గర్భధారణ సమయంలో యోని స్రావాలు - Vaginal discharge during pregnancy in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

April 26, 2019

March 06, 2020

గర్భధారణ సమయంలో యోని స్రావాలు
గర్భధారణ సమయంలో యోని స్రావాలు

గర్భధారణ సమయంలో యోని స్రావాలు అంటే ఏమిటి?

గర్భధారణ సమయంలో, తెలుపు లేదా పాల రంగులో, పలుచని, తేలికపాటి వాసనతో ఉండే యోని నుండి స్రవించే స్రావాన్ని లీకోరియా (leucorrhoea) అని పిలుస్తారు. దాని పరిమాణం, తరచుదనం మరియు చిక్కదనము మారవచ్చు అయితే, ఇది ఒక సాధారణ పరిణామంగా పరిగణించబడుతుంది. యోని స్రావాలు పెరగడం అనేది గర్భధారణ యొక్క ప్రారంభ సంకేతాలలో  ఒకటి మరియు అది గర్భం గర్భధారణ సమయం అంతటా కొనసాగుతుంది. చిక్కని శ్లేష్మ (mucus) తీగల/చారల వంటి స్రావం గర్భధారణ ఆఖరి వారాలలో కనిపిస్తుంది, ఇది ప్రసవ సమయం దగ్గర పడడాన్ని సూచిస్తుంది.

కొన్నిసార్లు, యోని నుండి అసాధారణమైన స్రావాలు స్రవించవచ్చు, అవి వేరే రంగులో ఉంటాయి  మరియు ఇతర లక్షణాలతో పాటు చెడు వాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి వైద్యుడిచే చికిత్స చేయబడాలి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ యోని స్రావాల లక్షణాలు:

  • పలుచని లేదా చిక్కని శ్లేష్మం (mucus)
  • తెలుపు రంగు లేదా పాల రంగులో ఉంటుంది
  • తేలికపాటి వాసన
  • గర్భధారణ సమయం చివరలో చిన్నగా రక్తం మరకలు

ఇన్ఫెక్షన్ సోకిన లేదా అసాధారణ యోని స్రావాల లక్షణాలు:

  • పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో స్రావాలు
  • చెడ్డ మరియు బలమైన వాసన ఉండవచ్చు
  • ఎరుపుదనం మరియు/లేదా దురద
  • యోని యొక్క వాపు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సాధారణ యోని స్రావాల కారణాలు:

  • హార్మోన్ల స్థాయిలలో మరియు గర్భాశయంలో మార్పులు (యోనిమార్గము గుండా శిశువు వెళ్ళడానికి అనుకూలంగా చెయ్యడం కోసం)
  • అంటువ్యాధులను నిరోధించడానికి శరీర మార్పులు కలుగుతాయి
  • శిశివు యొక్క తల గర్భాశయం మీద ఒత్తిడి కలిగించడం వలన (గర్భధారణ సమయ ఆఖరిలో)

అసాధారణ యోని స్రావాలు వీటి వలన కలుగుతాయి:

  • అంటువ్యాధులు, సాధారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు
  • లైంగిక సంక్రమణ వ్యాధులు  
  • గర్భధారణ సంబంధిత సమస్యల, ప్లెసెంటా ప్రెవేయా (placenta praevia) లేదా ప్లాసెంటా అబ్రుప్షన్ (placental abruption) వంటివి
  • ఏదైనా బయటి వస్తువు లోపల ఉండిపోవడం (టాంపోన్, కండోమ్) లేదా వాపు (డిస్ఇన్ఫెక్టెంట్స్ [disinfectants], డియోడరెంట్లు లేదా లూబ్రికెంట్ల కారణంగా)
  • గర్భాశయ ఎక్టోపికి (ectopy) లేదా పాలిప్స్ (polyps)
  • ట్యూమర్స్

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు లైంగిక మరియు మందుల చరిత్రతో సహా పూర్తి ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకుంటారు, అలాగే స్పెకులమ్ (అద్దము) ఉపయోగించి, పొత్తి కడుపును తాకుతూ మరియు రెండు చేతులు ఉపయోగించి యోని మరియు గర్భాశయాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. మరిన్ని పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:

  • యోని స్రావాల యొక్క pH ను పరీక్షించడం
  • హై వజైనల్ స్వేబ్ (HVS, High vaginal swab)
  • క్లామిడియా, గోనేరియా మరియు ట్రైకోమోనియాసిస్ కోసం ట్రిపుల్ నాట్ [NAAT](న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్)
  • క్లమిడియా తనిఖీ కోసం పరీక్ష
  • లైంగిక సంక్రమణ వ్యాధుల తనిఖీ కోసం పరీక్ష

యోని స్రావాల నిర్వహణ నివారణ అలాగే చికిత్స చర్యలను కలిగి ఉంటుంది:

  • సౌకర్యవంతమైన, వదులుగా ఉండే కాటన్ లోదుస్తులను ధరించడం మరియు జననేంద్రియ ప్రాంతాన్ని పొడిగా ఉంచడం ద్వారా సంక్రమణను నివారించడానికి ప్రయత్నించాలి.
  • యోని ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఆహారంలో పెరుగు మరియు ఇతర ఫెర్మెంటేడ్ ఆహారాలను తీసుకోవాలి.
  • అంటురోగాల/ఇన్ఫెక్షన్ల చికిత్సకు, లేదా వజైనల్ క్రీములు లేదా అటువంటి ఇతర ఉత్పత్తులు సూచించబడతాయి, వాటిలో ఇవి ఉంటాయి:
    • ఫ్లూకోనజోల్ (Fluconazole)
    • క్లోట్రిమజోల్ (Clotrimazole)
    • మెట్రోనిడజోల్ (Metronidazole)
    • క్లిండామైసిన్ 2% క్రీమ్ (Clindamycin 2% cream)
    • ఇట్రాకోనజోల్ (Itraconazole)



వనరులు

  1. Office of Population Affairs. Vaginal Discharge. U.S. Department of Health & Human Services [Internet]
  2. Tânia Maria M. V. da Fonseca et al. Pathological Vaginal Discharge among Pregnant Women: Pattern of Occurrence and Association in a Population-Based Survey . Obstet Gynecol Int. 2013; 2013: 590416. PMID: 23843798
  3. Ross SM, Hoosen AA, Sheik AI. Diagnosis and treatment of vaginal discharge in pregnancy.. S Afr Med J. 1980 Nov 8;58(19):757-9. PMID: 7423322
  4. National Health Service [Internet]. UK; Vaginal discharge in pregnancy.
  5. Bishop GB. Vaginal Discharge. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 172.

గర్భధారణ సమయంలో యోని స్రావాలు కొరకు మందులు

Medicines listed below are available for గర్భధారణ సమయంలో యోని స్రావాలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.