తామర వ్యాధి (రింగ్‍వార్మ్) - Ringworm in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

March 06, 2020

తామర వ్యాధి
తామర వ్యాధి

సారాంశం

రింగ్ వార్మ్ వ్యాధి అనేది సాధారణ చర్మ వ్యాధి, ఇది పిల్లలు మరియు పెద్దలలో కనిపిస్తుంది. డేర్మటోఫైట్ అని పిలువబడే ఒక ఫంగస్ వలన రింగ్ వార్మ్ వ్యాధి వస్తుంది. వైద్యపరంగా టినియా అని పిలుస్తారు, రింగ్ వార్మ్ వ్యాధి  మనుషులను అలాగే జంతువులను ప్రభావితం చేయవచ్చు. రింగ్ వార్మ్ అనేది సాధారణంగా వెచ్చగా మరియు తేమగా ఉండే చర్మంపై, అనగా కాలి వ్రేళ్ళు, గజ్జ ప్రాంతం, పైచర్మం, చేతి వేళ్లు మధ్య చర్మం మడతలులో వ్యాపిస్తుంది. వివిధ రకాలైన చర్మాన్ని బట్టి రింగ్ వార్మ్ వ్యాధి పేరు పెట్టబడుతుంది. ఉదాహరణకు, గజ్జల్లో టినియా క్రూరిస్, చర్మపు పై పొరలో టినియా క్యాపిటీస్, గోళ్ళపై టినియా ఉంజియం, పాదాలలో టినియా పెడీస్ (క్రీడాకారుల పాదాలు) మరియు చేతులలో టినియా మానుమ్ సంభవిస్తుంది. టినియా కార్పోరిస్ అనేది శిలీంధ్ర సంక్రమణ శరీరంలో ఎక్కడైనా సంభవించే ఒక సాధారణ పదం.

రింగ్ వార్మ్ వ్యాధి అనేది ఒక వృత్తాకార వలయం లాంటి దద్దురు ఒక ప్రాంతంతో స్పష్టముగా కనిపిస్తుంది. వలయం యొక్క అంచులు ఎత్తుగా మరియు ఎర్రటి రంగులో పొలుసులుగా ఉంటాయి. రింగ్ వార్మ్ వ్యాధిలో ప్రభావిత ప్రాంతంలో తీవ్రమైన దురద కలుగుతుంది. దద్దుర్లు యొక్క వృత్తాకార వలయం లాంటి ఆకారం కారణంగా 'రింగ్ వార్మ్ వ్యాధి' అనే  పదం టినియాకి ఇవ్వబడుతుంది. రింగ్ వార్మ్ వ్యాధి సోకిన ఒక వ్యక్తి, జంతువు లేదా పెంపుడు జంతువు నుండి సులభంగా వ్యాపిస్తుంది మరియు శిలీంధ్రాలను కలిగిన మట్టి లేదా ఉపరితలాల ద్వారా వాపిస్తుంది. ఇది కూడా హెచ్.ఐ.వి, డయాబెటీస్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులతో బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన చర్మం నమూనా యొక్క శారీరక మరియు మైక్రోస్కోపిక్ పరీక్ష ఆధారంగా వైద్యులు రింగ్ వార్మ్ వ్యాధిని నిర్ధారణ చేస్తారు. రింగ్ వార్మ్ వ్యాధి యొక్క చిన్న నమూనాలు సాధారణంగా యాంటీ ఫంగల్ మందులు మరియు లోషన్­లను బాహ్యంగా వర్తింపజేయాలి. అయినప్పటికీ, తీవ్రతర పరిస్థితులలో నోటి ద్వారా తీసుకునే యాంటీఫంగల్ మందులు కూడా అవసరం అవుతాయి. అదనంగా, చర్మం శుభ్రంగా మరియు పరిశుభ్రమైనదిగా ఉంచడానికి ఆరోగ్యకరమైన అలవాట్లు నిర్వహించడంతో రింగ్ వార్మ్ వ్యాధి నివారించబడుతుంది.

తామర వ్యాధి (రింగ్‍వార్మ్) యొక్క లక్షణాలు - Symptoms of Ringworm in Telugu

ఒక విలక్షణమైన రింగ్ వార్మ్ వ్యాధి యొక్క పుండు ఒక వృత్తం లేదా వలయాకారంలో ఒక చర్మ దద్దురు లేదా విస్ఫోటనాలను కలిగి ఉంటుంది. పుండు యొక్క అంచులు పెరుగుతాయి మరియు ఎరుపు రంగులో కనిపిస్తాయి మరియు వెండి లాంటి పొరలు కలిగి ఉంటాయి. వలయాకార గాయం యొక్క కేంద్ర భాగం స్పష్టంగా మరియు ప్రభావితం కానిదిగా ఉంటుంది. చికిత్స లేకుండా పరిమాణం మరియు సంఖ్య పెరుగుతుంది, వ్యాధి సోకిన చర్మం యొక్క ప్యాచ్­లో తీవ్రమైన దురద కలుగుతుంది. దద్దుర్లు సాధారణంగా కాకుండా, చర్మoపై వివిధ భాగాలలో రింగ్ వార్మ్ వ్యాధి క్రింద వివరించిన విధంగా వివిధ ఆనవాళ్ళు మరియు లక్షణాలను పెంచేలా చేస్తుంది:

శరీరం యొక్క ఏ భాగం మీద అయినా టినియా కార్పొరిస్ లేదా రింగ్ వార్మ్

  • ఎత్తైన అంచుతో ఒక గుండ్రని ప్యాచ్ మరియు మధ్యలో స్పష్టమైన ప్రాంతం.
  • ప్యాచ్ ఎరుపు, గులాబీ, బూడిద లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది.
  • అనేక రింగ్ ఆకారపు ప్యాచ్­లు కలిసిపోయి ఎక్కువ భాగంలో వ్యాప్తి చెందుతాయి.
  • కొన్నిసార్లు, చీము నిండిన బొబ్బలు కూడా దద్దురు చుట్టూ కనిపిస్తాయి.

గజ్జలలో టినియా క్రూరిస్ లేదా రింగ్ వార్మ్ (జాక్ ఇచ్)

  • గజ్జ ప్రాంతంలోని వాపు మరియు ఎరుపును సంక్రమణ అనేవి ప్రారంభ దశలలో ఉంటాయి.
  • దద్దుర్లు క్రమంగా పెరుగుతాయి మరియు లోపలి తొడలు, నడుము మరియు పిరుదులకు విస్తరిస్తాయి.
  • చేరిన చర్మం పొలుసులుగా మారుతుంది, ఇది వేరు చేయబడవచ్చు లేదా పగుళ్లుగా మారవచ్చు.
  • సంక్రమణ యొక్క వృత్తాకార ప్యాచ్  యొక్క అంచు పెరుగుతుంది మరియు చీము నిండిన బొబ్బలు కలిగి ఉండవచ్చు.
  • ఇన్ఫెక్షన్ తో తరచుగా తీవ్రమైన దురద ఉంటుంది.

పాదాల మడమలపై టినియా పెడిస్ లేదా రింగ్ వార్మ్ (అథ్లెట్స్ ఫుట్)

  • అరికాళ్ళకు మరియు కాలివేళ్ల మధ్య గల చర్మం తేలిక అయిపోతుంది.
  • పొడి చర్మం రక్తస్రావంతో కూడిన పగుళ్లుగా ఏర్పడుతుంది.
  • అంటురోగం పాదాల ఇతర భాగాలకు వ్యాపిస్తుంది మరియు తీవ్రమైన దురద మరియు నొప్పితో చీము నిండిన బొబ్బలతో ఒక దద్దురును కలిగిస్తుంది.
  • కాలి మధ్య చర్మం తెలుపుగా, మృదువైనదిగా, మరియు మెత్తగా ఉంటుంది.
  • తీవ్రమైన అంటువ్యాధి కారణంగా, పాదాలలో ఉన్న చర్మం, ప్రత్యేకించి కాలికి మధ్యలో అసహ్యకరమైన వాసనను కలిగి ఉంటుంది.

గోళ్ళపై టినియా అంజ్యూయం లేదా రింగ్ వార్మ్

  • ఒకటి లేదా అనేక గోళ్ళకు ఇది సోకి ఉండవచ్చు.
  • గోరు యొక్క ఆధారంలో వాపు మరియు ఎరుపు, వ్యాధి యొక్క ప్రారంభ దశలలో కనిపిస్తాయి.
  • గోర్లు యొక్క రంగు నలుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
  • గోర్లు మందపాటిగా, పెళుసుగా మరియు సంక్రమణ గోరు ఆధారం నుండి మారుతుంది మరియు సంక్రమణ మరింత పెరగడంతో గోరు ఆధారం నుండి వేరు చేయబడుతుంది.
  • సాధారణంగా అథ్లెట్ల పాదంతో బాధపడుతున్న వ్యక్తులలో కనిపిస్తుంది.

నెత్తి (మాడుపై టినియా క్యాపిటిస్ లేదా రింగ్ వార్మ్

  • చర్మం పైపొర యొక్క ప్యాచెస్ ఏర్పడేలా చేస్తుంది.
  • జుట్టు రాలిన తరువాత ఒక బోడి ప్యాచ్ ఏర్పడుతుంది.
  • బోడి ప్యాచ్ లందు నల్లని మచ్చలు కనిపిస్తాయి.
  • చర్మం మీద ప్రభావితమైన పై చర్మం ఎరుపుగా మరియు మంట కారణంగా వాపుకు గురుతుంది.
  • చర్మం లో తీవ్రమైన దురద కూడా సాధారణంగా కలుగుతుంది.

గడ్డముపై టినియా బార్బే లేదా రింగ్ వార్మ్

  • రింగ్ వార్మ్ వ్యాధి గడ్డం మరియు మీసము ప్రాంతంలో చర్మంపై ఏర్పడుతుంది, అచ్చట మందపాటి జుట్టు పెరుగుదలను కలిగి ఉంటుంది.
  • చర్మం ఎరుపుగా మారి, వాపు కలిగి ఉంటుంది మరియు ఒక పారదర్శక ద్రవాన్ని విడిచిపెడుతుంది.
  • ప్రభావిత చర్మం కూడా చీము నిండిన బొబ్బలను కలిగి ఉండవచ్చు.
  • దెబ్బతిన్న హెయిర్ ఫోలికల్స్ కారణంగా ప్రభావిత ప్రాంతంలోని జుట్టు రాలిపోతుంది.
  • వ్యాధి సోకిన చర్మంపై తీవ్ర దురద ఉంటుంది.

చేతులపై టినియా మానూమ్ లేదా రింగ్ వార్మ్

  • అరచేతులలోని చర్మం మధ్యలో పగుళ్లతో చాలా పొడిగా ఉంటుంది.
  • సంక్రమణ యొక్క వలయాకారపు ప్యాచ్ సాధారణంగా చేతి వెనుక భాగంలో కనిపిస్తుంది.

ముఖంపై టినియా ఫేసియల్ లేదా రింగ్ వార్మ్

  • ముఖంపై ఉన్న చర్మం (గడ్డం భాగం కాకుండా కంటే భాగంలో) ఎర్రగా ఉంటుంది.
  • తీవ్రంగా దురద మరియు ముఖం మీద దహనం, ముఖ్యంగా సూర్యుడికి గురైనప్పుడు.
  • వ్యాధి సోకిన చర్మం సాధారణoగా వలయాకార నమూనాలో దద్దుర్లు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు.

తామర వ్యాధి (రింగ్‍వార్మ్) యొక్క చికిత్స - Treatment of Ringworm in Telugu

రింగ్ వార్మ్ వ్యాధి యొక్క చికిత్స వీలైనంత త్వరగా ప్రారంభించబడాలి మరియు వ్యాధి యొక్క వ్యాప్తి మరియు పునరావృత నివారించడానికి డాక్టర్ సలహా ఇచ్చినట్లుగా కొనసాగించాలి. చికిత్స అనేది రోగ సంక్రమణ యొక్క ప్రాంతం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. యాంటీ ఫంగల్ మందులు పెరుగుదల మరియు ఫంగస్ యొక్క వృద్ధిని ఆపుచేయును మరియు వ్యాధి సంక్రమణను నయం చేయడానికి సహాయపడుతుంది.

పైపూతగా రాసుకునే యాంటీఫంగల్ మందులు

చాలా సందర్భాలలో, యాంటీ ఫంగల్ క్రీమ్లు, పౌడర్లు, స్ప్రేలు, లేదా మందులను వాడడం వలన  2 నుంచి 4 వారాలలో రోగ సంక్రమణ నయం చేయబడుతుంది. పాదాలు మరియు గజ్జ భాగాలలో రింగ్ వార్మ్ చికిత్సకు ఉపయోగించే సాధారణ యాంటీ ఫంగల్ క్రీమ్లు, పౌడర్లు లేదా మందులు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • క్లోట్రిమాజోల్
  • మైకోనజోల్
  • టర్బినాఫైన్
  • కెటోకోనజోల్

సైక్లోపిరాక్స్ అని పిలువబడే యాంటీ-ఫంగల్ ఔషధం ఉన్న గోరుపై పూసే వార్నిష్ యొక్క ప్రయోజనం గోళ్ళ యొక్క రింగ్ వార్మ్ వ్యాధి నివారణకు వాడబడుతుంది.

నోటి ద్వారా తీసుకునే యాంటీఫంగల్ మందులు

నోటి మందుల సహాయముతో ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయము కావడానికి 1 నుండి 3 నెలల సమయం తీసుకుంటుంది.

చర్మం యొక్క అధిక ప్రాంతంలో రింగ్ వార్మ్ వ్యాప్తి చెందుతున్న సందర్భాలలో రింగ్ వార్మ్ వ్యాధి చికిత్సకు ఓరల్ యాంటీ ఫంగల్ మందులు అవసరం అవుతాయి. యాంటీ ఫంగల్ క్రీమ్లు లేదా పౌడర్లు వాడకంతో తల భాగంలో గల చర్మం నందు రింగ్ వార్మ్ వ్యాధి నయం కాదు. నోటి ఔషధాల సహాయంతో సంక్రమణ పూర్తిగా 1 నుంచి 3 నెలలు పడుతుంది:

  • గ్రీసోఫుల్విన్
  • టర్బినాఫైన్
  • ఇట్రాకొనజోల్
  • ఫ్లూకోనజోల్

సెలీనియం సల్ఫైడ్ మరియు కేటోకానజోల్ కలిగిన యాంటీ ఫంగల్ షాoపూలు తలపై గల రింగ్ వార్మ్ యొక్క వేగవంతమైన నివారణ కోసం నోటి ఔషధాలకు అదనంగా ఉపయోగిస్తారు.

జీవనశైలి యాజమాన్యము

చికిత్స వ్యూహాలతో పాటుగా, మీ జీవనశైలిని ఆధునీకరించుకోవడం ద్వారా కూడా రింగ్ వార్మ్ను నిర్వహణ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లకు అలవాటుపడటం మరియు రోజువారీ జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వలన రింగ్ వార్మ్ ఇతర శరీర భాగాలకు లేదా మనుషులకు వ్యాపిoచకుండా నివారించవచ్చు.

  • ఇతర శరీర భాగాలకు సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సోకిన చర్మాన్ని తాకిన తరువాత సబ్బు మరియు నీటితో మీ చేతులను శుభ్రపరచుకోవాలి.
  • సోకిన ప్రదేశమును శుభ్రంగా ఉంచుకోవడానికై తరచుగా కడుగుతూ ఉండండి.
  • క్రీడాకారుల పాదాల విషయంలో, సోకిన ప్రాంతాన్ని పొడిగా ఉంచడానికి సాక్స్ లేదా షూలను ధరించకూడదు, ఎందుకంటే వెచ్చదనం మరియు తేమ పెరుగుదల మరియు ఫంగస్ యొక్క వృద్ధికి ఉంటుంది. అంతేకాకుండా, తడి గదులు, లాకర్ గదులు మరియు పబ్లిక్ షవర్లు వద్దకు చెప్పులు లేకుండా వెళ్ళకూడదు మరియు ఇతరులకు వ్యాపించకుండా నివారించడానికి చెప్పులు వాడవలెను.
  • శుభ్రంగా మరియు పొడిగా ఉన్న దుస్తులను (ప్రత్యేకించి కాటన్ వస్త్రాలు) మరియు లోదుస్తులను ధరించండి.
  • దయచేసి మీ స్వంత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.
  • క్రమం తప్పకుండా వ్యాయామము చేయండి మరియు ఒక ఆరోగ్యకరమైన బరువును నిర్వహించుకోండి.
Skin Infection Tablet
₹499  ₹799  37% OFF
BUY NOW


వనరులు

  1. BARRY L. HAINER. Dermatophyte Infections. Am Fam Physician. 2003 Jan 1;67(1):101-109. [Internet] American Academy of Family Physicians
  2. P Ganeshkumar, M Hemamalini, A Lakshmanan, R Madhavan, S Raam Mohan. Epidemiological and clinical pattern of dermatomycoses in rural India.. Indian Journal of Medical Microbiology, Vol. 33, No. 5, 2015, pp. 134-136.
  3. American Academy of Dermatology. Rosemont (IL), US; Ringworm
  4. National Health Service [Internet] NHS inform; Scottish Government; Ringworm and other fungal infections
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Sources of Infection
  6. Chen X, Jiang X, Yang M, González U, Lin X, Hua X, Xue S, Zhang M, Bennett C. Systemic antifungal therapy for tinea capitis in children. Cochrane Database of Systematic Reviews 2016, Issue 5. PMID: 27169520
  7. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Ringworm Risk & Prevention
  8. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Ringworm Information for Healthcare Professionals
  9. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Treatment for Ringworm
  10. National Health Service [Internet]. UK; Ringworm.

తామర వ్యాధి (రింగ్‍వార్మ్) వైద్యులు

Dr Shishpal Singh Dr Shishpal Singh Dermatology
5 Years of Experience
Dr. Sarish Kaur Walia Dr. Sarish Kaur Walia Dermatology
3 Years of Experience
Dr. Rashmi Aderao Dr. Rashmi Aderao Dermatology
13 Years of Experience
Dr. Moin Ahmad Siddiqui Dr. Moin Ahmad Siddiqui Dermatology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

తామర వ్యాధి (రింగ్‍వార్మ్) కొరకు మందులు

Medicines listed below are available for తామర వ్యాధి (రింగ్‍వార్మ్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.