స్క్లెరోడెర్మా వ్యాధి - Scleroderma in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 14, 2018

March 06, 2020

స్క్లెరోడెర్మా వ్యాధి
స్క్లెరోడెర్మా వ్యాధి

చర్మం గట్టిబడే స్క్లెరోడెర్మా వ్యాధి అంటే ఏమిటి?

అనుబంధ కండరకణజాలాలు (connective tissues) మరియు చర్మానికి సంబంధించిన రోగనిరోధక వ్యాధి లేదా స్వయం ప్రతిరక్షక వ్యాధి “స్క్లెరోడెర్మా.” ఇది సాధారణంగా రోగనిరోధక కీళ్ల వ్యాధులతో (autoimmune rheumatic diseases) సంబంధం కలిగి ఉంటుంది. “స్క్లెరోడెర్మా” అనే పదం స్వీయ-వివరణాత్మకమైనది, ఇక్కడ ‘స్క్లెరో’ అంటే గట్టిపడడం మరియు 'డెర్మా' అంటే చర్మం. అంటే ఇది చర్మం గట్టిపడే వ్యాధి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కండర కణజాలాల కాఠిన్యం (స్క్లెరోడెర్మా) వ్యాధి యొక్క లక్షణాలు ఈ రుగ్మతకు గురైన శరీర భాగంపై ఆధారపడి ఉంటాయి.

ప్రారంభ దశ లక్షణాలు:

  • చేతులు, వేళ్లు మరియు ముఖం యొక్క చర్మం మందమెక్కడం (thickening) మరియు గట్టిపడటం
  • వేళ్ల యొక్క వాపు మరియు ఉబ్బు
  • ఎరుపుదేలిన మరియు వాపుదేలిన చేతులు
  • బాధాకరమైన కీళ్ళు
  • ఉదయకాల పెడసరం
  • అలసట
  • బరువు నష్టం
  • రెనాడ్ యొక్క దృగ్విషయం: కాలు మరియు చేతివేళ్లలో రక్త ప్రసరణ నష్టం, దీనివల్ల కాలివేళ్ళు మరియు చేతివేళ్ళు చలికి బహిర్గతమై తెల్లబడుతాయి

తర్వాతి దశలో సంభవించే లక్షణాలు:

  • చర్మ కణజాల నష్టం, చర్మం చాలా ఎక్కువగా రంగుదేలడం కనిపిస్తుంది
  • కాల్సినోసిస్: వేళ్లు, ముంజేతులు లేదా ఇతర ఒత్తిడితో కూడిన శరీరభాగాల్లో స్థానికీకరించిన గట్టి దద్దుర్లు.
  • రేనాడ్స్ ఫినోమేనన్  
  • అన్నవాహిక పనిచేయకపోవడం
  • స్క్లెరోడ్రాక్టిలీ: చర్మం పలుచబడ్డట్టు, మెరిసేతత్వంతో  ప్రకాశవంతంగా కనిపిస్తుంది, దీని ఫలితంగా కాలి వేళ్లు మరియు చేతివేళ్ల పనితీరు తగ్గుతుంది.
  • తెలంగాయిక్టాసియా: చర్మం యొక్క ఉపరితలంపై ఎరుపు మచ్చలు వలె కనిపించే రక్తనాళాల విస్ఫోటనం లేక ఉబ్బు
  • తరువాతి దశల్లో రేనాడ్స్ ఫెనోమేనన్ ప్రభావితమైన భాగాలలో జలదరింపు, మొద్దుబారుట లేదా నొప్పితో కూడిన లక్షణాలుంటాయి.

ఎక్స్ప్లస్ స్క్లెరోడెర్మా గుండె, రక్త నాళాలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు జీర్ణశయాంతర అవయవాలను ప్రభావితం చేస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కండర కణజాలాల కాఠిన్య (స్క్లెరోడెర్మా) వ్యాధి యొక్క కారణం అస్పష్టంగా ఉంది, కానీ ఇది స్వయం ప్రతిరక్షక యంత్రాంగం ద్వారా సంభవిస్తుందని నమ్మడమైంది.

ఈ రుగ్మత సాధారణంగా మహిళల్నే దెబ్బ తీస్తుంది మరియు రెండు రూపాల్లో సంభవిస్తుంటుంది, అంటే,

  • స్థానిక కండర కణజాలాల కాఠిన్య (స్క్లెరోడెర్మా) వ్యాధి
  • విస్తారమైన కండర కణజాలాల కాఠిన్య (స్క్లెరోడెర్మా) వ్యాధి

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు  మరియు దీనికి చికిత్స ఏమిటి?

కండర కణజాలాల కాఠిన్యానికి (స్క్లెరోడెర్మా) రుమటాలజిస్ట్ లేదా డెర్మటాలజిస్ట్తో సంప్రదింపులు అవసరం.

కండర కణజాలాల కాఠిన్యవ్యాధి (స్క్లెరోడెర్మా) నిర్ధారణలో వైద్య చరిత్ర  మరియు భౌతిక పరీక్ష సహాయపడతాయి.

అనేక పరీక్షలు మరియు వైద్య పరిశోధనలు వైద్యుడికి వ్యాధిని అంచనా వేయడంలో మరియు మూల్యాంకనం చేయడానికి సహాయపడతాయి.

ఈ రుగ్మత నిర్ధారణలో కింది పరిశోధనలు ఉంటాయి:

  • రక్త పరీక్షలు
  • యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్
  • చర్మ జీవాణు (స్కిన్ బయాప్సీ) పరీక్ష

దెబ్బతిన్న అంతర్గత అవయవాల ఆధారంగా ఇతర వైద్య పరిశోధనలు సిఫారసు చేయబడతాయి.

కండర కణజాలాల కాఠిన్యవ్యాధి (స్క్లెరోడెర్మా) యొక్క చికిత్స వ్యాధి లక్షణాలపై దృష్టి పెట్టి పనిచేసి వాటిని ఉత్తమంగా తగ్గిస్తుంది.

మీ వైద్యుడు గుండెల్లో మంటలను తొలగించడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి మందులను సూచిస్తాడు.

రోగనిరోధక వ్యవస్థ యొక్క కార్యకలాపాన్ని తగ్గించడానికిచ్చే మందులు కండర కణజాలాల కాఠిన్యవ్యాధి (స్క్లెరోడెర్మా) యొక్క పురోగతిని నెమ్మదిస్తాయని కనుగొనబడ్డాయి.

కీళ్ల నొప్పి, కీళ్లపెడసరం మరియు కీళ్లవాపు తగ్గించడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్ (వాపు-మంట నివారిణులు) మందులు మరియు నొప్పినివారిణులైన (అనల్జెసిక్స్) మందులు ఉపయోగపడతాయి.

వ్యాధివల్ల దెబ్బతిన్న అంతర్గత అవయవాలను బట్టి మందులు  సూచించబడతాయి.

స్వీయ సంరక్షణ:

  • వేళ్లు మరియు పాదాలు చల్లదనానికి గురికాకుండా నివారించడానికి చేతి తొడుగులు (gloves)  మరియు మేజోళ్ళు (సాక్స్) ధరించాలి.
  • మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మరియు చర్మాన్ని తేమగా ఉంచడం మంచిది.
  • ఫిజియోథెరపీ ప్రయత్నించండి.
  • ధూమపానం మానుకోండి.



వనరులు

  1. Scleroderma Foundation, Danvers, MA. [Internet] What is scleroderma?
  2. National Institutes of Health; [Internet]. U.S. Department of Health & Human Services; Scleroderma.
  3. healthdirect Australia. Scleroderma. Australian government: Department of Health
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Scleroderma
  5. National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases [Internet]. National Institute of Health; Scleroderma.
  6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Scleroderma

స్క్లెరోడెర్మా వ్యాధి వైద్యులు

Dr Shishpal Singh Dr Shishpal Singh Dermatology
5 Years of Experience
Dr. Sarish Kaur Walia Dr. Sarish Kaur Walia Dermatology
3 Years of Experience
Dr. Rashmi Aderao Dr. Rashmi Aderao Dermatology
13 Years of Experience
Dr. Moin Ahmad Siddiqui Dr. Moin Ahmad Siddiqui Dermatology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

స్క్లెరోడెర్మా వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for స్క్లెరోడెర్మా వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹330.0

Showing 1 to 0 of 1 entries