myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

గొంతులో దురద అంటే ఏమిటి?

గొంతులో దురద అనేది ఓ అసహనీయత (అలెర్జీ) లక్షణం లేదా గొంతు సంక్రమణకు సంబంధించిన చాలా సాధారణమైన లక్షణం. ఇది రోగికి నొప్పి మరియు అసౌకర్యం కలిగిస్తుంది కానీ దీన్ని ఔషధాలు మరియు గృహ సంరక్షణతోనే సులభంగా  నిర్వహించుకోవచ్చు.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా సార్లు, గొంతులో దురద రుగ్మత, అంతర్లీన కారణాలమీద ఆధారపడి ఇతర లక్షణాలతో కలిసి వస్తూ ఉంటుంది.

 • వ్యక్తికి జలుబు మరియు తుమ్ములతో కూడిన నిరంతర దగ్గు ఉండవచ్చు.
 • మీ నాశికా రంధ్రాలు మూసుకుపోతే ముఖం మరియు తల భారమైపోయినట్లు అనుభూతి చెందుతారు.
 • కళ్ళు మరియు కాళ్ళు-చేతుల చర్మం కూడా దురదను కల్గి ఉండవచ్చు.
 • గొంతులో దురద రుగ్మతతో ఉన్న వ్యక్తి జ్వరాన్ని కూడా పొందవచ్చు, ఎందుకంటే ఓ  అంతర్లీన సంక్రమణ ఉండే అవకాశం ఉన్నందున వ్యక్తి జ్వరం రావచ్చు.
 • గొంతులో దురద రుగ్మత ఓ అలెర్జీ కారణంగా సంభవిస్తే, వ్యక్తికి కడుపు నొప్పి, వికారం, మరియు మైకము ఉండవచ్చు .
 • గొంతులో దురద రుగ్మత కల్గినవారికి చర్మంపై దద్దుర్లు కూడా రావచ్చు .

ప్రధాన కారణాలు ఏమిటి?

 • ముక్కులో మంట (అలర్జీ రినిటిస్) అనేది గొంతులో దురద రుగ్మతకు అత్యంత సాధారణ కారణం. ముక్కులో మంట నే “హే ఫీవర్” అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో అతిక్రియాశీల రోగనిరోధక వ్యవస్థ కారణంగా వస్తూ ఉంటుంది.
 • గొంతులో దురదను, ముక్కు నుండి నీళ్లుకారే పడిశాన్ని కలిగించే మరొక రకమైన అలెర్జీ ఏదంటే ప్రత్యేకమైన ఆహారాలు, దుమ్ము లేదా సువాసనలు (అలెర్జీగా) పడకపోవడం కావచ్చు. కాలుష్యం కూడా ఎలర్జీ కల్గించటంలో ఓ పెద్ద వాటాదారు.
 • సూక్ష్మ-జీవుల వలన సంక్రమణం తరచుగా గొంతులో దురద సంవేదనాన్ని  కలిగిస్తుంది. స్ట్రెప్టోకోకస్ బాక్టీరియా సాధారణంగా గొంతు సంక్రమణకు కారణమవుతుంది.
 • తీవ్రమైన డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) మరియు ఆమ్లత్వం కూడా గొంతులో దురదను కలిగించవచ్చు.
 • ధూమపానం మరియు మద్యంపానం గొంతులో దురదను కల్గించవచ్చు లేదా రుగ్మతను తీవ్రతరం చేయవచ్చు.

గొంతులో దురద రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గొంతులో దురద చికిత్స కోసం మీరు మీ డాక్టర్ను సందర్శిస్తే, అతడు/ఆమె మొదట భౌతిక పరీక్ష నిర్వహించి మీ వ్యాధి లక్షణాల యొక్క కారణాన్ని కనుగొనడానికి కొన్ని పరీక్షలను నిర్వహిస్తారు.

 • గొంతు యొక్క పరీక్ష గొంతు కణజాలం ఎరుపుదేలడాన్ని మరియు వాపును బహిర్గతం చేసే అవకాశం ఉంది.
 • అంటువ్యాధులు మరియు అసహనీయతల (అలెర్జీల) కోసం రక్త పరీక్షలు అవసరమవుతాయి.
 • అంతర్లీన శ్వాసకోశ రుగ్మత లేదా గ్యాస్ట్రిక్ సమస్య ఉండొచ్చన్న అనుమానం ఉంటే, X- రే మరియు CT స్కాన్లు సూచించబడతాయి.
 • గొంతులో దురద రుగ్మత అసహనీయత (అలెర్జీ) లేదా ముక్కులో మంట (అలెర్జీ రినైటిస్) కారణంగా సంభవించి ఉంటే, హైపర్సెన్సిటివ్ స్పందన నుండి ఉపశమనం పొందటానికి యాంటీ-హిస్టామైన్స్ సూచించబడతాయి.
 • సూక్ష్మజీవులవల్ల వచ్చే గొంతులో దురద సంక్రమణకు యాంటీ-బయోటిక్స్ మందులు సహాయపడతాయి.
 • పులితేన్పులు (యాసిడ్ రిఫ్లక్స్) గొంతులో దురదకు కారణమైనట్లైతే, ఆమ్లవిరోధి మందులు మరియు ఆహార నియంత్రణ పాటించడంవల్ల రుగ్మత నిర్వహణకు మద్దతిస్తుంది.
 • గొంతులో గడ్డలుగా వచ్చే టాన్సిల్స్ సంక్రమణ వలన పునరావృతమయ్యే గొంతు దురద ఉంటే, ‘టాన్సిలెక్టోమీ’ శస్త్రచికిత్స అవసరమవుతుంది.
 1. గొంతు దురద కొరకు మందులు
 2. గొంతు దురద వైద్యులు
Dr. Chintan Nishar

Dr. Chintan Nishar

ENT
10 वर्षों का अनुभव

Dr. K. K. Handa

Dr. K. K. Handa

ENT
21 वर्षों का अनुभव

Dr. Aru Chhabra Handa

Dr. Aru Chhabra Handa

ENT
24 वर्षों का अनुभव

Dr. Jitendra Patel

Dr. Jitendra Patel

ENT
22 वर्षों का अनुभव

గొంతు దురద కొరకు మందులు

గొంతు దురద के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Cetil खरीदें
Pulmocef खरीदें
Altacef खरीदें
Ceftum Tablet खरीदें
Stafcure LZ खरीदें
Zocef खरीदें
Cat XP खरीदें
Cefactin खरीदें
Cefadur CA खरीदें
Altaxime खरीदें
Cef खरीदें
Cefasom खरीदें
Cefasyn खरीदें
SBL Asclepias tuberosa Dilution खरीदें
SBL Asparagus officinalis Dilution खरीदें
Cefenta खरीदें
Cefnext खरीदें
Ceforim खरीदें
Cefotil खरीदें
Cefoxim La खरीदें
Schwabe Anthemis nobilis CH खरीदें
Cefrotux खरीदें
Cefsafe खरीदें

References

 1. Kakli HA, Riley TD. Allergic Rhinitis.. Prim Care. 2016 Sep;43(3):465-75. doi: 10.1016/j.pop.2016.04.009. PMID: 27545735
 2. American Thoracic Society. [Internet]. New York, United States; Air Pollution from Traffic and the Development of Respiratory Infections and Asthmatic and Allergic Symptoms in Children.
 3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Sore Throat.
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Strep Throat: All You Need to Know.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Stuffy or runny nose - adult.
और पढ़ें ...
ऐप पर पढ़ें