తలతిప్పుడు (వెర్టిగో) - Vertigo in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 14, 2019

July 31, 2020

తలతిప్పుడు
తలతిప్పుడు

తలతిప్పుడు అంటే ఏమిటి?

తలతిప్పుడు (వెర్టిగో) రుగ్మత అనేది తల లోపల తిప్పినట్లుండే ఓ రకమైన అహితకర భావన. ఇందులో సంతులనం కోల్పోవటం లేదా స్పృహ లేకపోవడం (అంటే తాను ఎక్కడుండేది, తానెవరన్నదీ తెలియకుండా పోయే స్థితి) జరుగుతుంది. కదలికల గురించిన జ్ఞానం (మోటార్ సంచలనాలు) మనిషిలో దెబ్బ తిన్నపుడు తలతిప్పడం (వెర్టిగో) రుగ్మత సంభవిస్తుంది. సంతులనాన్ని, శరీర అవయవాల పట్ల జ్ఞానాన్ని లేదా దృష్టి యొక్క సంవేదనాత్మక పనితీరును దెబ్బ తీసే తీవ్రమైన రుగ్మతతో తలతిప్పుడు రుగ్మత సంబంధాన్ని కలిగి ఉంటుంది. తలతిప్పుడు రుగ్మత కల్గిన వ్యక్తులు మైకము మరియు అహితకర తలతిప్పటను అనుభవిస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

తలతిప్పుడుతో సంబంధం ఉన్న ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:

  • టిన్నిటస్ (చెవుల్లో రింగు మనే మోతతో కూడిన శబ్దం)
  • వినికిడి లోపం
  • తలతిప్పే సమయంలోనే వికారం
  • శ్వాస ప్రక్రియలో మరియు హృదయ స్పందనలో మార్పులు
  • చెమటలు  పట్టేయడం
  • నడవడానికి అసమర్థత
  • చురుకుదనంలో మార్పు
  • అసాధారణ కంటి కదలికలు
  • ద్వంద్వ దృష్టి (డబుల్ దృష్టి)
  • ముఖ పక్షవాతం
  • మాట్లాడటం లో కష్టం
  • చేతులు లేదా కాళ్లలో బలహీనత

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

తలతిప్పుడుకు కారణం కింది పరిస్థితుల్లో ఏదైనా కావచ్చు:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

డాక్టర్ తలను పరీక్షించే ఒక కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ మరియు  మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (MRI), ఎలక్ట్రానిస్ట్రేగ్మోగ్రఫీ (కంటి కదలికల కొలత), రక్త పరీక్షలు మరియు ఒక ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరీక్షల్నిఆదేశించవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు, లేదా ఏవైనా ఇతర రుగ్మతలు కారణంగా తలతిప్పడు సంభవించిందేమోనని తెలుసుకోవడానికి డాక్టర్ వ్యక్తి వైద్య చరిత్రను పరిశీలించొచ్చు.

రుగ్మతకు కారణం నిర్ణయించిన తర్వాత తలతిప్పుడుకు చికిత్సను అందిస్తారు. వెర్టిగో కోసం సూచించిన సాధారణ చికిత్సలు:

  • ఆందోళన నివారణా మందులు
  • కండరాల విశ్రామక మందు లు
  • నడకను స్థిరీకరించడానికి వ్యాయామాలు (వాకింగ్ యొక్క విధానం)
  • అలవాటు వ్యాయామాలు
  • జ్ఞాన సంస్థ కోసం శిక్షణ
  • మంచి సమతుల్యత కొరకు స్టాటిక్ మరియు డైనమిక్ బ్యాలెన్స్ వ్యాయామాలు
  • కానలిత్ పునఃస్థాపన చికిత్స (CRT) - ఈ చికిత్స అత్యంత సాధారణ రకమైన వెర్టిగో రకానికి చెందినది (నిరపాయమైన పార్లోసైస్మల్ ఎసిటిక్ వెర్టిగో)
  • ఏరోబిక్ కండిషనింగ్ - నిరంతర లయబద్ద కదలికలు ఊపిరితిత్తుల మరియు గుండె కండరాలు రక్తాన్ని సమర్ధవంతంగా పంపు చేయడానికి సహాయం చేస్తాయి, ఇది మరింత ఆక్సిజన్ను కండరాలు మరియు అవయవాలకు సరఫరా చేస్తుంది.



వనరులు

  1. Melissa S. Bloom et al. What is Vertigo? . American Physical Therapy Association, Section on Neurology [Internet]
  2. Rush University Medical Center. Vertigo. Chicago [Internet]
  3. Northwell Health. What is vertigo treatment?. New York, United States [Internet]
  4. Konrad HR. Vertigo and Associated Symptoms. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 123.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Dizziness and Vertigo

తలతిప్పుడు (వెర్టిగో) వైద్యులు

Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
Dr. Muthukani S Dr. Muthukani S Neurology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

తలతిప్పుడు (వెర్టిగో) కొరకు మందులు

Medicines listed below are available for తలతిప్పుడు (వెర్టిగో). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.