తెల్ల బొబ్బలు (ఇంపెటైగో) - Impetigo in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 08, 2018

March 06, 2020

తెల్ల బొబ్బలు
తెల్ల బొబ్బలు

తెల్లనిబొబ్బలు లేక ఇంపెటైగో అంటే ఏమిటి? 

తెల్లనిబొబ్బలు లేక ఇంపెటైగో అనేది  పిల్లలకొచ్చే ఓ సామాన్య చర్మవ్యాధి; ఇది బురదతో కూడిన పండ్లను కల్గి ఉంటుంది. ఈ తెల్లని బొబ్బల పుండ్ల వ్యాధి తీవ్రమైన అంటురోగం. ఇది పిల్లల్లో చాలా సాధారణం అయినందున దీనిని 'బడి పుండు' అని కూడా పిలుస్తారు. ఇది బ్యాక్టీరియా కారక  సంక్రమణం. ఈ పుండు రుగ్మత చర్మం ఉపరితలభాగాన్ని బాధిస్తుంది మరియు 7 నుండి 10 రోజులలోనే తనను తానుగా మానిపోతుంది

తెల్ల బొబ్బలు రుగ్మత ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రెండు రకాల తెల్ల బొబ్బలున్నాయి-

 • చర్మంమీద బొబ్బల్లేని (నాన్-బుల్లస్ ఇంపెటిగో) తెల్ల బొబ్బల రుగ్మత
  • దురద పుళ్ళు
  • పుళ్ళు పగిలిపోయాక ఎరుపుదెలే చర్మం
  • పుళ్ళు సమీపంలో వాపు  గ్రంధులు
  • తేనె రంగులో గుల్లల (crusts) నిర్మాణం
 • తెల్ల బొబ్బలు (బుల్లస్ ఇంపెటిగో) - చుట్టుపక్కల చర్మం ఎరుపుదేలకుండా ద్రవంతో కూడిన దద్దుర్ల గుల్లలు రావడానికి ఈ తెల్లబొబ్బల రుగ్మత కారణం అవుతుంది. చర్మంపై లేత పసుపు రంగులో గుల్లలు లేక బొబ్బలు పారదర్శకంగా తయారవుతాయి. పొక్కులు కట్టిన పుళ్ళు లోకి మారేందుకు ముందు ఇలా పారదర్శకమైన గుల్లలుగా కనబడి, అటుపై ద్రవం గుమిగూడుతుంది. ఈ పుళ్ళు తమంతట తామే మానిపోతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

తెల్ల బొబ్బల పుళ్ళు సాధారణంగా స్టెఫిలోకాకస్ ఆరియస్ లేదా స్ట్రెప్టోకోకస్ పియెజినెస్ అని పిలువబడే బాక్టీరియా వల్ల  ఏర్పడుతాయి. చిన్న పిల్లలను చూసుకునే డేకేర్ సెంటర్లు, అధిక జనసమ్మర్దమైన స్థలాలు మరియు స్పర్శ క్రీడలు చర్మం స్పర్శ ద్వారా ఈ తెల్లబొబ్బల పుల్లావ్యాధి ఒకరినుండి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. తామర లేదా చికెన్ ఫాక్స్ (chickenpox) తో బాధపడుతున్నప్పుడు చిన్నపిల్లలు తెల్ల బొబ్బల పుళ్లను అదనపు వ్యాధిగా అంటించుకోవడమో లేక పొందదామో జరుగుతుంది. గోకడం మూలంగా రుగ్మతకు గురైన చర్మం విచ్ఛిన్నం అయి బ్యాక్టీరియా ప్రవేశించడానికి సులభతరమవుతుంది. ఈ బ్యాక్టీరియా నల్లులు కరవడం మూలంగా, చర్మ దద్దుర్లు, తెగడం లేదా చర్మం మీద కాలిన గాయాల  ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ పుండ్ల రుగ్మత గాలిలో తేమ ఉండే వేడి వాతావరణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

తెల్ల బొబ్బల వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

చర్మాన్ని పరిశీలించడం ద్వారా చర్మవ్యాధి వైద్యుడు (డెర్మాటోలజిస్ట్) తెల్ల బొబ్బల పండ్ల రుగ్మతను నిర్ధారించవచ్చు. వ్యాధికారక బాక్టీరియా రకం తనిఖీ కోసం  తెల్లబొబ్బల పుండు నుండి ఒక నమూనాను సేకరించి ప్రయోగశాలకు పంపబడుతుంది.

తెల్లబొబ్బల పుండ్ల (ఇంపెటిగో) రుగ్మత అనేది సాధారణంగా తీవ్రమైన వ్యాధి కాదు మరియు 2 నుంచి 3 వారాలలో వాటంతటవే మానిపోతుంటాయి. ఈ రుగ్మత యొక్క తేలికపాటి కేసుల కోసం, యాంటీబయాటిక్ క్రీమ్లు సిఫారసు చేయబడ్డాయి. సంక్రమణ విస్తృతంగా మరియు తీవ్రంగా ఉంటే నోటిద్వారా తీసుకునే యాంటీబయోటిక్ మందులు సూచించబడవచ్చు.

ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి, శరీరంపై ఎక్కడెక్కడ తెల్లబొబ్బలు ఏర్పడ్డాయో అక్కదంతా క్రీమ్ పూయడం చేసిన తర్వాత వ్యాధి అంటు ద్వారా వ్యాప్తిచెందకుండా ఉండేందుకు చేతుల్ని శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. మీరు పుండ్లను తాకడం నివారించుకోవాలి మరియు ఇతర వ్యక్తులు వాటిని తాకకుండా ఉండేట్టు కూడా చూసుకోవాలి. బాధిత పిల్లలను పాఠశాల, రోజు సంరక్షణ కేంద్రాలు (daycare centres) లేదా ఏదైనా బహిరంగ ప్రదేశాల నుండి దూరంగా ఉంచాలి.వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి, రోగి తువ్వాలు, పరుపు మరియు బట్టల్ని వేడి నీటితో (60 డిగ్రీల ఉష్ణోగ్రతలో)  ఉతకడం తప్పనిసరి.వనరులు

 1. British skin foundation. Impetigo. London, UK
 2. National Health Service [Internet]. UK; Impetigo
 3. American Academy of Dermatology. Rosemont (IL), US; Impetigo
 4. MedlinePlus Medical: US National Library of Medicine; Impetigo
 5. U.S food and drug administration. How to Treat Impetigo and Control This Common Skin Infection. US. [internet].

తెల్ల బొబ్బలు (ఇంపెటైగో) కొరకు మందులు

తెల్ల బొబ్బలు (ఇంపెటైగో) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।