అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ - Obsessive Compulsive Disorder in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 04, 2019

March 06, 2020

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్
అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ (OCD) (లేదా స్వీయభావారోధ నిర్బంధ రుగ్మత) అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక రుగ్మత. ఈ రుగ్మత పిల్లలు మరియు పెద్దలలో కూడా సంభవించవచ్చు. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి అసమంజసమైన స్వీయ భావారోధాలు మరియు నిర్బంధాల యొక్క చక్రంలో చిక్కుకుంటాడు. వ్యక్తి యొక్క మనస్సులో చిత్రాలు కూడా ఉంటాయి, ప్రేరేపణలుంటాయి, అనుచిత ఆలోచనలూ కలిగి ఉంటాడు, ఇవన్నీ వ్యక్తి మనసులో బాధతో కూడిన భావాలను ఉత్పన్నం చేస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:

 • మానసిక చిత్రాలు, ప్రేరేపణలు మరియు పునరావృతమయ్యే ఆలోచనలు ఆందోళనను  కల్గిస్తాయి.
 • మతం మరియు లైంగికతతో సహా పలు అధిక నిషిద్ధ ఆలోచనలు
 • పదేపదే విషయాల్ని పరిశీలించడము, ఉదాహరణకు, వంట గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని తలుపు లాక్ లో ఉందా లేదా అని రోజులో వందల సార్లు పదే పదే చూడ్డం.
 • ఖచ్చితమైన క్రమంలో, ఒక సుష్ట నమూనాలో లేదా చాలా ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన మార్గంలో వస్తువుల్ని అమర్చడం
 • నిర్బంధంగా (కంపల్సివ్) లెక్కించడం.
 • ఈడ్పు క్రమరాహిత్యం (లేక Tic disorder): హఠాత్తుగా, భుజాలు ఎగరేసేటువంటి  పునరావృత మోటార్ కదలికలు. ఇంకా, కనులు మిటకరించడం, భుజంతో జెర్కింగ్ చేయడం మరియు ముఖములో కోపంతో భావప్రకటన చేయడం. గొంతు శబ్దాలు, గొంతు సవరించుకోవడం మరియు పునరావృతంగా ముక్కుతో పీల్చే శబ్దాల్ని చేయడం వంటి స్వర సంబంధ చర్యలు.
 • స్వీయ లేదా ఇతరులపై తీవ్రమైన ఆలోచనలు
 • అధిక మోతాదులో మాలిన్యమవటం గురించి లేదా కీటకాలకాలుష్యం గురించి గాభరా పడుతూ చేతుల్ని ఎక్కువగా కడగడం, అధికంగా శుభ్రపరిచే ప్రక్రియకు ఉపక్రమిస్తూ ఉండడం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్  యొక్క ప్రధాన కారణాలు:

 • మెదడులో అసాధారణతలు
 • పర్యావరణసంబంధమైనవి
 • మెదడు యొక్క వివిధ భాగాల మధ్య సమాచార వైఫల్యాలు
 • జన్యు కారకాలు
 • సెరోటోనిన్ యొక్క అసాధారణ స్థాయిలు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఒక మనోరోగ పరీక్ష మరియు భౌతిక పరీక్ష నిర్వహించడం ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. రోజువారీ జీవితంలో కింద ఉదహరించిన స్వీయభావారోధ నిర్బంధ వ్యాధి  లక్షణాలు ఎంత మాత్రం జోక్యం చేసుకుంటాయని డాక్టర్ అడుగుతారు, రోజులో కనీసం ఒక గంటపాటు ఈ భావనల జోక్యం ఉంటుందా లేక వ్యధాభరితంగా ఉంటాయా అని అడగొచ్చు.

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ చికిత్సకు క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు:

 • మందులు: యాంటిడిప్రెసెంట్ మందులు మెదడులోని రసాయనాల సంతులనాన్ని పునరుద్ధరించడానికి సాధారణంగా సూచించబడతాయి. OCD లక్షణాలను నియంత్రించడానికి సహాయపడే మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సెలెక్టివ్ సెరోటోనిన్ రిఅప్టేక్ ఇన్హిబిటర్లు (SSRI లు) సూచించబడతాయి
 • మానసిక చికిత్స: ఈ చికిత్స అబ్సెసివ్ ఆలోచనలు మరియు భయాలు నియంత్రించడానికి సహాయపడుతుంది
 • మెదడు యొక్క లోతు ఉద్దీపన (DBS): ఈ చికిత్సను కనీసం ఐదు సంవత్సరాలు OCD కలిగి ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, దీనిలో మెదడుకు ఎలక్ట్రోడ్లను ఉపయోగించి తేలికపాటి విద్యుత్ ప్రవాహాలతో చికిత్స చేయడం జరుగుతుంది.వనరులు

 1. University of Rochester Medical Center Rochester, NY. [Internet] Obsessive-Compulsive Disorder (OCD)
 2. National Health Service [Internet]. UK; Obsessive compulsive disorder (OCD).
 3. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Obsessive-Compulsive Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States
 4. Mental Health. Obsessive-Compulsive Disorder. U.S. Department of Health & Human Services, Washington, D.C. [Internet]
 5. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Obsessive-compulsive disorder.
 6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Obsessive-compulsive disorder
 7. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Obsessive compulsive disorder

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వైద్యులు

Dr. Ankit Gupta Dr. Ankit Gupta Psychiatry
10 वर्षों का अनुभव
Dr. Anil Kumar Kumawat Dr. Anil Kumar Kumawat Psychiatry
5 वर्षों का अनुभव
Dr. Dharamdeep Singh Dr. Dharamdeep Singh Psychiatry
6 वर्षों का अनुभव
Dr. Samir Parikh Dr. Samir Parikh Psychiatry
24 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కొరకు మందులు

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।