రుమటాయిడ్ ఆర్థరైటిస్ - Rheumatoid Arthritis in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

రుమటాయిడ్ ఆర్థరైటిస్
రుమటాయిడ్ ఆర్థరైటిస్

రుమటాయిడ్ కీళ్లనొప్పులు (రుమటాయిడ్ ఆర్థరైటిస్) అంటే ఏమిటి?

రుమటాయిడ్ కీళ్లనొప్పులు (Rheumatoid Arthritis-RA) అనేది కీళ్ళలో నొప్పి లేక  కీళ్లలో వాటి చుట్టుపక్కల వాపు, కీళ్ల నొప్పులు మరియు ఇతర వ్యాధి లక్షణాలతో కూడుకొని ఉండే ఓ రుగ్మత.  ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (autoimmune disease). ఇందులో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాల్ని పొరబాటుగా విదేశీ కణజాలాలుగా భావించి వాటిపై (ఆరోగ్య కణజాలాలపై) దాడి చేస్తుంది.

సకాలంలో వైద్యజోక్యం లేకపోవటం మృదులాస్థికి నష్టం కలిగిస్తుంది. కీళ్ళు మరియు ఎముకలను కలిపి ఉంచే కణజాలమే మృదులాస్థి లేక గట్టి నరాలు. ఇంకా, మృదులాస్థి యొక్క ఈ నష్టం తగ్గిపోయిన కీళ్ల అంతరానికి దారితీస్తుంది. మొత్తంమీద, ఈ రుగ్మత పరిస్థితి చాలా బాధాకరమైనది కానీ మందులతో నియంత్రించబడుతుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేతులు, పాదాలు (అడుగులు), మోచేతులు, మోకాలు, మణికట్లు మరియు చీలమండల కీళ్ళను దెబ్బ తీస్తుంది. ఈ రుగ్మత హృదయనాళాల ద్వారా లేదా శ్వాసకోశ వ్యవస్థ ద్వారా వ్యాపిస్తుంది, అందుచేతనే దీనిని ‘దైహిక వ్యాధి’గా సూచిస్తారు.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ రుగ్మత యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • ఉదయంపూట కీళ్లలో పెడసరం ఉంటుంది, రోజంతా నిరంతరం జరిగే కీళ్లకదలికల కారణంగా ఉదయం ఉండే కీళ్లనొప్పి రోజులో తర్వాత సమయంలో మాయమైపోతుంది.
  • అలసట.
  • రక్తహీనత.
  • బాధాకరమైన కీళ్ళు.
  • పొడిబారే కళ్ళు మరియు నోరు.
  • మోచేతులు, చేతులు, మోకాలు మరియు ఇతర కీళ్ళలో గట్టిగా ఉండే గడ్డలు.
  • కీళ్ళలో వాపు మరియు కీళ్లు ఎరుపుదేలడం.
  • ఛాతి నొప్పి.
  • జ్వరం మరియు బరువు నష్టం.

బాధాకరమైన ఈ రుగ్మత ఏకకాలంలో చేతులు లేదా పాదాలను దెబ్బ తీస్తుంది. ఇది 30 ఏళ్ల వయసు పైబడ్డవాళ్లలో సంభవిస్తుంది, మరియు పురుషుల కంటే స్త్రీలకే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. కొన్నిసార్లు, నొప్పి మరియు అలసటతో పాటు వాపు అనుకోకుండా సంభవించవచ్చు మరియు తీవ్రమవచ్చు, పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ రుగ్మతను ప్రేరేపించే ఖచ్చితమైన కారకాలు తెలియకపోయినా, కింది కారకాలు ఈ వ్యాధికి పూర్వగామిగా పరిగణించబడతాయి:

  • జన్యు ఉత్పరివర్తనలు (జీన్ మ్యుటేషన్).
  • తండ్రి కుటుంబంలో రుమటాయిడ్ కీళ్లనొప్పుల (RA) చరిత్ర.
  • అంటు వ్యాధులు.
  • హార్మోన్ల మార్పులు.
  • భావోద్వేగ బాధ.
  • ధూమపానం.
  • కాలుష్య కారకాలకు బహిర్గతమవడం.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పైన పేర్కొన్న లక్షణాలను చూసి ఈ రుగ్మతను నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇంకా, భౌతిక పరీక్ష, x- రే మరియు రక్త పరీక్షలు కూడా ఈ రుగ్మత ఉనికిని నిర్ధారించడానికి సహాయపడతాయి. వ్యాధి లక్షణాల ప్రారంభదశలోనే రోగ నిర్ధారణ మరియు చికిత్స అందించినట్లయితే వ్యాధి ప్రభావవంతంగా నయమవుతుంది.

చికిత్స:

చికిత్సావిధానాల్లో ప్రీ-ఎంప్టీవ్  మరియు రియాక్టివ్ చికిత్సలు రెండున్నూ ఉంటాయి:

  • నొప్పినివారిణులు (పెయిన్కిల్లర్లు) లేదా అనాల్జేసిక్ ఔషధాలు.
  • ఇబూప్రోఫెన్ వంటి నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు.
  • ప్రిడ్నిసోలోన్ వంటి కార్టికోస్టెరాయిడ్స్.
  • మెథోట్రెక్సేట్ వంటి వ్యాధి మార్పును కల్గించే కీళ్ళవాతపు ఔషధాలు.
  • ఇన్ఫ్లిక్సిమాబ్ వంటి జీవ ఔషధాలు.
  • వ్యాయామాలు, బలం శిక్షణ మరియు తాయ్ చి వంటివి.
  • నొప్పిని నియంత్రించడానికి మరియు కీళ్ళలో కదలికను సంరక్షించడానికి ఫిజియోథెరపీ.
  • నొప్పి మరియు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే గాడ్జెట్లు.
  • విశ్రాంతి (రెస్ట్).
  • ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను తినే ఆహారంలో ఉండేట్లు చూసుకోవడం.
  • రుద్దడం (massage), ఆక్యుపంక్చర్ మరియు ఇతర పరిపూరకరమైన చికిత్సలను ఉపయోగించడం.



వనరులు

  1. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Rheumatoid arthritis.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Rheumatoid Arthritis (RA).
  3. National Health Service [Internet]. UK; Symptoms.
  4. Rheumatology Research Foundation [Internet]. Georgia: American College of Rheumatology. Rheumatoid Arthritis.
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Rheumatoid Arthritis.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వైద్యులు

Dr. G Sowrabh Kulkarni Dr. G Sowrabh Kulkarni Orthopedics
1 Years of Experience
Dr. Shivanshu Mittal Dr. Shivanshu Mittal Orthopedics
10 Years of Experience
Dr. Saumya Agarwal Dr. Saumya Agarwal Orthopedics
9 Years of Experience
Dr Srinivas Bandam Dr Srinivas Bandam Orthopedics
2 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for రుమటాయిడ్ ఆర్థరైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.