myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

డయాబెటిక్ కిటోఎసిడోసిస్ అంటే ఏమిటి?

డయాబెటిక్ కిటోఎసిడోసిస్ (DKA) అనేది చక్కెరవ్యాధి (మధుమేహం)తో ముడిపడిన ఓ రుగ్మత, ఇది రక్తంలో అసాధారణమైన రీతిలో అధిక స్థాయి కీటోన్ల ఉనికి ఫలితంగా సంభవిస్తుంది. తత్ఫలితంగా రక్తం ఆమ్లీయమవుతుంది. చికిత్స చేయకపోతే అది కోమా లేదా మరణానికి దారి తీయవచ్చు . ఒకటో రకం డయాబెటిస్లో ఈ రుగ్మత చాలా సాధారణంగా ఉంటుంది మరియు రెండో రకం మధుమేహం కలిగిన వ్యక్తులకు ఈ డయాబెటిస్ కిటోఎసిడోసిస్ రుగ్మత అరుదుగా సంభవిస్తుంది. భారతదేశంలో డయాబెటిస్ కిటోఎసిడోసిస్ సంభవించిన పరిణామాల గురించి పరిమిత సమాచారం మాత్రమే ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

డయాబెటిస్ కిటోఎసిడోసిస్ యొక్క హెచ్చరిక చిహ్నాలు మరియు లక్షణాలు:

 • మితిమీరిన దాహం
 • తరచూ మూత్రవిసర్జనకు పోవాలనిపించడం (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జనకు కారణాలు)
 • అధిక రక్త-చక్కెర స్థాయిలు
 • మూత్రంలో కీటోన్ యొక్క అధిక స్థాయిలు

ఈ రుగ్మతతో కనిపించే ఇతర లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మధుమేహం (వ్యాధి)లో ఇన్సులిన్ లేకపోవడం కారణంగా శరీరం కొవ్వును శక్తికి మూలంగా  ఉపయోగించుకుంటుంది. కొవ్వు విచ్ఛిన్నమైతే, అది కీటోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి అయిన అదనపు కీటోన్లు  మూత్రం ద్వారా విసర్జించబడతాయి.

డయాబెటిస్ కిటోఎసిడోసిస్ ప్రధానంగా కిందివాటివల్ల ప్రేరేపించబడుతుంది:

 • సంక్రమణం: అనారోగ్యమీదైనా ఉండడంవల్ల ఇన్సులిన్ చర్యను రద్దు చేసే కొన్ని హార్మోన్ల స్థాయిలలో పెరుగుదలకు దారి తీస్తుంది.
 • ఇన్సులిన్ నియమం: ఇన్సులిన్ మోతాదుల్ని సరిగా తీసుకోకపోవడంవల్ల లేక ఇన్సులిన్ మోతాదుల్ని తీసుకోకపోవడం వలన డయాబెటిస్ కిటోఎసిడోసిస్ సంభవిస్తుంది.
 • తగినంత ఆహారం తీసుకోక పోవడం

ఇతర అంశాలు:

 • భావోద్వేగపరమైన లేదా శారీరక ఆఘాతం
 • గుండెపోటు
 • మద్యపానం లేదా మత్తుమందుల దుర్వినియోగం (drug abuse), సాధారణంగా కొకైన్
 • ఔషధ వినియోగం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగి వైద్య చరిత్ర, భౌతిక పరీక్ష మరియు ప్రయోగశాల పరీక్షలు వైద్యుడికి వ్యాధి పరిస్థితిని నిర్ధారించడంలో సహాయపడతాయి. HbA1c పరీక్ష మరియు ఇతర రక్తంలో చక్కెర స్థాయి  కొలతల్ని నిర్ధారించే పరీక్షలు జరుగుతాయి. రోగికి చక్కెరవ్యాధి ఉందన్న విషయం తెలిస్తే కీటోన్లను ప్రధానంగా పరీక్ష ద్వారా తనిఖీ చేయబడతాయి. దీన్ని మూత్రం లేదా రక్త పరీక్ష ద్వారా చేయవచ్చు. ఇతర పరీక్షలు:

 • ధమనుల రక్తంలోని గ్యాస్ కొలత (Arterial blood gas measurement)
 • మూత్ర విశ్లేషణ
 • ఓస్మోలాలిటీ రక్తం పరీక్ష (Osmolality blood test)
 • బయోకెమికల్ పరీక్షలు (సోడియం, పొటాషియం, కాల్షియం, మొదలైన వాటి కోసం పరీక్షలు )

డయాబెటిస్ కిటోఎసిడోసిస్ కు చేసే చికిత్స యొక్క లక్ష్యం రక్త-చక్కెర నియంత్రణ. రక్తంలో చక్కెరని తగ్గించే ఓరల్ బ్లడ్ షుగర్ తగ్గింపు ఏజెంట్లను మొదట్లో ఇవ్వవచ్చు, లేదా మీ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటే, ఇన్సులిన్ ను ఇవ్వటానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. రోగి యొక్క చక్కెర స్థాయిల ఆధారంగా ఈ చికిత్స నిర్ణయించబడుతుంది. చికిత్సలో ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ లకు ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి.

స్వీయ రక్షణ చిట్కాలు:

 • రక్తంలో చక్కెర స్థాయిలను జాగ్రత్తగా గమనించండి.
 • చక్కెరవ్యాధికి మందులు (anti-diabetic) సేవించిన తరువాత, మీరు రక్తంలో చక్కెరస్థాయి సామాన్య స్థాయి కంటే కూడా తక్కువై “హైపోగ్లైసిమిక్” పరిస్థితిని  అనుభవిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తినేందుకు మీతో పాటు చక్కెర మిఠాయి లేదా చాక్లెట్లో ఉంచుకుని ఉంటే అవి మీకు సహాయపడవచ్చు..
 • మీకు ఒంట్లో బాగలేనపుడు (జబ్బు పడినపుడు) ప్రతి 4-6 గంటలకు ఒకసారి కీటోన్ల ను పరీక్షించుకోండి
 • మీ మూత్ర పరీక్షలో కీటోన్లు (ketones) ఉనికిని సూచిస్తే  వ్యాయామం మానుకోండి.
 • మీరేదైనా అసౌకర్యం అనుభవిస్తే లేదా ఏవైనా హెచ్చరిక లక్షణాలు సంభవిస్తే, వెంటనే మీ వైద్యునికి కబురు పెట్టండి.

జీవనశైలి మార్పులు:

 • ఆహారంలో చక్కెర-కలిగిన ఆహారాన్ని నియంత్రించండి.
 • క్రొవ్వు తక్కువగా ఉండి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకోండి.
 • రక్తంలో కీటోన్లు లేవని నిర్ధారణయ్యాక మరియు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పుడు వ్యాయామం చేయొచ్చని ప్రోత్సహించబడుతోంది.
 1. డయాబెటిక్ కిటోఎసిడోసిస్ కొరకు మందులు

డయాబెటిక్ కిటోఎసిడోసిస్ కొరకు మందులు

డయాబెటిక్ కిటోఎసిడోసిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
NovorapidNovorapid 100 Iu Cartridge530.0
Novomix 30 100 IuNovomix 30 100 Iu Flexpen672.0
Novomix 50Novomix 50 100 Iu Flexpen677.0
Insuman CombInsuman Comb 25/75 3 Ml Cartridge1085.0
Actrapid HmActrapid Hm 100 Iu Cartridge228.44
ActrapidActrapid 100 Iu Cartridge1250.0
Human ActrapidHuman Actrapid 40 Iu Injection140.7
Human MonotardHuman Monotard 100 Iu Injection384.11
Huminsulin RHuminsulin R 100 Iu Injection446.0
Insucare RInsucare R Injection140.07
Insugen RInsugen R 100 Iu Injection343.0
Insuman RapidInsuman Rapid 100 Iu Cartridge208.0
Wosulin RWosulin R 100 Iu Disposable Pen298.0
HumajectHumaject 100 Iu Cartridge1365.0
Humaject RHumaject R 100 Iu Cartridge1365.0
Human FastactHuman Fastact 40 Iu Injection145.58
Human InsunormHuman Insunorm 40 Iu Injection124.36
Human InteractHuman Interact 40 Iu Injection158.0
HumarapHumarap 40 Iu Injection141.88
Recosulin RRecosulin R 40 Iu Injection148.37
Rapisulin HpiRapisulin Hpi 400 Iu Injection110.5
HumalogHumalog 100 Iu Kwikpen640.0
Humalog MixHumalog 100 Iu/Ml Cartridge 3 Ml2550.0
RyzodegRyzodeg 100 Iu/2.56 Mg Penfill1700.0
WosulinWosulin Pen Royale Device450.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...