ట్రిజెమినల్ న్యూరాల్జియా - Trigeminal Neuralgia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 12, 2019

March 06, 2020

ట్రిజెమినల్ న్యూరాల్జియా
ట్రిజెమినల్ న్యూరాల్జియా

ట్రిజెమినల్ న్యూరాల్జియా అంటే ఏమిటి?

ట్రిజెమినల్ న్యూరాల్జియా (టిఎన్) అంటే ఆకస్మిక మరియు తీవ్రమైన ముఖపు నొప్పి యొక్క అనుభూతిని కలిగిస్తుంది, అది కొన్ని క్షణాల నుండి కొన్ని నిమిషాలు వరకు ఉంటుంది. ఈ పరిస్థితి ముఖం యొక్క ఒక వైపు లేదా రెండు వైపులా కలుగవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా, టిఎన్ అనేది 50 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తుల్లో కనిపిస్తుంది.

ట్రిజెమినల్ న్యూరాల్జియాతో  ముడి పడి ఉండే నొప్పి అధికంగా పదునైన, ఆకస్మిక మరియు తీవ్రమైన నొప్పిగా తెలియజేయబడుతుంది/వర్ణింపబడుతుంది. కొన్నిసార్లు ఇది మంట సంచలనంతో పాటుగా కూడా ఉండవచ్చు.

 • నొప్పి హఠాత్తుగా మొదలవుతుంది  మరియు సాధారణంగా అలాగే అకస్మాత్తుగా తగ్గిపోతుంది.
 • తినడం, గెడ్డం చేసుకోవడం (క్షౌరము), ముఖం కడగడం, మరియు పళ్ళు తోముకోవడం వంటి రోజువారీ కార్యకలాపాల/పనుల సమయంలో నొప్పి ప్రేరేపించబడుతుంది.
 • నిద్రిస్తున్న సమయంలో కూడా అకస్మాత్తుగా నొప్పి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.

అయితే, పరిస్థితి ప్రాణాంతకం కానప్పటికీ, ఇది వ్యక్తికి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. లక్షణాలు పురోగమించే స్వభావం ఉన్నవి, అంటే నొప్పి కాలక్రమేణా/క్రమముగా తీవ్రతరం అవుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • ట్రిజెమినల్ న్యూరాల్జియా యొక్క ప్రాధమిక కారణం పుర్రె (స్కల్)లో ఉండే ట్రిజెమినల్ నెర్వ్ యొక్క సంకోచం ఇది ముఖ్యంగా ముఖం, పళ్ళు మరియు నోటి నుండి మెదడుకు నొప్పి లేదా స్పర్శ యొక్క సంచలనాన్ని ప్రసారం చెయ్యడంలో బాధ్యత వహిస్తుంది.
 • ఈ సంకోచానికి కారణం ట్రిజెమినల్ నెర్వ్ కు పక్కన ఉండే రక్త నాళము విస్తరించడం/పెరిగడం వల్ల కావచ్చు.  టిఎన్ యొక్క లక్షణాలు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న వ్యక్తులలో కూడా సంభవించవచ్చు ఎందుకంటే ఈ వ్యాధి ట్రైజెమినల్ నరాలకు హాని కలిగిస్తుంది.
 • అరుదైన సందర్భాల్లో, ఈ నరాల యొక్క సమీపంలో కణితి ఏర్పడిన కారణంగా నరాల సంకోచం కలుగవచ్చు.
 • ఏదైనా ఆకస్మిక గాయం లేదా కొన్ని శస్త్రచికిత్సల కారణంగా ట్రిజెమినల్ నరాలకు గాయం కలుగడం వల్ల  కూడా టిఎన్ లక్షణాలకు కారణమవుతుంది.

దీనిని  ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

శారీరక మరియు నరాల పరీక్షల ద్వారా ట్రిజెమినల్ న్యూరాల్జియా యొక్క నిర్ధారణ జరుగుతుంది. ముఖ నొప్పికి ఇతర కారణాల యొక్క సంభావ్యతను తొలగించడానికి వైద్యులు స్కల్ ఎక్స్- రే, సిటి (CT) స్కాన్ మరియు ఎంఆర్ఐ (MRI) వంటి కొన్ని స్కానింగ్ పరీక్షలను నిర్వహించవచ్చు.

టిఎన్ యొక్క చికిత్సలో యాంటీ కన్వల్సెంట్ (anticonvulsant) మందులు ఉంటాయి అవి నరాలు ప్రేరేపించబడడాన్ని నివారించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో, నొప్పి ఉపశమనానికి శస్త్రచికిత్స చేయవచ్చు.వనరులు

 1. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Trigeminal Neuralgia Fact Sheet.
 2. National Health Service [Internet]. UK; Trigeminal neuralgia.
 3. American Association of Neurological Surgeons. [Internet] United States; Trigeminal Neuralgia.
 4. National Organization for Rare Disorders [Internet]; Trigeminal Neuralgia.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Trigeminal Neuralgia.

ట్రిజెమినల్ న్యూరాల్జియా వైద్యులు

Dr. Hemanth Kumar Dr. Hemanth Kumar Neurology
3 वर्षों का अनुभव
Dr. Deepak Chandra Prakash Dr. Deepak Chandra Prakash Neurology
10 वर्षों का अनुभव
Dr Madan Mohan Gupta Dr Madan Mohan Gupta Neurology
7 वर्षों का अनुभव
Dr. Virender K Sheorain Dr. Virender K Sheorain Neurology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ట్రిజెమినల్ న్యూరాల్జియా కొరకు మందులు

ట్రిజెమినల్ న్యూరాల్జియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।