భయం (ఫోబియాలు) - Fear (Phobias) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 21, 2018

July 31, 2020

భయం
భయం

ఫోబియా అంటే ఏమిటి?

వాస్తవంగా ప్రమాదం లేకపోయినా ఒక వస్తువు లేదా పరిస్థితి గురించిన అధిక భయం అని ఫోబియా గురించి  నిర్వచించబడింది. మీరు భయపడుతున్న వస్తువు లేదా పరిస్థితి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు ఆందోళన చెందుతారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల విషయంలో ఆందోళన కలిగించేది పూర్తిగా సాధారణమైనది కాని వాస్తవమైన కారణం లేదా ప్రమాదం లేకుండానే ఆందోళన పడటం సాధారణమైంది  కాదు. అందువల్ల, భీతి లేక ఫోబియా మీ రోజువారీ కార్యకలాపాలపై రుణాత్మక (లేక ప్రతికూలమైన) ప్రభావం ఉంటుంది. సాధారణంగా నివేదింపబడిన సంభవించే భీతులు (భయాలు) జంతువులు, కీటకాలు, ఇంజెక్షన్, ఎత్తులు, బహిరంగ ప్రసంగాలు మరియు ప్రజల సమూహాలు ఉన్నాయి.

ఒక భారతీయ పరిశోధనా వ్యాసం ప్రకారం, ఫోబియా అనేది ఒక ఆందోళన రుగ్మత మరియు భారతీయ జనాభాలో 4.2% మందిపై దీని (ఫోబియా) ప్రాబల్యం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

భయం మరియు ఆందోళనతో పాటు, మీరు క్రింది లక్షణాలు కూడా అనుభవించవచ్చు:

ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికీ మారుతుంది. తీవ్రమైన పరిస్థితుల్లో, భయం అనేది తీవ్ర భయాందోళన రుగ్మత వంటి ఇతర ఆందోళనలకు దారితీస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

భీతి (భయం) యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా గుర్తించబడలేదు. ఇది క్రింది కారణాల వల్ల కావచ్చు:

 • గత పరిస్థితులు (ఉదాహరణకు, ఎగురుతూ లేదా బహిరంగంగా మాట్లాడేటప్పుడు, లిఫ్ట్లో చిక్కుకున్నప్పుడు, బాల్యంలో కుక్క కాటు, మరణం ప్రమాదం సమీపంలో)
 • ఇదే భయంతో కుటుంబ సభ్యులు.
 • జన్యు  పరిస్థితులు (జెనెటిక్స్).
 • ఒత్తిడికి గురైన లేదా ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీరు కొన్ని వస్తువులు లేదా పరిస్థితుల గురించి భయాలు కలిగి ఉంటే, మీరు చేయాల్సిన మొదటి పనేంటంటే దాని గురించి ఎవరితోనైనా మాట్లాడటం. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కావచ్చు, వారితో మాట్లాడొచ్చు. రెండవది, యోగా, ధ్యానం మరియు శ్వాస నియంత్రణ నేర్చుకోవడం వంటి ఉపశమన పద్ధతులు ద్వారా మీ శరీరాన్ని మీరు శాంతింపచేసుకోవడం.

ఇక మీరు వృత్తినిపుణుల (ప్రొఫెషనల్) సహాయం కోరుకుంటే, మీ వైద్యుడిని సంప్రదించండి. అతను / ఆమె మీ భయం మరియు దాని తీవ్రతను గుర్తించి తర్వాత మీకు తీసుకోతగ్గ చికిత్స ఎంపికలు గురించి వివరిస్తారు. చాలా సందర్భాలలో, ఫోబియాలు చికిత్స అవసరం లేదు. ఫోబియాలకు అందుబాటులో ఉన్న చికిత్సలు:

 • భయాన్నిదశల వారీగా ఎదుర్కొనేందుకు మరియు సమస్యల గురించి ఆలోచంచేందుకు కౌన్సిలింగ్ మరియు చికిత్స, తద్వారా సమస్యల గురించి ఆలోచించే తీరులో మార్పును తీసుకురావడం.
 • భయంతో కూడిన ఆందోళనకు మందులతో కూడిన చికిత్స.
 • ఇలాంటి భయాలతో బాధపడుతున్న ఇతర వ్యక్తులతో కలిపి సమూహ చికిత్స.
 • మేధోపరమైన నడవడిక (కాగ్నిటివ్ బిహేవియరల్) థెరపీ.
 • యోగా మరియు ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు.వనరులు

 1. Trivedi JK, Gupta PK. An overview of Indian research in anxiety disorders. Indian J Psychiatry. 2010 Jan;52(Suppl 1):S210-8. PMID: 21836680
 2. Anxiety and Depression Asscociation of America. Specific Phobias. Silver Spring, Maryland; [Internet].
 3. OMICS International[Internet]; Phobias.
 4. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Coping with anxiety and phobias. Harvard University, Cambridge, Massachusetts.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Phobias.

భయం (ఫోబియాలు) కొరకు మందులు

Medicines listed below are available for భయం (ఫోబియాలు). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.