myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

చెడు శ్వాస అనేది శ్వాస తీసుకొనే సమయంలో నోటి నుండి వెలువడే ఒక అసహ్యకరమైన వాసనగా చెప్పవచ్చు. వైద్య పరిభాషలో చెడు శ్వాసను హాలీటోసిస్ లేదా ఓరల్ మలడార్ అని అంటారు. దాని మూలాలు (నోరు లేదా శరీరం) తో సంబంధం లేకుండా శరీరం నుండి వచ్చే అసహ్యకరమైన వాసన  కూడా హాలిటోసిస్­గా పిలువబడుతుంది. కానీ నోటి దుర్వాసన అనేది ముఖ్యంగా నోటి నుండి వచ్చే చెడు శ్వాసను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చెడు శ్వాస ప్రభావం చూపుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది మరియు చెడు శ్వాసతో బాధపడుతున్న ప్రజలు ముఖ్యమైన మానసిక మరియు సామాజిక వైకల్యతకు లోనవుతారు. చెడు శ్వాసకు అతి సాధారణ కారణం ఏమిటంటే జిగురు వంటి సూక్ష్మజీవులు సాధారణంగా మన పంటి చిగుళ్ళు మరియు నాలుకలో ఒక పొరను ఏర్పరుస్తాయి. మంచి సూచన ఏమిటంటే నోటిని పరిశుభ్రత చేసుకోవడం మరియు ఒక వైద్యుడు సూచించిన కొన్ని మందులు సాధారణంగా నోటి వాసన నుండి పూర్తిగా కోలుకోవడంలో సహాయ పడుతుంది.

మీకు తెలుసా?

దీర్ఘకాలిక చెడు శ్వాస అనేది ప్రపంచ జనాభాలో దాదాపు 25% జనాభాను ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి. పురుషులు మరియు మహిళలు సమాన నిష్పత్తిలో చెడు శ్వాసను ఎదుర్కొంటారు కానీ పురుషులు కంటే మహిళలు వేగవంతమైన సహాయం మరియు చికిత్స కోరుకుంటారు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెడు శ్వాసకు తరచుగా కనీస వైద్యప్రమేయంతో ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు పేర్కొoటున్నారు. అయితే కొన్ని మూలాధార వైద్య పరిస్థితుల కారణంగా అసహ్యకరమైన వాసన మరియు చెడు శ్వాస సంభవించవచ్చు. అందువల్ల దీన్ని విస్మరించవద్దు, మీకు 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు నిరంతరంగా ఈ సమస్య ఉన్నట్లయితే దంతవైద్యుని లేదా ఇ.ఎన్.టి నిపుణుని సంప్రదించండి.

 1. చెడు శ్వాస అంటే ఏమిటి? - What is Halitosis (bad breath) in Telugu
 2. చెడు శ్వాస యొక్క లక్షణాలు - Symptoms of Halitosis (bad breath) in Telugu
 3. చెడు శ్వాస యొక్క చికిత్స - Treatment of Halitosis (bad breath) in Telugu
 4. చెడు శ్వాస కొరకు మందులు

చెడు శ్వాస అంటే ఏమిటి? - What is Halitosis (bad breath) in Telugu

చెడు శ్వాస అనేది ప్రధానంగా బ్యాక్టీరియా మరియు ఇతర వైద్య కారణాల వలన సంభవించే ఒక సాధారణ స్థితి, ఇది మాట్లాడటం లేదా నిశ్వాసలో గాలిని విడిచే సమయంలో నోటి కేవిటీ (నోటి) నుండి ఒక చెడు వాసన వెలువడుతుంది. చెడు శ్వాస తీవ్రత ఒక రోజులో వేర్వేరు సమయాలలో భిన్నంగా ఉంటుందనేది గమనించవచ్చు. ఉదాహరణకు, ఉదయం సమయంలో మీ ఊపిరి చెడు వాసనను కలిగి ఉండవచ్చు కానీ సాయంత్రం వాసన తగ్గిపోతుంది. కొన్ని ఆహారాలు (వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, చేపలు మరియు జున్ను) తినడం ద్వారా ఒత్తిడి, ఉపవాసం, చెడు శ్వాస వంటివి నోటి చెడు వాసనకు నేరుగా బాధ్యత వహిస్తున్న అనేక కారణాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అదనంగా, ధూమపానం మరియు మద్యం వినియోగం వంటివి కూడా అసహ్యకరమైన వాసనలు మరియు చెడు శ్వాసను కలిగించేవిగా గుర్తించబడినవి.

సాధారణంగా, మనకు ఉదయం సమయంలో శ్వాస చెడు వాసన కలిగి ఉంటుంది, ఎందుకంటే నోరు పొడి మరియు క్రియారహితంగా ఉంటుంది మరియు రాత్రి సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలకు మరియు వాటి చర్యలకు కారణమవుతుంది. కానీ నోటి దుర్వాసన అనేది దీర్ఘకాలిక పరిస్థితి, చికిత్స తర్వాత దంతాలపై శ్రద్ధ తీసుకోవడం అవసరం.

చెడు శ్వాస యొక్క లక్షణాలు - Symptoms of Halitosis (bad breath) in Telugu

నోటి దుర్వాసన యొక్క లక్షణం ఒక విలక్షణమైన చెడు వాసన కూడా. కుళ్ళిన మాంసం, పాడయిన ఆహారం లేదా ఏదైనా అసహ్యకరమైన వాసన కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి లోపలికి గాలి పీల్చడం లేదా గాలిని వదిలేటప్పుడు సాధారణంగా వారు తెలుసుకొంటారు. మీరు మాట్లాడటం, తుమ్మటం లేదా దగ్గుతున్నప్పుడు సమీపంలో ఉన్న ఒక వ్యక్తి తెలుసుకోగలరు.

డాక్టర్­ని ఎప్పుడు చూపించుకోవాలి?

మీరు చెడు శ్వాసతో పాటు క్రింది సంకేతాలు మరియు లక్షణాలు కలిగి ఉన్నట్లయితే, మీరు దంతవైద్యునికి ముఖ్యంగా దంత జీవకణశాస్త్త్ర నిపుణుని సంప్రదించాలి. ఒక దంత జీవకణశాస్త్త్ర నిపుణుడు అనగా పంటి చిగురు, డవడ శ్లేష్మం మరియు నోటి యొక్క మృదువైన కణజాలాల సమస్యలపై చికిత్స చేయు ఒక నిపుణుడు.

మీలో అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఒక దంత జీవకణశాస్త్త్ర నిపుణుని సంప్రదించండి:

 • చెడు శ్వాస లేదా ప్రబలమైన తీవ్రత గల ఒక చెడు వాసన.
 • మీ దంతాలపై లేదా చిగుళ్ళలో తెల్లని పూత కనిపిస్తుంది.
 • ఒక రకమైన లోహసంబంధిత రుచి.
 • చిగుళ్ళలో రక్తస్రావం.
 • నోటిలో లాలాజలo తగ్గడం.

చెడు శ్వాస యొక్క చికిత్స - Treatment of Halitosis (bad breath) in Telugu

చెడు శ్వాస చికిత్స అనేది దశల వారీగా చేయబడే సమస్య పరిష్కార విధానం. చెడు శ్వాస చికిత్స ప్రారంభించడానికి ముందు దంతవైద్యుడు చెడు శ్వాస యొక్క మూలాన్ని గుర్తించడానికి జాగ్రత్త తీసుకోవాలి. నోటి మరియు ఇతర భాగాల వాసనను వేరు చేయడానికి సరళమైన మార్గం నోరు మరియు ముక్కు నుండి వచ్చే వాసనను సరిపోల్చడం. మూల కారణం నాసికా సంబందిత లేదా ఏదైనా ఇతర వైద్య కారణాల వలన అయినచో ఒక సంబందిత నిపుణులు సూచిస్తారు.

నోటి నుండి ఉత్పన్నమైన చెడు శ్వాసకు తరచుగా దంత చికిత్స అవసరం అవుతుంది. అయితే, చెడు శ్వాస చికిత్సకు ఎలాంటి ప్రమాణాలు గాని మరియు ప్రోటోకాల్ గాని లేవు, అయినప్పటికీ, ప్రామాణిక దంత వైద్యం మరియు దంత జీవకణశాస్త్త్ర వైద్యం వంటి ప్రాధమిక అంశాలతో సాధ్యమయ్యే ప్రోటోకాల్ కలిగి ఉంటుంది.

చెడు శ్వాస ఈ క్రింది విధంగా చికిత్స చేయబడుతుంది;

 • నోటి ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా సూక్ష్మజీవుల తగ్గింపు (క్రిములు) చేసుకోవచ్చు, అవసరమైతే మౌత్ వాష్ వాడడం, సోనిక్ మరియు ఆల్ట్రాసోనిక్ టూత్ బ్రష్­లు వంటి ఆధునిక పరిశుభ్రత వంటి ఆధునికి పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి.
 • చెడు శ్వాస ఇంకా ఉంటే నోటి పరిశుభ్రతను కొనసాగించే మందులు బదులు, మీ నాలుకను సరిగా శుభ్రం చేయడం మంచిది.
 • 0.2% క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ ఉదాహరణకు లిస్టెరిన్­ నోటిలో క్రిములను తగ్గిoచుటకు ఉపయోగించబడుతుంది. అయితే అక్కడ దీర్ఘకాలిక ప్రభావం ఉన్నట్లు నిర్థారించబడితే అది పంటి పూతకు దారితీస్తుంది.
 • చెడు శ్వాస చికిత్సకు మరొక చికిత్స వ్యూహం అనేది VSC'S ను వివిధ లోహ అయాన్లు ఉపయోగించుట, జింక్ అనేది ఈ ప్రక్రియలో ఉపయోగించే అత్యంత సాధారణ అయాన్. హాలిటా అనేది ఆల్కహాల్ లేని 0.05% క్లోరెక్సిడైన్ కలిగి ఉన్న కొత్త ద్రావణం పైన చెప్పిన మౌత్ వాష్ కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

చెడు శ్వాస కొరకు మందులు

చెడు శ్వాస के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
RantacRantac 150 Mg Tablet18
ZinetacZinetac 150 Mg Tablet17
AcilocAciloc 150 Tablet17
Viscodyne SViscodyne S 4 Mg/100 Mg/1 Mg/2 Mg Syrup53
Reden OReden O 2 Mg/150 Mg Tablet33
R T DomR T Dom 10 Mg/150 Mg/20 Mg Tablet7
Aciloc DAciloc D 10 Mg/150 Mg Tablet0
AcispasAcispas 10 Mg/150 Mg Tablet12
ConrinConrin 10 Mg/10 Mg/20 Mg Tablet0
RadicRadic 10 Mg/150 Mg Tablet14
Pepdac DPepdac D 10 Mg/10 Mg/20 Mg Tablet4
CycloranCycloran 10 Mg/150 Mg Tablet16
Rt Dom ForteRt Dom Forte 10 Mg/10 Mg/20 Mg Tablet21
RanidicRanidic Tablet4
Ranitas DcRanitas Dc 10 Mg/150 Mg Tablet0
DicloplastDicloplast Patch110
Rd SRd S 10 Mg/150 Mg Tablet4
FremovFremov Capsule64
Reden PlusReden Plus 10 Mg/150 Mg Injection7
ZidiumZidium Injection42

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Yaegaki K1, Coil JM. Genuine halitosis, pseudo-halitosis, and halitophobia: classification, diagnosis, and treatment. Compend Contin Educ Dent. 2000 Oct;21(10A):880-6, 888-9; quiz 890. PMID: 11908365.
 2. Touyz LZ1. Oral malodor--a review. J Can Dent Assoc. 1993 Jul;59(7):607-10. PMID: 8334555.
 3. Bahadır Uğur Aylıkcı, Hakan Çolak. Halitosis: From diagnosis to management. J Nat Sci Biol Med. 2013 Jan-Jun; 4(1): 14–23. PMID: 23633830.
 4. National Health Service [Internet]. UK; Bad breath.
 5. Walter J. Loesche, Christopher Kazor. Microbiology and treatment of halitosis. First published: 09 July 2002; periodontology 2000, vol. 28, 2002, 256-279 [Internet].
और पढ़ें ...