తరచుగా మూత్రవిసర్జన - Frequent Urination in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

తరచుగా మూత్రవిసర్జన
తరచుగా మూత్రవిసర్జన

తరచుగా మూత్రవిసర్జన అంటే ఏమిటి?

సాధారణం కంటే అధికంగా మూత్రవిసర్జన చేవలసి వస్తుంటే లేదా మూత్రవిసర్జన  భావన కలుగుతుంటే, అది సంక్రమణ (ఇన్ఫెక్షన్) లేదా ఒక మూత్రపిండాల రాళ్ళు వంటి అంతర్లీన వ్యాధి కారణంగా కావచ్చు.

తరచుగా మూత్రవిసర్జన సమస్య అనేక సంబంధిత సమస్యలను కలిగిస్తుంది మరియు వ్యక్తి యొక్క రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిస్తుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • సగటున, చాలా మంది 24 గంటల్లో 7 నుంచి 8 సార్లు మూత్రవిసర్జన చేస్తారు. ఇది సాధారణమైనప్పటికీ, దీని కంటే ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్ళవలసి వస్తుంటే అది సమస్యగా పరిగణించబడుతుంది.
 • రాత్రిపూట ఈ సమస్య ఎక్కువగా ఉండవచ్చు, అది సాధారణ నిద్ర క్రమానికి అంతరాయం కలిగిస్తుంది మరియు తర్వాతి రోజు మొత్తం బద్ధకం మరియు మగత కలిగిస్తుంది.
 • తరచుగా మూత్రవిసర్జన కారణంగా, దాహం పెరుగుతుంది.
 • కొన్ని అసాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

దీని  ప్రధాన కారణాలు ఏమిటి?

 • తరచూ మూత్రవిసర్జన అధిక ద్రవాలు త్రాగడం వలన లేదా చాలా చల్లని పరిస్థితులు వంటి కారణంగా కావచ్చు.
 • డయాబెటిస్ మెల్లిటస్ ( diabetes mellitus) లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ (diabetes insipidus) రోగులు తరచుగా మూత్రవిసర్జనతో బాధపడతారు.
 • తరచూ మూత్రవిసర్జన అనేది మూత్ర నాళ సంక్రమణ మరియు అతిగా పనిచేసే (overactive) మూత్రాశయం యొక్క లక్షణాలలో ఒకటి.
 • స్త్రీలలో, మోనోపాజ్(రుతువిరతి) లేదా ఈస్ట్రోజెన్ అసమతుల్యతలు కూడా తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతాయి.
 • మూత్రాశయపు రాళ్ళు (Urinary bladder stones) కూడా తరచుగా మూత్రవిసర్జనకు మరొక కారణం.
 • కొన్నిసార్లు, యాంటి ఎపిలెప్టిక్స్ (anti-epileptics) వంటి మందులు కూడా ఈ లక్షణాన్ని కలిగించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

తరచుగా మూత్రవిసర్జన సమస్య కోసం వైద్యున్నీ సంప్రదిస్తే, వైద్యులు  సమస్య యొక్క ప్రారంభం మరియు లక్షణాల గురించి తెలుసుకుంటారు. తరచుగా మూత్రవిసర్జన మాత్రమే కాకుండా ఏ ఇతర సమస్యలనైనా కలిగి ఉంటే వైద్యులకి అవి కూడా తెలియజేయడం ముఖ్యం.

 • ప్రయోగశాలలో మూత్రంలోని రక్తం, గ్లూకోజ్, ప్రోటీన్లు లేదా ఇతర అసాధారణతలను పరీక్షించడానికి సాధారణంగా ఉదయపు మూత్ర నమూనాను తీసుకుంటారు.
 • మూత్రవిసర్జన తర్వాత మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతుందో లేదో పరిశీలించడానికి మూత్రాశయం యొక్క అల్ట్రాసౌండ్ చేయబడుతుంది. పొత్తికడుపు యొక్క సిటి (CT) స్కాన్ లేదా ఎక్స్-రే కూడా చేయవచ్చు.
 • వైద్యులు మధుమేహం వంటి ఇతర సమస్యలను అనుమానిస్తే, సంబంధిత పరీక్షలు మరియు రక్త పరిశోధనలను ఆదేశిస్తారు.

తరచుగా మూత్రవిసర్జనకు చికిత్స విధానం దాని కారణం మీద ఆధారపడి ఉంటుంది.

 • తరచూ మూత్రవిసర్జన సంక్రమణ (ఇన్ఫెక్షన్) కారణంగా ఐతే, యాంటీబయాటిక్స్ సహాయపడతాయి.
 • డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఇన్సులిన్ థెరపీ లేదా మందుల ద్వారా నియంత్రించబడుతుంది,అలాగే కొన్ని జీవనశైలి మార్పులు కూడా ఉంటాయి.
 • కారణం ఒక అతిగా పనిచేసే (ఓవర్ ఆక్టివ్) మూత్రాశయం ఐతే , మూత్రాశయ కండరాలను సడలించడానికి మందులు ఇస్తారు. మూత్రాశయ శిక్షణా వ్యాయామాలు (Bladder training exercises) కూడా సహాయకారంగా ఉంటాయి.వనరులు

 1. Ju J et al. Levetiracetam: Probably Associated Diurnal Frequent Urination.. Am J Ther. 2016 Mar-Apr;23(2):e624-7. PMID: 26938751
 2. Yeong-Woei Chiew et al. The Case ∣ Disabling frequent urination in a young adult. July 1, 2009 Volume 76, Issue 1, Pages 123–124
 3. Dwyer, Peter L et al. Recurrent urinary tract infection in the female. Wolters Kluwer Health; October 2002 - Volume 14 - Issue 5 - p 537-543
 4. Wrenn K. Dysuria, Frequency. Dysuria, Frequency, and Urgency. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 181.
 5. Stormorken H, Brosstad F. [Frequent urination--an important diagnostic marker in fibromyalgia].. Tidsskr Nor Laegeforen. 2005 Jan 6;125(1):17-9. PMID: 15643456

తరచుగా మూత్రవిసర్జన కొరకు మందులు

తరచుగా మూత్రవిసర్జన के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

translation missing: te.lab_test.sub_disease_title

translation missing: te.lab_test.test_name_description_on_disease_page

translation missing: te.lab_test.test_names