myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

థ్రష్ అంటే ఏమిటి?

థ్రష్ ను కాండీడియాసిస్ లేదా కాండిడా ఇన్ఫెక్షన్/సంక్రమణ అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో వివిధ భాగాలను ప్రభావితం చేసే ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్. కాండిడా ఆల్బికెన్స్ (Candida albicans) అనే ఫంగస్ థ్రష్ను కలిగిస్తుంది, మరియు సాధారణంగా ఈ ఫంగస్ జీర్ణవ్యవస్థ మరియు చర్మం లో నివసిస్తుంది మరియు ఇది శరీరంలో సిమ్బయోసీస్ (పరస్పర సహకారంతో జీవించడం) గా జీవిస్తున్న కారణంగా ఎటువంటి లక్షణాలు కలిగించదు.కానీ  కొన్నిసార్లు రోగనిరోధకత శక్తి తక్కువగా ఉన్న పరిస్థితి కారణంగా, ఇది బాగా వృద్ధి చెంది మరియు నోటిలో, అన్నవాహిక (food pipe), గొంతు, యోని, లేదా పురుషాంగం వంటి అవయవాలలో ఇన్ఫెక్షన్లు/సంక్రమణలను కలిగిస్తుంది. ప్రభావితమైన భాగాన్ని బట్టి, దీనిని వివిధ రకాలుగా పిలుస్తారు

 • ఓరల్ కాండీడియాసిస్ (నోటికి సోకేది)
 • వెజైనల్ కాండీడియాసిస్ (యోనికి సోకేది)
 • కాండీడియాసిస్ ఈసోఫేగయిటిస్ (అన్నవాహిక వాపు కలిగించేది)
 • ఓరోఫారీన్జియాల్ కాండీడియాసిస్ (గొంతు మరియు ఊపిరితిత్తులకు సోకేది)
 • పురుషాంగ ఈస్ట్ సంక్రమణ

ఇది చిన్న పిల్లలు మరియు పసిబిడ్డలతో సహా వివిధ వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఫంగస్ వలన ఏ శరీర భాగం ప్రభావితం అయినప్పటికీ, సాధారణ కనిపించే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

 • తెల్లని మచ్చలు
 • దురద
 • చికాకు
 • చెడ్డ వాసన
 • నొప్పి
 • కొద్దిగా ఎరుపుగా ఉండే బొబ్బలు
 • జ్వరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కాండిడా సాధారణంగా శరీరంలో ఉంటుంది కానీ  సంక్రమణ కలిగించేటంత అధిక సంఖ్యలో ఉండదు. ఈ  కింది కారకాలు ఈ ఫంగస్ యొక్క సంఖ్య పెరుగుదలకు కారణం అవుతాయి, అది  ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది:

 • కోర్టికోస్టెరాయిడ్స్, గర్భ నిరోధక మాత్రలు మరియు యాంటీబయాటిక్స్ వంటి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే మందులు
 • గర్భం
 • ధూమపానం
 • నోరు పొడిబారడం
 • సరిగ్గా సరిపోని కట్టుడు పళ్ళు
 • నియంత్రించలేని మధుమేహం
 • క్యాన్సర్ మరియు హెచ్ఐవి వంటి రోగనిరోధక శక్తిని బలహీనపర్చే సమస్యలు

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

నోటి కాండీడియాసిస్ వ్యాధి నిర్ధారణ శారీరక పరీక్ష మరియు ప్రభావిత ప్రాంతాల నుండి సేకరించిన నమూనాల మైక్రోస్కోపిక్ పరిశీలనను కలిగి ఉంటుంది. కాండీడియాసిస్ ఈసోఫేగయిటిస్ రోగ నిర్ధారణ కోసం సాధారణంగా ఎండోస్కోపీ పరీక్ష అవసరం అవుతుంది. జననేంద్రియ (genital) కాండీడియాసిస్ విషయంలో, శారీరక పరీక్షతో పాటుగా లక్షణాలు గురించి తెలుసుకోవడం అనేది పరిస్థితి యొక్క నిర్ధారణకు సహాయపడుతుంది.

నైస్టాటిన్ (Nystatin), మైకోనజోల్ (miconazole), మరియు క్లాట్రీమజోల్ (clotrimazole) అనే యాంటీ ఫంగల్ మందులు సాధారణంగా కాండీడియాసిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈసోఫేగయిటిస్ మరియు తీవ్రమైన కాండీడియాసిస్ విషయంలో ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) లేదా ఇంట్రావీనస్ (నరాలోకి ఎక్కించే) ఫ్లూకానజోల్ (fluconazole) సూచించబడుతుంది. ఫ్లూకానజోల్ సమర్థవంతంగా పనిచేయ్యకపోతే ఇతర రకాల యాంటీ ఫంగల్ మందులను ఈ పరిస్థితి చికిత్సకు ఉపయోగిస్తారు.

 1. థ్రష్ కొరకు మందులు

థ్రష్ కొరకు మందులు

థ్రష్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
SyscanSYSCAN 100MG CAPSULE 4S88
DermizoleDermizole 2% Cream0
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet55
Candid GoldCANDID GOLD 30GM CREAM59
Propyderm NfPROPYDERM NF CREAM 5GM60
PlitePlite Cream0
FungitopFungitop 2% Cream0
PropyzolePropyzole Cream0
Q CanQ Can 150 Mg Capsule9
MicogelMicogel Cream17
Imidil C VagImidil C Vag Suppository59
Propyzole EPropyzole E Cream0
ReocanReocan 150 Mg Tablet23
MiconelMiconel Gel0
Tinilact ClTinilact Cl Soft Gelatin Capsule135
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream34
Toprap CToprap C Cream28
Saf FSaf F 150 Mg Tablet24
Relin GuardRelin Guard 2% Cream10
VulvoclinVulvoclin 100 Mg/100 Mg Capsule56
Crota NCrota N Cream27
Clop MgClop Mg 0.05%/0.1%/2% Cream34
FubacFUBAC CREAM 10GM0
Canflo BCanflo B Cream27

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Health Service [Internet]. UK; Thrush in men and women.
 2. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Thrush.
 3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Candida infections of the mouth, throat, and esophagus.
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Yeast Infections.
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Vaginal thrush.
और पढ़ें ...