మానవ శరీరం యొక్క అత్యంత కీలకమైన కణజాలాలలో (టిష్యూలలో) రక్తం ఒకటి. రక్త నాళాల నెట్‌వర్క్ శరీరాన్ని అంతా కలుపుతుంది, తద్వారా ఇది ఒకే యూనిట్‌గా పనిచేస్తుంది. రక్తం శరీరమంతా అవసరమైన పోషకాలు మరియు ఖనిజాలను సరఫరా చేయడమే కాక, వ్యర్ధాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో ఉండే తేల్లరక్తకణాలు మరియు యాంటీబాడీలు శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షిస్తాయి. రక్తం యొక్క కొన్ని ఇతర విధులు వీటిని:

 • ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీరంలోని వివిధ భాగాలకు అందించడం.
 • శరీర ఉష్ణోగ్రత మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడం.
 • లక్ష్య (టార్గెట్) అవయవాలకు హార్మోన్లను సరఫరా చేయడం.

అదనంగా, రక్తంలోని ప్లేట్‌లెట్లు గాయం తర్వాత రక్తస్రావం అధికంగా జరగకుండా రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.

జీవనశైలి, పర్యావరణం మరియు కొన్ని రకాల ఆహారాలు రక్తంలో కొన్ని విష పదార్థాలు/టాక్సిన్లు  పేరుకుపోవడానికి దారితీయవచ్చు. అవి ఫ్రీ రాడికల్స్, భారీ లోహాలు (heavy metals) లేదా ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా కావచ్చు. శరీర అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాల సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో పోగుపడే వ్యర్థ ఉత్పత్తులు కూడా ఇందులో ఉంటాయి.

ఈ మూడు అవయవాలు (ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాలు) ప్రధానంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు శుభ్రపరచడానికి బాధ్యత వహిస్తాయి. కాలేయం హానికరమైన రసాయన సమ్మేళనాలను తొలగించి రక్తాన్ని డిటాక్సిఫై చేస్తుంది, వాటిని (టాక్సిన్లను) మూత్రం ద్వారా బయటకు వెళ్ళేలా చేస్తుంది,, మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి మరియు అదనపు వ్యర్థాలను తొలగిస్తాయి. మరోవైపు, ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనేట్ చేయడంలో మరియు రక్తప్రవాహం నుండి హానికరమైన వాయువులను తొలగించడంలో సహాయపడతాయి.

ఇది కాకుండా, చనిపోయిన ఎర్రరక్త కణాలను (RBC) లను ఫిల్టర్ చేయడంలో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తెల్ల రక్త కణాలను మెరుగుపరచడంలో ప్లీహము బాధ్యత వహిస్తుంది.

అంటువ్యాధులతో పోరాడటానికి యాంటీమైక్రోబయాల్ మరియు యాంటీఆక్సిడెంట్ చర్యలను అందించడంతో పాటు ఈ అవయవాల పనితీరును మెరుగుపరచడంలో కొన్ని మూలికలు మరియు ఆహార వనరులు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రక్త శుద్దీకరణకు ఆహార మార్గం ఒక్కటే సరిపోదు. అనేక వ్యాయామాలు, యోగా భంగిమలు మరియు ప్రాణాయామం కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. మొత్తం శరీర పనితీరును ప్రోత్సహించడంలో ఇవి కూడా సహాయపడతాయి.

ఈ వ్యాసంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడే వివిధ మార్గాలు, ఆహారాలు, పద్ధతులు, మరియు విధానాలను గురించి మేము తెలియజేశాము.

 1. నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది - Water purifies blood in Telugu
 2. రక్త శుద్దీకరణకు గ్రీన్ టీ - Green tea for blood purification in Telugu
 3. సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు - Foods to purify blood naturally in Telugu
 4. రక్తాన్ని శుద్ధి చేయడానికి మూలికలు మరియు మసాలాదినుసులు - Herbs and spices to purify blood in Telugu
 5. రక్త శుద్దీకరణ కోసం యోగా మరియు శ్వాస వ్యాయామాలు - Yoga and breathing exercises for blood purification in Telugu
 6. ఉపసంహారం - Takeaway in Telugu

ఏవిధమైన ప్రక్షాళన మరియు డేటాక్సిఫైయింగ్ (నిర్విషీకరణ) విధానాలను ప్రస్తావించినప్పుడు గుర్తుకు వచ్చే మొదటి విషయం నీరు.

మన శరీరం 75% నీటితో తయారవుతుంది. కాబట్టి, ఈ ద్రవాన్ని తరచూ మార్చుతూ ఉండడం వల్ల రక్తం నుండి విషాన్ని మరియు హానికరమైన పదార్థాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

రోజుకు 8-10 గ్లాసుల నీరు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా కిడ్నీ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

(మరింత చదవండి: పరగడుపున మంచినీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
long time sex capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

గ్రీన్ టీ దాని డేటాక్సిఫైయింగ్ మరియు డైయూరేటిక్ లక్షణాల కోసం ఎక్కువగా ప్రసిద్ధి పొందిన పానీయం. గ్రీన్ టీ వినియోగం మూత్రం ద్వారా శరీరం పొటాషియం కోల్పోవడాన్ని తగ్గిస్తుందని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ యొక్క క్రమమైన వినియోగం శరీరం యొక్క ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు ఆటంకం కలగకుండా టాక్సిన్స్ బయటకు తొలగిపోవడంలో సహాయపడుతుంది.

దీనిలో వివిధ బయోలాజికల్ ఆక్టివ్ కెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయం మరియు మూత్రపిండాల నష్టాన్ని నిరోధిస్తాయి, అదే సమయంలో అవయవ పనితీరును మెరుగుపరుస్తాయి.

వాణిజ్యపరంగా మార్కెట్లో వివిధ రకాల గ్రీన్ టీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం రక్త శుద్దీకరణలో చాలా ఉపయోగపడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో అనేక రకాల ఆహార పదార్థాలు చాలా విధాలుగా ప్రభావవంతంగా ఉంటాయి, అవి:

 • శరీరం యొక్క సహజ నిర్విషీకరణ (డేటాక్సిఫైయింగ్) అవయవాలను బలోపేతం చేయడం. దీనిలో యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ పోగుపడడాన్ని నిరోధించి, తద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు శరీర సాధారణ పనితీరును మెరుగుపరుస్తాయి. (మరింత చదవండి: యాంటీఆక్సిడెంట్ ఆహార వనరులు)
 • రక్తంలో మైక్రోబియల్ లోడ్ (సూక్ష్మజీవుల పరిమాణాన్ని)ను తొలగించడంలో సహాయపడే యాంటీమైక్రోబయల్ పదార్థాలను అందించడం.
 • రక్తం నుండి అదనపు లవణాలు మరియు రసాయనాలను బయటకు తొలగించడానికి మూత్రవిసర్జన కారకాలను అందించడం.

అటువంటి కొన్ని ఆహారాలను మరియు వాటి లక్షణాలను, చర్యలను చర్చిద్దాం.

రక్త శుద్ధికారులుగా ఆక్రోటు కాయలు - Walnuts as blood purifiers in Telugu

లిపిడ్ మెటబాలిజంలో (జీవక్రియలో) కలుగజేసుకోవడం ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఆక్రోటు కాయలు తగ్గిస్తాయని కనుగొనబడింది. ఇది కాలేయ కణాల అపోప్టోసిస్ (సెల్ డెత్ [కణాల మరణం]) ను కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫలమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్‌గా, ఆక్రోటు కాయలు వివిధ శరీర అవయవాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా, అవి యాంటీప్రొలిఫెరేటివ్‌గా కూడా పరిగణింపబడతాయి, అంటే అవి కొన్ని క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి.

జంతు ఆధారిత అధ్యయనాలు ఆక్రోటు కాయలు కిడ్నీ క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయని సూచిస్తున్నాయి.

ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే ఆక్రోటు కాయలు ఆస్వాదించడానికి క్రమంగా కొన్ని ఆక్రోటు కాయలను తింటూ ఉండండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj hair oil
₹425  ₹850  50% OFF
BUY NOW

రక్త శుద్దీకరణ కోసం ఉసిరి - Amla for blood purification in Telugu

ఉసిరి ఒక తీపి మరియు పుల్లని పండు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్, అంటే ఇది వివిధ వ్యాధుల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. ఇది కొవ్వు జీవక్రియను (ఫ్యాట్ మెటబాలిజంను) మెరుగుపరచడంతో పాటు మందులు మరియు రసాయనాల వల్ల కలిగే కాలేయ టాక్సిసిటీని కూడా తగ్గిస్తుంది. అదనంగా, ఉసిరి ఒక ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్‌ను నిర్ములిస్తుంది మరియు అవయవ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉసిరి యాంటీమైక్రోబయల్ సమ్మేళనాల యొక్క గొప్ప మూలం, ఇది రక్తం నుండి వ్యాధికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

ఈ ప్రయోజనాలను పొందటానికి, ఉసిరిని పచ్చిగా తినవచ్చు లేదా ఉసిరి రసం లేదా పచ్చడి రూపంలో తీసుకోవచ్చు.

బ్లడ్ ప్యూరిఫైయర్‌గా బ్రోకలీ - Broccoli as a blood purifier in Telugu

కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో బ్రోకలీ అగ్రశ్రేణి ఆహారాల పదార్దాలలో ఒకటి.

ఇన్ వివో (జంతు-ఆధారిత) అధ్యయనాలు బ్రోకలీ కాలేయంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని సూచించాయి. ఫ్యాటీ లివర్ కు కారణమయ్యే హానికరమైన కొవ్వులలో ఇవి ఒకటి. బ్రోకలీ వినియోగం వలన కాలేయ ఎంజైమ్‌లలో గణనీయమైన తగ్గుదల కూడా గుర్తించబడింది, తద్వారా ఇది దెబ్బతిన్న కాలేయ కణజాల మెరుగుదలను సూచిస్తుంది. అదనంగా, కాలేయ క్యాన్సర్ కణాల అభివృద్ధిని కూడా ఇది నిరోధిస్తుందని నివేదించబడింది.

బ్రోకలీ వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుదలలో మరియు కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు మెరుగుదలతో ముడిపడి ఉందని మరొక అధ్యయనం ద్వారా తెలిసింది.

అదనంగా, క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు ప్రతిపాదించబడింది.

ఇంకేమిటి? బ్రోకలీని పచ్చిగా (సలాడ్లలో) తినవచ్చు లేదా వివిధ వంటకాల ద్వారా తినవచ్చు.

రక్త శుద్దీకరణ కోసం కాఫీ - Coffee for blood purification in Telugu

కాలేయ ఆరోగ్యానికి కాఫీ ఒక అద్భుతమైన పదార్థంగా నమ్ముతారు.

రోజుకు 2 కప్పుల కాఫీ త్రాగేవారికి కాలేయ వ్యాధులైన ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటివాటి ప్రమాదం తక్కువగా ఉండటంతో పాటు కాలేయ క్యాన్సర్‌ ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దెబ్బతిన్న కాలేయం అలనిన్ అమినోట్రాన్స్ఫిరేజ్ (alanine aminotransferase) మరియు ఆల్కలీన్ ఫాస్ఫేటేజ్ (alkaline phosphatase) వంటి కొన్ని ఎంజైమ్‌లను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. క్రమమైన కాఫీ వినియోగం ఈ ఎంజైమ్‌ల యొక్క స్థాయిలను తగ్గించడంతో ముడిపడి ఉంటుంది, తద్వారా మెరుగైన కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అయితే, కాఫీ వినియోగం మూత్రపిండాలకు హానికరమని నమ్ముతారు, అందువలన ఈ విషయం కొంచెం వివాదాస్పదముగా (controversial) ఉంటుంది.

కాబట్టి కాఫీ తీసుకోవడంతో పాటు తగినంత నీరు తీసుకోవడం మంచిది.

రక్తాన్ని శుద్ధి చేయడానికి బీట్‌రూట్ - Beetroot for purifying blood in Telugu

బీట్రూట్ దాని హెపటోప్రొటెక్టివ్ (కాలేయాన్ని రక్షించే) లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పండ్లలో ఒకటి. కాలేయ నష్టాన్ని తగ్గించడంలో మరియు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతమైన అనేక యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయని అధ్యయనాలు సూచించాయి.

జంతు-ఆధారిత అధ్యయనంలో, మోతాదు-ఆధారిత పద్ధతిలో (dose-dependent manner) బీట్‌రూట్ రసం కాలేయ గాయాలను మెరుగుపరుస్తుందని తెలిసింది. ఇంకా, ఇది విస్తృతమైన యాంటీమైక్రోబయాల్ చర్యలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

కొన్ని క్యారెట్లు, నిమ్మకాయ మరియు అల్లంతో బీట్‌రూట్‌లను కలిపి బీట్‌రూట్ రసాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కాలేయంలో  కొవ్వు అధికంగా పేరుకుపోయే అవకాశం ఉన్నందున ఎక్కువ చక్కెర లేదా అడిటివ్స్  వేసుకోకుండా ఉండడం మంచిది.

ఆయుర్వేద మూలికలలో చాలావాటికి కాలేయ శుద్దీకరణ మరియు నిర్విషీకరణ (డేటాక్సిఫికేషన్)తో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రయోజనం కలిగి ఉంటాయి.  అజమోదము(పార్స్లీ), వేప, మందార మరియు తిప్పతీగ వంటి మూలికలు వాటి  రక్త ప్రక్షాళన లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు టీ రూపంలో లేదా వేరేవాటితో కలిపి తీసుకోవచ్చు. రక్త నాణ్యతను మెరుగుపరచడమే కాక కొన్ని మూలికలకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చగల  కొన్ని మూలికలు ఈ కింద ఇవ్వబడ్డాయి:

రక్త శుద్దీకరణలో వేప ప్రయోజనాలు - Neem benefits in blood purification in Telugu

ప్రత్యామ్నాయ ఔషధలా గురించి మీకు పెద్దగా తెలియపోయినా, వేప యొక్క అద్భుతాల గురించి మీకు తెలిసే ఉండవచ్చు. ఆయుర్వేదంలో వేప రక్తాన్నిశుద్ధి చేసే లక్షణాలకు బాగా ప్రసిద్ది చెందింది. ఇది రక్తంలో ఉన్న టాక్సిన్లను మరియు సూక్ష్మజీవులను తొలగిస్తుంది. వేప ఆక్సిడేటివ్ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది, లేకపోతే అది రక్తంలో చనిపోయిన ఎర్ర రక్తకణాలు పేరుకుపోవటానికి కారణమవుతుంది, తద్వారా అది శరీరం యొక్క సాధారణ డీటాక్సిఫైయింగ్ చర్యలను ప్రభావితం చేస్తుంది.

వేపను టాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు కాని వేప ఆకుల పొడి మార్కెట్లో సులభంగా లభిస్తుంది. డాక్టర్ సిఫారసు ప్రకారం దీనిని నీటితో కలిపి తీసుకోవచ్చు.

బ్లడ్ ప్యూరిఫైయర్ గా అల్లం - Ginger is a blood purifier in Telugu

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మాత్రమే కాకుండా, అల్లం మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది. అంటే, ఇది కణజాలాల నుండి అదనపు టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. అల్లం టీ కంటే రుచికరమైనటువంటి  రక్తాన్ని శుభ్రపరచే మార్గం మరొకటి ఉండదు!!

ఒక కప్పు నీటిలో చిన్న అల్లం  ముక్క వేసి మరిగించడం ద్వారా అల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ యొక్క డైయూరేటిక్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలను పెంచడానికి కొంచెం తేనె మరియు నిమ్మకాయ రసం కూడా జోడించవచ్చు.

రక్త శుద్దీకరణకు పసుపు ప్రయోజనాలు - Turmeric benefits for blood purification in Telugu

రక్త శుద్దీకరణ చర్యలకు ప్రసిద్ధి చెందిన ప్రధాన మూలికలలో పసుపు ఒకటి. దీనిని పారంపర్యంగా  కాలేయం మరియు మూత్రపిండ రుగ్మతల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. శరీరానికి వేడిని కలిగించే మూలికగా, ముక్కు దిబ్బేడను తగ్గించడానికి పసుపు చాలా సహాయపడుతుంది, దిబ్బేడ/రద్దీ (congestion) రక్తం యొక్క ఆక్సిజనేషన్‌ను ప్రభావితం చేసి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. పసుపును శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ అని కూడా అంటారు.

పసుపు పొడి సాధారణంగా చాలా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. పసుపు వేసిన పాలను త్రాగడం కూడా పసుపును ఆహారంలో చేర్చగల ఒక మంచి మార్గం.

తులసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది - Basil purifies blood in Telugu

శరీరంలోని ప్రతి వ్యవస్థకు అనేక ప్రయోజనాలు కలిగించే ముఖ్యమైన ఔషధ మూలికలలో తులసి ఒకటి. ఇది ఒక అద్భుతమైన డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇది కణజాలాల నుండి భారీ లోహాలు, టాక్సిన్స్ మరియు డ్రగ్స్ ను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను నిర్ములించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికి కాలేయం మరియు మూత్రపిండాలపై అనేక రక్షణ చర్యలు ఉన్నాయి మరియు శక్తివంతమైన యాంటీమైక్రోబయాల్ చర్యలను కలిగి ఉంటుంది.

ఒక కప్పు వేడినీటిలో కొన్ని తులసి ఆకులను వేసి, ఇంట్లో తులసి టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీకి తేనె మరియు అల్లాన్ని కూడా కలుపవచ్చు, ఇది రుచిని జోడించడమే కాకుండా, డేటాక్సిఫైయింగ్ లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది.

యోగా మరియు ప్రాణాయామం పురాతన భారతీయ విధానాలు, ఇవి శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తాయని మరియు చి (chi) లేదా ప్రాణ (prana) ప్రవాహాన్ని నియంత్రిస్తాయని భావిస్తారు. నిజానికి, ఒక నియంత్రిత ప్రాణ, ఆరోగ్యకరమైన శరీరం యొక్క ప్రాథమిక లక్షణంగా పరిగణించబడుతుంది. అవగాహన పెరగడంతో, ప్రపంచవ్యాప్తంగా యోగాభ్యాసాల ఆసక్తి పెరుగుతోంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాక, శరీర అవయవాల పనితీరు యొక్క సమగ్ర అభివృద్ధికి దారితీస్తుంది.

యోగా ఆసనాలు రక్త శుద్దీకరణకు మంచివి - Yoga asanas good for blood purification in Telugu

చాలా ఆసనాలు రక్త శుద్ధిలో ఏదో ఒక విధంగా ప్రయోజనకరంగా ఉంటాయి. శ్వాస వ్యాయామాల మాదిరిగానే, ఇవి శరీరంలోని శక్తి ప్రవాహాన్ని (energy flow) క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి, ఇది జీవక్రియను మరియు శరీరం యొక్క సహజ డేటాక్సిఫైయింగ్ మరియు శుద్దీకరణ (purifying) సామర్ధ్యాలను సమతుల్యం చేస్తుంది.

సహజంగా రక్త శుద్దీకరణ మరియు నిర్విషీకరణకు సహాయపడే,  మీరు ఇంట్లోనే చేయగల రెండు సులభమైన ఆసనాలు ఇక్కడ ఉన్నాయి:

త్రికోణాసనం: దీనిని త్రిభుజ భంగిమ అని కూడా పిలుస్తారు, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు ఉదర కండరాలను బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ శరీరం నుండి వ్యర్థ ఉత్పత్తులను అధికంగా తొలగించడానికి దారితీస్తుంది, తద్వారా రక్తంలో అవి పేరుకుపోకుండా చేస్తుంది. మీరు ఈ దశలను అనుసరించవచ్చు:

 • మీ పాదాలు ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉండేలా చూసుకుని నిటారుగా నిలబడండి.
 • మీ చేతులను భూమికి సమాంతరంగా పెంచండి, తద్వారా అవి 180-డిగ్రీల కోణాన్ని ఏర్పరచాలి.
 • నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి మరియు మీ ఎడమ అరచేతితో మీ ఎడమ పాదం వెనుక భాగాన్ని తాకేలా వంగండి.
 • మీ కుడి చేయి భూమికి 90 డిగ్రీల వద్ద ఉండాలి.
 • కుడి చేతి వైపు చూస్తూ, కొన్ని సెకన్ల పాటు అదే భంగిమలో ఉండండి.
 • శ్వాస సాధారణంగా తీసుకోండి.
 • ఊపిరి తీసుకుంటూ మాములు స్థితికి రండి.
 • మరొక వైపు రిపీట్ (పునరావృత్తం) చెయ్యండి.
 • మొత్తం ప్రక్రియను కొన్ని సార్లు చేయవచ్చు.

అర్ధ ఉస్త్రాసనం (సగం ఒంటె భంగిమ): ఈ ఆసనం నడుము మరియు కడుపు కండరాలను బలపరుస్తుంది. ఇది గుండె వైపుకు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇది రక్తం యొక్క సరైన ఆక్సిజనేషన్ను మరియు శరీర అవయవాలకు మెరుగైన సామర్థ్యాన్ని అందించి అవి సహజంగా అధిక టాక్సిన్లను తొలగించేలా చేస్తుంది.

 • మీ మోకాళ్ళను వంచి, మీ పిరుదుల క్రింద మీ కాలి వేళ్ళను అడ్డంగా పెట్టి కూర్చోండి.
 • మీ మోకాళ్లపై పైకి లేవండి.
 • మీ అరచేతులను నడుము మీద ఉంచి, మీ మెడను వెనుకకు వంచండి.
 • ఊపిరి తీసుకుంటూ మీ శరీర పై భాగాన్ని నెమ్మదిగా వెనుకకు వంచండి.
 • మీ వెనుకభాగానికి అతిగా ఇబ్బంది కలిగించకూడదు. నెమ్మదిగా  ఊపిరి బయటకు వదులుతూ కొన్ని సెకన్ల పాటు అదే భంగిమను కొనసాగించండి.
 • మీ తొడలు భూమికి 90 డిగ్రీలలో ఉండాలి మరియు మీ వేళ్లు క్రింది వైపుకి ఉండాలి.
 • ఊపిరి పీల్చేటప్పుడు మీ వీపును నిఠారుగా ఉంచండి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
sex power capsule for men
₹719  ₹799  10% OFF
BUY NOW

రక్త శుద్ధికి ప్రాణాయామం సహాయపడుతుంది - Pranayama helps in blood purification in Telugu

ప్రాణాయామం సాధారణంగా యోగా భంగిమలతో లేదా అవి లేకుండా అనుసరించే శ్వాస నియంత్రణ పద్ధతులను సూచిస్తుంది. సాంప్రదాయ యోగాలో అనేక శ్వాస వ్యాయామాలు ప్రస్తావించబడ్డాయి. వీటిలో అనులోమ విలోమాలు , కపలభతి మరియు భస్త్రికా ఉన్నాయి. ఈ వ్యాయామాలన్నీ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచి మరియు శరీర పనితీరును సరిచేయడం ద్వారా పనిచేస్తాయి. ఇది శరీరం నుండి టాక్సిన్లను త్వరగా మరియు సహజంగా తొలగించడానికి దారితీస్తుంది. ఈ మూడు వ్యాయామాలను ఎలా సాధన చేయాలో ఇక్కడ ఇవ్వబడింది:

అనులోమ విలోమాలు: ప్రాణాయామంలో సరళమైన శ్వాస పద్ధతుల్లో అనులోమ విలోమం ఒకటి. ఇది నాసికా రంధ్రాలను ఒకటి మార్చి మరొక దానితో (ఒకదాన్ని మూసి మరొక దానితో) శ్వాసించడం ద్వారా జరుగుతుంది. చాలా యోగ అభ్యాసాలకు ప్రశాంతమైన మరియు నెమ్మదైన వాతావరణం ఉండడం ఉత్తమం. అది ఎల్లప్పుడూ అవసరం లేనప్పటికీ, మీ శ్వాస గురించి మరింత తెలుసుకోవటానికి ఇది మీకు సహాయపడవచ్చు, అది ఈ వ్యాయామం యొక్క లక్ష్యాలలో ఒకటి.

 • సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి, వదులుగా ఉండే బట్టలు ధరించడం మంచిది.
 • మీ కళ్ళు తెరిచి ఒకసారి, ఆపై కళ్ళు మూసుకుని ఒకసారి, నెమ్మదిగా శ్వాసను లోపలికి మరియు బయటికి వదులుతూ ఉండండి.
 • మీ కళ్ళు మూసుకుని, మీ బొటనవేలితో మీ కుడి నాసికా రంధ్రాన్ని మూసివేయండి.
 • ఎడమ నాసికా రంధ్రం ద్వారా నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి.
 • కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచండి (మీకు సౌకర్యవంతంగా లేకపోతే మీరు ఈ దశను విస్మరించవచ్చు)
 • ఇప్పుడు మీ ఎడమ నాసికా రంధ్రాన్ని మీ వేలితో మూసివేసి కుడి నాసికా రంధ్రాన్ని విడిచిపెట్టండి.
 • కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస నెమ్మదిగా బయటకు రావనివ్వండి.
 • దీన్ని 3-5 సార్లు చేయండి.

సాధారణంగా, నిశ్వాస (ఊపిరి బయటకు వదిలి పెట్టడం) సమయం ఊపిరి తీసుకునే సమయం కంటే రెండు రెట్లు అధికంగా ఉండాలి, కానీ, అది అలవాటు కావడానికి కొంత సమయం పడుతుంది.

కపలభతి: కపలభతి అనులోమ విలోమం కన్నా కొంచెం కష్టం మరియు ఇది శరీరంలో అధిక వేడిని సృష్టిస్తుంది. నిజానికి, కపలభతి అనే పేరుకు అర్ధం పుర్రె (స్కల్) ప్రకాశవంతం కావడం. దీనిలో శ్వాసను నెమ్మదిగా పీల్చడం మరియు బలవంతంగా వదలడం ఉంటుంది. రక్తపోటుతో బాధపడేవారు, ఈ వ్యాయామానికి దూరంగా ఉండాలని గట్టిగా సిఫార్సు చేయబడుతుంది. దీనిని చేసే విధానం:

 • ధ్యాన భంగిమలో కూర్చోండి.
 • మీ శ్వాస గురించి తెలుసుకోవడానికి కొన్ని సాధారణ శ్వాసలను తీసుకోండి.
 • ఊపిరిని నెమ్మదిగా మరియు పూర్తిగా పీల్చుకోండి, మీ ఛాతీ క్యావిటీ అంతా నింపుకోండి.
 • మీ ఉదర కండరాలను ఉపయోగించి అన్ని గాలిని బలవంతంగా పీల్చుకోండి.
 • 2-3 సార్లు పునరావృతం చేయండి.

కపలభతి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కాబట్టి, త్వరగా ఆక్సిజనేషన్ జరుగుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను తొలగిస్తుంది. అలాగే, ఇది సాధారణం కంటే వేగంగా టాక్సిన్లు మరియు వ్యర్థ ఉత్పత్తులు తొలగిపోవడానికి దారితీస్తుంది. అదనంగా, ఇది నేసల్ సైనస్‌లను క్లియర్ చేస్తుంది మరియు కంజెషన్ (దిబ్బేడను) తగ్గిస్తుంది.

భస్త్రికా ప్రాణాయామం: దీనిని అగ్ని శ్వాస అని కూడా అంటారు. ఇది బలమైన మరియు శక్తివంతమైన ఉచ్ఛ్వాసా మరియు నిశ్వాసాలను కలిగి ఉంటుంది, ఈ రెండింటికి దాదాపు ఒకే సమయం పడుతుంది. రక్తం నుండి అన్ని రకాల విష పదార్థాలను (గాలి, కొవ్వులు, కఫం) తొలగించడంతో పాటు, మీ శరీరంలోని అన్ని దోషాలను సమతుల్యం చేయడానికి ఇది సహాయపడుతుంది.

 • ప్రశాంతమైన మరియు సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి.
 • కొన్ని సాధారణ శ్వాసలను తీసుకుని, మీ శ్వాస గురించి తెలుసుకోండి.
 • మీ ఛాతీ మరియు ఉదరం నుండి అన్ని కండరాలను కలుపుతున్నట్లు శక్తివంతంగా మరియు పూర్తిగా ఊపిరిని పీల్చుకోండి.
 • ఊపిరి పీల్చడానికి తీసుకునేంత సమయం తీసుకుని శక్తివంతంగా ఊపిరిని బయటకు వదలండి.   
 • 2-3 సార్లు పునరావృతం చేయండి.

కొన్ని నిర్దిష్ట ఆహార పదార్దాలు లేదా మూలికలను తినడం ద్వారా మాత్రమే రక్త శుద్దీకరణ చేయలేము. శరీర పనితీరులో, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్లీహము మరియు కాలేయం వంటి సహజ శుద్దీకరణ, వడపోత (ఫిల్టరింగ్) మరియు నిర్విషీకరణ (డేటాక్సిఫైయంగ్) అవయవాల యొక్క అన్ని విధాలా మెరుగుదల కూడా అవసరం. యోగా మరియు ప్రాణాయామాలతో పాటు ఆహార మార్పుల యొక్క సమతుల్య మిశ్రమం రక్త శుద్దీకరణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

వనరులు

 1. University of Rochester Medical Center Rochester, NY. [Internet] Overview of Blood and Blood Components
 2. Grant DM. Detoxification pathways in the liver. J Inherit Metab Dis. 1991;14(4):421-30. PMID: 1749210
 3. Váli L et al. Liver-protecting effects of table beet (Beta vulgaris var. rubra) during ischemia-reperfusion. Nutrition. 2007 Feb;23(2):172-8. PMID: 17234508
 4. Vulić JJ et al. Antiradical, antimicrobial and cytotoxic activities of commercial beetroot pomace. Food Funct. 2013 Apr 30;4(5):713-21. PMID: 23423147
 5. Wadhawan M, Anand AC. Coffee and Liver Disease. J Clin Exp Hepatol. 2016 Mar;6(1):40-6. PMID: 27194895
 6. Ryan D Heath et al. Coffee: The magical bean for liver diseases . World J Hepatol. 2017 May 28; 9(15): 689–696. PMID: 28596816
 7. Bolignano D et al. Caffeine and the kidney: what evidence right now? J Ren Nutr. 2007 Jul;17(4):225-34. PMID: 17586420
 8. Youngshim Choi et al. Dietary walnut reduces hepatic triglyceride content in high fat-fed mice via modulation of hepatic fatty acid metabolism and adipose tissue inflammation . J Nutr Biochem. 2016 Apr; 30: 116–125. PMID: 27012628
 9. W. Elaine Hardman. Walnuts Have Potential for Cancer Prevention and Treatment in Mice. J Nutr. 2014 Apr; 144(4): 555S–560S. PMID: 24500939
 10. Yung-Ju Chen et al. Dietary Broccoli Lessens Development of Fatty Liver and Liver Cancer in Mice Given Diethylnitrosamine and Fed a Western or Control Diet. J Nutr. 2016 Mar; 146(3): 542–550. PMID: 26865652
 11. Cho EJ et al. Protective effects of broccoli (Brassica oleracea) against oxidative damage in vitro and in vivo. J Nutr Sci Vitaminol (Tokyo). 2006 Dec;52(6):437-44. PMID: 17330507
 12. Masahiro Kikuchi et al. Sulforaphane-rich broccoli sprout extract improves hepatic abnormalities in male subjects. World J Gastroenterol. 2015 Nov 21; 21(43): 12457–12467. PMID: 26604653
 13. Tram Kim Lam et al. Cruciferous vegetable consumption and lung cancer risk: a systematic review . Cancer Epidemiol Biomarkers Prev. 2009 Jan; 18(1): 184–195. PMID: 19124497
 14. Robert H. Brown et al. Sulforaphane improves the bronchoprotective response in asthmatics through Nrf2-mediated gene pathways . Respir Res. 2015; 16(1): 106. PMID: 26369337
 15. Thilakchand KR et al. Hepatoprotective properties of the Indian gooseberry (Emblica officinalis Gaertn): a review. Food Funct. 2013 Oct;4(10):1431-41. PMID: 23978895
 16. Parveen Kumari, B. S. Khatkar. Assessment of total polyphenols, antioxidants and antimicrobial properties of aonla varieties . J Food Sci Technol. 2016 Jul; 53(7): 3093–3103. PMID: 27765980
 17. Prasad S, Aggarwal BB. Turmeric, the Golden Spice From Traditional Medicine to Modern Medicine. In: Benzie IFF, Wachtel-Galor S, editors. Herbal Medicine: Biomolecular and Clinical Aspects. 2nd edition. Boca Raton (FL): CRC Press/Taylor & Francis; 2011.
 18. Bode AM, Dong Z. The Amazing and Mighty Ginger. In: Benzie IFF, Wachtel-Galor S, editors. Herbal Medicine: Biomolecular and Clinical Aspects. 2nd edition. Boca Raton (FL): CRC Press/Taylor & Francis; 2011.
 19. M. Popkin, Kristen E. D’Anci, Irwin H. Rosenberg. Water, Hydration and Health Barry. Nutr Rev. 2010 Aug; 68(8): 439–458. PMID: 20646222
 20. Manodeep Chakraborty et al. Potential Interaction of Green Tea Extract with Hydrochlorothiazide on Diuretic Activity in Rats . Int Sch Res Notices. 2014; 2014: 273908. PMID: 27355016
 21. Yu-Hsuan Peng et al. Green tea inhibited the elimination of nephro-cardiovascular toxins and deteriorated the renal function in rats with renal failure . Sci Rep. 2015; 5: 16226. PMID: 26552961
 22. Ministry of AYUSH, Govt. of India. NTERNATIONAL DAY OF YOGA: Common Yoga Protocol. [Internet]
Read on app