గవద బిళ్ళలు - Mumps in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 13, 2018

July 31, 2020

గవద బిళ్ళలు
గవద బిళ్ళలు
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గవద బిళ్ళలు అంటే ఏమిటి?

గవద బిళ్ళలు అనే రుగ్మత పిల్లలకు సంభవించే ఒక సాధారణమైన  వైరల్ అంటువ్యాధి. చెవులు కింద ముఖానికి ఇరువైపులా ఉన్న గవదలభాగంలోని లాలాజల గ్రంధులకు బాధాకరమైన వాపును కలిగించి బాధించే రుగ్మత ఇది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధికారక సూక్ష్మజీవి సోకిన 14 నుంచి 25 రోజులకు గవదబిళ్ళల వ్యాధి లక్షణాలు గోచరించడం జరుగుతుంది. గవదబిళ్ళల యొక్క కొన్ని వ్యాధి లక్షణాలను క్రింద పేర్కొనబడ్డాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పారమిక్సో వైరస్ల యొక్క కుటుంబానికి చెందిన ఒక వైరస్ (సూక్ష్మజీవి) వలన గడ్డలు ఏర్పడతాయి. వాతావరణంలో గాలి బిందువుల ద్వారా ఈ సూక్ష్మజీవులు ముక్కు లేదా నోటి ద్వారా మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన, ఈ వైరస్లు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధి ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ముతున్నపుడు మరియు దగ్గుతున్నప్పుడు నోటికి మరియు ముక్కుకు అడ్డంగా చేతిరుమాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం.

దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

నిర్ధారణ (డయాగ్నోసిస్)

 • గవదబిళ్ళలు రాకుండా ఉండేందుకు టీకాలమందు వేసిన చరిత్రను గుర్తించడం.
 • ముఖ్యంగా గొంతు మరియు చెవులు యొక్క భౌతిక పరీక్ష
 • సూక్ష్మజీవిని గుర్తించి నిర్ధారించేందుకు, సూక్ష్మజీవికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను గుర్తించడానికి రక్త పరీక్ష.
 • సూక్ష్మజీవిని నిర్ధారించడానికి ముఖ జీవకణ (నోటికి సంబంధించిన) స్వాబ్ (పరీక్ష
 • మూత్ర పరీక్ష

చికిత్స

గవదబిళ్ళల వ్యాధి ఒక వైరస్ వల్ల సంభవించినందున యాంటిబయోటిక్స్ మందులు దీనికి ప్రభావవంతంగా పని చేయవు. శరీరంలోని రోగనిరోధకతశక్తి వ్యాధికారక సూక్ష్మజీవితో (వైరస్తో) పోరాడేవరకూ ఈ లక్షణాలను ఉపశమనం చేసుకొనే ప్రయత్నం చికిత్సలో భాగంగా జరుగుతుంది. వ్యాధి అసౌకర్యం తగ్గించడానికి పాటించే దశలు క్రింది విధంగా ఉన్నాయి:

 • సంక్రమణ వ్యాప్తిని నిరోధించడానికి రోగిని ఇతరుల నుండి వేరుచేయడం
 • జ్వరము కొరకు పారాసెటమాల్ మందులు
 • వాపు కోసం ఇబుప్రోఫెన్
 • వాపు కోసం వెచ్చని కాపడం లేదా చల్లని అద్దకాలు
 • నమలడం అవసరమైన ఆహారాన్ని నిరోధించి మృదువైన ఆహారం రోగికి తినిపించడం ఉత్తమం
 • ద్రవాహారాల్ని పుష్కలంగా తీసుకోవడం

నివారణ

మశూచికం (మీసల్స్), గవదబిళ్ళలు (ముంప్స్), పొంగు రుబెల్లా (MMR) టీకామందు సిఫార్సు చేయబడింది. CDC విభాగం సిఫారసుల ప్రకారం, పిల్లలు MMR టీకామందు  యొక్క రెండు మోతాదులను ఇవ్వాలి: 15 నెలల వయస్సులో మొదటి మోతాదు మరియు 4-6 ఏళ్ళ వయసులో రెండవ మోతాదును ఇవ్వాలి. శిశువు పుట్టిన 28 రోజుల తర్వాత ఈ టీకా మందునివ్వడం జరుగుతుంది, ఎందుకంటే తల్లి నుండి శిశువుకు బదిలీ అయ్యే  ప్రతిరక్షకాలు కొన్ని వ్యాధులకు రక్షణ కల్పించగలవు.వనరులు

 1. World Health Organization [Internet]: Geneva, Switzerland. Mumps.
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Mumps.
 3. National Health Service [Internet]. UK; Mumps.
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Signs & Symptoms of Mumps.
 5. Office of Infectious Disease and HIV/AIDS Policy [Internet]: U.S. Department of Health and Human Services; Mumps.
 6. Department of Health[internet]. New York State Department; Mumps Fact Sheet.

గవద బిళ్ళలు వైద్యులు

Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 वर्षों का अनुभव
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 वर्षों का अनुभव
Dr. Lalit Shishara Dr. Lalit Shishara Infectious Disease
8 वर्षों का अनुभव
Dr. Alok Mishra Dr. Alok Mishra Infectious Disease
5 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గవద బిళ్ళలు కొరకు మందులు

గవద బిళ్ళలు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।