పొటాషియం లోపం - Potassium Deficiency in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

December 14, 2018

March 06, 2020

పొటాషియం లోపం
పొటాషియం లోపం

పొటాషియం లోపం అంటే ఏమిటి?

పొటాషియం లోపం అనేది అరుదైన పరిస్థితి, దీనిని వైద్యపరంగా హైపోకలైమియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో, శరీరంలో పొటాషియం యొక్క లోపం ఉంటుంది అది కొన్ని నిర్దిష్ట సంకేతాలు మరియు లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పొటాషియం లోపం యొక్క మొదటి మరియు అత్యంత సాధారణ లక్షణం పూర్తి శరీరంలో అలసట మరియు సాధారణ బలహీనత. ఈ లోపం యొక్క ఇతర నిర్దిష్ట లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

 • ఆహార జీర్ణక్రియలో సమస్య.
 • కండరాల తిమ్మిరి మరియు కండరాలు పట్టేయడం.
 • గుండె దడ (ముఖ్యంగా వేగవంతమైన, క్రమరహిత మరియు పెద్ద శబ్దంతో కూడిన హృదయ స్పందన).
 • శ్వాస తీసుకోవడంలో సమస్య.
 • కాళ్ళు, చేతులలో తిమ్మిరి మరియు జలదరింపు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అనేక ఆరోగ్య సమస్యలు మరియు వివిధ రకాల మందుల దుష్ప్రభావాల వలన పొటాషియం లోపం సంభవించవచ్చు. కొన్ని కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

దీనిని  ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వ్యక్తిలో పైన పేర్కొన్న లక్షణాలు ఉన్నట్లయితే, వైద్యులు పొటాషియం, కాల్షియం మరియు ఇతర ఖనిజాల (minerals) స్థాయిలను తెలిపే ఒక రక్త పరీక్షలు వంటి కొన్ని పరీక్షలను ఆదేశించవచ్చు.

క్రమరహిత హృదయ లయలు విషయంలో, ఎలెక్ట్రొకార్డియోగ్రామ్ (ఈసిజి, electrocardiogram) ను కూడా సూచించవచ్చు, ఎందుకంటే పొటాషియం లోపం అనేది హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది.

ఈ పరిస్థితికి యొక్క చికిత్స చాలా సులభంగా ఉంటుంది మరియు లక్షణాలు వేగవంతమైన అభివృద్ధిని చూపిస్తుంది. వ్యక్తి యొక్క పరిస్థితి మరియు లక్షణాలు ఆధారంగా, వైద్యులు వివిధ మందులను సూచిస్తారు. రక్తంలో పొటాషియం స్థాయి తగ్గుదల అనేది ప్రమాదకరంగా లేనట్లయితే, పొటాషియం సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి పొటాషియం లవణాలు (salts) కలిగిన కొన్ని మాత్రలు లేదా సిరప్లను నిర్దేశిస్తారు.

కేసు తీవ్రంగా ఉంటే మరియు వ్యక్తి గుండెదడ (palpitations) కూడా బాధపడుతుంటే, రోగికి పొటాషియం ఇంట్రావీనస్ (IV లేదా నరము ద్వారా) గా ఎక్కించబడుతుంది.

పొటాషియం లోప ప్రమాదాన్ని నివారించడానికి  మద్యపానాన్ని నియంత్రణలో ఉంచాలి మరియు ఒక సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.వనరులు

 1. A Tabasum et al. A man with a worrying potassium deficiency . Endocrinol Diabetes Metab Case Rep. 2014; 2014: 130067. PMID: 24683481
 2. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; Potassium.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Potassium
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; The Role of Potassium and Sodium in Your Diet
 5. healthdirect Australia. Potassium. Australian government: Department of Health
 6. Weaver CM et al. Potassium and health. Adv Nutr. 2013 May 1;4(3):368S-77S. PMID: 23674806
 7. Michael S. Stone, Lisa Martyn, Connie M. Weaver. Potassium Intake, Bioavailability, Hypertension, and Glucose Control. Nutrients. 2016 Jul; 8(7): 444. PMID: 27455317

పొటాషియం లోపం వైద్యులు

Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 वर्षों का अनुभव
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 वर्षों का अनुभव
Dr. M Shafi Kuchay Dr. M Shafi Kuchay Endocrinology
13 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పొటాషియం లోపం కొరకు మందులు

పొటాషియం లోపం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।