చెవిలో గుబిలి అవరోధం - Earwax Blockage in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 19, 2020

January 04, 2021

చెవిలో గుబిలి అవరోధం
చెవిలో గుబిలి అవరోధం

చెవిలో గుబిలి అవరోధం (చెవిలో మైనం పేరుకుపోవడం) అంటే ఏమిటి?

చెవిలో గులిమి  లేదా గుబిలి (Earwax) అనేది మానవ శరీరం లో సహజంగా ఉండే  పదార్ధం. ఈ గుబిలి అనే పదార్థము చెవులు తమను తాము (స్వీయ శుభ్రక్రియ) శుభ్ర పరచుకునేందుకు సహాయపడుతుంది. గుబిలిని సెరుమెన్ (cerumen) అని కూడా పిలుస్తారు. ఈ గుబిలిలో సూక్ష్మ క్రిమినాశకాలు (యాంటీ బాక్టీరియల్స్) మరియు కందెన (lubricant) లక్షణాలను వైద్య పరిశోధనకారులు కనుగొన్నారు. అయినప్పటికీ, చెవిలో గుబిలి (earwax) పేరుకుపోయినట్లైతే, దాన్ని శుభ్రపరచకపోతే, అది “చెవిలో గుబిలి అవరోధం” సమస్యకు దారితీయవచ్చు. చెవిలో గుబిలి అవరోధం ఏర్పడితే అది మరెన్నో సమస్యలను సృష్టించగలదు.

ఈ సమస్య ఎక్కువగా ముసలివాళ్ళు లేదా పిల్లల్లో కనబడుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెవిలో గుబిలి అవరోధం అనేది సాధారణంగా సంభవించే దృగ్విషయమే (phenomenon) , ఇది ఏర్పడ్డప్పుడు క్రింది సంకేతాలు మరియు లక్షణాలు కొన్ని ఎవరైనా అనుభవించవచ్చు:

  • చెదిరిన వినికిడి జ్ఞానం
  • చెవుల్లో రద్దీ
  • చెవుల్లో దేనిలోనైనా గుచ్చాలని లేదా రుద్దాలన్న కోరిక నిరంతరం కల్గుతుంది
  • నిరంతరం దురద
  • చెవుల్లో హోరు శబ్దం (రింగింగ్ శబ్దం  (దీన్నే టినిటస్ అని కూడా పిలుస్తారు)
  • మైకము
  • తీవ్ర సందర్భాల్లో చెవులనుండి ద్రవాలు బయటకొస్తాయి
  • చెవిని పరీక్షిస్తే చెవి (కాలువ) లోపల పెద్ద ప్రమాణంలో గుబిలి ఉండడం కనబడుతుంది.

గుబిలి కారణంగా సంపూర్ణ అవరోధం ఏర్పడ్డ సందర్భంలో మీ వినికిడి శక్తి మూసుకు పోయిన వినికిడి (muffled hearing) లా ఉంటుంది, వినడంలోస్పష్టత లోపిస్తుంది..

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

గుబిలి పేరుకుపోవడమనేది సాధారణంగా నివేదించబడిన సమస్యల్లో ఒకటి. దీన్నిసులభంగా నిర్వహించవచ్చు. గుబిలి ప్రతిష్టంభన లేక గుబిలితో మూసుకుపోయిన చెవులకు సాధారణ కారణాలు ఇలా ఉంటాయి:

  • పత్తి పీచు (cotton buds) ల్ని నిరంతరం ఉపయోగించడం వల్ల చెవిలోనిమైనం లేదా గుబిలి ఇంకా చెవి లోపలికి, వెనక్కి నెట్టివేయబడుతుంది. తద్వారా చెవిలో గుబిలి (మైనం) ఎక్కువగా సేకరించబడి, పేరుకుపోతుంది.
  • సాధారణంగా చెవిలో గుబిలి అధికంగా ఉత్పత్తి కావడం
  • నిరంతరం చెవిలో కాటన్బడ్స్ (Earplugs) వాటిని పెట్టి కెలకడంవల్ల గుబిలి (మైనం) మరింత వెనక్కి నెట్టివేయబడుతోందని నివేదించబడింది. ఆవిధంగా చెవిలో గుబిలి కాలక్రమేణా పేరుకుపోవడం జరుగుతుంది.
  • చెవులను శుభ్రం చేయడానికి పిన్స్ లేదా ఇదే ఇతర వస్తువులు ఉపయోగించడం.

దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పైన చెప్పిన సంకేతాలు మరియు లక్షణాలను గనుక మీరు అనుభవించినట్లైతే, సమస్య మరింత తీవ్రతరం కాక ముందే మీరు మీ డాక్టర్ను సంప్రదించి అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవాలని నిర్ధారించుకోండి. డాక్టర్ భౌతికంగా మీ చెవిని ఓటోస్కోప్ పరికరంతో చెవిలో గుబిలి పేరుకుపోయినదా లేదా అన్నది తనిఖీ చేస్తాడు. దీన్ని నిర్ధారించే విషయంలో రక్తపరీక్ష లేదా ఇమేజింగ్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదు.

రోగనిర్ధారణ అయిన తర్వాత, వైద్యుడు మీ చెవులను వైద్యపరంగా శుభ్రం చేయడమో లేదా మీ స్వంతంగా శుభ్రపరచుకోవడమో రెండింటిలో ఎదోఒంకటి ఎంపిక చేసుకొమ్మని అడుగుతారు.

పేరుకుపోయిన గుబిలిని (ear-wax) ను విచ్ఛిన్నం చేయడానికి లేదా కరిగించడానికి వైద్యులు మందుల అంగట్లో సులభంగా లభించే (ఓవర్ ది కౌంటర్) చెవిలో వేసే చుక్కల మందును సూచించవచ్చు. దీనివల్ల గుబిలివల్ల మూసుకుపోయిన చెవి తెరవబడుతుంది. అవసరమైతే, మీ చెవిలోని గుబిలిని తొలగించేందుకు వైద్యుడి సహాయాన్ని కూడా పొందవచ్చు.



చెవిలో గుబిలి అవరోధం కొరకు మందులు

Medicines listed below are available for చెవిలో గుబిలి అవరోధం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.