myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పురుషాంగ రుగ్మతలు అంటే ఏమిటి?

పురుషాంగం పురుష పునరుత్పాదక వ్యవస్థలో భాగమైన కోప్యూలేటరీ (సంభోగము చేసే) అవయవం. పురుషాంగం రుగ్మతలు అసౌకర్యం మరియు నొప్పిని కలిగించడం మాత్రమే కాక, వ్యక్తి యొక్క లైంగిక చర్యలను ప్రభావితం చేస్తాయి మరియు సంతానోత్పత్తి సమస్యలకు కూడా దారితీయవచ్చు. కొన్ని సాధారణ పురుషాంగ సమస్యలు అంగస్తంభన లోపం, బెలనైటిస్ (పురుషాంగ వాపు), ప్రియాపిజం (అంగస్తంభన ఎక్కువగా ఉండడం), పెయోరోనిస్ వ్యాధి, మరియు అరుదుగా, పురుషాంగ క్యాన్సర్.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు అంతర్లీన కారణంపై ఆధారపడి ఉంటాయి, అందువల్ల, ఈ క్రింది విధంగా లక్షణాలను వర్గీకరించవచ్చు.

 • అంగస్తంభన లోపం -ఇది అత్యంత సాధారణమైన సమస్య దీనిలో అంగస్తంభనను  నిలిపి ఉంచడంలో అసమర్థత కలిగి ఉంటారు .
 • ప్రియాపిజం అనేది ఒక బాధాకరమైన పరిస్థితి, ఇందులో పురుషాంగం 4 గంటల కంటే ఎక్కువ సమయం పాటు స్తంభించి ఉంటుంది.
 • ఫిమోసిస్- ఈ పరిస్థితిలో పురుషాంగ ముందరి చర్మం పురుషాంగ కొనకు అంటుకుపోతుంది అది తీవ్ర నొప్పికి దారితీస్తుంది.
 • పెయోరోనిస్ వ్యాధి- ఈ వ్యాధిలో, పురుషాంగం యొక్క అంతర్గత పొర లోపల గట్టి గడ్డలను అభివృద్ధి చేస్తుంది, దీని వలన అంగం స్తంభించినప్పుడు ఒక వైపుకు వంగి పోతుంది.

పురుషాంగ చర్మ రుగ్మతలు దద్దుర్లు, దురద, చర్మం రంగు మారిపోవడం మరియు పురుషాంగం యొక్క పుండ్లు వంటివి కలిగిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • కొన్ని రకాల మందులు, మద్యం, గాయాలు, వెన్నుమూక సమస్యలు వంటివి ప్రియాపిజంను కలిగించే కారణాలు.
 • ప్రదర్శన ఆత్రుత (performance anxiety), ఒత్తిడి మరియు లైంగిక  అణిచివేత యొక్క చరిత్ర కారణంగా ప్రధానంగా అకాల శీఘ్రస్ఖలనం సంభవిస్తుంది.
 • సాధారణంగా సున్తీ చేయించుకోని పురుషులలో ఫిమోసిస్ కనిపిస్తుంది.
 • పెయోరోనిస్ వ్యాధి యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, కానీ వాస్కులైటిస్, పురుషాంగ గాయాలు, మరియు వంశపారంపర్య  కారణాలు దానితో ముడిపడి ఉండే కొన్ని కారకాలు.
 • ధూమపానం మరియు హెచ్ పివి (HPV, మానవ పాపిల్లో వైరస్) పురుషాంగ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన కారణాలు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగనిర్ధారణ సాధారణంగా పురుషాంగ పరిశీలన మరియు పరీక్షల ద్వారా నిర్దారించబడుతుంది. వ్యక్తి యొక్క సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని నిర్ధారించడానికి, ఒక సాధారణ వీర్య కణ సంఖ్య (స్పెర్మ్ కౌంట్) పరీక్ష మరియు స్థానిక సోనోగ్రఫీ (sonography) జరుగుతుంది. చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది.

 • ప్రియాపిజంకి ఒక సూదిని ఉపయోగించి పురుషాంగం నుండి రక్తాన్ని తీసివేయడం ద్వారా చికిత్స చేస్తారు.
 • ఫిమోసిస్కు తరచుగా శస్త్రచికిత్స అవసరం.
 • పెయోరోనిస్ వ్యాధి, చిన్నపాటిగా ఉంటే, 15 నెలల లోపు ఎటువంటి చికిత్స లేకుండానే నయం అవుతుంది.
 • శస్త్రచికిత్స, రేడియేషన్, మరియు కీమోథెరపీలతో పురుషాంగ క్యాన్సర్కి చికిత్స చేస్తారు.

పురుషాంగ రుగ్మతలను నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది మరియు ఇది ఒకరి భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

కొన్ని స్వీయ సంరక్షణ చిట్కాలు పురుషాంగ రుగ్మతలను నివారించడంలో సహాయం చేస్తాయి మరియు తద్వారా ఒక ఆరోగ్యవంతమైన లైంగిక జీవితాన్ని గడిపేలా చేస్తాయి. ఈ చిట్కాలు వీటిని కలిగి ఉంటాయి

 • పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచడం
 • క్రమముగా  జననేంద్రియాలను తనిఖీ చేయించుకోవడం
 • బహుళ లైంగిక భాగస్వాములను నివారించడం
 • బిగుతుగా ఉండే  లోదుస్తులను ధరించకుండా ఉండడం
 • తీవ్ర వేడి నుండి పురుషాంగాన్ని రక్షించడం
 • ధూమపానాన్ని విడిచిపెట్టడం

సరైన సమయంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం, పురుషాంగం మీద ఏదైనా అసాధారణ మార్పులను గమనించిన వెంటనే  వ్యక్తి వైద్యులని సంప్రదించాలి.

 1. పురుషాంగ రుగ్మతలు కొరకు మందులు

పురుషాంగ రుగ్మతలు కొరకు మందులు

పురుషాంగ రుగ్మతలు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Penegra TabletPenegra 100 Mg Tablet183.0
HerpexHerpex 100 Mg Tablet81.0
Manforce TabletManforce 100 Mg Tablet232.0
Viagra TabletViagra 100 Mg Tablet1055.0
VigreksVigreks 100 Mg Tablet120.0
VigronVigron 50 Mg Tablet11.0
VistagraVistagra 100 Mg Tablet12.0
VygexVygex 100 Mg Tablet37.0
WavegraWavegra 100 Mg Tablet12.0
WingoraWingora 100 Mg Tablet10.0
ZeagraZeagra 100 Mg Tablet125.0
ZestograZestogra 100 Mg Tablet11.0
1 2 31 2 3 100 Mg Tablet12.0
AgraAgra 100 Mg Tablet10.0
AlivherAlivher 25 Mg Tablet149.0
AndrozAndroz 100 Mg Tablet124.0
Double ForceDouble Force Tablet30.0
DuragraDuragra 50 Mg Tablet13.0
EnthusiaEnthusia 100 Mg Tablet14.0
ErevaEreva 25 Mg Tablet142.0
EriactaEriacta 100 Mg Tablet14.0
HonygraHonygra 50 Mg Tablet73.0
KamagraKamagra 100 Mg Tablet131.0
LupigraLupigra Tablet10.0
OptithikOptithik 25 Mg Tablet149.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...