myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పెరిటోనిటిస్ అంటే ఏమిటి?

పెరిటోనిటిస్ అనేది పెరిటోనియం యొక్క వాపు. పెరిటోనియం అనేది ఉదరకుహరాన్ని ఆవరించి ఉండేపొర. పొత్తికడుపు లోపలి గోడల్లో (లైనింగ్) ఏర్పడిన కణజాలం మరియు కడుపు అవయవాలను రక్షించే పొరనే ‘పెరిటోనియం’ అంటారు. పెర్టోనిటిస్ ఒక సాధారణ రుగ్మతే కానీ తీవ్రమైన పరిస్థితిని కల్గిఉంటుందిది. ఇది బ్యాక్టీరియల్ సంక్రమణ వలన సంభవించవచ్చు లేదా శస్త్రచికిత్స లేదా పెరిటోనియల్ డయాలిసిస్ తెచ్చిపెట్టే సమస్య కావచ్చు ఇది. ఈ రుగ్మతకు వెంటనే చికిత్స చేయబడాలి, చికిత్స చేయకుండా వదిలేస్తే మరింత తీవ్రతరం కావచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పెర్టోనిటిస్ యొక్క అత్యంత సాధారణ కారణం ఒక తీవ్రమైన బాక్టీరియల్ సంక్రమణం. ఈ సంక్రమణం ప్రాధమికమైన కారణమో (ఏదైనా అంతర్లీన వ్యాధి లేకుండా) లేదా రెండవ కారణమో కావచ్చు. ఈ సంక్రమణ ఇతర అవయవాల నుండి లేదా శరీరభాగం నుండి వ్యాపిస్తుంది. అయినప్పటికీ, పెర్టోనిటిస్ కు దారితీసే అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. పెర్టోనిటిస్ యొక్క ఇతర కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 • పొత్తికడుపు గాయం లేదా పుండు.
 • పెరిటోనియల్ డయాలిసిస్ - డయాలిసిస్ ఆఫ్ పెరిటోనియల్ ఫ్లూయిడ్, అక్కడ ఉన్న ద్రవం ఒక యంత్రాన్ని ఉపయోగించి ఫిల్టర్ చేయబడుతుంది.
 • కడుపు శస్త్రచికిత్స.
 • అపెండిసైటిస్.
 • కడుపు పూతలు (stomach ulcers)
 • క్రోన్స్ వ్యాధి- ఒక రకం ప్రేగు శోథ వ్యాధి
 • క్లోమము లేదా పొత్తికడుపు యొక్క వాపు
 • పిత్తాశయం లేదా ప్రేగు యొక్క సంక్రమణ.
 • డయాసిసిస్ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్.
 • ఆహార ట్యూబ్ ఉపయోగించడం.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే మీ డాక్టర్ ను వెంటనే కలిసి సలహా తీసుకోవాలి. రోగనిర్ధారణ వైద్య చరిత్ర అంచనాతో రోగ నిర్ధారణ పరీక్ష ప్రారంభమవుతుంది. రోగనిర్ధారణకు కింద సూచించిన పరీక్షలుంటాయి:

 • ఉదరం యొక్క భౌతిక పరీక్ష.
 • రక్త పరిశోధన
 • పెరిటోనియం ను దెబ్బ తీసే బ్యాక్టీరియాను తెలుసుకోవటానికి రక్తం సంస్కృతి (blood culture) పరీక్ష.
 • ఉదర ద్రవ విశ్లేషణ.
 • డీయాలిసిస్ ప్రసరించే విశ్లేషణ, మీరు పెరిటోనియల్ డయాలిసిస్లో ఉంటే.
 • అల్ట్రాసౌండ్ ఇమేజింగ్.
 • CT స్కాన్లు మరియు X- కిరణాలు పెరిటోనియంలోని రంధ్రాలను గుర్తించడానికి.
 • లాపరోస్కోపీ - కారణం వెతకడానికి ఉదరం లోపల అన్వేషించడానికి ఒక కెమెరా-బిగించిన గొట్టం ఉపయోగించి చేసే పరీక్ష.

సంక్రమణ బహుళ అవయవ వైఫల్యానికి దారితీసే ప్రమాదముంది గనుక పెర్టోనిటిస్కు తక్షణ చికిత్స అవసరం. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి:

 • మందులు: యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్.
 • సోకిన కణజాలం తొలగించడానికి శస్త్రచికిత్స.
 • ఉదర భాగంలో కడగడానికి మరియు వాపు మరియు సంక్రమణను తగ్గించడానికి ఇంట్రా-ఉదర కందరి (intra-abdominal lavage).
 • కొందరు రోగులకు తిరిగి లాపరోటమీ అవసరమవుతుంది (ఓపెన్ శస్త్రచికిత్స). అసాధారణతల్ని గుర్తించటానికి ఉదర కుహరంలో  తాజాగా కోత పెట్టి ఈ శస్త్రచికిత్స చేస్తారు.

చికిత్స చేయకుండా వదిలేస్తే, సెప్టిసిమియా (శరీరంలోని రక్తానికంతకూ  సంక్రమణ వ్యాప్తి) మరియు షాక్ వంటి సమస్యలకు పెర్టోనిటిస్ వ్యాప్తి చెందుతుంది. ఇది పొత్తికడుపుచీము లేదా కణజాల మరణం ఏర్పడటానికి దారితీయవచ్చు, ఇది ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, పెర్టోనిటిస్ యొక్క ఏదైనా సంకేతం లేదా లక్షణాన్ని గుర్తించిన వెంటనే శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం, వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి.

 1. పెరిటోనిటిస్ కొరకు మందులు

పెరిటోనిటిస్ కొరకు మందులు

పెరిటోనిటిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Rite O CefRITE O CEF DT 200MG TABLET126
ExtacefEXTACEF 100MG TABLET 10S70
OmnikacinOmnikacin 100 Mg Injection26
CeftasCEFTAS 400MG TABLET 10S195
MiliximMILIXIM 100MG DS SYRUP 30ML53
ZifiZIFI 100MG DRY SYRUP 50ML117
Rite O Cef CvRite O Cef Cv 200 Mg/125 Mg Tablet216
MagnexMAGNEX 2GM INJECTION721
Gramocef CvGramocef Cv 200 Mg/125 Mg Tablet236
Taxim OTAXIM O 100MG TABLET 10S95
Ritolide 250 Mg TabletRitolide 250 Mg Tablet168
Amicin InjectionAmicin 100 Mg Injection17
Mikacin InjectionMikacin 100 Mg Injection18
Cefopam SCefopam S 500 Mg/500 Mg Injection96
RevobactoRevobacto 200 Mg/200 Mg Tablet156
WofunginWofungin 50 Mg Injection11030
PidPid 200 Mg Tablet72
CbactCbact 1 Gm Injection182
CamicaCamica 100 Mg Injection14
CefortalCefortal 500 Mg/500 Mg Injection112
TraxofTraxof 100 Mg/100 Mg Tablet Dt52
CanciginCancigin 50 Mg Injection7992
Qucef (Dr Cure)Qucef 200 Mg Tablet Dt93
CefomycinCefomycin 1 Gm Injection195
CecefCecef 1000 Mg Injection56

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. OMICS International[Internet]; Peritonitis.
 2. Sujit M. Chakma et al. Spectrum of Perforation Peritonitis. J Clin Diagn Res. 2013 Nov; 7(11): 2518–2520. PMID: 24392388
 3. K Soares-Weiser. Antibiotic treatment for spontaneous bacterial peritonitis. BMJ. 2002 Jan 12; 324(7329): 100–102. PMID: 11786457
 4. R.J.E.Skipworth and K.C.H.Fearon. Acute abdomen: peritonitis. Surgery,March 2008, 26 (3); 98-101. Volume 26, Issue 3, Pages 98–101
 5. Carlos A Ordonez,Juan Carlos Puyana. Management of Peritonitis in the Critically Ill Patient. Surg Clin North Am. 2006 Dec; 86(6): 1323–1349. PMID: 17116451
और पढ़ें ...