మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా) - Schizophrenia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

February 06, 2019

March 06, 2020

మనోవైకల్యం
మనోవైకల్యం

సారాంశం

స్కిజోఫ్రీనియా (మనోవైకల్యం) అనునది ఒక పరిస్థితి,  ఇందులో కొద్దిగా తెలుసుకుంటారు, అధికముగా భయపడతారు, మరియు ఎక్కువగా అపార్థం చేసుకుంటారు.  ఇది ఒక మానసిక పరిస్థితి, ఇది ఒక వ్యక్తి యొక్క అవగాహనను మరియు అతని/ఆమె వాస్తవ భావనను వక్రీకరిస్తుంది. మనోవైకల్యము అనునది తీవ్రమైన ఆరోగ్య సమస్య, దీని ద్వారా బాధపడే ప్రజలకు చిక్కులను మరియు తగ్గుచున్న ఆయుష్కాలమును ఇస్తుంది.  మనోవైకల్యము యొక్క లక్షణాలు భ్రమలను, భ్రాంతిలను, అపసవ్య (సక్రమముగా లేని) ప్రవర్తనను మరియు పేలవమైన సామాజిక సంకర్షణలను కలిగి ఉంటాయి.  మనోవైకల్యము యొక్క ఖచ్చితమైన కారణాలు కనుగొనడానికి ఇప్పటికీ అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.  వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఒక వ్యక్తిని అధిక ప్రమాదములో ఉంచుతుంది.  చికిత్సలు అనునవి నిరంతర ఉపబలముతో పాటు మందులను మరియు దీర్ఘకాల చికిత్సలను కలిగి ఉంటాయి మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల యొక్క మధ్దతును కలిగి ఉండాలి.  అయితే, కొన్నిసార్లు గర్భధారణ సమయములో సమస్యలు ఏర్పడవచ్చు.  మనోవైకల్యమును నిర్వహించుట అనునది తరచుగా సామాజిక ప్రమేయమును కోరుకుంటుంది, అది ప్రజలు మనోవైకల్యము నుండి కోలుకోవడానికి మరియు ఫలవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాలను జీవించుటకు సహాయం చేస్తుంది. కావున మునుపటి స్థితికి చేరుకునే అవకాశాలు సాపేక్షముగా ఎక్కువగా ఉంటాయి, మరింత సానుకూలమైన చర్యలకు తోడ్పడుట, డ్రగ్స్ మరియు ధూమపానం నుండి దూరముగా ఉండుట, మరియు వృత్తి మద్ధతు కొరకు ప్రొవిజన్స్ ను సమకూర్చుట అనునవి వారికి సహాయము చేసి స్వతంత్రముగా మరియు బాధ్యతాయుతముగా జీవించేలా చేస్తుంది.

మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా) యొక్క లక్షణాలు - Symptoms of Schizophrenia in Telugu

మనోవైకల్యము యొక్క లక్షణాలు మారుతాయి, మరియు మానసిక అనారోగ్యము కారణముగా, పూర్తిగా ఒకే విధముగా ఉండే రెండు కేసులను కనుగొనడం చాలా కష్టము. అయితే, ఈ పరిస్థితికి సంబంధించి కొన్ని లక్షణాలు చాలా విభిన్నముగా ఉంటాయి.  వీటి యొక్క కొన్ని లక్షణాలు:

యుక్తవయస్సు ఉన్న వారి మధ్య

వారి యొక్క పెద్దల ప్రతిరూపాల వలె కాకుండా, మనోవైకల్యము గల యుక్త వయస్సు గల వారు చాలా తక్కువగా భ్రమలు కలిగి ఉంటారు మరియు భ్రాంతి యొక్క అవకాశాలను చాలా అధికముగా కలిగి ఉంటారు.  చికాకు కలిగించే సాధారణ భావనలు మరియు ప్రేరణ లేకపోవడం, ఇబ్బందిగా పడుకోవడం, స్నేహితులు మరియు కుటుంబము నుండి వేరుగా ఉండడం అదేవిధముగా స్కూలులో గమనించినట్లుగా పని చేయడములో మునిగిపోవడం.

పెద్దల మధ్య

  • భ్రమలు చాలా సాధారణముగా ఉంటాయి. వాస్తవానికి ఏ విధమైన ఆదారము లేకపోవడం అను నమ్మకాలు కలిగి ఉంటారు.  తనతో ఒకరు ప్రేమలో ఉన్నారను భావనను కలిగి ఉండడం, వ్యతిరేకముగా వేధించబడడం లేక తనకు వ్యతిరేకముగా కుట్ర పన్నుతున్నారు అనే కొన్ని సాధారణ భ్రమలు కలిగి ఉండడం.
  • భ్రాంతి అనునది మరొక సాధారణ లక్షణము, ఇది మనోవైకల్యము  యొక్క  లక్షణము.  భ్రాంతి అనగా, ఉనికిలో లేనటువంటి ఏదో ఒక సంవేదనాత్మక అనుభవం కలిగిఉండడం.  భ్రాంతి అనునవి అనేక రకాలుగా ఉన్న, వినబడే స్వరాలు అత్యంత  సాధారణముగా అనుభవములోకి వస్తాయి.
  • మనోవైకల్యములో అనేక రూపాలలో ఉన్న బలహీనమైన కమ్యూనికేషన్ అనునది అనుభవములోనికి వస్తుంది, ప్రశ్నలకు సంబంధములేని (అసంబద్ధ) సమాధానాలు ఇవ్వడం, ప్రసంగం కొరకు గార్బెల్డ్ సౌండ్స్(అన్నీ కలిసి ఉన్న శబ్దాలు) ఉత్పత్తి చేయడం, మరియు నిర్మాణం లేని లేక అర్థవంతము కాని  వాక్యాలను ఏర్పరచడం అనునవి వాటిలో కొన్ని.
  • అసంఘటిత ప్రవర్తన అనునది వెనుకబడిన చిన్న పిల్లల మనస్తత్వము, కోపము మరియు ఆందోళన వలన ఆకస్మికముగా  గట్టిగా అరవడం, అనుసరించకుండా లేక ఆదేశాలను తీసుకోకుండా ప్రతిఘటించడం, అదనపు మరియు అర్థము లేని ఆందోళన, మరియు సక్రమముగా లేని తీరు వంటి వాటిని కలిగి ఉంటుంది.
  • సాధారణ కార్యక్రమాలలో ఆసక్తి లేకపోవడం అనగా వ్యక్తులతో వ్యవహరించడం, వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహించడం, భావోద్వేగపూరితముగా వ్యక్తీకరించడం మరియు ఆనందాన్ని కోరుకోవడం వంటివి.

మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా) యొక్క చికిత్స - Treatment of Schizophrenia in Telugu

మనోవైకల్యము యొక్క చికిత్స అనునది బహుళ-చీలికల విధానమును ఉపయోగిస్తుంది, వ్యవహరించవలసిన సమస్యల యొక్క లేయర్లను పరిగణనలోకి తీసుకుంటుంది.  చికిత్సా పధ్ధతులు వీటిని కలిగిఉన్నాయి:

  • మందులు
    ఇది చికిత్స యొక్క మొదటి మరియు ప్రముఖ యాస్పెక్ట్, ఎందుకనగా ఇది వ్యాధి యొక్క ఫలితముగా ఏర్పడిన లేక వ్యక్తము చేయబడిన లక్షణాలను సూచిస్తుంది మరియు నిర్వహిస్తుంది.  అత్యంత సాధారణముగా సూచించబడిన చికిత్స యాంటీసైకోటిక్ మందులను కలిగిఉంటుంది.  వివిధ కారకాల పైన ఆధారపడి, మొదటి లేక రెండవ జనరేషన్ యాంటిసైకాటిక్ డ్రగ్(మందు) అనునది సూచించబడుతుంది.  ఆలోచన ఏమనగా పరిస్థితి కొరకు కోరదగిన రూపము మరియు డోసేజ్ లను సూచించుట.  రోగి యొక్క సున్నితత్వాన్ని మరియు అటువంటి మందుల యొక్క  దుష్ప్రభవాలను మనస్సులో ఉంచుకొని, ఒక సంప్రదాయ విధానమును తీసుకోవాలి.  మొదటి సారి ఎపిసోడ్స్ కొరకు, మునుపటి స్థితికి చేరుకునే సందర్భాలు మరియు నిర్వహణ చికిత్సలో ఉన్న వారి కొరకు సూచించిన మందులు విభిన్నముగా ఉంటాయి.  ఏ విధమైన మందులకు ప్రతిస్పందించని వారి కొరకు ఇక్కడ చికిత్సకు సంబంధించిన సవరణ మార్పులు ఉంటాయి.  నోటి ద్వారా మందులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తులకు సంబంధించిన సందర్భాలలో, సూది ద్వారా మందులు ఇస్తారు.  కొన్ని సంధర్భాలలో, ఆసుపత్రిలో చేరడం కూడా అవసరమై ఉంటుంది.  ధూమపానము వంటి సమస్యలకు సంబంధించి ఏకకాల వైద్య చికిత్స కూడా ప్రారంభించవచ్చు.
  • ఇతర చికిత్సలు
    పరిమిత లేక మందులకు స్పందించని సందర్భాలలో, ఎలక్ట్రో         కన్వల్సివ్ చికిత్స అనునది సూచించబడుతుంది.  భ్రమలు వంటివి అనుభవించే వ్యక్తుల కొరకు, మెదడు యొక్క కొన్ని భాగాలలో అయస్కాంత ప్రేరణ అనునది సహాయపడుతుంది.
  • మానసిక జోక్యం
    దీనిని సాధారణముగా మందులతో పాటు తీసుకెళ్తారు మరియు ఇది గొప్ప విలువను కలిగి ఉంటుంది.  అనేక కారకాలు వీటిపైన పనిచేస్తాయి, మరియు ఈ చికిత్స వెనుక ఉన్న ఆలోచన ఏమనగా ఆ వ్యక్తి సమాజములో కలుపుకొని వెళ్లే జీవితమును జీవించడం.
  • కాగ్నిటివ్ ప్రవర్తనా చికిత్స
    మనస్తత్వమును అర్థం చేసుకోవడములో సహాయం చేయడానికి కనీసం ఆరు నెలలు దీనిని రికమెండ్ చేస్తారు మరియు వ్యూహాలు మరియు ఇతర ముదురు విధానాలను ఉపయోగించడం ద్వారా లక్షణాల చుట్టూ మనము పనిచేయాలి.
  • మద్యం మరియు పదార్థ దుర్వినియోగ జోక్యం
    ఈ రెండు సమస్యల పరిష్కారము జరిగేలా మనము చూడాలి, మరియు ఒక వ్యక్తి ఈ వ్యసనాల నుండి వెనుకకు వెళ్ళలేకపోతే, ఇవి వెనుకకు వెళ్లేలా ట్రిగ్గర్ చేస్తాయి.  ఇది ఒత్తిడి నుండి విజయవంతముగా బయటకు రావడానికి సహాయం చేస్తుంది,  ప్రేరణను మెరుగుపరుస్తుంది మరియు ప్రవర్తనను బలపరుస్తుంది.
  • టోకెన్ ఎకానమీ జోక్యం
    ఇక్కడ చికిత్స యొక్క వివిధ రూపాలు అనునవి వ్యక్తిత్వము యొక్క అవాంచనీయ అంశాలను పరిమితం చేస్తాయి, అనుకూల ప్రవర్తనను ప్రదర్శించిన వారి కొరకు మరియు సామాజిక నైపుణ్యాలు నేర్చుకొనే వారి కొరకు ఈ రూపము బహుమానమును ఏర్పరుస్తుంది.
  • నైపుణ్య శిక్షణ
    ఇది ఒక ప్రోగ్రాం, ఇది మనోవైకల్యము గల వ్యక్తులు, సమాజములో భాగముగా పనిచేయడానికి మరియు పంక్షనింగ్ చేయడము కొరకు కావలసిన నైపుణ్యాలను అబివృధ్ధి పరచుకోవడానికి ఈ శిక్షణ సహాయం చేస్తుంది.  వారు స్వతంత్రముగా జీవించడానికి మరియు సామాజికముగా పరస్పరం కలిసి పనిచేయడానికి ఇది వారిని ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగత శిక్షణ మరియు గృహ ఆధారిత వ్యాయామాల కలయిక ద్వారా ఇది నెరవేర్చబడుతుంది.
  • మధ్ధతు ఉపాధి
    ఈ పరిస్థితి కలిగిన వ్యక్తులు మరింత స్వయం-ప్రతిపత్తి కలిగిన వారుగా తయారుకావడానికి ప్రయత్నించే విషయములో,  వాటి ప్రాధాన్యతలను మరియు వృత్తి నైపుణ్య సెట్లను అర్థంచేసుకోవడానికి దీని జోక్యం సహాయపడుతుంది.  వీటి ఆధారముగా, ఉద్యోగం పొందుకునే విషయములో వారికి మధ్ధతును సమకూర్చాలి.
  • కుటుంబ సర్వీసులు
    మనోవైకల్యము గల వారిని హ్యాండ్లింగ్ చేయునప్పుడు,  ఈ చికిత్సలో కుటుంబము పాల్గొనడము అనునది చాలా క్లిష్టమైనది. విస్తృతమైన చికిత్స అనగా ఇందులో కుటుంబము ఉంటుంది మరియు మనోవైకల్యము కలిగిన వ్యక్తుల మధ్య పూర్వ స్థితిని తీసుకొని వచ్చే సందర్భమును తగ్గించడములో ఉన్న కుటుంబము యొక్క జోక్యము వారి ప్రవర్తనను మెరుగుపరుస్తుంది.

జీవనశైలి నిర్వహణ

చికిత్సతో పాటు, మానసిక వైకల్యమునకు జీవితకాల జోక్యము అనునది అవసరమవుతుంది, ఇది వ్యక్తి  సర్దుబాటు, సహనము మరియు ఫలవంతమైన జీవితము జీవించడము కొరకైన  నిర్వహణను నిర్ధారిస్తుంది.  మనోవైకల్యముతో బాధపడుతున్న వ్యక్తిని నిర్వహించడము మరియు తోడ్పాటునందించడములో కుటుంబము మరియు స్నేహితుల యొక్క పాత్ర అసమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.   మనోవైకల్యము కలిగిన వ్యక్తుల యొక్క నిర్వహణ సమయములో మనము క్రింద ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

  • పూర్వపు స్థితిని తొలగించడం
    మనోవైకల్య స్థితి యొక్క పూర్వపు స్థితిని నివారించడానికి ఇది చాలా సహాయపడుతుంది.  ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన కారకాలుగా, క్రమముగా మరియు సకాలములో మందుల యొక్క భరోసా, మరలా తిరిగి కనిపించే ఏవైనా లక్షణాల కొరకు పరిశీలించుట, మరియు మధ్ధతు వ్యవస్థను కలిగించే స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల గుంపును ఎక్కువగా కలిగియుండుట.
  • కౌన్సిలింగ్ మరియు సామాజిక జోక్యం
    ఇది కూడా మానసిక బలమును నిర్మించడానికి సహాయపడుతుంది మరియు ఎదుర్కొంటున్న సర్దుబాటు సమస్యలను అడ్రెసింగ్ చేయడం లేక గుర్తించడం.  చికిత్స పూర్తయిన తరువాత కూడా ఈ ప్రోగ్రాములలో ఇది విలువలేనిదిగా నిరూపించబడుతుంది.  పూర్వపు స్థితి యొక్క సంఘటనలు కూడా గణనీయముగా తగ్గుతాయి.
  • ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం
    ఇది ఫిట్ నెస్ స్థాయిలు పెరగడానికి సహాయపడుతుంది, మంచి ఆరోగ్య నిర్వహణ, మరియు బరువు పెరగడం వంటి సమస్యలకు సంబంధించి కొన్నింటిని అడ్రెస్ చేయడం, ఇది తరచుగా తనకు తానుగా ఆంటిసైకోటిక్ మందుల యొక్క దుష్పలితముగా విశదపరచుకుంటుంది. 
  • ధూమపానము మరియు మద్యపానము నుండి దూరముగా ఉండడం
    మనోవైకల్యముతో బాధపడేవారు మందులు, ధూమపానం మరియు అధికముగా మద్యం త్రాగడం అను వాటిని ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మరియు ఒక ఆరోగ్యకరమైన వాతావరణమును నిర్వహించడము త్వరగా కోలుకోవడములో సహాయపడుతుంది, మనోవైకల్యము గలవారు పూర్వపు స్థితులను తొలగించి మరియు శుభ్రముగా ఉండాలనే భరోసా ఇస్తుంది.


వనరులు

  1. Palmer BA, Pankratz VS, Bostwick JM. The lifetime risk of suicide in schizophrenia: a reexamination. Arch Gen Psychiatry. 2005 Mar;62(3):247-53.PMID: 15753237.
  2. Simon GE, Stewart C, Yarborough BJ, Lynch F, Coleman KJ, Beck A, Operskalski BH, Penfold RB, Hunkeler EM. Mortality Rates After the First Diagnosis of Psychotic Disorder in Adolescents and Young Adults.. JAMA Psychiatry. 2018 Mar 1;75(3):254-260. doi: 10.1001/jamapsychiatry.2017.4437. PMID: 29387876
  3. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Schizophrenia. National Institutes of Health; Bethesda, Maryland, United States
  4. Robert E. Hales, Stuart C. Yudofsky, M.D., Laura Weiss Roberts [Internet]. The American Psychiatric Association; The American Psychiatric Publishing Textbook Of Psychiatry, Sixth Edition.
  5. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Schizophrenia treatment recommendations updated. Published: June, 2010. Harvard University, Cambridge, Massachusetts.
  6. van Os J1, Kapur S. Schizophrenia. Lancet. 2009 Aug 22;374(9690):635-45. doi: 10.1016/S0140-6736(09)60995-8. PMID: 19700006
  7. Sarah D. Holder, Amelia Wayhs. Schizophrenia. Am Fam Physician. 2014 Dec 1;90(11):775-782 [Internet] American Academy of Family Physicians; Schizophrenia.
  8. National Health Service [Internet]. UK; Schizophrenia.

మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా) వైద్యులు

Dr. Kirti Anurag Dr. Kirti Anurag Psychiatry
8 Years of Experience
Dr. Anubhav Bhushan Dua Dr. Anubhav Bhushan Dua Psychiatry
13 Years of Experience
Dr. Alloukik Agrawal Dr. Alloukik Agrawal Psychiatry
5 Years of Experience
Dr. Sumit Shakya Dr. Sumit Shakya Psychiatry
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా) కొరకు మందులు

Medicines listed below are available for మనోవైకల్యం (స్చిజోఫ్రీనియా). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.