myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మయస్తినియా గ్రేవిస్ అంటే ఏమిటి?

మయస్తినియా గ్రేవిస్ (MG) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యొక్క అసాధారణ పనితీరు వలన సంభవించే ఒకరకమైన వ్యాధి, ఇది, తద్వారా శరీర కణజాలాలను ప్రభావితం చేసి వాపును మరియు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది నరములు మరియు కండరాల మధ్య ఉండే కెమికల్ మెసేజెస్ యొక్క  ప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది, అవి శరీరంలోని దాదాపు అన్ని కదలికలు మరియు చర్యలకు దోహదపడతాయి. ఇది వివిధ వయస్సుల గల పురుషులు మరియు మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. ఇది మహిళల్లో కొంచెం చిన్న వయసులోనే కనిపిస్తుంది మరియు పురుషులలో పెద్ద వయసులో గమనించవచ్చు. వాపు కారణంగా, వివిధ కండరాలలో కదలికలను కలిగించే/సహాయపడే  శక్తికి (energy) ఒక క్రముముగా నష్టం వాటిల్లుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ లక్షణాలకు చికిత్స చేయకుండా వదిలేస్తే వ్యాధి అధికమవుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

శరీరం యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా/తప్పుగా మెదడు మరియు కండరాల యొక్క నెర్వ్ (నరాల) టెర్మినల్స్ మధ్య ఉన్న ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేసినప్పుడు మయస్తినియా గ్రేవిస్  సంభవిస్తుంది. కణాల మధ్య సందేశాలను తీసుకువెళ్లే ఎసిటైల్ కోలిన్ (acetylcholine) అని పిలువబడే కెమికల్ మెసెంజర్ (రసాయన సందేశాలను తీసుకువెళ్లేది) స్థాయిలు తగ్గిన కారణంగా ఈ కణాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితి ప్రమాదాన్ని పెంచే కారకాలు:

 • రోగనిరోధక శక్తిని నియంత్రించే థైమస్ గ్రంథులు (thymus glands) బలహీనపడినప్పుడు
 • క్యాన్సర్
 • మయస్తినియా గ్రేవిస్ యొక్క కుటుంబ చరిత్ర

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

నరాల పరీక్ష (neurological examination) నిర్వహించబడుతుంది అది వీటిని నిర్దారిస్తుంది

 • కండరాల బలహీనత యొక్క తీవ్రత
 • కండరాల యొక్క పరిస్థితి
 • ప్రతిచర్యలు (Reflexes)
 • పరీక్ష ద్వారా కంటి లోపాన్ని పరిశీలించడం
 • కండరాల సమన్వయం

ఒక వివరణాత్మక ఆరోగ్య చరిత్ర తీసుకోబడుతుంది. ఇతర పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి

 • కెమికల్ మెసెంజర్  అసిటైల్ కోలిన్ (acetylcholine) యొక్క అంచనా
 • ఎడ్రోఫోనియం క్లోరైడ్ పరీక్ష (Edrophonium chloride test) అనేది కండరాల కదలికను తనిఖీ చేయగల ఒక విశేషమైన పరీక్ష
 • కండరాల కణజాలం యొక్క ఎలెక్ట్రికల్ ఆక్టివిటీని (electrical activity) నమోదు చేసే ఎలెక్ట్రోమయోగ్రఫీ (Electromyography)
 • థైమస్ గ్రంధుల తనిఖీ కోసం సిటి (CT) స్కాన్ మరియు ఎంఆర్ఐ (MRI)
 • శ్వాస యొక్క బలాన్ని కొలవడానికి ఊపిరితిత్తుల పరీక్ష

ప్రస్తుతం మయస్తినియా గ్రేవిస్కు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. చికిత్సలో లక్షణాలను నిర్వహించడం మరియు రోగనిరోధక వ్యవస్థ పనితీరును నియంత్రించడం వంటివి ఉంటాయి.

 • రోగనిరోధక శక్తిని మరియు కార్టికోస్టెరాయిడ్లను తగ్గించే మందులు ఉపయోగకరంగా ఉంటాయి. నరాల (nerve cells) మరియు కండరాల మధ్య మెదడు యొక్క సంకేతాలను మెరుగుపర్చడానికి పైరిడోస్టిగ్మైన్ (Pyridostigmine) ఉపయోగించబడుతుంది. రోగనిరోధక వ్యవస్థలోని అసాధారణతను ఎదుర్కోవడానికి  ఇంట్రావీనస్ గ్లోబులిన్ (నరలోనికి ఎక్కించే గ్లోబులిన్) అనే ఒక బ్లడ్ (రక్త) ఆధారిత ఉత్పత్తి సహాయపడుతుంది.
 • థైమస్ గ్రంధి యొక్క తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
 • ప్లాస్మా యొక్క మార్పిడి కూడా  కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది.

మయస్తినియా గ్రేవిస్కు యొక్క లక్షణాలను తగ్గించడంలో కొన్ని జీవనశైలి మార్పులు కూడా  సహాయపడవచ్చు:

 • కండరాల బలహీనత తగ్గించడానికి విశ్రాంతి.
 • ఒత్తిడిని మరియు వేడికి గురికావడాన్ని తగ్గించాలి/నివారించాలి.
 1. మయస్తినియా గ్రేవిస్ కొరకు మందులు

మయస్తినియా గ్రేవిస్ కొరకు మందులు

మయస్తినియా గ్రేవిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
DistinonDistinon 60 Mg Tablet0
GravitorGravitor 180 Mg Tablet Sr271
MyestinMyestin 30 Mg Tablet0
MygrisMygris 60 Mg Tablet0
PyodistigPyodistig 60 Mg Tablet106
PyristigPyristig 60 Mg Tablet92
TrostigminTrostigmin 60 Mg Tablet208
MyostigminMYOSTIGMIN 2.5MG INJECTION 1ML17
NeomineNeomine 0.5 Mg Injection5
NeostiminNeostimin Injection7
NeotroyNeotroy 0.5 Mg Injection16
TilstigminTilstigmin 0.5 Mg Injection36
AlstigAlstig Injection5
NeotagminNeotagmin Injection16
Glycopyrolate And NeostigminGlycopyrolate And Neostigmin 0.5 Mg/2.5 Mg Injection79
Stimin GStimin G 0.5 Mg/2.5 Mg Injection30
Myo PyrolateMyo Pyrolate Injection67
Pyrotroy NeoPyrotroy Neo Injection52

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Scherer K,Bedlack RS,Simel DL. Does this patient have myasthenia gravis? JAMA. 2005 Apr 20;293(15):1906-14. PMID: 15840866
 2. National Institute of Neurological Disorders and Stroke [internet]. US Department of Health and Human Services; Myasthenia Gravis Fact Sheet.
 3. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Myasthenia gravis.
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Myasthenia Gravis.
 5. Office on Women's Health [Internet]: U.S. Department of Health and Human Services; Myasthenia gravis.
और पढ़ें ...