myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

హైపోగ్లైసీమియా అంటే ఏమిటి?

హైపోగ్లైసీమియాను లో (తక్కువ) బ్లడ్ (రక్త) గ్లూకోజ్ లేదా లో (తక్కువ) బ్లడ్ (రక్త) షుగర్ అని కూడా పిలుస్తారు, డయాబెటిస్ మెల్లిటస్తో బాధపడుతున్న ప్రజలలో ఇది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. రక్త గ్లూకోజ్ స్థాయి, ఇది శరీరంలోని ప్రధాన శక్తి వనరు సాధారణ స్థాయిల కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా సంభవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలు
  • క్రమ రహిత గుండె లయ.
  • అలసట.
  • శరీర వణుకు.
  • పాలిపోయిన చర్మం.
  • ఆందోళన.
  • చెమటలు.
  • ఆకలి.
  • చిరాకు.
  • నోరు చుట్టూ జలదరింపు సంచలనం.
  • గందరగోళం,స్థితి భ్రాంతి, మరియు మైకము.
  • బలహీనత.
 • తీవ్ర లక్షణాలు:
 • నిద్రలో సంభవించే లక్షణాలు ఇలా ఉండవచ్చు:
  • చెడు కలలు.
  • వస్త్రాలు తడిసిపోయేంత విపరీత చెమటలు.
  • నిద్ర మేల్కొనేటప్పటికీ అలసట మరియు బలహీనత.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • హైపోగ్లైసీమియా యొక్క సాధారణ కారణాలు
  • డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం తీసుకునే, సల్ఫోనిలోరియస్ (sulfonylureas) లేదా మెగ్లిటినాడ్స్ (meglitinides) వంటి మందులు.
  • ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోవడం.
  • ప్యాంక్రియాస్ లో కణితి, అదనపు ఇన్సులిన్ ఉత్పత్తి (రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే హార్మోన్) కారణంగా తక్కువ రక్త గ్లూకోస్ స్థాయిలకి దారి తీస్తుంది.
  • హైపర్ఇన్సులినిజం మరియు గ్లూకోజ్ జీవక్రియ (మెటబాలిజం) లో లోపాలు.
 • ప్రమాద కారకాలు:
  • భోజనం చెయ్యడంలో ఆలస్యం లేదా మానేయడం.
  • కార్బోహైడ్రేట్లు తగినంతగా తీసుకోకపోవడం.
  • అనారోగ్యం.
  • శారీరక శ్రమ పెరగడం.
  • కిడ్నీ వ్యాధులు.
  • కాలేయ వ్యాధులు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మధుమేహం కోసం మందులను తీసుకుంటుంటే, గ్లూకోమీటర్ (glucometer) ను ఉపయోగించి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. వైద్యులు హైపోగ్లైసిమియాను నిర్ధారించడానికి శారీరక పరీక్షతో ఆరోగ్య చరిత్రను గురించి కూడా తెలుసుకుంటారు. అయినప్పటికీ, తీవ్ర హైపోగ్లైసిమియా యొక్క లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, కాబట్టి వైద్యులు వెంటనే చికిత్సను ప్రారంభించవచ్చు. వైద్యులని సంప్రదించే సమయంలో వ్యక్తికీ ఏ లక్షణాలు లేనట్లయితే, ఒక రోజు రాత్రంతా ఏమి తినకుండా ఉండి అప్పుడు  వైద్యులని మళ్ళి కలవాలని సూచిస్తారు .

పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:

 • భోజనం ముందు మరియు తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను కొలిచేందుకు పరీక్షలు.
 • లక్షణాలు సంభవించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించడం.

సులభంగా గ్లూకోజ్గా మార్చబడే గ్లూకోజ్ టాబ్లెట్లు, పండ్ల రసాలు లేదా షుగర్ క్యాండీలు, తేనె లేదా సాదా చక్కెర వంటి 15 నుండి 20 గ్రాముల కార్బోహైడ్రేట్ల యొక్క వినియోగం హైపోగ్లైసీమియా యొక్క తక్షణ చికిత్సలో ఉంటుంది,.

తీవ్ర సందర్భాల్లో, గ్లూకోజ్ ఇంజక్షన్ ద్వారా లేదా ఇంట్రావీనస్గా ఇవ్వబడుతుంది.

తక్షణ చికిత్స (immediate treatment) తర్వాత ప్రతి 15 నిమిషాలకు రక్తంలోని చక్కెర స్థాయిలను తనిఖీ చేయాలి.హైపోగ్లైసిమియా యొక్క అంతర్లీన కారకాల యొక్క చికిత్సలో మధుమేహం కోసం తీసుకుంటున్న మందులను మార్చడం లేదా ప్యాంక్రియాస్ లోని కణితుల తొలగింపు ఉంటుంది.

 1. హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) కొరకు మందులు
 2. హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) వైద్యులు
Dr. Tanmay Bharani

Dr. Tanmay Bharani

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. Sunil Kumar Mishra

Dr. Sunil Kumar Mishra

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. Parjeet Kaur

Dr. Parjeet Kaur

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) కొరకు మందులు

హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
D.N.S खरीदें
Dns (Baxter) खरीदें
Dns (Parenteral Drug) खरीदें
Liketears Plus खरीदें
Dns (Denis) खरीदें
Grelyte खरीदें
Sodium Chloride (Albert) खरीदें
Tna खरीदें
Leclyte G Pl खरीदें
N.S (Parenteral) खरीदें
Rallidex खरीदें
Glucagen खरीदें
Glugon खरीदें
SBL Achyranthes aspera Dilution खरीदें
Microspan D खरीदें
Microspan Ns खरीदें
Rallidex In Ns खरीदें
Bjain Achyranthes aspera Dilution खरीदें

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Low Blood Glucose (Hypoglycemia).
 2. Diabetes Spectrum. [Internet]. American Diabetes Association. Detection, Prevention, and Treatment of Hypoglycemia in the Hospital.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Low blood sugar.
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Low blood sugar - self-care.
 5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Diabetes.
और पढ़ें ...
ऐप पर पढ़ें