పులిపిర్లు - Skin Warts in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

March 06, 2020

పులిపిర్లు
పులిపిర్లు

సారాంశం

పులిపిర్లు (మొటిమలు) అనునవి చర్మం పై అసాధారణముగా చిన్నగా పెరిగేవి, ఇవి శరీరముపైన ఏ భాగములోనైనా కనిపిస్తాయి, అయితే ఇవి సాధారణముగా ముఖము, చేతులు, మరియు పాదాలపై కనిపిస్తాయి.  అవి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్ కారణముగా ఏర్పడతాయి, ఇవి చర్మముపైన మిడిమిడి పగుళ్ళు గీతల నుండి శరీరములోనికి ప్రవేశిస్తాయి.  పిలిపిర్లు అనునవి అధికముగా అంటు సంక్రమణ కలిగినవి మరియు తాకడం ద్వారా త్వరగా వ్యాపిస్తాయి.  అవి విభిన్న ఆకారాలు మరియు పరిమాణాల్లో ఏర్పడతాయి మరియు అవి ఏర్పడిన ప్రదేశం మరియు వాటి ఆకారము ప్రకారముగా అవి విభేదించబడతాయి.  పులుపిర్ల యొక్క ప్రధాన రకాలు ఏమనగా సాధారణ పులిపిర్లు , పాదాల మొటిమలు, ఫ్లాట్ మొటిమలు, ఫిల్లిపారం మొటిమలు, మరియు మొజాయిక్ మొటిమలు అనునవి.  పులిపిర్లకు ఏ విధమైన నివారణ లేదు మరియు చికిత్స అనునది క్రయోథెరపీ (శీతల వైద్యము) ద్వారా చర్మము పైనుండి తొలగించడము లేక శరీరము యొక్క రోగనిరోధక వ్యవస్థను త్వరగా ప్రారంభించి వైరస్ కు వ్యతిరేకముగా యాంటిబాడీస్ అభివృధ్ధి చేయడము ద్వారా తొలగించడముపై దృష్టి పెట్టవచ్చు.  సాల్సిలిక్ ఆమ్లము లేక వాహక టేప్ (డక్ట్ టేప్) మరియు ఇతర మందులు ఉపయోగించడము ద్వారా ఇది జరుగుతుంది.  ఒకవేళ పులిపిర్లు నాశనం చేయబడినా, తరువాత ఎప్పుడైనా మరలా అవి వచ్చే అవకాశం కలదు.  కొన్ని వారాలు లేక నెలల లోనే శరీరం వైరస్ కు వ్యతిరేకముగా యాంటిబాడీస్ ను ఉత్పత్తి చేయడం వలన ఎక్కువ భాగం మొటిమలు వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఆరోగ్యకరమైన ప్రజలలో పులిపిర్లు అనునవి సమస్యలను ఏర్పరచవు.  అయితే వీటిని నివారించుట కష్టమయినప్పటికినీ, పులిపిర్లు సాదారణముగా గుర్తించదగిన ఎటువంటి ప్రమాదాలు ఏర్పరచవు.

పులిపిర్లు యొక్క లక్షణాలు - Symptoms of Warts (Skin) in Telugu

పులిపిర్ల యొక్క గుణాత్మక లక్షణము ఏమనగా శరీరము యొక్క వివిధ భాగాలలో చిన్నచిన్న చర్మము వృధ్ధిని కలిగిఉండడం.  పులిపిర్లు ఒక్కొక్కటిగా వృధ్ధి చెందుతాయి లేక గుంపులుగా లేక మట్టి ముద్దలుగా గుంపులుగా ఎక్కువ ప్రదేశమును కవర్ చేస్తాయి.  కొన్ని పులిపిర్లు వీటిని కలుగచేస్తాయి దురద, బిగువు లేక అవి ఉన్న ప్రాంతము వద్ద ఒత్తిడితో కూడిన ప్రభావాన్ని   కలుగచేస్తాయి కొన్ని పులిపిర్లు చిన్న నల్లని మచ్చలను వాటిలోపల (వీటినే సీడ్స్ అంటారు) ఏర్పరుస్తాయి.  పులిపిర్లు సాధారణముగా నొప్పిని కలిగిఉండవు మరియు ఎటువంటి అసౌకర్యమును కలిగించవు.  అరికాళ్లలో పెరిగిన పులిపిర్లు, ఒకవేళ అవి లోపలి వైపు పెరిగిఉంటే నడుస్తున్న సమయములో నొప్పిని కలుగచేస్తాయి.

పులిపిర్లు యొక్క చికిత్స - Treatment of Warts (Skin) in Telugu

అధిక భాగం పులిపిర్లకు ఏ విధమైన చికిత్స అవసరము ఉండదు మరియు వాటంతట అవే వెళ్ళిపోతాయి.  కొంత సమయము తరువాత, శరీరము వీటికి వ్యతిరేకముగా యాంటిబాడీస్ ను తయారుచేసినప్పుడు, మరియు అప్పుడు అవి కనిపించకుండా పోతాయి.  అయితే, ఈ విధముగా జరుగడానికి కొన్ని నెలలు లేక ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా పట్టవచ్చు.  పులిపిర్లు చూడటానికి అందముగా కనిపించవు కాబట్టి ఇవి చికిత్సను కోరుకుంటాయి మరియు ఒక వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసమును ఇవి తీవ్రముగా దెబ్బతీస్తాయి లేక ఒకవేళ నొప్పిని కలిగించవచ్చు.

ఏ విధమైన అంతర్లీన వైద్య పరిస్థితి లేకుండా వాటిని తొలగించడానికి ఒక చర్మ వైద్యుడిని సంప్రదించడమును అధికముగా రికమెండ్ చేయవచ్చు.

ఇంటి చికిత్స

పులిపిర్లను చికిత్స చేయుటకు వివిధ రకాల గృహ నివారణలు అందుబాటులో ఉన్నాయి.  అవి క్రింది వాటిని కలిగిఉంటుంది:

  • సాల్సిలిక్ ఆమ్లము
    పులిపిర్ల చికిత్స కొరకు అత్యధిక సాధారణముగా ఉపయోగించే గృహ నివారణ ప్రక్రియ.  సాల్సిలిక్ ఆమ్లము అనునది ఎక్కువ దేశాలలో మెడికల్ కౌంటర్లలో లభ్యమవుతుంది, మరియు ఇది విభిన్న గాడతలలో దొరుకుతుంది.  ఎక్కువ క్రీములు లేక జెల్స్ వాటిపైన, వాటిని ఏ విధముగా అప్లై చేయాలో వాటికి సంబంధించిన సూచనలు వ్రాయబడి ఉంటాయి.  మీరు ఈ సూచనలను జాగ్రత్తగా అనుసరించాలని సూచించబడింది, ఎందుకనగా సాల్సిలిక్ ఆమ్లము చర్మము ఊడిపోవడం మరియు చిరాకును కలిగిస్తుంది.
    ముందుగా ఏ విధమైన పురోగతిని మీరు గమనించకుండా ఉంటే,  మీరు ఒక రోజులో అనేక సార్లు మందులను కొన్ని వారాలపాటు అప్లై చేయవలసి ఉంటుంది.  మందును అప్లై చేయకముందు, పులిపిర్ల యొక్క పై పొరపైన సున్నితముగా గోకడం మరియు దానిని శుభ్రపరచడం చేయడం వలన మందుల యొక్క ప్రభావమును పెంచడములో  సహాయపడవచ్చు.  అయితే, ఒక వ్యక్తి అధిక స్థాయిలో శుభ్రతను మరియు పరిశుభ్రతను కలిగిఉండడం వలన వైరస్ చర్మము యొక్క ఇతర భాగాలకు వ్యాప్తి చెందదు.  సాల్సిలిక్ ఆమ్లము అనునది చర్మముకు ఇబ్బంది కలిగించడం ద్వారా మీ యొక్క రోగ నిరోధక వ్యవస్థ త్వరగా పనిచేయునట్లు చేస్తుంది మరియు వైరస్ ను నాశనము చేయుటకు యాంటిబాడీస్ ను అభివృధ్ధి చేస్తుంది.  వైరస్ ను నేరుగా తొలగించడము సాధ్యము కాదు.
  • డక్ట్ (వాహక) టేప్
    కొంత మంది డాక్టర్లు పులిపిర్లకు డక్ట్ టేప్ ను అప్లై చేయమని సూచిస్తారు.  కొన్ని రోజుల తరువాత టేప్ అనునది తొలగించబడుతుంది.  వ్యాధి సోకిన చర్మము యొక్క పొరలను తొలగించడము అనునది వైరస్ కు వ్యతిరేకముగా రోగ నిరోధక వ్యవస్థ పోరాడేలా ఇది పురికొల్పుతుందని నమ్ముచున్నారు.
    మొదట, చర్మమును మృదువుగా చేయుటకు వెచ్చని నీటితో పులిపిర్లను తుడవాలి, మరియు తరువాత డిస్పోజబుల్ ఎమెరీ బోర్డుతో నెమ్మదిగా రుద్దాలి.  ఆ ప్రదేశానికి చిన్న ముక్కగా డక్ట్ టేప్ ను అప్లై చేయాలి.  పులిపిరి కనిపించకుండా పోయేవరకు టేప్ ను ప్రతీ 5 నుండి 6 రోజులకొకసారి మారుస్తూ ఉండాలి.

ఒకవేళ మీ పులిపిర్ల సంఖ్య పెరుగుతూ ఉన్నను, బాధ లేక దురద పెరుగుచున్నను లేక మీరు ఖచ్చితముగా ఆ చర్మము యొక్క పెరుగుదల గురించి మీకు ఒక ఖచ్చితమైన నిర్ధారణ లేనప్పుడు,   ఒక చర్మ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

మెడికల్ చికిత్స

  • క్రయోథెరపీ (శీతల వైద్యము)
    ఒక చర్మవైద్యుడు క్రయోథెరపీ (శీతల వైద్యము) అను విధానమును నిర్వహిస్తాడు, ఇందులో పులిపిర్ల యొక్క బయటి గట్టి కణాలు అనునవి ద్రవ నైట్రోజన్ తో గడ్డ కట్టేలా చేయడం ద్వారా నాశనం చేయబడతాయి మరియు తరువాత చర్మము నయమగుటకు అనుమతించబడుతుంది.  ద్రవ నైట్రోజన్ యొక్క తక్కువ ఉష్ణోగ్రత కారణముగా చర్మము ఎర్రగా మారడం లేక వాపు వచ్చినట్లుగా మారడం జరుగుతుంది. పులిపిర్ల యొక్క సంఖ్య మరియు వాటి పరిమాణమును బటి అనేక సార్లు ఈ విధానము పునరావృతమయ్యే అవసరముంటుంది.  సాధారణముగా, ఒకసారి సెషన్ పూర్తయిన తరువాత 7 నుండి 10 రోజుల గ్యాప్ అనునది చర్మము నయమవడానికి అనుమతించబడుతుంది.  మీ చర్మవైద్యుడు, చికిత్సకు ముందు ఒక మత్తు క్రీమును మీకు అప్లై చేస్తాడు.
  • కాంథరిడిన్
    మీ చర్మవైద్యుడు, పులిపిరి నయమగుటకు ఈ మందును పూయడం లేక రాయడం చేయడం ద్వారా చికిత్స చేస్తాడు.  చనిపోయిన పులుపిరిని ఒక వారం తరువాత లేక ఆ పైన తొలగిస్తారు.
  • ఎలక్ట్రో (విద్యుత్) శస్త్ర చికిత్స మరియు క్యూరెట్టేజ్ (తురమడం)
    ఎలక్ట్రో (విద్యుత్) శస్త్ర చికిత్స అనగా పులిపిరిని కాల్చడం మరియు ఈ పధ్దతి సాదారణ మొటిమలు, పిలిఫారం మొటిమలు, మరియు పాదాల పులిపిర్లు అను వాటిని తొలగించడములో సహాయపడుతుంది.  క్యురెట్టేజ్ అనునది ఒక పదునైన కత్తితో పులిపిర్లను కట్ చేయడం లేక గీకడం అను పధ్దతులను కలిగి ఉంటుంది.  సాధారణముగా, రెండు పద్ధతులు ఒకదానితో ఒకటి కలిసి నిర్వహించబడుతాయి, మరియు మొటిమ మొదట కాల్చబడి తరువాత గోకడం చేయబడుతుంది లేక వైస్-వెర్సా.
  • కత్తిరించడం
    ఇది చర్మము యొక్క ఉపరితలము నుండి పులిపిరిని కత్తిరించడం మరియు తొలగించడము అను పధ్ధతిని కలిగి ఉంటుంది.

పులిపిరి యొక్క చికిత్స అనునది సమర్థవంతముగా జరుగుతుంది, అయితే పులిపిర్లు మరలా తిరిగి వస్తాయని మీరు గమనించవలెను.  పులిపిర్లు ఏర్పడడానికి కారణమైన మీ శరీరము వైరస్ కు వ్యతిరేకముగా యాంటిబాడీస్ ను వృద్ధి చేయకపోతే, దానికి బదులుగా, వాటిని నయం చేయుటకు ఏ విధమైన శాశ్వత చికిత్స లేదు.

పులిపిర్లు అంటే ఏమిటి? - What is Warts (Skin) in Telugu

ఎవరైనా పులిపిర్లను పొందవచ్చు, అయితే ఇవి ఎక్కువ సాధారణముగా టీనేజర్లు మరియు చిన్న పిల్లలలో ఏర్పడతాయి.  కొంత సమయము వద్ద లేక మరొ కొంత సమయానికి, దగ్గరగా  33% పిల్లలు మరియు టీనేజర్లు పులిపిర్లను కలిగిఉన్నారు.  అధిక భాగం పులిపిర్లు నొప్పిని కలిగించవు మరియు వాటంతట అవే వెళ్ళిపోతాయి.  3 నుండి 5 %  వరకు పెద్దలలో మాత్రమే పులిపిర్లు వృధ్ధి చెందుతాయి.  ఒకవేళ పులిపిర్లు తమంతట తాముగా వెళ్ళిపోనప్పుడు మరియు అసౌకర్యముగా మరియు అందవికారముగా ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు చికిత్సను కోరుకుంటారు.

మొటిమలు లేక పులిపిర్లు అంటే ఏమిటి?

పులిపిర్లు అనునవి విస్తృతముగా వ్యాపించే వైరల్ చర్మ పరిస్థితి, ఇది చర్మము యొక్క బయటి ఉపరితలముపైన చిన్న చిన్న చర్మము పెరుగుదల రూపములో ఏర్పడుతుంది.  ఒక సాధారణ వైరస్ అనగా హ్యూమన పాపిల్లోమావైరస్ అని పిలువబడే వైరస్ ఇవి ఏర్పడుటకు కారణమవుతుంది.  పులిపిర్లు విభిన్న ఆకారాలు మరియు పరిమాణాల్లో కనిపిస్తాయి.  అవి చాలా చిన్నగా లేక పెద్దగా విభిన్న రంగులలో అనగా తెలుపు, గులాబీ, లేక గోధుమ లేక మీ చర్మము యొక్క రంగును కలిగిఉంటాయి.  అవి గరుకుగా లేక మృదువుగా, చదునుగా లేక పెరిగినట్లుగా లేక పొడవుగా మరియు సన్నగా ఉంటాయి.  శరీరము యొక్క ఏ ప్రదేశములోనైనా ఏర్పడే అవకాశం ఉన్ననూ, పులిపిర్లు సాధారణముగా చేతులు, పాదాలు, మరియు ముఖము పైన పెరుగుతాయి,



వనరులు

  1. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Warts: Overview. 2014 Jul 30 [Updated 2017 May 4]
  2. American Academy of Dermatology. Rosemont (IL), US; Warts
  3. American Academy of Dermatology. Rosemont (IL), US; What warts look like
  4. American Orthopaedic Foot & Ankle Society [Internet] Orthopaedic Foot & Ankle Foundation, Rosemont, IL; Ailments of the Big Toe
  5. American Academy of Dermatology. Rosemont (IL), US; Dermatologists share tips to treat common warts

పులిపిర్లు కొరకు మందులు

Medicines listed below are available for పులిపిర్లు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for పులిపిర్లు

Number of tests are available for పులిపిర్లు. We have listed commonly prescribed tests below: