myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

వెంట్రిక్యులర్ టాఖీకార్డియా అంటే ఏమిటి?

వెంట్రిక్యులర్ టాఖీకార్డియా (విటి) అనేది హృదయం యొక్క కింది గదులు [chambers] (వెంట్రికిల్స్) లో ఏర్పడే వేగవంతమైన గుండె లయ (నిమిషానికి 100 కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటుంది, దీనిలో వరుసగా 3 క్రమరహిత గుండె లయలు ఉండవచ్చు). చికిత్స చేయకుండా వదిలేస్తే, విటి చాలా తీవ్రతరం అవుతుంది, వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ (ventricular fibrillation) వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది మరియు మరణానికి కూడా దారితీయవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

విటి యొక్క లక్షణాలు హటాత్తుగా ప్రారంభమవచ్చు లేదా ఆగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఏటువంటి లక్షణాలు కనిపించవు. ఒక విటి ఎపిసోడ్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణాలు:

 • శ్వాస ఆడకపోవుట
 • ఛాతీలో అసౌకర్యం దానిని ఆంజినా అని కూడా పిలుస్తారు
 • గుండె దడ (దీనిలో అసాధారణ లేదా వేగవంతమైన గుండె స్పందనలు/లయలు సంభవిస్తాయి, వీటి వలన వ్యక్తికి చాలా అసౌకర్యంగా ఉంటుంది)
 • బలహీనమైన నాడి (pulse) లేదా అసలు నాడి లేకపోవచ్చు
 • అల్ప రక్తపోటు
 • తల తిరగడం
 • మైకము
 • మూర్ఛ

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

విటి కి దారితీసే వివిధ కారకాలు లేదా పరిస్థితులు ఈ కింది వాటిని కలిగి ఉంటాయి:

 • గుండెపోటు యొక్క ప్రారంభ లేదా తర్వాతి సంక్లిష్టత/లక్షణం
 • పుట్టుకతో వచ్చే గుండె లోపము

సంక్రమిత (Inherited) గుండె లయ సమస్యలు వీటిని కలిగి ఉంటాయి:

 • దీర్ఘ/అధిక క్యూటి (QT) సిండ్రోమ్
 • బ్రుగాడా సిండ్రోమ్ (Brugada syndrome)
 • హృదయ కండరముల వాపు (మాయోకార్డయిటిస్)
 • కార్డియోమయోపతి
 • హైపర్ ట్రోఫిక్
 • డైలేటెడ్ (Dilated)
 • గుండె వైఫల్యం
 • గుండె శస్త్రచికిత్స
 • వాల్వ్యులర్ గుండె వ్యాధి
 • వెంట్రికేల్స్ యొక్క కండరంలో గాయపు మచ్చగల కణజాలం (సాధారణంగా ఇది గుండెపోటు తర్వాత ఏర్పడుతుంది)

విటి యొక్క ఇతర గుండెకు సంబంధం లేని (non-cardiac) కారణాలు:

వీటిలో వివిధ రకాల మందుల వాడకం ఉంటుంది, అవి:

 • యాంటీ-అరిథిమిక్ మందులు (Anti-arrhythmic drugs, వీటిని అసాధారణ గుండె లయ చికిత్సకు ఉపయోగిస్తారు)
 • ప్రిస్క్రిప్షన్ లేని డకాంగిస్టెంట్స్ (Non-prescription decongestants)
 • మూలిక ఔషధాలు మరియు ఆహార మాత్రలు (Herbal remedies and diet pills)
 • కొకైన్ లేదా ఇతర ఉత్ప్రేరకాలు (other stimulants)

రక్త (బ్లడ్) కెమిస్ట్రీలో మార్పుల వలన,అవి:

 • పొటాషియం స్థాయి తక్కువగా ఉండడం
 • యాసిడ్-బేస్ బ్యాలెన్స్ (acid-base balance) లో మార్పులు
 • ఆక్సిజన్ లేకపోవడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు లక్షణాల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుంటారు, పూర్తిస్థాయి భౌతిక పరీక్షను నిర్వహిస్తారు, నాడి (పల్స్) మరియు రక్తపోటును తనిఖీ చేస్తారు. వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు:

 • బ్లడ్ కెమిస్ట్రీ, రక్త pH మరియు రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి రక్త పరీక్షలు నిర్వహిస్తారు
 • ఛాతీ ఎక్స్-రే
 • ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి, Electrocardiogram) లేదా హోల్టర్ మానిటర్ [Holter monitor](దీనిలో 24-48 గంటల పాటు గుండె స్పందనను పర్యవేక్షిస్తారు)
 • ఇంట్రాకార్డియక్ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ (ఇపియస్, Intracardiac electrophysiology study)
 • గుండె లయను (రిథం) రికార్డు చేయడానికి లూప్ రికార్డర్ (Loop recorder) లేదా వేరే పరికరం

విటి యొక్క నిర్వహణ గుండె రుగ్మత యొక్క రకాన్ని మరియు కనిపించే లక్షణాలను బట్టి ఉంటుంది మరియు సాధారణంగా వీటిని కలిగి ఉంటుంది:

ఒక విటి ఎపిసోడ్లో వెయిన్స్ ద్వారా లేదా నోటి ద్వారా ఇచ్చే మందులు అలాగే వీటిని దీర్ఘకాలిక చికిత్సలో భాగంగా కూడా ఇస్తారు:

 • లిడోకైన్ (Lidocaine)
 • ప్రోకైనమైడ్ (Procainamide)
 • సోటాలోల్ (Sotalol)
 • అమియోడారోన్ (Amiodarone)

ఒక విటి ఎపిసోడ్ సమయంలో ఉపయోగించే చికిత్సా చర్యలు:

 • కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR, Cardiopulmonary resuscitation)
 • కార్డియోవెర్షన్ (ఎలక్ట్రిక్ షాక్)
 • అబ్లేషన్: దీనిలో అసాధారణ గుండె స్పందనను కలిగించే గుండె కణజాలం తొలగించబడుతుంది.
 • ఇంప్లాంట్ చేయదగిన కార్డియోవెర్టర్ డీఫైబ్రిలేటర్ (ICD, implantable cardioverter defibrillator) : ఇది ఒక శరీరంలోకి ప్రవేశపెట్టే (ఇంప్లాంట్ చేసే) పరికరం, ఇది ప్రాణాంతకమయ్యే వేగవంతమైన గుండె లయలను వెంటనే గుర్తించి, ఒక ఎలక్ట్రిక్ షాక్ ద్వారా గుండె లయను మాములు స్థాయికి తీసుకువస్తుంది.
 1. వెంట్రిక్యులర్ టాఖీకార్డియా కొరకు మందులు

వెంట్రిక్యులర్ టాఖీకార్డియా కొరకు మందులు

వెంట్రిక్యులర్ టాఖీకార్డియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Xylo(Astra)Xylo 2% Infusion36.22
XylocaineXylocaine 1%W/V Injection34.5
Xylocaine HeavyXylocaine Heavy 5% Injection4.5
XylocardXylocard 2% Injection43.0
XyloxXylox 0.2% Gel37.17
AlocaineAlocaine Injection18.0
LcaineLcaine Injection30.0
NircaineNircaine Injection80.92
UnicainUnicain 2% Injection14.5
Wocaine AWocaine A Injection583.31
XylonumbXylonumb 2% Injection26.0
XynovaXynova 2% Gel39.65
ZelcaineZelcaine Injection16.58
Quik KoolQuik Kool Gel65.0
Ora FastOra Fast Cream40.0
Orex LoOrex Lo Gel58.3
TricozolTricozol Ear Drop50.5
Tympalin CTympalin C Drops45.0
PradilPradil 150 Mg Tablet216.6

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...