జింక్ లోపం - Zinc Deficiency in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

April 25, 2019

March 06, 2020

జింక్ లోపం
జింక్ లోపం

జింక్ లోపం అంటే ఏమిటి?

జింక్ అనేది ఆహారం మరియు ఆహార అనుబంధక పదార్ధాల నుండి మనం పొందగలిగే ఒక ముఖ్యమైన ఖనిజం. ప్రోటీన్ మరియు DNA ల సంశ్లేషణ, గర్భధారణ మరియు చిన్నతనంలో పెరుగుదల మరియు అభివృద్ధి, వాసన మరియు రుచి యొక్క సరైన భావగ్రహణం, గాయాల/పుండ్లు మాన్పుడు మరియు రోగనిరోధకశక్తి పనితీరు వంటి శరీరంలోని అనేక విధుల్లో జింక్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ కోసం నిల్వ వ్యవస్థ లేనందున తగినంత మొత్తంలో జింక్ను తీసుకోవడం మనకు చాలా అవసరం. మన శరీరంలో తగ్గిన జింక్ పరిమాణం మరియు ఆహారంలో తక్కువ జింక్ ను తీసుకోవడంవల్ల కలిగే రుగ్మతనే “జింక్ లోపం” అని పిలుస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జింక్ లోపం యొక్క సాధారణ లక్షణాలు:

 • ఆకలి నష్టం
 • పెరుగుదల ప్రతిబంధకం (గ్రోత్ రిటార్డేషన్)
 • తగ్గిన రోగనిరోధక శక్తి

అరుదైన మరియు తీవ్రమైన జింక్ లోపం లక్షణాలు:

 • అతిసారం (విరేచనాలు)
 • జుట్టు నష్టం
 • నపుంసకత్వము
 • రజస్వల కావడంలో ఆలస్యం (యుక్తవయసు రావడానికి ఆలస్యం)
 • చర్మం మరియు కంటి గాయాలు
 • పురుషులలో జననగ్రంథి మాంద్యం (హైపోగోనాడిజం)

ఇతర లక్షణాల్లో గాయం మానడంలో ఆలస్యం, బరువు నష్టం, బద్ధకం మరియు తగ్గిన రుచి అనుభూతి కూడా జింక్ లోపంతో సంబంధం కలిగి ఉండవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

జింక్ లోపం ప్రధాన కారణాలు:

 • తగినంతగా జింక్ తీసుకోకపోవడం
 • అసంబద్ధమైన జింక్ శోషణ
 • శరీరంలో పెరిగిన జింక్ అవసరం
 • శరీరం నుండి పెరిగిన జింక్ నష్టం

కింది కారకాలు జింక్ లోపం ప్రమాదాన్ని పెంచుతాయి:

 • ఆహార సరిగ్గా తీసుకోకపోవడం
 • మితం లేని మద్యపానం (ఆల్కహాలిజమ్)
 • క్రోన్స్ వ్యాధి వంటి జీర్ణశయాంతర వ్యాధులు , వ్రణోత్పత్తి పెద్దప్రేగువ్యాధి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ట్రోపికల్ స్పూ వంటి వ్యాధులు ఆహారం నుండి జింక్ శోషణను తగ్గిస్తాయి.
 • గర్భధారణ మరియు చనుబాలివ్వడంవల్ల జింక్ అవసరం పెరగడం జరుగుతుంది

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

శరీరంలో జింక్ యొక్క తీవ్ర లోపాన్ని గుర్తించడానికి రక్తంలో జింక్ స్థాయిలు తనిఖీ చేయడానికి  రక్త పరీక్షను ఉపయోగిస్తారు. ఆల్కలీన్ ఫాస్ఫాటాస్ ఎంజైమ్ మరియు అల్బుమిన్ స్థాయిలు కూడా జింక్ లోపాన్ని నిర్ధారించడంలో సహాయపడతాయి.

జింక్ లోపం రుగ్మతకు చేసే చికిత్సలో శరీరంలో జింక్ పునఃస్థాపన చేయడం అనేది ప్రధానమైనది. జింక్ అనుబంధకాల మోతాదు అంతర్లీన కారణంపై ఆధారపడి ఉంటుంది.

జింక్ లోపం వలన ఏర్పడిన చర్మ గాయాలను మాయిశ్చరైజర్ మరియు పైపూత స్టెరాయిడ్స్ ఉపయోగించి చికిత్స చేయలేము.

జింక్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడంవల్ల పెరుగుతున్న జింకలోపం రుగ్మత నిర్వహణకు సహాయపడుతుంది. గుల్లలు, ఎరుపు మాంసం, పౌల్ట్రీ, కాయలు, బీన్స్, తృణధాన్యాలు మరియు పాల ఉత్పత్తులు వంటి ఆహారాల సేవనం శరీర అవసరాలకు తగినంతగా జింక్ ను కలిగి ఉంటాయి.వనరులు

 1. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; Zinc.
 2. Ananda S Prasad. Zinc deficiency. BMJ. 2003 Feb 22; 326(7386): 409–410. PMID: 12595353
 3. Australasian College of Dermatologists. Zinc Deficiency and the Skin. [Internet]
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Zinc
 5. healthdirect Australia. Zinc. Australian government: Department of Health
 6. United States Department of Agriculture Agricultural Research Service. NUTRIENTS AND HEALTH BENEFITS. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]

జింక్ లోపం వైద్యులు

Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 वर्षों का अनुभव
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 वर्षों का अनुभव
Dr. M Shafi Kuchay Dr. M Shafi Kuchay Endocrinology
13 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

జింక్ లోపం కొరకు మందులు

జింక్ లోపం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।