కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) - Peptic Ulcer in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

కడుపులో పుండు
కడుపులో పుండు

సారాంశం

పెప్టిక్ అల్సర్లు అనేవి కడుపులో మరియు చిన్న ప్రేగులలో (ఆంత్రమూలం) అభివృద్ధి చెందుతాయి. అవి కడుపులో నొప్పి, ఆకలి లేకపోవటం మరియు బరువు కోల్పోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ అల్సర్ల వలన కలిగే నొప్పి లేదా అసౌకర్యం యాంటాసిడ్లు తినడం లేదా తీసుకోవడం ద్వారా తగ్గుతుంది. పెప్టిక్ అల్సర్లకు సాధారణంగా స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDS) దీర్ఘకాలం వాడకం వలన లేదా హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాను వలన కలిగే బాక్టీరియల్ రోగ సంక్రమణం కలిగి ఉండటం వలన కావచ్చు. ఈ పరిస్థితి యొక్క నిర్ధారణ లక్షణాల ఆధారంగా చేయబడుతుంది, NSAIDలు మరియు నిర్దిష్ట పరీక్షల సంబంధిత చరిత్ర ద్వారా బ్యాక్టీరియా సంక్రమణను గుర్తించడంలో సహాయపడతాయి. సాధారణంగా, వృద్ధులలో, తీవ్రమైన లక్షణాలను లేదా సంభావ్య సమస్యలు మరియు నిరంతర లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎండోస్కోపీ సూచించబడుతుంది.

పెప్టిక్ అల్సర్ యొక్క చికిత్స అనేది దాని మూలాధారంపై ఆధారపడి ఉంటుంది. బ్యాక్టీరియా సంక్రమణ కలిగి ఉన్నవారు యాంటీబయాటిక్స్ సూచించబడినప్పుడు NSAID లపై ఉన్న వ్యక్తులు ఉపయోగించడం నిలిపివేయవలసి ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఆమ్ల ఉత్పత్తిని నియంత్రించుటకు ప్రోటాన్ పంప్ నిరోధకాలు సాధారణంగా సూచించబడతాయి. చికిత్సా విధానం ఆలస్యం చేయబడినా లేదా ఔషధాలకు అల్సర్ స్పందించకపోతే సమస్యలు తలెత్తవచ్చు. అరుదైన సంక్లిష్టతలలో ప్రేగుల రంధ్రాలు పడుట, గ్యాస్ట్రిక్ అడ్డంకులు, మరియు పెరిటోనిటిస్ వంటివి ఉంటాయి, వీటికి తక్షణ వైద్య సంరక్షణ మరియు శస్త్రచికిత్స అవసరమవుతాయి.

కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) యొక్క లక్షణాలు - Symptoms of Peptic Ulcer in Telugu

పెప్టిక్ అల్సర్ల యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి మొండి నొప్పి లేదా కడుపులో మంటగా అనిపించడం. నొప్పి సాధారణంగా కడుపు పైభాగంలో అనగా బొడ్డు ఎగువ భాగంలో కలుగుతుంది. ఇతర లక్షణాలు కడుపు ఉబ్బడం, బర్పింగ్, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం, వాంతులు, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు కోల్పోవటం మరియు సరిగా ఆకలి వేయకపోవుట వంటి ఇతర లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు, మనుషులు కూడా గుండెల్లో మండటం మరియు అజీర్తిని ఎదుర్కొంటారు. (మరింత చదవండి - కడుపు నొప్పికి కారణాలు మరియు చికిత్స)

కడుపులో మంట కలిగించే భావన సాధారణంగా క్రింది లక్షణాలతో ముడిపడి ఉంటుంది:

  • మీరు యాంటాసిడ్లను తీసుకున్నా లేదా ఏదో తినడం వల్ల కొంత సమయం వరకు ఆపుచేస్తుంది
  • ఎక్కువగా భోజనాల విరామం సమయంలో మరియు రాత్రి సమయంలో ఖాళీ కడుపుతో ఉండడం వలన సంభవిస్తుంది.
  • ఇది కొన్ని నిమిషాల నుండి అనేక గంటలు వరకు ఉండవచ్చు.
  • ఇది అనేక రోజులు లేదా వారాలు లేదా నెలలు క్రమానుగతంగా జరుగుతుంది.

పెప్టిక్ అల్సర్­ని సీరియస్­గా తీసుకోవాలి, మరియు మీ లక్షణాలు మోస్తరుగా ఉంటే వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే చికిత్స చేయకుండా వదిలేస్తే, పెప్టిక్ అల్సర్లు మరింత తీవ్రమైన మరియు వివిధ సమస్యలకు దారితీస్తుంది.

కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) యొక్క చికిత్స - Treatment of Peptic Ulcer in Telugu

చికిత్సకు పెప్టిక్ అల్సర్ల బాగానే స్పందిస్తాయి మరియు రెండు నెలల సమయంలో నయం అవటం ప్రారంభo అవుతుంది. చికిత్స అనేది అల్సర్ యొక్క కారణంపై ఆధారపడి ఉంటుంది. అటువంటి NSAIDs మందుల సాధారణ వాడకం కారణంగా అల్సర్లు ఏర్పడినప్పుడు, మందులు నిలిపివేయడం పరిగణించబడుతుంది. మీ డాక్టర్ మీ కేసును సమీక్షిoచడం గాని మరియు మోతాదుని తగ్గిoచడం గాని లేదా ప్రత్యామ్నాయ మందులను సూచించడం గాని చేస్తారు. మందులు క్రింది వాటితో పాటుగా:

  • ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్
    సాధారణంగా, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (PPI) అని పిలువబడే ఔషధం సూచించబడుతుంది. ఈ ఔషధం కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు అల్సర్లకు సహజమైన వైద్యాన్ని అనుమతిస్తుంది. సాధారణంగా 4 నుండి 8 నెలల వరకు PPI లు సూచించబడతాయి. సాధారణంగా ఉపయోగించే PPI లు ఓమెప్రజోల్, పంటోప్రజోల్ మరియు లాన్సోప్రజోల్.
  • యాంటీబయాటిక్స్
    పెప్టిక్ అల్సర్­కు బాక్టీరియా సంక్రమణ కారణమైతే బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబయాటిక్స్ సూచించబడతాయి. యాంటీబయాటిక్స్తో పాటు, PPIలు కూడా అదే సమయాల్లో సూచించబడతాయి. బాక్టీరియా చంపబడిన తరువాత, అల్సర్ నయమవుతుంది మరియు సాధారణంగా అల్సర్లు మరల తిరిగి రావు. సాధారణంగా, రెండు లేదా మూడు యాంటీబయాటిక్స్ యొక్క కోర్సు సూచించబడుతుంది, వీటిలో ప్రతి ఒక్కదానిని ఒక రోజుకు రెండుసార్లు చొప్పున ఒక వారం పాటు తీసుకోవాలి. బాక్టీరియా సంక్రమణ మరియు NSAID మందుల వాడకం వలన పెప్టిక్ అల్సర్లు ఏర్పడినప్పుడు, అప్పుడు సిఫారసు చేయబడిన చికిత్సగా PPI లు మరియు యాంటీబయాటిక్స్ రెంటినీ సూచించవచ్చు.
  • H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్­లు
    H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్­లు అనేవి మీ కడుపుతో ఉత్పత్తి చేసే యాసిడ్ మొత్తాన్ని ఆటంకపరచే అవరోధకాలు. అత్యంత విస్తృతంగా ఉపయోగించే H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్­లలో ఒకటి రేనిటిడిన్.
  • ఏంటాసిడ్లు మరియు ఆల్గినేట్లు
    కడుపులో ఆమ్లాలను తటస్థీకరించడం ద్వారా కడుపులోని అల్సర్ల యొక్క లక్షణాలకు వ్యతిరేకంగా స్వల్పకాలిక ఉపశమనం అందించటంలో ఏంటాసిడ్లు పని చేస్తాయి. కొన్ని ఏంటాసిడ్లు ఆల్గిన్ట్ అని పిలువబడే ఔషధం కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తి ఉపశమనం అందించడానికి సహాయపడే కడుపు లైనింగ్ పై సంరక్షక పూత కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఏంటాసిడ్లు తీసుకోవాలి లేదా ఈ లక్షణాలు నిద్రవేళలో లేదా భోజనం తర్వాత సంభవిస్తాయని అనికోవడం జరుగుతుంది. ఆల్గినేట్స్ కలిగి ఉన్న ఏంటాసిడ్లు, అయితే, వీటిని సాధారణంగా భోజనం ముందు తీసుకుంటారు.

మీ వైద్యుని సంప్రదించకుండా ఏ ఔషధాలను ఆపివేయడం గాని లేదా నిలిపివేయడం గాని చేయకూడదు. పరిస్థితి యొక్క సరియైన కారణాన్ని గుర్తించమని మీ వైద్యుడిని సంప్రదించాలి, అతని/ ఆమె సిఫారసులను తీసుకోవడం లేదా ఆపడం చేస్తే ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది.

అన్ని పెప్టిక్ అల్సర్లలో 90% H పైలోరీ బ్యాక్టీరియా వలన కలిగే సంక్రమణ ఫలితంగా జరుగుతుంది. సిఫార్సు చేసిన సమయానికి యాంటీబయాటిక్స్ కోర్సును తీసుకోవడం ద్వారా అటువంటి అంటువ్యాధులు సులభంగా నయమవుతాయి, ఇది సాధారణంగా రెండు వారాలు పడుతుంది.

జీవనశైలి నిర్వహణ

గతంలో కొన్ని జీవనశైలిలు మరియు స్పైసి ఆహారాలు, ఒత్తిడి మరియు ఆల్కహాల్ తీసుకోవడం వంటివి పెప్టిక్ అల్సర్లుకు కారణమయినట్లుగా భావించబడింది. నేడు, అయితే, స్పైసి ఫుడ్స్ మరియు ఆందోళన అనేవి అల్సర్లకు కారణoగా చెప్పబడుట లేదు, అయినప్పటికీ అవి అల్సర్ల లక్షణాలును మరింత అధ్వాన్నంగా మారుస్తాయి.

పెప్టిక్ అల్సర్ల నిర్మూలన మరియు నివారణలో ఆహారం మరియు పోషణ యొక్క పాత్ర గురించి పరిశోధన అనేది ఒక కొలిక్కిరాలేదు, మరియు పరిశోధకులు వాటి మధ్య ఎలాంటి సంబంధాన్ని కనుగొనలేకపోయారు.

లక్షణాల ఉపశమనం కోసం అత్యంత సాధారణమైన గృహ నివారణలలో ఒకటి పాలు తీసుకోవడం. అయినప్పటికీ, వ్యాధి నుండి ఉపశమనాన్ని అందించడంలో పాలు తీసుకోవడం అంత ప్రభావవంతమైనది కాదు.

అంతే కాకుండా, మద్యం మరియు ధూమపానం వలన పెప్టిక్ అల్సర్లు ఏర్పడటానికి కారణం ముడిపడివుంది, అందుచేత వీటిని తీసుకోరాదు.

కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) అంటే ఏమిటి? - What is Peptic Ulcer in Telugu

పెప్టిక్ అల్సర్లు చాలా సాధారణం, అయితే అయితే ప్రభావితమైన వ్యక్తుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే 10 మంది వ్యక్తులలో ఒకరు పెప్టిక్ అల్సర్ల ద్వారా వారి జీవితాలలో ఏదో ఒక సమయంలో ప్రభావితం అయినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇతర వయసుల వారి కంటే, 60 సంవత్సరాల ఇతర వయసుల పైబడిన వారిలో పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, స్త్రీలతో పోలిస్తే పురుషులు ఈ పరిస్థితిని మరింత ఎక్కువగా ప్రభావితం అవుతారు.

పెప్టిక్ అల్సర్ అంటే ఏమిటి?

పెప్టిక్ అల్సర్ అనేది తెరచి ఉన్న పుండు లేదా నొప్పి, ఇవి ఉదర గోడ లోపల లేదా చిన్న ప్రేగులోని మొదటి భాగంలో ఆంత్రం అని అని పిలువబడే భాగంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు, ఒక అల్సర్ ఉదర ప్రారంభాన్ని కలిసే ఆహారపు పైపు దిగువ భాగంలో (అన్నవాహిక) కూడా ఎర్పడవచ్చు. ఇలాంటి పెప్టిక్ అల్సర్­ని జీర్ణకోశ పుండు అని అంటారు.



వనరులు

  1. Am Fam Physician. 2007 Oct 1;76(7):1005-1012. [Internet] American Academy of Family Physicians; Peptic Ulcer Disease.
  2. National Health Service [Internet]. UK; Stomach ulcer.
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Peptic Ulcers (Stomach Ulcers).
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Peptic ulcer
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Ulcers

కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) వైద్యులు

Dr. Paramjeet Singh Dr. Paramjeet Singh Gastroenterology
10 Years of Experience
Dr. Nikhil Bhangale Dr. Nikhil Bhangale Gastroenterology
10 Years of Experience
Dr Jagdish Singh Dr Jagdish Singh Gastroenterology
12 Years of Experience
Dr. Deepak Sharma Dr. Deepak Sharma Gastroenterology
12 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) కొరకు మందులు

Medicines listed below are available for కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.