మూత్రము యొక్క ఆమ్లీకరణ (యాసిడిఫికేషన్) - Urinary Acidification in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 14, 2019

March 06, 2020

మూత్రము యొక్క ఆమ్లీకరణ
మూత్రము యొక్క ఆమ్లీకరణ

మూత్రము యొక్క ఆమ్లీకరణ (యాసిడిఫికేషన్) ఏమిటి?

మూత్రపు ఆమ్లీకరణ (యాసిడిఫికేషన్) అనేది మూత్రం యొక్క తక్కువ pH విలువ సూచిస్తుంది. ఆహార విధానం మరియు మందుల వంటి అనేక కారణాల వలన మూత్రం ఆమ్ల (యాసిడిక్) pH ను  కలిగి ఉంటుంది. సోడియం స్థాయిలు పెరగడం మరియు శరీరం అదనపు ఆమ్ల స్థాయిలు నిల్వకావడం వలన అవి మూత్రాన్ని ఎక్కువ ఆమ్లముగా (acidifies) చేస్తాయి. రక్తంలో స్థిరమైన pH ను నిర్వహించడానికి మూత్రపిండాలు మూత్రంలో ఆమ్ల స్థాయిలను సరిచేస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, మూత్రంలో అధిక ఆమ్ల స్థాయిలు మూత్రపిండాల వైఫల్యానికి దారి తీయవచ్చు.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మూత్రపు ఆమ్లీకరణతో ముడి పడి ఉండే ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రపు ఆమ్లీకరణ యొక్క ప్రధాన కారణాలు:

  • క్రాన్బెర్రీ రసం (Cranberry juice)
  • నియంత్రత లేని మధుమేహం
  • యాసిడోసిస్ కలిగించే శ్వాస సంబంధిత వ్యాధులు
  • డిహైడ్రాషన్ (నిర్జలీకరణము)
  • యాసిడోసిస్ (శరీర ద్రవాలలో చాలా అధిక ఆమ్లం ఉండటం)
  • రీనల్ ట్యూబులర్ యాసిడోసిస్ (Renal tubular acidosis)
  • హైపర్ క్లోరమిక్ యాసిడోసిస్ (Hyperchloremic acidosis)
  • లాక్టిక్ యాసిడోసిస్
  • డయాబెటిక్ యాసిడోసిస్
  • మజ్జిగ, పెరుగు మరియు సోడా వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం
  • పస్తులు ఉండడం
  • మద్యం అధిక తీసుకోవం
  • మందులు, ఉదాహరణకు, ఫ్యూరోసెమైండ్ (furosemide)
  • అతిసారం
  • శాఖాహారం కాని (Non-vegetarian) ఆహారం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

క్రింది పద్ధతుల ద్వారా మూత్రము యొక్క ఆమ్లీకరణ నిర్ధారణ చేయబడుతుంది:

  • యాసిడ్ లోడింగ్ పరీక్ష (Acid loading test) : ఈ పరీక్షలో రక్తం మరియు మూత్ర పరీక్ష రెండూ ఉంటాయి. ఈ పరీక్ష రక్తంలోని అదనపు యాసిడ్ సమక్షంలో మూత్రపిండాల యొక్క యాసిడ్ పంపిణీ పనిని కొలుస్తుంది, ఐతే అదే సమయంలో మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి కూడా చేస్తాయి.
  • మూత్ర pH పరీక్ష (Urine pH test): ఈ పరీక్ష మూత్రంలోని ఆమ్లత్వ స్థాయిని కొలుస్తుంది
  • మందుల గురించి మరియు మూత్రము యొక్క ఆమ్లీకరణ యొక్క అంతర్లీన కారణం తీసుకోవడం కోసం రోగి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం
  • మూత్రపిండాలు లేదా మూత్రాశయాలలో ఏవైనా అసహజతలను తీసుకోవడానికి ఈ అవయవాలలో యొక్క ఆల్ట్రాసౌండ్ను  ఆదేశించవచ్చు

మూత్రపు ఆమ్లీకరణకు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి చికిత్స చేస్తారు:

  • సమతుల్య శాఖాహారం ఆహారం
  • యూరినరీ ఆల్కలీనైజింగ్ ఎజెంట్లు (Urinary alkalinising agents)
  • నొప్పి నివారిణులు
  • మొక్క ఆధారిత ఆహార సప్లిమెంట్లు (Plant-based dietary supplements)
  • ద్రవాలు మరియు నీటి పుష్కలంగా త్రాగడం
  • ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి సప్లిమెంటేషన్.



వనరులు

  1. Naim M. Maalouf et al. Metabolic Basis for Low Urine pH in Type 2 Diabetes . Clin J Am Soc Nephrol. 2010 Jul; 5(7): 1277–1281. PMID: 20413437
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Acidosis
  3. Seema Kumar et al. URINARY NET CHARGE IN HYPERCHLOREMIC METABOLIC ACIDOSIS. Indian Pediatrics, VOLUME 35-JANUARY 1998
  4. Patel S, Sharma S. Physiology, Respiratory Acidosis. [Updated 2019 May 4]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  5. Siener R, Hesse A. The effect of a vegetarian and different omnivorous diets on urinary risk factors for uric acid stone formation. Eur J Nutr. 2003 Dec;42(6):332-7. PMID: 14673606
  6. Johns Hopkins Medicine [Internet]. The Johns Hopkins University, The Johns Hopkins Hospital, and Johns Hopkins Health System; Urinary Tract Infections
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Acid loading test (pH)
  8. John M Berardi et al. Plant based dietary supplement increases urinary pH . J Int Soc Sports Nutr. 2008; 5: 20. PMID: 18990209
  9. Elisabeth G. E. de Vries et al. Influence of Various Beverages on Urine Acid Output. Cancer Research 46, 430-432, January 1986

మూత్రము యొక్క ఆమ్లీకరణ (యాసిడిఫికేషన్) కొరకు మందులు

Medicines listed below are available for మూత్రము యొక్క ఆమ్లీకరణ (యాసిడిఫికేషన్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.