గొంతు నొప్పి - Sore Throat in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 14, 2018

September 11, 2020

గొంతు నొప్పి
గొంతు నొప్పి

సారాంశం

గొంతు మంట అనేది, పిల్లలలో అదే విధంగా పెద్దలలో కనిపించే ఒక లక్షణము. ఇది, ఔట్ పేషెంట్ విభాగాలలో డాక్టర్లు చికిత్స చేసే అత్యంత సర్వ సాధారణమైన స్థితులలో ఒకటి. బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పాటుగా గొంతుమంటను కలిగించగలవి దాదాపు 200 కు పైగా సూక్ష్మజీవులు ఉన్నాయి. అతిగా జనం నివసించే ప్రదేశాలు మరియు పేదరిక జీవన పరిస్థితులు ఉన్న ప్రదేశాలు వంటి వ్యాధి సంక్రమణ లేదా పునఃసంక్రమణ ప్రమాదము అధికంగా ఉండే చోట్లలో నివసిస్తున్న పిల్లలలో తీవ్రమైన గొంతుమంట అనేది సర్వసాధారణం. గొంతుమంటకు అత్యంత సామాన్య కారణాలలో ఫ్లూ జ్వరం లేదా ఒక సాధారణ జలుబు ఒకటి. వైరల్ మరియు బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి గాలి ద్వారా, అత్యంత సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుండి ముక్కు ద్వారా లేదా లాలాజల స్రావముల ద్వారా వ్యాపిస్తాయి. జనసమ్మర్దం ఉన్న చోట్లు, అపరిశుభ్రత, ఆహారాన్ని అనారోగ్యకరంగా చేపట్టుట, రసాయనాలు, పొగ మరియు దురద కలిగించేవాటికి గురి అగుట వంటివి గొంతుమంటను ప్రేరేపించవచ్చు. మ్రింగడానికి కష్టంగా ఉండటంతో పాటుగా, జ్వరము, చారికలు లేదా తలనొప్పి వంటి ఇతర లక్షణాలను అది తోడుగా కలిగియుండవచ్చు.

అది అనేక రకాల జబ్బుల కారణంగా ఏర్పడగలదు కాబట్టి, గొంతుమంటకు ఖచ్చితమైన కారణాన్ని మదింపు చేయడానికి ఒక వివరమైన వైద్య చరిత్ర అవసరమవుతుంది. గొంతుమంట యొక్క అత్యధిక కేసులు ఎటువంటి మందులు లేకుండానే నయమవుతాయి, అయితే అనేకమంది వ్యక్తులకు ఒక యాంటీబయాటిక్ కోర్సు అవసరమవుతుంది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల కలిగే గొంతుమంటకు తదుపరి సమస్యలు నివారించడానికి గాను తగిన విధంగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గొంతుమంట యొక్క ఇతర కారణాలకు మరింత క్లిష్టమైన మరియు వ్యాధి-నిర్దిష్ట చికిత్స అవసరం కావచ్చు. రోగి తక్షణ లేదా ఆలస్యమైన యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నదానితో నిమిత్తం లేకుండా 1% కేసులలో గొంతుమంట యొక్క సంక్లిష్ట సమస్యలను చూడవచ్చు.

గొంతు నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Sore Throat in Telugu

ఒక గొంతుమంట యొక్క కారణంపై ఆధారపడి, చిహ్నాలు మరియు లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. వాటిలో ఇవి ఉంటాయి:

 • గొంతు నొప్పి
 • గొంతు దురద.
 • మ్రింగడం కష్టమగుట ఆహారం మరియు / లేదా నీళ్ళు
 • మెడ యొక్క గ్రంధులలో మంట
 • బొంగురు గొంతు

ఒక గొంతుమంట యొక్క పైన కనబరచిన సామాన్య లక్షణాలతో పాటుగా, అది ఈ క్రిందివాటిని కూడా కలిగియుండవచ్చు:

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

గొంతు నొప్పి యొక్క చికిత్స - Treatment of Sore Throat in Telugu

 • నొప్పి నివారిణులు మరియు యాంటీ పైరెటిక్స్
  వైరస్ వల్ల కలిగిన గొంతుమంట ఎటువంటి మందు లేకుండా 5 నుండి 7 రోజుల్లోపల నయమవుతుంది. కొన్ని కేసులలో, నొప్పి మరియు జ్వరము వంటి తీవ్రమైన లక్షణాలను స్వల్ప యాంటీపైరెటిక్స్ (జ్వరానికి వాడే మందులు) మరియు నొప్పి ఉపశమన మందులతో తగ్గించుకోవచ్చు. పిల్లలలో, చిన్నారి యొక్క వయస్సు, బరువు మరియు ఎత్తుపై ఆధారపడి, డాక్టరును సంప్రదించిన మీదట వారు సూచించిన సరియైన మోతాదును బట్టి దుకాణములో కొనుగోలు చేయు మందులను వారికి ఇవ్వవచ్చు. ఒక డాక్టరు యొక్క సూచన లేనిదే ఆస్పిరిన్ వంటి మందులను గొంతుమంట లేదా ఫ్లూ వంటి లక్షణాలతో ఉన్న యుక్తవయసు యువతకు ఇవ్వకూడదు, ఎందుకంటే అది తీవ్రమైన చిక్కులకు దారితీయవచ్చు.
 • యాంటీబయాటిక్స్
  ఒకవేళ ఒక బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా గొంతుమంట కలుగుతూ ఉన్నట్లయితే, ఒక యాంటీబయాటిక్స్ కోర్సు మీ డాక్టరుచే సూచించబడుతుంది. అన్ని లక్షణాలూ తొలగిపోయినప్పటికీ సైతమూ, మందుల యొక్క మొత్తం కోర్సును పూర్తి చేయాల్సిందిగా సలహా ఇవ్వబడుతోంది. నిర్దేశించిన ప్రకారము మందులను గనక తీసుకోనట్లయితే, ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరగదోడవచ్చు లేదా ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చు. ఎక్కువ గొంతుమంటకు గనక పూర్తి యాంటీబయాటిక్ కోర్సు తీసుకోని పక్షములో, ప్రత్యేకించి పిల్లలలో, మూత్రపిండాల వ్యాధి లేదా ర్యుమాటిక్ జ్వరము వృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి.
 • ఇతర మందులు
  ఒకవేళ లోలోపల ఉన్న ఒక వైద్య స్థితి కారణంగా గొంతుమంట కలుగుతూ ఉన్నట్లయితే, చికిత్స వేరుగా ఉంటుంది మరియు అది వ్యాధిని బట్టి ఉంటుంది.

జీవనశైలి యాజమాన్యము

 • ఒక గొంతుమంట నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి మందులతో పాటుగా, ఈ క్రింది గృహ రక్షణ చిట్కాలు సహాయకారిగా ఉండగలవు:
 • యాంపిల్ టెస్ట్ చేయించుకోండి, అదే విధంగా మీ గొంతుకు కొంత విశ్రాంతినివ్వండి.
 • గొంతును తడిగా ఉంచుకోవడానికి పుష్కలంగా ద్రవాలు త్రాగండి. కాఫీ మరియు మద్యము గొంతులో తేమను తగ్గిస్తాయి కాబట్టి వాటిని తీసుకోవడం మానేయండి.
 • గొంతుకు ఉపశమనం కలిగించడానికై, సూపు, బ్రోత్, మరియు తేనెతో వెచ్చని నీళ్ళు వంటి గోరువెచ్చని పానీయాలు త్రాగండి.
 • రోజుకు 3 నుండి 4 సార్లు గోరువెచ్చని నీటితో పుక్కిలించడం కూడా సహాయకారిగా ఉండగలదు.
 • లక్షణాలకు ఉపశమనం కలగడానికి గొంతు బిళ్ళకు చప్పరించండి, ఐతే వాటిని పిల్లలకు ఇవ్వడం వల్ల ఊపిరికి అడ్డం పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండండి.
 • సిగరెట్ పొగ, అగరు వత్తులు మరియు గాఢమైన వాసననిచ్చే పదార్థాలు గొంతుకు బాధ కలిగించగలవు కాబట్టి, వాటిని నివారించండి.
 • మూలికా మందులు, టీలు, లికోరైస్, మార్ష్ మెల్లో దుంప మరియు చైనీయ మూలికలు వంటి వాటితో ప్రత్యామ్నాయ చికిత్సలు కూడా సహాయకారిగా ఉండగలవు. ఒక ప్రత్యామ్నాయ చికిత్సను మొదలుపెట్టే ముందుగా ఒక డాక్టరును సంప్రదించండి.

గొంతు నొప్పి అంటే ఏమిటి? - What is Sore Throat in Telugu

గొంతుమంట అనేది అన్ని వయస్సుల వ్యక్తుల్లోనూ సర్వసాధారణంగా కనిపించే లక్షణము. ఇది, మనిషి గొంతు ఎర్రగా మారి, ఆహారాన్ని మ్రింగడానికి కష్టం అయ్యేలా చేస్తూ మంట కలిగించే ఒక స్థితి. ఒక గొంతుమంట యొక్క తీవ్రమైన సంఘటనలు బ్యాక్టీరియా మరియు ఇతర సాంక్రామిక వాహకాల వల్ల కూడా కలిగినప్పటికీ, అవి సాధారణంగా వైరస్ ల వల్ల ఏర్పడతాయి. గొంతుమంటను కలిగించే ముఖ్యమైన బ్యాక్టీరియాలో ఒకటి గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకస్ (GAS), దీనిని పిల్లలలో 15% నుండి 20% కేసులలో చూడవచ్చు. ఇండియాలో సైతమూ, జి.ఎ.ఎస్ (GAS) యొక్క కేసులు 11% నుండి 34% మధ్య ఉన్నాయి.వనరులు

 1. Nandi S, Kumar R, Ray P, Vohra H, Ganguly NK. Group A streptococcal sore throat in a periurban population of northern India: a one-year prospective study.. Departments of Experimental Medicine and Biotechnology, Postgraduate Institute of Medical Education and Research (PGIMER), Chandigarh, India. Bull World Health Organ. 2001;79(6):528-33. PMID: 11436474
 2. Am Fam Physician. 2004 Mar 15;69(6):1465-1470. [Internet] American Academy of Family Physicians; Pharyngitis.
 3. ENT Health [Internet]. American Academy of Otolaryngology–Head and Neck Surgery Foundation; Sore Throats.
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Strep Throat
 5. The Merck Manual of Diagnosis and Therapy [internet]. US; Sore Throat
 6. Huang Y, Wu T, Zeng L, Li S. Chinese medicinal herbs for sore throat. Cochrane Database Syst Rev. 2012 Mar 14;(3):CD004877. PMID: 22419300.

గొంతు నొప్పి కొరకు మందులు

Medicines listed below are available for గొంతు నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for గొంతు నొప్పి

Number of tests are available for గొంతు నొప్పి. We have listed commonly prescribed tests below: