myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సెరిబ్రల్ మలేరియా అంటే ఏమిటి?

సెరిబ్రల్ మలేరియా (CM), మలేరియా యొక్క క్లిష్టమైన పరిస్థితి, మూర్ఛ మరియు కోమా లక్షణాలు కలిగించే ఒక నరాల వ్యాధి. ఇది మలేరియా వ్యాప్తి చెందే ప్రాంతాలలో నివసించే చిన్న పిల్లలలో మరియు పెద్దలలో ప్రధానంగా కనిపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంక్రమిత (infected) దోమ కాటు తర్వాత 2 వారాల లోపు సెరిబ్రల్ మలేరియా  (CM) అభివృద్ధి చెందుతుంది మరియు 2 నుంచి 7 రోజులకు జ్వరం వస్తుంది. ఇది అసాధారణ ప్రవర్తన, బలహీనమైన స్పృహ, ఎపిలెప్టిక్  ఫిట్స్ (epileptic fits), కోమా మరియు ఇతర నరాలకు సంబంధించిన లక్షణాలను చూపిస్తుంది. 14 మంది పిల్లల్లో 6 మందికి సెరిబ్రల్ పరిమాణం పెరిగిందని తేలింది. సెరిబ్రల్ మలేరియా పిల్లలలో కదలికలు, మాట్లాడడంలో ఇబ్బందులు, చెవుడు మరియు అంధత్వ లోపాలను కూడా  కలిగిస్తుంది. దాని సంకేతాలు మరియు లక్షణాలు:

నరాలకు సంభందించిన సమస్యలు తరచుగా తీవ్రమైన మెటబాలిక్ అసిడోసిస్ (శరీర ద్రవాలలో చాలా ఎక్కువ యాసిడ్ చేరడం), తక్కువ హిమోగ్లోబిన్ మరియు తగ్గిపోయిన చక్కెర స్థాయిలతో ముడి పడి ఉంటాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది ఆడ అనోఫిలస్ దోమ (Anopheles mosquito) యొక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది. ప్లాస్మోడియం యొక్క నాలుగు జాతులు సంక్రమణకు (infection) బాధ్యులు, వీటిలో P. ఫాలసీపారం (P.falciparum) యొక్క సంక్రమణం అత్యంత తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. సంక్రమణం సోకిన రక్త కణాల ద్వారా మెదడు యొక్క చిన్న రక్త నాళికలలో అడ్డంకులు ఏర్పడిన కారణంగా సెరిబ్రల్ మలేరియా (CM) సంభవిస్తుంది, ఫలితంగా మెదడు వాపు మరియు చివరికి మెదడుకి హాని జరుగుతుంది. బయట పదార్ధాల నుండి మెదడుని రక్షించే మెదడు-రక్త అవరోధం (blood-brain barrier, BBB), చీలిపోతుంది మరియు దాని వలన ఫైబ్రినోజెన్ (fibrinogen) లీకేజీని గమనించవచ్చు. ఇది కోమాకు దారి తీస్తుంది. నరాల సమస్యలుకు ఇతర కారణాలు:

 • అధిక స్థాయి జ్వరం
 • మలేరియా వ్యతిరేక మందులు (Anti-malarial medicines)
 • తగ్గిన చక్కెర స్థాయిలు
 • తగ్గిన సోడియం స్థాయిలు
 • చాలా శాతం తగ్గిన హిమోగ్లోబిన్ స్థాయిలు

ఎలా నిర్ధారిస్తారు  మరియు చికిత్స?

మలేరియా వ్యాపించే ప్రాంతాలకు వెళ్లిన ఇటీవలి ప్రయాణ చరిత్రతో పాటు వైద్యులు ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు శారీరక పరీక్ష చేస్తారు. ఇస్చేమియా (ischaemia) ఉన్న భాగాలను కనుగొనడానికి ఇమేజింగ్ చేయవచ్చు.

 • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్: ఇది సాధారణమైనది కావచ్చు, కానీ కొన్ని మెదడుకి సంభందించిన లక్షణాలను చూడవచ్చు, అవి

 1. సెరిబ్రల్ ఎడెమా
 2. అనారోగ్యం కారణంగా సంభవించిన థాలమిక్ హైపోటాటేన్యుయేషన్ (Thalamic hypoattenuation)
 3. మెదడు తెల్లటి పదార్థం హైపోటాటేన్యుయేషన్ (Cerebellar white matter hypoattenuation)
 • అయస్కాంత ప్రతిధ్వని ప్రతిబింబనం (MRI): వ్యాధి పురోగతికి సంబంధించిన ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.
 • లుంబార్ పంక్చర్: మార్పు చెందిన  స్పృహతో ముడి పడి ఉండే ఫిబ్రిల్ సిండ్రోమ్స్ (febrile syndromes)  వంటి ఇతర కారణాలను మినహాయించటానికి.

సెరిబ్రల్ మలేరియా  అనేది ఒక తీవ్రమైన సమస్య మరియు దానికి తక్షణ వైద్య సహాయం అవసరం. చికిత్స ప్రధానంగా ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

 • మలేరియా వ్యతిరేక మందులు - ప్రతిఘటనను  (resistance) నివారించటానికి   ఒకే రకమైన చికిత్స (మోనోథెరపీ) లేదా కలయిక చికిత్స (combination therapy).
 • ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతను సరి చేసే ఏజెంట్లు.
 • లక్షణాలను బట్టి యాంటి ఎపిలెప్టిక్ ఔషధాల ఉపయోగం.
 • స్టెరాయిడ్ దిరివేటివ్స్ (derivatives).
 • ఇతర నాడీ సంబంధిత సమస్యలను సరిదిద్దడం.
 • శ్వాస సంబంధిత సమస్యల విషయంలో ఆక్సిజన్ థెరపీ సహాయపడవచ్చు.

స్వీయ రక్షణ చిట్కాలు ఉన్నాయి:

 • లక్షణాల యొక్క ప్రారంభదశ  గుర్తింపు సంక్రమణ చక్రాన్ని (infection cycle) విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.
 • దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గించడంలో జ్వరం మందులు సహాయం చేయకపోతే వాటి అనవసర వినియోగాన్ని నివారించాలి.
 • పరిసరాలను శుభ్రంగా ఉంచాలి మరియు దోమల అభివృద్ధి చెందే వనరులను తొలగించాలి.

సరైన చికిత్స మరియు సంరక్షణ అనేవి మెదడు నస్టాన్ని మరియు మలేరియా సమస్య యొక్క తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది.

 1. సెరిబ్రల్ మలేరియా కొరకు మందులు

సెరిబ్రల్ మలేరియా కొరకు మందులు

సెరిబ్రల్ మలేరియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Quinoquin EcQuinoquin Ec 300 Mg Tablet47
Quinoquin P EcQuinoquin P Ec Tablet24
Quinoquin PQuinoquin P Tablet24
QuinsulQuinsul 300 Mg Tablet30
QutisQutis 150 Mg Suspension42
QutomalQutomal 300 Mg Injection13
QutroyQutroy 300 Mg Injection14
SafequinSafequin 300 Mg Tablet52
SulfaquinSulfaquin 100 Mg Tablet42
Tq NinTq Nin 100 Mg Suspension43
Uniquin EcUniquin Ec 300 Mg Tablet60
ZequinZequin 300 Mg Tablet316
Arm QArm Q Injection22
MosgardMosgard 300 Mg Tablet0
Q MalQ Mal 300 Mg Tablet51
Q SQ S 300 Mg Tablet40
QuinaxQuinax 300 Mg Tablet559
QuinonirQuinonir Syrup23
QunimaxQunimax 300 Mg Tablet26
RadiantRadiant Syrup52
RubiquinRubiquin 300 Mg Tablet49
Rubiquin EcRubiquin Ec 450 Mg Tablet69
SulphaquinSulphaquin Suspension37
SwiquinSwiquin 300 Mg Tablet29
Rez Q DRez Q D 600 Mg/100 Mg Tablet178

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Laurent Rénia et al. Cerebral malaria. Virulence. 2012 Mar 1; 3(2): 193–201. PMID: 22460644
 2. Anupkumar R. Anvikar et al. Epidemiology of Plasmodium vivax Malaria in India. Am J Trop Med Hyg. 2016 Dec 28; 95(6 Suppl): 108–120. PMID: 27708188
 3. Kumar A, Valecha N, Jain T, et al. Burden of Malaria in India: Retrospective and Prospective View. American Society of Tropical Medicine and Hygiene; 2007 Dec.
 4. Henry J. Shikani et al. Cerebral Malaria. Am J Pathol. 2012 Nov; 181(5): 1484–1492. PMID: 23021981
 5. Richard Idro et al. Cerebral Malaria; Mechanisms Of Brain Injury And Strategies For Improved Neuro-Cognitive Outcome. Pediatr Res. 2010 Oct; 68(4): 267–274. PMID: 20606600
और पढ़ें ...