స్పృహ తప్పి పడిపోవడం (సిన్కపి) - Fainting (Syncope) in Telugu

స్పృహ తప్పి పడిపోవడం
స్పృహ తప్పి పడిపోవడం

స్పృహ తప్పి పడిపోవడం (సిన్కపి) అంటే ఏమిటి?

స్పృహ తప్పి పడిపోవడాన్ని, వైద్యపరంగా సిన్కపి (syncope) అని కూడా పిలుస్తారు, ఇది రోగి తాత్కాలికంగా  స్పృహను కోల్పయే ఒక ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. చాలా సందర్భాలలో, స్పృహ తప్పడం అనేది ఒక అంతర్లీన ఆరోగ్య సమస్యని సూచిస్తుంది అందువల్ల దానిని తేలికగా తీసుకోరాదు.

మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోవడం అనేది దీనికి ప్రాధిమిక కారణం, అది కేవలం కొన్ని సెకన్ల పాటు ఏర్పడుతుంది. ఈ రక్త ప్రసరణకు అంతరాయం వల్ల వివిధ కారణాల వల్ల కావచ్చు. అదృష్టవశాత్తూ, ఇది చాలా తక్కువ సమయము మాత్రమే ఉంటుంది మరియు చాలా సందర్భాలలో ప్రమాదకరం కాదు. అయినప్పటికీ, ఇది ప్రాణాంతకమయ్యే ఒక అంతర్లీన ఆరోగ్య సమస్యని కూడా సూచించవచ్చు.

దాని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

స్పృహ తప్పి పడిపోవడానికి  సంబంధించిన కొన్ని సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు ఈ క్రింద ఉన్నాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పైన చెప్పినట్లుగా, మెదడుకి రక్త ప్రసరణలో అడ్డంకి ఏర్పడడం అనేది స్పృహ తప్పడానికి  ప్రధాన కారణం. ఈ రక్త ప్రసరణ తగ్గడానికి వివిధ కారణాలకు కారణం ఉండవచ్చు. వీటిలో కొన్ని:

స్పృహ తప్పి పడిపోవడానికి ఇతర సాధారణ కారణాలు:

 • అధిక వేడికి చాలా సమయం పాటు గురికావడం
 • అధిక ఒత్తిడి లేదా శ్రమ
 • బలహీనత లేదా రక్తం లేకపోవడం
 • డీహైడ్రేషన్(నిర్జలీకరణము)
 • మద్యం అధికంగా తీసుకోవడం
 • అల్పాహారం తీసుకోకపోవడం వలన రక్తంలో చక్కెర తక్కువ అవడం

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

స్పృహ తప్పి పడిపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు ఒక ముఖ్యమైన మరియు సాధారణ లక్షణం మరియు ప్రత్యేక రోగనిర్ధారణ పరీక్ష అవసరం లేదు. అయితే, స్పృహ తప్పి పోయిన రోగిని వైద్యుని దగ్గరికి తీసుకువెళితే, వైద్యుడు రోగి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించి స్పృహ తప్పడానికి గల కారణాన్ని గుర్తిస్తారు.

స్పృహ తప్పి పడిపోవడం అనేది పునరావృత్తమవుతూ ఉంటే, అంతర్లీన కారణాన్ని గుర్తించడం ముఖ్యం.

శరీర పనితీరు యొక్క తనిఖీ కోసం కొన్ని పరీక్షలను వైద్యులు సూచించవచ్చు. వీటిలో ఇవి ఉండవచ్చు;

 • గుండె పనితీరు తనిఖీ కోసం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG, electrocardiogram)
 • రక్తహీనతను పరీక్షించడానికి రక్త పరీక్షలు
 • మధుమేహం లేదా ఇన్ఫెక్షన్, హార్మోన్ల లోపాలు, మరియు ఇతర సమస్యలను తనిఖీ చేయడానికి రక్త పరీక్ష
 • స్కాల్ (పుర్రె) కు సిటి (CT) స్కాన్ లేదా ఎక్స్- రే కూడా అవసర పడవచ్చు

చికిత్స అనేది అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో స్పృహ తప్పడం కేవలం కొన్ని సెకన్ల పాటు ఉంటుంది, ఒకవేళ అది ఎక్కువసేపు ఉన్నా లేదా పునరావృతమవుతున్నా. చికిత్సను వెంటనే ప్రారంభించవలసి ఉంటుంది. చికిత్స కారణం ఆధారంగా మారుతూ ఉంటుంది, అది ఆహార మార్పులను చేయడం, గుండె జబ్బులు మరియు మధుమేహం మొదలైన వాటిని నియంత్రించడం వంటివి.వనరులు

 1. American Academy of Family Physicians [Internet]. Leawood (KS); Syncope: Evaluation and Differential Diagnosis
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fainting
 3. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Syncope Information Page
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Fainting (Syncope)
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Fainting

స్పృహ తప్పి పడిపోవడం (సిన్కపి) వైద్యులు

Pallavi Tripathy Pallavi Tripathy General Physician
3 वर्षों का अनुभव
Dr Sarath Dr Sarath General Physician
Dr. Mukesh Prajapat Dr. Mukesh Prajapat General Physician
3 वर्षों का अनुभव
Dr. Hitesh Suthar Dr. Hitesh Suthar General Physician
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

స్పృహ తప్పి పడిపోవడం (సిన్కపి) కొరకు మందులు

స్పృహ తప్పి పడిపోవడం (సిన్కపి) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।