిరిగి పొందడానికి సహాయపడవచ్చు. నొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు వ్యాధి లక్షణాలను పరిష్కరించడానికి సహాయపడవచ్చు.

సరైన జాగ్రత్తలతో బెణుకుల్ని సులభంగా సరిదిద్దడానికి వీలుంది కాబట్టి దీన్ని బాగానే  నిర్వహించవచ్చు. బెణికిన శరీరభాగాన్ని కదల్చకుండా పైన పేర్కొన్న చర్యలను అనుసరించడం ద్వారా ఈ రుగ్మతను త్వరగా పరిష్కరించవచ్చు.



వనరులు

  1. National Institute of Arthritirs and Musculoskeletal and Skin Disease. [Internet]. U.S. Department of Health & Human Services; Is there a test for sprains and strains?
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Sprains and Strains.
  3. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Sprained Ankle.
  4. Hospital for Special Surgery [Internet]: New York, USA; Ankle Sprain Types and Treatments.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Sprains.

బెణుకు కొరకు మందులు

Medicines listed below are available for బెణుకు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.