myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మూత్రనాళపు  వాపు అంటే ఏమిటి?

మూత్రనాళం వాపుదేలిన పరిస్థితినే “మూత్రనాళపు  వాపు” అంటారు. ఈ రుగ్మత సూక్ష్మజీవుల (బ్యాక్టీరియల్) సంక్రమణ కారణంగా సంభవిస్తుంది. ‘మూత్రనాళ వాపు’, ‘మూత్రనాళ సంక్రమణం’ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్-యుటిఐ),  ఈ రెండూ ఒకటి కాదు. మూత్రనాళ సంక్రమణం అంటే మూత్రాశయం నుండి మూత్ర నాళము యొక్క కొనవరకూ ఏ భాగానికైనా సంక్రమణం సోకవచ్చు. ఈ రెండు వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి కానీ వీటికి చేసే చికిత్స పద్ధతులు వేరుగా ఉంటాయి. మూత్రనాళం వాపు (Urethritis) అన్ని వయసుల వారికి రావచ్చు, కానీ ఈ వ్యాధికి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:

 • మూత్రవిసర్జన సమయంలో మంట (బర్నింగ్)
 • మూత్రవిసర్జన సమయంలో నొప్పి
 • తరచుగా మూత్రవిసర్జన
 • పొత్తికడుపు మరియు కటిప్రాంతంలో నొప్పి
 • జ్వరం
 • వాపు
 • సంభోగం సమయంలో నొప్పి
 • మహిళల్లో యోని ఉత్సర్గ
 • పురుషుల్లో పురుషాంగం ఉత్సర్గ
 • పురుషులలో వీర్యంతోపాటు రక్తం పడటం లేక మూత్రంతో పాటుగా రక్తం పడటం
 • పురుషుల్లో పురుషాంగం యొక్క దురద
 • పురుషుల్లో బాధాకరమైన స్ఖలనం

మహిళలలో, వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు చాలా స్పష్టంగా గోచరించక పోవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రనాళం వాపు (Urethritis) కింద పేర్కొన్నటువంటి వివిధ కారణాల వల్ల కలుగుతుంది:

 • గాయం.
 • స్పెరిమిసైడ్లు లేదా గర్భనిరోధక జెల్లీలు మరియు ఫోమ్ల్లు(foams).
 • మూత్రాశయం మరియు మూత్రపిండాల అంటురోగాలకు కారణమయ్యే బాక్టీరియా.
 • అడెనో వైరస్.
 • ట్రిఖోమోనాస్ వెజినాలిస్ .
 •  ఎస్చెరిషియా కోలి వంటి యురోప్యాతోజెన్స్.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు వాపు లేదా ఉత్సర్గ వంటి సాధారణమైన అసాధారణతల తనిఖీకి భౌతికపరీక్ష చేస్తారు. వివరణాత్మక చరిత్ర తీసుకోవడంతోపాటు, కొన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి:

 • మూత్రనాళ పరిశీలన.
 • సూక్ష్మదర్శిని క్రింద స్వాబ్లను చొప్పించడం మరియు సేకరించిన నమూనాను  గమనించడం.
 • సిస్టోస్కోపీ - (మూత్రాశయాంతర్దర్ళిని) - అసాధారణతలను తనిఖీ చేసేందుకు మూత్రాశయంలోకి ఒక కెమెరాతో కూడిన ఒక ట్యూబ్ ను జొప్పించి  ప్రవేశపెడతారు.
 • మూత్ర పరీక్షలు
 • పూర్తి రక్తగణన పరీక్ష
 • లైంగిక సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేకమైన పరీక్షలు
 • మహిళల్లో పెల్విక్ అల్ట్రాసౌండ్

రోగనిర్ధారణ తరువాత, రోగికి  కిందివాటి లాంటి వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు:

 • బ్యాక్టీరియా సంక్రమణకు సరైన యాంటీబయాటిక్స్ను వైద్యుడు నిర్ణయిస్తారు.
 • స్టెరాయిడ్ లు కానటువంటి యాంటీ- ఇన్ఫ్లమేటరీ మందులు (NSAID లు) నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
 • వాపు-మంటను త్వరితంగా తగ్గించేందుకు క్రాన్బెర్రీ రసం సేవించవచ్చు. ఈ రసంలో వాపును త్వరగా తగ్గించే అధిక విటమిన్ ‘సి’ పదార్థాలున్నాయి.
 1. మూత్రనాళపు వాపు కొరకు మందులు

మూత్రనాళపు వాపు కొరకు మందులు

మూత్రనాళపు వాపు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
AzibactAzibact 100 Mg/5 Ml Redimix Suspension27.0
AtmAtm 100 Mg Tablet Xl25.0
AzibestAzibest 100 Mg Suspension26.0
CetilCetil 1.5 Gm Injection226.0
AzilideAzilide 100 Mg Redimix25.0
ZithroxZithrox 100 Mg Suspension26.0
PulmocefPulmocef 250 Mg Tablet157.0
AzeeAzee 1000 Mg Tablet47.0
AltacefAltacef 1.5 Gm Injection327.0
Microdox LbxMicrodox Lbx Capsule63.5
Doxt SlDoxt Sl Capsule63.0
AzithralAzithral 1% W/W Eye Ointment85.0
Ritolide 250 Mg TabletRitolide 250 Mg Tablet210.0
Ceftum TabletCeftum 125 Mg Tablet91.0
Stafcure LzStafcure Lz Tablet499.0
ZocefZocef 125 Mg Syrup165.0
Cat XpCat Xp 250 Mg Tablet85.0
ZomycinZomycin 250 Mg Tablet33.0
CefactinCefactin 250 Mg Tablet31.0
ZybactZybact 250 Mg Tablet106.0
Schwabe Sabal PentarkanSabal Pentarkan Drop140.0
Cefadur CaCefadur Ca 250 Mg Infusion51.0
Zycin(Cdl)Zycin 250 Mg Tablet68.0
ADEL 31Adel 31 Upelva Drop215.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...