myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

స్లీప్ అప్నియా అంటే ఏమిటి?

స్లీప్ అప్నియా అనేది ఒక నిద్ర రుగ్మత, దీనిలో వ్యక్తి నిద్రిస్తున్నపుడు అతని శ్వాస పదే పదే ఆగిపోయి, మళ్ళి మొదలవుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (Obstructive sleep apnea) అనేది ఒక సాధారణ పరిస్థితి దీనిలో  వ్యక్తి యొక్క ముక్కు నుండి శ్వాస నాళిక (windpipe) వరకు ఉండే ఎగువ శ్వాస మార్గంలో అడ్డంకులు ఏర్పడడం వలన గురక మొదలవుతుంది. సెంట్రల్ స్లీప్ అప్నియా (Central sleep apnea) లో శ్వాస సంకేతాలను (breathing signals) మెదడు శ్వాస కండరాలకు (breathing muscles) ప్రసారం చెయ్యలేదు (పంపించలేదు) . రాత్రి సమయంలో గురక పెట్టె వారి అందరికి స్లీప్ అప్నియా ఉందని, అలాగే గురక పెట్టని వారికీ స్లీప్ అప్నియా ఉండదని అనుకోరాదు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నిద్రించే సమయంలో లక్షణాలు సంభవిస్తాయి అందువలన, వ్యక్తులు వారి సమస్యను గుర్తించటం కష్టం అవుతుంది.

కొన్ని లక్షణాలు  ఈ కింద ఉన్నాయి:

 • రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కారణంగా పగటి సమయంలో నిద్రించడం
 • నిద్రలో ఎగఊపిరి (Gasping) మరియు పొలమారడం/పొరబారడం (choking)
 • నోరు ఎండిపోవడం మరియు ఉదయం పూట తలనొప్పి
 • బిగ్గరగా గురక పెట్టడం
 • ఎక్కువగా చిరాకు రావడం మరియు కోపంగా ఉండడం
 • రోజంతా మగతగా ఉండడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

స్లీప్ అప్నియా ఈ కింద ఇవ్వబడినటువంటి కొన్ని అంతర్లీన వైద్య సమస్యల వలన కలుగుతుంది:

 • ముఖ్యంగా మెడ మరియు ఛాతీ ప్రాంతం చుట్టూ కొవ్వు  అధికంగా ఉండే ఊబకాయం
 • పెద్ద టాన్సిల్స్
 • న్యూరోమస్క్యులార్ రుగ్మతలు
 • కిడ్నీ వైఫల్యం లేదా గుండె వైఫల్యం
 • జన్యు రుగ్మతలు
 • నెల తక్కువగా బిడ్డ (పుట్టడం)

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు వ్యక్తితో పాటు పడుకునే వారిని వ్యక్తి యొక్క నిద్ర విధానం గురించి అడిగి తెలుసుకుంటారు మరియు ఒక వివరణాత్మక భౌతిక పరీక్ష నిర్వహిస్తారు. నిద్రా కేంద్రం (sleep centre) లో శ్వాస మరియు ఇతర శరీర భాగాల పనితీరును ఒక రాత్రి అంతా పర్యవేక్షణ చెయ్యడం అనేది స్లీప్ అప్నియా యొక్క ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సహాయపడవచ్చు. నిద్రిస్తున్నప్పుడు వ్యక్తి యొక్క శ్వాస విధానాలు, రక్త ఆక్సిజన్ స్థాయిలు మరియు గుండె, ఊపిరితిత్తుల మరియు మెదడు పనితీరు తెలుసుకునేందుకు నోక్టుర్నల్ పాలీసోమ్నోగ్రఫీ పరీక్ష (Nocturnal polysomnography test, నిద్ర అధ్యయనాలు) నిర్వహిస్తారు. వైద్యులు ఇంటి నిద్ర పరీక్షలను (Home sleep tests) సూచించవచ్చు.

తేలికపాటి సందర్భాల్లో, శరీర బరువును తగ్గించుకోవడం లేదా ధూమపానం మానివేయడం వంటి జీవనశైలి మార్పులు సిఫార్సు చేయబడతాయి. తీవ్రమైన సందర్భాల్లో, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP, నిరంతర సానుకూల వాయుమార్గ ఒత్తిడి) నిర్వహించడానికి ఒక మాస్క్ ఇవ్వబడుతుంది. నాలుకను పట్టి ఉంచే ఓరల్ ఉపకరణాలు (Oral appliances ) ఉపయోగించబడతాయి. గొంతు లేదా దవడ వెనుక భాగంలో వాయుమార్గాన్ని అడ్డుకునే కణజాలన్ని తొలగించే శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.

 1. స్లీప్ అప్నియా కొరకు మందులు
 2. స్లీప్ అప్నియా వైద్యులు
Dr. Sushma Sharma

Dr. Sushma Sharma

न्यूरोलॉजी

Dr. Swati Narang

Dr. Swati Narang

न्यूरोलॉजी

Dr. Megha Tandon

Dr. Megha Tandon

न्यूरोलॉजी

స్లీప్ అప్నియా కొరకు మందులు

స్లీప్ అప్నియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
ArmodArmod 150 Mg Tablet218.1
WaklertWaklert 100 Mg Tablet143.75
ModafilModafil 100 Mg Tablet Md87.0
ModalertModalert 100 Mg Tablet122.0
ModatecModatec 100 Mg Tablet60.0
ProvakeProvake 100 Mg Tablet83.4
WellmodWellmod 100 Mg Tablet68.57

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...