ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల - Enlarged Prostate in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 28, 2018

March 06, 2020

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల
ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల అంటే ఏమిటి?

ప్రోస్టేట్ గ్రంధి అనేది మగవాళ్లలో కనిపించే ఒక చిన్న గ్రంథి, ఇది వీర్యంలోకి ఒక ద్రవాన్ని స్రవింపచేసి వీర్య కణాలను పోషిస్తుంది. ఇది మూత్రనాళం చుట్టూ ఉంటుంది, మూత్రనాళం అనేది మూత్రాన్ని తీసుకువెళ్ళే గొట్టం. ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల 50 ఏళ్లు దాటిన మగవారిలో ఏర్పడే పరిస్థితి ఒక మరియు ఇది వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటుంది.

ఇది క్యాన్సర్ కాదు కాబట్టి ఈ పరిస్థితిని నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా (BPH) (benign prostatic hyperplasia) అని కూడా పిలుస్తారు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచదు లేదా కలిగించదు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల ప్రధానంగా మూత్రనాళాన్ని కుదించడం ద్వారా మగవారిలో మూత్రం మీద ప్రభావం చూపుతుంది.

 • ఏ సమయంలోనైనా ముత్రాన్ని నియంత్రించడంలోని అసమర్థతతో మూత్రవిసర్జన యొక్క తరచుదనం పెరుగుతుంది. ఇది రాత్రి సమయంలో మరింత పెరుగుతుంది. (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జన కారణాలు)  
 • మూత్ర స్రావం మొదలై మరియు పదేపదే ఆగిపోతుంది, అసంపూర్ణ మూత్రవిసర్జన భావన కలుగుతుంది.
 • మూత్రంతో పాటు నొప్పి అలాగే రక్తస్రావం కూడా కలిగే అవకాశం ఉంటుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదలకు ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ ఇది వృద్ధాప్యంతో ముడిపడి ఉంటుంది.

 • పురుష హార్మోన్, టెస్టోస్టెరోన్ స్థాయిలలో మార్పులతో పాటు వృషణ కణాల్లో మార్పులు కూడా ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదలకు కారణమవుతాయి.
 • పరిశోధనలు,మగవారు అంతర్లీన రోగ లక్షణముల కారణంగా వారి వృషణాలను తొలగించుకుంటే అలాంటి వారు ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల సమస్యను ఎదుర్కొనరు.
 • ఈ పరిస్థితి 75 ఏళ్లు పైబడిన పురుషులలో చాలా సాధారణం మరియు ఏ హాని కారకాలతో ముడి పడి ఉండదు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల యొక్క రోగ నిర్ధారణ మినహాయింపు ప్రమాణాల ఆధారంగా, అలాగే లక్షణాలు మరియు భౌతిక పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది.

 • మూత్రపిండ రుగ్మతలు, మూత్రాశయ క్యాన్సర్ లేదా మూత్రనాళాలో కొన్ని అడ్డంకులు వంటి ఇతర సమస్యల కారణంగా మూత్రవిసర్జన సమస్యలు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితులన్నీ మొదటగా యూరోలాజిస్ట్ (urologist) చేత తనిఖీ చేయబడాలి.
 • వైద్యులు నిర్ధారించడానికి ముందు లక్షణాల సంక్షిప్త చరిత్రను మరియు ఇతర ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటారు.
 • ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్ (prostate specific antigen) లేదా PSA అని పిలిచే నిర్దిష్ట ప్రోటీన్ కోసం రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, మరియు శారీరక పరీక్షలు వంటివి ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల వెనుక ఉన్న కారణాన్ని నిర్ధారించడానికి ముఖ్యమైనవి.

చికిత్స లక్షణాల యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి లక్షణాలకు, చికిత్స అవసరం లేదు.

 • మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యాన్ని తగ్గించడానికి మందులు సూచించబడతాయి. సాధారణంగా, ఆల్ఫా బ్లాకర్ల (alpha blockers) ఈ ప్రయోజనం కోసం ఉపయోగించే ఔషధాలు.
 • ప్రోస్టేట్ గ్రంధిని తగ్గించడానికి, 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ (5-alpha reductase inhibitors) అని పిలవబడే మరొక రకం ఔషధాన్ని సూచించవచ్చు, ఇవి సాధారణంగా 6 నెలల కంటే ఎక్కువ వ్యవధి పాటు తీసుకోబడతాయి.
 • లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటే, మూత్రనాళం చుట్టూ ఒత్తిడిని తగ్గించడానికి ప్రోస్టేట్ గ్రంధిలో చిన్న భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు.వనరులు

 1. Science Direct (Elsevier) [Internet]; Benign prostatic hyperplasia
 2. Science Direct (Elsevier) [Internet]; Benign prostatic hyperplasia
 3. H. M. Arrighi, H.A. Guess, E.J. Metter, J.L. Fozard. Symptoms and signs of prostatism as risk factors for prostatectomy. 1990, Volume16, Issue3
 4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Prostate Enlargement (Benign Prostatic Hyperplasia)
 5. National institute of aging. [internet]: US Department of Health and Human Services; Prostate Problems

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల వైద్యులు

Dr. Samit Tuljapure Dr. Samit Tuljapure Urology
4 Years of Experience
Dr. Rohit Namdev Dr. Rohit Namdev Urology
2 Years of Experience
Dr Vaibhav Vishal Dr Vaibhav Vishal Urology
8 Years of Experience
Dr. Dipak Paruliya Dr. Dipak Paruliya Urology
15 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల కొరకు మందులు

Medicines listed below are available for ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల

Number of tests are available for ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల. We have listed commonly prescribed tests below: