కీళ్ల నొప్పి - Joint Pain (Arthralgia) in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 08, 2018

March 06, 2020

కీళ్ల నొప్పి
కీళ్ల నొప్పి

కీళ్ల నొప్పి అంటే ఏమిటి?

కీళ్ళలో నొప్పి చాలా కారణాల వల్ల సంభవిస్తుంది, కానీ చాలా సాధారణ కారణం గాయం కావడం లేదా కీళ్ళవాపు రావడం. చికిత్స చేయించుకోకుండా కీళ్లనొప్పిని నిర్లక్ష్యం చేస్తే అంగ వైకల్యం దాపురించగలదు.

దీని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కీళ్ళ నొప్పి యొక్క లక్షణాలు:

  • నొప్పి ఉన్నచోట ఎరుపుదేలడం లేదా వేడిని కల్గి ఉండడం
  • వాపెక్కిన కీళ్ళు
  • సున్నితత్వంతో కూడిన టెండర్ కీళ్ళు
  • శరీరం యొక్క వేర్వేరు కీళ్లలో (జాయింట్లలో) నొప్పి ఉంటుంది, నడవడం, రాయడం మొదలైనవి సాధారణ కార్యకలాపాలను చేసుకోవడం కష్టతరం చేస్తాయి.
  • తడవలు తడవలుగా నొప్పి యొక్క పునరావృతాలు
  • ప్రభావిత ప్రాంతం వద్ద పెడసరం మరియు గాయాలు
  • కీళ్ల లోకి రక్తస్రావం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కీళ్ల నొప్పి అనేక కారణాల వల్ల కలుగుతుంది

  • కీళ్ళ నొప్పి యొక్క అత్యంత సాధారణ కారణాలు:
    • మోకాలిచిప్ప వెనుక భాగంలో మృదులాస్థికి నష్టం
    • జాయింట్ లైనింగ్ వాపుదేలడం కీళ్ల ప్రదేశంలో ఎర్రబడి రక్తస్రావం కావడం
    • శరీరంలో పెరిగిన యురిక్ యాసిడ్ స్థాయిల కారణంగా గౌట్ లేదా సూడోగౌట్ రుగ్మతలు
    • వైరల్ ఇన్ఫెక్షన్లు
    • స్క్లెరోడెర్మా , లూపస్ వంటి కనెక్షన్ కణజాల లోపాలు
  • తక్కువ సాధారణ కారకాలు:
  • అన్నింటి కంటే అసాధారణమైనవి ఏవంటే:
    • ఉష్ణ మండలీయ సంక్రమణ 
    • క్యాన్సర్, హిమోఫిలియా, సెప్టిక్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు
    • ఎముకకు రక్త సరఫరా లేకపోవడం వలన ఎముకలు పెళుసుబారుతనానికి గురవడం
    • పునరావృత కీళ్ల స్థానభ్రంశం (లేక కీలు జారడం)

కీళ్ల నొప్పిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు కీళ్ల నొప్పిని నిర్ధారించడానికి మరియు దాని కారణాన్ని తెలుసుకోవడానికి భౌతిక పరీక్ష నిర్వహించి వ్యాధి లక్షణాల పూర్తి చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. వైద్యుడిచే క్రింది పరీక్షలు సూచించబడవచ్చు:

  • బ్లడ్ పరీక్షలు పూర్తి రక్త గణన, యాంటిన్యూక్యులార్ యాంటీబాడీ, రుమాటాయిడ్ కారకం, యాంటీ-ఎస్-ఎ (యాంటి-రో), యాంటీ-ఎస్-బి (యాంటీ-లా) యాంటిబాడీస్, యాంటీకార్డిలాపిన్ యాంటీబాడీ, VDRL టెస్ట్, సైటోప్లాస్మిక్ యాన్టినేట్రోఫిల్ సైటోప్లాస్మిక్ ఆటోంట్ బాడీ (సి- ANCA), క్రియేటిన్ మరియు క్రియేటిన్ కినేస్ (CPK), కాల్షియం
  • యూరిక్ యాసిడ్ స్థాయిల తనిఖీకి మూత్రపరిశీలన (urinalysis)
  • కీళ్ల నుండి ద్రవం తొలగింపు (సిరంజి సాయంతో చేస్తారిది) మరియు సినోవియల్ ద్రవం విశ్లేషణ పరీక్షలు
  • ఇమేజింగ్ లలో వ్యాధి ప్రభావిత ప్రాంతం యొక్క ఎక్స్-కిరణాలు, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లు ఉన్నాయి
  • ఎలక్ట్రోకార్డియోగ్రామ్
  • డబుల్ స్ట్రాండెడ్ DNA పరీక్ష
  • HLA-B27 పరీక్ష

కీళ్ల నొప్పి యొక్క కారణాన్ని గుర్తించిన తరువాత దానికి క్రింది విధానాలను ఉపయోగించి చికిత్స చేయబడుతుంది:

  • తేలికపాటి కీళ్లనొప్పి విషయంలో, వైద్యుడు మందుల సలహాలిస్తారు, ఇబూప్రోఫెన్ లేదా ఎసిటమైనోఫెన్, లేదా క్యాప్సైసిన్, నొప్పినివారిణులైన క్రీమ్లను పైపూతకు లేదా రాయడానికి నిర్దేశిస్తారు.
  • సరైన ఔషధాలతో కీళ్లనొప్పికి దారి తీసిన కారణానికి చికిత్స చేయడం
  • ఒక సంక్రమణ కారణం ఉంటే, అది చికిత్స తగ్గించడానికి సహాయం చేస్తుంది
  • కొన్ని గృహ సంరక్షణ ఉపాయాలు కీళ్లనొప్పికి చేయతగ్గవిగా ఉన్నాయి:
    • కండరాలు మరియు కీళ్ళు యొక్క పెడసరాన్ని తగ్గించడానికి వేడి కాపడం పెట్టడం (హీట్ అప్లికేషన్), మరియు వాపు తగ్గించడానికి మరియు నొప్పి ఉపశమనానికి చలవ కాపాడాలు పెట్టాడము మరియు కొన్ని సున్నితమైన వ్యాయామాల్ని క్రమం తప్పకుండా నెమ్మదిగా చేయడం
    • కొన్ని రుగ్మత పరిస్థితులు కీళ్ళకు పూర్తి విశ్రాంతినివ్వడం అవసరం కావచ్చు
    • ధూమపానం నివారించడం



వనరులు

  1. National Health Service [Internet]. UK; Joint pain
  2. American Academy of Family Physicians. Diagnostic Approach to Polyarticular Joint Pain. Am Fam Physician. 2003 Sep 15;68(6):1151-1160.
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Joint pain
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Joint Pain and Arthritis
  5. Bruce L Kidd et al. Arthritis and pain. Current approaches in the treatment of arthritic pain. Arthritis Res Ther. 2007; 9(3): 214. PMID: 17572915

కీళ్ల నొప్పి కొరకు మందులు

Medicines listed below are available for కీళ్ల నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.