myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

పాదం అనేది మానవ శరీరం యొక్క నడక మరియు నిటారు భంగిమలో ఒక ముఖ్యమైన భాగం. నిలబడడం మరియు నడవడంలో శరీర బరువును సంతులనంగా ఉంచడంలో పాదాల నిర్మాణం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అమెరికన్ పోడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ చేసిన కొన్ని పరిశోధనా అధ్యయనాల ప్రకారం, ఒక జత మానవ పాదాలు సగటున 50 సంవత్సరాల వయస్సు వరకు 75,000 మైళ్ళ నడవడం జరుగుతుంది. ఫలితంగా, పాదాలు దీర్ఘకాల అరుగుదల మరియు తరుగుదల, గాయాలు, మరియు శారీరక ఒత్తిడి, ఇవి పాదాల నొప్పికి ప్రధాన కారణాలు అవుతాయి. పురుషులు కంటే మహిళలు ఎక్కువగా పాదాల నొప్పిని ఎదుర్కొంటారు. నొప్పి పాదాలలో ఏచోట అయినా సంభవించవచ్చు. అయినప్పటికీ, మడమలు మరియు పాదతలసంధి (పాదం యొక్క మడమ మరియు కాలి వ్రేళ్ళ ఎముకలు) ఎక్కువగా దెబ్బతినే భాగాలు, అవి పాదం యొక్క ప్రధాన శరీర బరువును మోసే భాగాలు. వైద్యులు చేసే భౌతిక పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు, రక్త పరీక్షలు మరియు ఇతర విశ్లేషణ సాధనాల ఆధారంగా పాదాల నొప్పిని నిర్ధారిస్తారు. ఐస్ ప్యాక్­లు ఉపయోగించుట ఒక మంచి ఫిట్ అయిన మరియు షాక్-అబ్సార్బ్ బూట్లు, హీల్ ప్యాడ్స్, బరువు నియంత్రణ, స్ట్రెచింగ్ వ్యాయామాలు, వంటి వాటి ద్వారా పాదాల నొప్పిని తగ్గించటం వంటి స్వీయ-రక్షణ చర్యలను పాటించాలి. నొప్పి నివారక మందులు మరియు ఫిజియోథెరపీ వ్యాయామాలు వంటివి కూడా పాదాల నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

 1. పాదాల నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Foot Pain in Telugu
 2. పాదాల నొప్పి యొక్క చికిత్స - Treatment of Foot Pain in Telugu
 3. పాదాల నొప్పి కొరకు మందులు
 4. పాదాల నొప్పి వైద్యులు

పాదాల నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Foot Pain in Telugu

పాదాల రకాల ఆధారంగా వాటి నొప్పి లక్షణాలు, అనగా:

పాదాల నొప్పి వంటి లక్షణాలతో సహా:

 • కాలి మడమ నొప్పి
  ప్లాంటర్ ఫాస్కిటిస్ అనేది మడమ పొరల యొక్క మంటగా అనిపించడం, ఇది మడమ నుండి కాలి వరకు వ్యాపిస్తుంది. మడమ స్పర్స్ (కాల్షియం గడ్డకట్టడం వలన ఎముక యొక్క అధిక పెరుగుదల) లేదా స్నాయువులో అధిక ఒత్తిడి వలన స్నాయువుపై గాయo మరియు బెణుకు కలుగుతుంది ఫలితంగా మడమ యొక్క నొప్పికి దారితీస్తుంది. కావున క్రింది లక్షణాలు కనిపించవచ్చు:
  • మడమ లేదా అరికాళ్ళలో నొప్పి
  • దీర్ఘకాలంగా కూర్చోవడం లేదా చేరబడి ఉన్న స్థితి నుండి లేచినపుడు, కొన్ని ప్రారంభ దశల్లో మడమలో ఒక భరించలేని నొప్పి గల అసౌకర్యం కలుగుతుంది (ఉదా: నిద్ర నుండి మేల్కొనగానే నడవడం).
  • కాసేపు నడచిన తర్వాత నొప్పి తగ్గుతుంది
  • వ్యాయామం లేదా దీర్ఘకాల  నడక లేదా ఇతర కార్యకలాపాలు తర్వాత నొప్పి మరింత తీవ్రమవుతుంది.
  • జలదరింపు లేదా తిమ్మిరి కూడా నొప్పితో పాటు ఉండవచ్చు.
 • ఎచిలెస్ టెండినిటిస్ఇ
  ది మడమకు కాలు కలిసే చోట స్నాయువులో కలిగే ఒక వాపు. నడవడం, జంపింగ్ చేయడం, మరియు కింది వైపు నడచుటలో సహాయపడే పిక్క కండరాల టెర్మినల్ ముగింపులో ఎచిలెస్ టెండినిటిస్­ని ఏర్పరుస్తుంది. పిక్క కండరాలలో అధికంగా కాలు సాగేలా నడవడం, గరుకైన ఉపరితలంపై నడవడం, జంపింగ్ మరియు ఇతర కార్యకలాపాల కారణంగా స్నాయువు వాపుకు గురవుతుంది మరియు నొప్పిని కలిగిస్తుంది. చదునైన మడమ, మడమ స్పర్స్, మరియు కీళ్ళనొప్పులు అనేవి అకిలెస్ స్నాయువు యొక్క వాపుకు కారణమవుతాయి. అందువలన క్రింది లక్షణాలు కనిపించవచ్చు:
  • నడవడం లేదా పరుగెత్తడం వంటి శారీరక కార్యకలాపాలతో బిరుసుబారడం మరియు నొప్పి పెరుగుదల.
  • పాదాలపై నిలబడుట కష్టముగా అనిపించుటo.
  • కాలి మడమలో వాపు మరియు నొప్పి.
 • అరికాలి నొప్పి
  అరికాలి ఎముకల మధ్యలో కలిగే ఒక నొప్పి. కాలి చీలమండను కలిపే పాదపు ఎముకలు కలిసే చోట సరికాని పాదరక్షలు వాడుట మరియు అధిక స్పోర్ట్స్ కార్యకలాపాల వలన కీళ్ళవాపులకు కారణమవుతాయి. స్థూలకాయం, ఫ్లాట్ పాదాలు, అధిక వంపుగల పాదాలు, కీళ్ళనొప్పులు, వాత రోగం, గోరుచుట్టు (పెద్ద బొటనవేలు యొక్క మొదటి జాయింట్ వద్ద ఒక బాధాకరమైన వాపు), వంకర వ్రేళ్ళు (కాలి ఒక వ్రేలు శాశ్వతoగా కిందకి వంగి ఉండడం), మార్టన్ న్యూరోమా (ఒక క్యాన్సర్ కాని వాపు నరంపై వత్తిడి కలిగించడం), ఫ్రాక్చర్, మరియు పెద్దవారిలో మధుమేహం అరికాలి ఎముకల నొప్పికి దారి తీస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు:
  • ఒకటి లేదా రెండు పాదాలలో, ముఖ్యంగా వ్రేళ్ళకు సమీపంలో మండటం మరియు నొప్పి కలుగుట (మండే పాదాలకు కారణాలు మరియు చికిత్స కోసం - మరింత చదువండి)
  • పాదం కింద రాయి ఉన్నట్లు కలిగే ఒక బాధ
  • పొడిచేలాంటి నొప్పి రకం మరియు జలదరింపు మరియు తిమ్మిరి కలిగి ఉండడం.
  • నిలబడడం లేదా నడవడo వలన నొప్పి పెరగడం
 • ముందరికాలు నొప్పి
  బొటన వ్రేలు లోపలి పెరుగుదల, వెరుకేయ్ లేదా చర్మకీలములు, గోర్లు మరియు చర్మం (అథ్లెట్ల పాదములు) ఫంగల్ ఇన్ఫెక్షన్ కలుగుట, కదరం మరియు గడ్డ కట్టడం (దట్టమైన లేదా గట్టిపడిన చర్మం), మదమశూల, హేమర్ టోయ్, పంజా పాదాలు, మరియు వాతరోగ ప్రభావితం చేసే సాధారణ పరిస్థితులు కొన్ని పాదం ముందు భాగంలో సాధారణంగా కనిపించే లక్షణాలు:
  • తీపు నొప్పి మరియు వాపుతో సహా బాధ కలిగించే ప్రాంతం కూడా సాధారణంగా పెరుగుతున్న గోళ్ళపై మరియు గోరుచుట్టు సంబంధం కలిగి ఉంటుంది. గోరుచుట్టు అనేది ఎముకలలో ముఖ్యంగా బొటన వ్రేలిలో కలిగే మంట.
  • పాదంలో నొప్పి వంటిది కాలి వేళ్ళలో ఉన్న వైకల్యం ఫలితంగా కలుగుతుంది:
   • హేమర్ టోయ్కా
    లి వేళ్ళు (రెండవ, మూడవ లేదా నాల్గవ) లో వైకల్యం వలన పాదం ఒక సుత్తిలా కనిపిస్తుంది.
   • పంజా అడుగు
    కాలి యొక్క పాదంలో వైకల్యం కారణంగా ఒక పంజాలా కనిపిస్తుంది.
   • బొటన వ్రేలి మొదట్లో ఉబ్బుట
    పెద్ద బొటనవేలు ఎముకపై ఒక పెద్ద వాపు ఏర్పడటం వలన రెండవ బొటనవేలు వైపు మొగ్గు చూపుతుంది.
  • వ్రేలి కండరములు నొక్కుకు పోవుటచే నరములు బిగుసుకు పోయి ముందరికాలు భాగంలో మండడం లేదా బాధ కలుగుట సంభవిస్తుంది.
  • నరాల గజిబిజి కదలిక వలన పాదంలో జలదరింపు మరియు తిమ్మిరి నొప్పి కలుగుతుంది.
  • కాలి వేళ్ళపై మరియు మడమపై స్థిరమైన ఒత్తిడి వలన కలిగే పొడిచేలా నొప్పి సాధారణంగా గట్టిపడిన మరియు మందమైన చర్మంతో పాటు (కదరం లేదా గడ్డ కట్టుట) జరుగుతుంది.
  • బొబ్బలేర్పడుట మరియు పొడిగా పోలుసుబారిన చర్మం ఏర్పడటంతో పాటు నొప్పి మరియు బాధగా అనిపించే చర్మంపై శిలీంధ్ర సంక్రమణ సంభవిస్తుంది. గోర్లు పెళుసుగా మారుతాయి మరియు వాటి రంగులో మార్పుని చూడవచ్చు.
 • సాధారణ పాదాల నొప్పి
  • నొప్పి అనేది ఉబ్బురోగం, ఫ్రాక్చర్, మరియు గజ్జి (చల్లటి ఉష్ణోగ్రతకు దీర్ఘకాలికంగా గురికావడం కారణంగా వాపు కలగడం ) తో సంబంధం కలిగి ఉంటుంది.
  • చలికురుపులు లేదా మొటిమలు, కాయ-కిరణం మరియు మాంసం గడ్డ కట్టడం విషయంలో పాదానికి తీవ్రమైన పోటు కలుతుతుంది.
  • కాలిలో ఉన్న చలికురుపులు వలన విపరీతమైన నొప్పి మరియు బాధ కలుగుతుంది. చర్మంలో  వాపు మరియు ముదురు ఎరుపు లేదా నీలం రంగులోకి మారుతుంది.
  • కీళ్ల నొప్పులు, గౌట్, ఆస్టియో ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ మరియు ఇతర నొప్పి వంటివి ఎముకల ఫ్రాక్చర్ మరియు శోధ వ్యాధికి సంబంధించినవి. నొప్పి అనేది వాపువలన లేదా పాదాల కదలికలో పరిమితితో సంబంధం కలిగి ఉంటుంది.

పాదాల నొప్పి యొక్క చికిత్స - Treatment of Foot Pain in Telugu

పాదాల నొప్పికి చికిత్స అనేది మందులు మరియు వివిధ స్వీయ రక్షణ చర్యలను కలిగి ఉంటుంది.

మందులు

 • పారాసిటమాల్ వంటి నొప్పి నివారిణులు తేలికపాటి పాదాల నొప్పికి ఉపశమనం కలుగజేస్తాయి.
 • ఐబూప్రోఫెన్ వంటి యాంటి ఇన్ఫ్లమేటరీ మందులు వాపు తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి.
 • వేరే ఏదియూ పనిచేయనప్పుడు వేగంగా పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో నొప్పి కలిగించే స్థానంలో కార్టికోస్టెరాయిడ్ మందులు మరియు సూది మందులు వాడవచ్చు.
 • గోరుచుట్టు కోసం మందులను తగ్గిస్తూ యూరిక్-ఆమ్లం ఉపయోగించి చికిత్స చేస్తారు
 • సాల్సిలిక్ యాసిడ్ లేదా జెల్ వంటివి ఎముకల వులిపెరలు తొలగించడం ద్వారా పొరలుగా వాటిని నిర్మూలించడంలో సహాయపడుతుంది.

శస్త్ర చికిత్స

 • వివిధ చికిత్సా ప్రక్రియలు సాధారణంగా జలదరింపు మరియు తిమ్మిరి అయినపుడు తీవ్రమైన కాలు నొప్పి తో పాటు ఇరుక్కున్న నరాలను వేరు చేయుట వంటి సహాయాన్ని పాదాల వైకల్యానికి చికిత్సగా ఉపయోగిస్తారు.
 • గాస్ట్రోక్నేమియాస్ మొద్దుబారిన అరికాలిని అంటిపట్టుకొన్న పిక్క కండర కణజాలంపై ఒత్తిడి పెంచడానికి మరియు సాగదీసే వ్యాయామాలు వంటివి చేయరాదు.
 • ప్లాంటర్ ఫాసియా రిలీజ్ అనేది కఠినమైన అరికాలిని అంటిపెట్టుకొని ఉన్న ప్లాంటార్ ఫాసియా యొక్క ఒత్తిడికి ఒక చిన్నగా కోయడo జరుగుతుంది.

జీవనశైలి నిర్వహణ

కొన్ని జీవనశైలి నిర్వహణ చర్యలు పాదం నొప్పిని మరింత తీవ్రత కలిగించే ప్రభావాలను నివారిస్తాయి, అవి:

 • దీర్ఘకాలిక లేదా తేవ్రమైన నొప్పి గల పాదం యొక్క బాధాకరమైన ప్రాంతంలో వేడి తగిలించడం వలన రక్త సరఫరా పెంచడం మరియు తరువాత నొప్పి తగ్గింపులో సహాయపడుతుంది.
 • ఐస్ ప్యాక్­తో చికిత్స చేయుట వలన పాదంలో వాపు మరియు మంట తగ్గించడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగించుటలో సహాయపడుతుంది. ప్రత్యామ్నాయంగా, చల్లని నీటి బాటిల్­ని ప్రభావిత శరీర బాగం మీద రోలింగ్ చేయడం ద్వారా సమర్థవంతంగా నొప్పిని తగ్గించుటలో సహాయపడుతుంది.
 • బాధ కలిగే చోట దానిపై అదనపు ఒత్తిడిని నివారించడానికి పాదాలపై కనీస సాధ్యమైనంత శరీర బరువు ఉంచడానికి ప్రయత్నించాలి.
 • బాధాకరమైన పాదాలపై ఒత్తిడిని తగ్గించడానికి మృదువైన మందంగా ఉన్న సోల్ లేదా హీల్ ప్యాడ్­లు ఉపయోగించడంతో పాటు సౌకర్యవంతమైన బూట్లు ఉపయోగించాలి.
 • పాదరక్షలు లేకుండా లేదా వుత్తపాదాలతో గరుకు తలాలపై నడవకూడదు
 • పిక్క కండరాలు కోసం సాగదీసే వ్యాయామాలు, పాదాల (ప్లాంటార్ ఫేసియా) దృఢత్వం తగ్గించడం మరియు పాదాల కండరాలు వశ్యతను పెంచడానికి సహాయపడుతుంది.
 • ప్లాంటర్ ఫాసిటిస్ రాత్రి నిద్ర సమయంలో వ్యాపిస్తుంది మరియు ప్లాంటార్ ఫసిటస్ కారణంగా నొప్పిని తగ్గించడానికి వీలు కలిగిస్తుంది.
 • అధిక బరువు ఉంటే, మితమైన సాధారణ వ్యాయామాలతో అదనపు బరువు తగ్గించుకోవాలి
 • గోళ్ళను శుభ్రంగా ఉంచాలి మరియు క్రమం తప్పకుండా వాటిని కత్తిరించాలి.
 • పాదాల నొప్పి యొక్క నిర్వహణలో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.
 • పాదాలు మరియు పిక్క కండరాల రెగ్యులర్ సాగతీత వ్యాయామాలు పాదాల కండరాలు అనువైనవిగా చేస్తాయి మరియు పాదాలలో నొప్పిని తగ్గిస్తాయి.
 • హార్డ్ ఇన్సోల్ కలిగి గట్టిగా ఉన్న పాదరక్షలకు బదులుగా మృదువైన ఇన్సోల్ కలిగిన సౌకర్యవంతమైన బూట్లు వాడాలి
 • బ్లడ్ షుగర్­ని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహార జీవనశైలిని నిర్వహించండి మరియు పోషకాల యొక్క లోపాన్ని నివారించండి.
Dr. Vivek Dahiya

Dr. Vivek Dahiya

ओर्थोपेडिक्स

Dr. Vipin Chand Tyagi

Dr. Vipin Chand Tyagi

ओर्थोपेडिक्स

Dr. Vineesh Mathur

Dr. Vineesh Mathur

ओर्थोपेडिक्स

పాదాల నొప్పి కొరకు మందులు

పాదాల నొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Oxalgin DpOxalgin Dp 50 Mg/325 Mg Tablet27
Diclogesic RrDiclogesic Rr 75 Mg Injection25
DivonDIVON GEL 10GM0
VoveranVOVERAN 1% EMULGEL 30GM105
EnzoflamEnzoflam 50 Mg/325 Mg/15 Mg Tablet91
DolserDolser 400 Mg/50 Mg Tablet Mr0
Renac SpRenac Sp Tablet51
Dicser PlusDicser Plus 50 Mg/10 Mg/500 Mg Tablet46
D P ZoxD P Zox 50 Mg/325 Mg/250 Mg Tablet20
Unofen KUnofen K 50 Mg Tablet0
ExflamExflam 1.16%W/W Gel48
Rid SRid S 50 Mg/10 Mg Capsule32
Diclonova PDiclonova P 25 Mg/500 Mg Tablet13
Dil Se PlusDil Se Plus 50 Mg/10 Mg/325 Mg Tablet44
Dynaford MrDynaford Mr 50 Mg/325 Mg/250 Mg Tablet29
ValfenValfen 100 Mg Injection10
FeganFegan Eye Drop16
RolosolRolosol 50 Mg/10 Mg Tablet67
DiclopalDiclopal 50 Mg/500 Mg Tablet16
DipseeDipsee Gel57
FlexicamFlexicam 50 Mg/325 Mg/250 Mg Tablet25
VivianVivian 1.16% Gel0
I GesicI Gesic 0.1% Eye Drop26
Rolosol ERolosol E 50 Mg/10 Mg Capsule51
DicloparaDiclopara 50 Mg/500 Mg Tablet0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Lacing right to fight foot pain. Year published. Harvard University, Cambridge, Massachusetts.
 2. Awale A, Dufour AB, Katz P, Menz HB, Hannan MT. Link Between Foot Pain Severity and Prevalence of Depressive Symptoms.. Arthritis Care Res (Hoboken). 2016 Jun;68(6):871-6.PMID: 26555319.
 3. R. Kevin Lourdes, Ganesan G. Ram. Incidence of calcaneal spur in Indian population with heel pain. Volume 2; 31August 2016; Department of Orthopaedics,Sri Ramachandra Medical University,Chennai.
 4. National Health Service [Internet]. UK; Foot pain
 5. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Plantar Fasciitis and Bone Spurs.
 6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Achilles tendinitis
 7. National Health Service [Internet]. UK; Pain in the ball of the foot
 8. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Hammer Toe.
 9. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Claw foot.
 10. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Bunions.
 11. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Exercises for healthy feet. Harvard University, Cambridge, Massachusetts.
 12. National Health Service [Internet]. UK; Foot pain
 13. National Health Service [Internet]. UK; Heel pain
 14. National Health Service [Internet]. UK; Ingrown toenail
और पढ़ें ...