బాదం బంకను సాధారణంగా "గోండు కటిరా" అని పిలుస్తారు. ట్రగాకాంత్ గమ్ (tragacanth gum) అని కూడా పిలిచే దీన్ని “అస్ట్రాగలస్” (Astragalus) అనే మూలిక యొక్క వివిధ జాతుల చెట్ల నుండి సహజంగా లభించే సారం (sap) లేక జిగురే ఈ  బాదం బంక. ఇది జిగట పదార్ధం లేక జెల్లీ లాంటిది. వాసన, రుచి ఉండదు దీనికి. బాదం బంక (ట్రగాకాంత్ గమ్) నీటిలో కరిగిపోతుంది మరియు ప్రధానంగా దీన్ని మొక్క యొక్క వేర్ల నుండి  సేకరించబడుతుంది. బాదం బంకను నీటిలో నానబెట్టినపుడు ‘జెల్’ లాంటి పదార్థంగా మారుతుంది, దీనిని పేస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో బాదం బంకను ఓ మూలికా ఔషధం (medicine)గా ఎక్కువగా ఉపయోగించబడుతోంది.  ముఖ్యంగా, శీతలీకరణ మరియు జీర్ణ ప్రచోదన లక్షణాల కోసం బాదం బంకను ఆయుర్వేదం వైద్యంలో వాడటం జరుగుతోంది.

బాదం బంకను ఇవ్వగల వివిధ అస్ట్రాగలస్ (Astragalus) జాతి చెట్లున్నాయి. అస్ట్రాగలస్ యొక్క ఆ జాతులు ఏవంటే అస్ట్రాగలస్ యాడ్సెండెన్స్  (Astragalus adscendens), అస్ట్రాగలస్ బ్రాచీకాలిక్స్ (Astragalus brachycalyx), అస్ట్రాగలస్ ట్రాగా క్యాంతుస్ (Astragalus tragacanthus), మరియు అస్ట్రాగలస్ గుమ్మిఫెర్ (Astragalus gummifer). ఈ జాతులు ప్రపంచంలోని మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందినవి. ఈ బాదం బంక ప్రధానంగా ఇరాన్లో ఉత్పత్తి అవుతుంది మరియు పెర్షియన్ వైద్యంలో కూడా విస్తృతంగా వాడటం జరుగుతోంది. ఆస్ట్రగలస్ మొక్కలు సాధారణంగా మూలికలు లేదా చిన్న పొదలు. 'ట్రాగోస్' (మేక) మరియు 'అకాంత' (కొమ్ము) అనే గ్రీకు పదాల నుండి ‘ట్రాగకాంత్’ అనే పేరు దీనికి  వచ్చింది.

బాదం బంక గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • పేరు: బాదం బంక ("బాదం బంక ") లేక బాదం బంక
  • బాదం బంకను ఏ జాతి మొక్క నుండి తీసుకోబడుతుంది: అస్ట్రాగలస్ జాతులు (species of Astragalus)
  • ఉపయోగించే చెట్టు భాగం: వేరులోని జిగురు సారం లేక రసం (ఎండినది)
  • సాధారణ పేరు: షిరాజ్, షిరాజ్ గమ్, గమ్ డ్రాగన్
  • సంస్కృత నామం: గల్గల్
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ప్రపంచంలోని మధ్యప్రాచ్య ప్రాంతం.
  1. బాదం బంక పోషక వాస్తవాలు - Tragacanth gum nutritional facts in Telugu
  2. బాదం బంక యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Gond katira (Tragacanth gum) in Telugu
  3. బాదం బంక యొక్క ఉపయోగాలు - Uses of tragacanth gum (gond katira) in Telugu
  4. బాదం బంక పౌడర్ - Gond katira powder in Telugu
  5. బాదం బంక దుష్ప్రభావాలు - Side effects of Gond katira in Telugu

బాదం బంకను (ట్రాగకాంత్ గమ్) వివిధ ఆహారాల తయారీల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది మరియు ఇది ఒక విలువైన వంటల్లో కలిపే సంకలిత పదార్థంగా (additive) పరిగణించబడుతుంది. 100 గ్రాముల బాదం బంకలో లభించే పోషకాల విలువను ఈ క్రింది పట్టికలో తెలియజేస్తునాం.  

 

పోషకాలు

విలువ (100 గ్రాములకి)

శక్తి

70 కిలో కేలరీలు

పిండిపదార్థాలు

35 గ్రా

పీచుపదార్థాలు (ఫైబర్)

30 గ్రా

కార్భోహైడ్రేట్లు 

5 గ్రా

కొవ్వులు (ఫాట్స్)

0 గ్రా

ఖనిజాలు

సోడియం

9 గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Hridyas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like high blood pressure and high cholesterol, with good results.
BP Tablet
₹899  ₹999  10% OFF
BUY NOW

బాదం బంక (ట్రాగకాంత్ గమ్) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది, అందుకే దీన్ని ఆయుర్వేద వైద్యంలో బాగా సిఫార్సు చేయబడింది. బాదం బంక యొక్క ఆరోగ్య ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి:

  • శీతలీకరణ కోసం: బాదం బంక చల్లబరిచే (శీతలీకరణ) లక్షణాలను కలిగి ఉంటుంది మరియు శరీర ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి మరియు వడదెబ్బ (హీట్ స్ట్రోక్‌)ను నివారించడానికి వేసవికాలంలో సాధారణంగా దీనిని వినియోగిస్తారు.
  • రక్తపోటును తగ్గించడానికి: బాదం బంకకున్నశీతలీకరణ లక్షణాల కారణంగా, దాన్ని రక్తపోటును తగ్గించడానికి ఉపయోగించవచ్చని సూచించబడింది.
  • జీర్ణక్రియ కోసం: బాదం బంక సేవనం జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, తద్వారా మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.
  • చర్మం కోసం: ఫేస్ మాస్క్ (ముఖంపై పట్టీ) రూపంలో బాదం బంకను ఉపయోగించినప్పుడు అది మన చర్మానికి అద్భుతమైన వయసును దాచే (యాంటీ ఏజింగ్ సప్లిమెంట్) అనుబంధకంగా పని చేస్తుంది. ఇది మన చర్మంపై ముడతలు, గీతలు మరియు వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను తగ్గించడానికి సహాయపడుతుంది, అయితే గాయాల నిర్వహణలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • నొప్పి నియంత్రణ కోసం: నొప్పి అనుభూతిని తగ్గించడానికి నాడీ వ్యవస్థలోని కొన్ని గ్రాహకాలపై పనిచేస్తున్నందున బాదం బంకను నొప్పి నివారిణి (అనాల్జేసిక్) గా ఉపయోగించవచ్చు.
  • మూత్రం ఆపుకోలేనివారి కోసం: డయాబెటిస్ లేదా గర్భం కారణంగా మూత్రం ఆపుకోలేనివారి కోసం లేదా బట్టల్లోనే మూత్రంపోసుకునే వారికి బాదం బంక సేవనం సూచించబడింది. గర్భధారణ సమయంలో, ఇది తల్లి మరియు పిండానికి పోషక పదార్థాల్ని అందించడానికి సహాయపడుతుంది.
  • క్యాన్సర్ కోసం: క్యాన్సర్ కణ విభజన రేటును మందగించడానికి బాదం బంక పని చేస్తుందని రుజువు అయినందున దీన్ని (ట్రాగాకాంత్‌ బంకను) క్యాన్సర్ నిరోధక ఏజెంట్‌గా ఉపయోగించవచ్చ ల్యాబ్ అధ్యయనాలు సూచించాయి.

శీతలీకరణ ఏజెంట్‌గా బాదం బంక - Tragacanth gum as a cooling agent in Telugu

బాదం బంకను దానికున్న శీతలీకరణ లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. వేసవికాలంలో, బాదం బంక కలిపిన నీటిని తాగి శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి వినియోగించబడుతుంది. అందువల్ల, వేసవిలో బాదం బంక  తినడం వల్ల వడ దెబ్బను నివారించవచ్చు. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల వాంఛనీయ పనితీరు కోసం అంతర్గత శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి బాదం బ్యాంకును ఆయుర్వేద వైద్యులు విస్తృతంగా సిఫార్సు చేస్తున్నారు.

బాదం బంక హైపోటెన్సివ్ (రక్తపోటు తగ్గించే) ఏజెంట్‌గా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి, ఇది దాని శీతలీకరణ లక్షణాలకు దోహదం చేస్తుంది. అధిక వేడి కారణంగా, ముక్కులో రక్తస్రావం సంభవించే సంఘటనలను బాదం బంక  ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు.

(మరింత చదవండి: అధిక రక్తపోటు లక్షణాలు)

జీర్ణక్రియ కోసం బాదం బంక - Gond katira for digestion in Telugu

జీర్ణక్రియకు తోడ్పడగల బాదం బంక యొక్క గుణాలవల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బాదం బంక  యొక్క ముఖ్య ఉపయోగం ఇది ఓ విరేచనాకారిగా (ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడం ద్వారా పేగుల్నిశుభ్రపరుస్తుంది) పని చేస్తుంది.బాదం బంకలో ఉన్న జిలోగలాక్టురోనన్ హైడ్రోలేస్ వంటి కొన్ని ఎంజైమ్‌లు జీర్ణక్రియను ప్రోత్సహించడానికి కారణమవుతాయి. బాదం బంకను నిత్యాహారంలో (రెగ్యులర్ డైట్ లో) చేర్చుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.

బాదం బంక మూత్ర పనితీరును మెరుగుపరుస్తుంది - Gond katira (Tragacanth gum) improves urinary function in Telugu

అసంకల్పిత మూత్రవిసర్జన మరియు మూత్రాన్ని ఆపుకోలేని అసహాయకత్వానికి (మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం) వ్యతిరేకంగా బాదం బంక పని చేస్తుందని బాగా ప్రసిద్ధం. ఇది మూత్ర నాళం యొక్క కండరాలను ఓదార్చడానికి లేదా మూత్ర మార్గము యొక్క వాపు విషయంలో ఉపశమనానికి సహాయపడుతుంది. బాదం బంకను సేవించడంవల్ల చక్కెరవ్యాధి-ప్రేరేపిత మూత్ర సమస్యలను కూడా తగ్గించవచ్చు.

గర్భధారణ సమయంలో బాదం బంక స్వీట్లు తినండి - Eat gond katira sweets in pregnancy in Telugu

బాదం బంక పోషక లక్షణాల కారణంగా దీన్ని గర్భిణీ స్త్రీలు సేవించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. బాదం బంక కలిగిన స్వీట్లు పంచే పద్ధతి భారతదేశంలో చాలా సాధారణం. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి మరియు తల్లికి మరియు బిడ్డకు మంచి పోషక వనరు అని నమ్ముతారు.

బాదం బంక లో ప్రోటీన్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, దీనివల్ల ఇది గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గర్భధారణ తరువాత, బాదం బంక  చిన్నబిడ్డ తల్లులకు అవసరమైన పోషకాలను అందించడం ద్వారా వారి బలాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. చనుబాలివ్వడం (తల్లి పాలివ్వడం) తల్లులలో పాలు ఉత్పత్తిని బాదం బంక పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మంచి చర్మ కోసం బాదం బంక వాడండి - Use gond katira for a good skin in Telugu

బాదం బంక లో వయసును దాచే (యాంటీ-ఏజింగ్) లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. బాదం బంక తరచుగా కలబంద వంటి ఇతర మొక్కల ఉత్పత్తులతో కలుపుతారు మరియు ఫేస్ మాస్క్‌గా ఉపయోగిస్తారు. ఈ ఫేస్ మాస్క్‌లు ముఖంపై ముడతలు మరియు  గీతలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఈ బంక వాడకం గురించిన వైద్య పరిశోధనలు కొనసాగుతున్నాయి.

బాదం బంక లో అనేక ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి మరియు చర్మ సంరక్షణ విధానాలలో బాదం బంకకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాదం బంక కలబందతో కలిపి గాయాలను నయం చేసే లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా బాదం బంక - Gond katira against cancer in Telugu

బాదం బంకలో కూడా క్యాన్సర్ నిరోధక స్వభావం ఉన్నట్లు కనుగొనబడింది. కణజాల విభజన రేటును మందగించే కొన్ని జీవరసాయనాలను బాదం బంక కలిగి ఉన్నట్లు కనుగొనబడింది, ఇది కణితుల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసే స్వభావాన్ని కల్గిఉంది.

విట్రో మరియు వివోలో నిర్వహించిన అధ్యయనాలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్‌గా బాదం బంక యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించాయి. క్యాన్సర్కు నివారణ చర్యగా రోజువారీ జీవితంలో బాదం బంక  వాడకాన్ని నిర్ణయించడానికి మరిన్ని వైద్య పరిశోధనల అవసరం ఉంది.

నొప్పి నివారణకు బాదం బంక - Tragacanth gum for pain relief in Telugu

నొప్పిని తగ్గించడంలో బాదం బంక  యొక్క ప్రభావాలను విశ్లేషించడానికి అధ్యయనాలు జరిగాయి. తగిన మొత్తంలో ఇచ్చినప్పుడు బాదం బంక ను సమర్థవంతమైన నొప్పినివారిణి లేదా అనాల్జేసిక్ (పెయిన్ కిల్లర్) గా ఉపయోగించవచ్చు. బాదం బంక నాడీ వ్యవస్థ యొక్క కొన్ని భాగాలపై పనిచేస్తుంది, నొప్పి యొక్క అనుభూతిని తగ్గిస్తుంది. బాదం బంక నొప్పినివారిణి (అనాల్జేసిక్‌)గా ఎలా పనిచేస్తుందో ఖచ్చితమైన యంత్రాంగాన్ని అధ్యయనం చేయడానికి వివోలో తదుపరి అధ్యయనాలు చేయడం అవసరం.

బాదం బంక యొక్క ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఈ బంక వల్ల ఆహారపరిశ్రమ మరియు తోలు పరిశ్రమల్లో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. బాదం బంక యొక్క జిగట స్వభావంతో  కూడిన అనుగుణ్యత గురించి సైన్స్ మరియు పరిశోధనా రంగాలలో అనేక విధాలుగా పరిశోధించబడింది.

  • బాదం బంకను ఆహార పరిశ్రమలలో కొవులకి (ఫ్యాట్స్) ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్న్యాయంగా ఉపయోగిస్తున్నారు. దాని యొక్క జిగురు  ఆహార పదార్దాలకు మంచి బైండింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. 
  • బాదం బంక ఒక ప్రభావవంతమైన సూక్ష్మజీవి నాశినిగా కూడా కనుగొనబడింది. అనేక పరిశోధనలు దీని సూచించాయి. కానీ బాదం బంక యొక్క యాంటీ మైక్రోబియల్ చర్యలపై ఇంకా పరిశోధనలు అవసరం. 
  • ఇన్సులిన్ ను ఇంజక్షన్ రూపంలో తీసుకునే మధుమేహ రోగులకు బాదం బంక ఒక మంచి ప్రత్యామ్న్యాయం. బాదం బంక యొక్క జిగురు వంటి లక్షణాలు ఇన్సులిన్ను పట్టి ఉంచి అవసరమైన మోతాదులో విడుదల చేస్తాయి. అందువలన ఇన్సులిన్ బాదం బంకతో కలిపి ఓరల్ (నోటి ద్వారా)  ఇవ్వవచ్చు. 
  • బాదం బంకను సలాడ్లు, పచ్చళ్ళు, కేచ్ అప్, మాయానైజ్ వంటి ఆహార ఉత్పత్తులలో ఠీక్నింగ్ (చిక్కబరచే) ఏజెంట్ గా ఉపయోగిస్తారు.     

కొవ్వుకు ప్రత్యామ్నాయంగా బాదం బంక - Tragacanth gum (gond katira) as a fat substitute in Telugu

ఆహార పరిశ్రమలో, కొవ్వుకు బదులు దాని స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మరో పదార్థాన్ని ప్రవేశపెట్టడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాసేజ్ వంటి అనేక ప్యాకేజీ చేయబడిన లేదా ప్రాసెస్ చేయబడిన మాంసం ఉత్పత్తులలో బాదం బంక (ట్రాగాకాంత్) సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా కనుగొనబడింది. బాదం బంకలోని బంక తత్త్వం ప్రాసెస్ చేసిన మాంసాలకు మంచి ముద్ద కట్టుడు (బైండింగ్) ఏజెంట్గా పని చేస్తుంది మరియు అధిక కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాలకు మరింత పోషకమైన ప్రత్యామ్నాయంగా కూడా ఇది ఉండగలదు.

సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా బాదం బంక - Gond katira against microbes in Telugu

బాదం బంక సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా పని చేయగలదని  కనుక్కోబడింది. సూక్ష్మజీవనాశినిగా దాని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బాదం బంకను అనేక పరిశోధన అధ్యయనాలలో ఉపయోగించబడింది. యాంటీబయాటిక్ ఆంపిసిలిన్ ను  బాదం బంకతో కలిపినప్పుడు ఈ బంక విషక్రిమినాశినిగా (యాంటీ-మైక్రోబియల్ ఏజెంట్‌గా) స్థాపించబడింది మరియు ఇది సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. అయితే, వివోలో, బాదం బంక యొక్క ఈ గుణాన్ని  పరీక్షించడానికి వైద్య పరిశోధనలు ఇంకా (క్లినికల్ ట్రయల్స్) అవసరం.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో నోటి ద్వారా మందు సేవనకు పనికొచ్చే బాదం బంక - Gond katira as an oral delivery system in diabetics in Telugu

బాదం బంక (ట్రాగకాంత్ గమ్) సారాన్ని ఇన్సులిన్‌ను కప్పడానికి (క్యాప్సూల్ కవర్ గా) ఉపయోగించవచ్చు. చక్కెరవ్యాధి ఉన్న రోగులు ఇన్సులిన్ ను (సూది ద్వారా) నేరుగా రక్తంలోకి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. బాదం బంకకు ఉండే జిగురు గుణం సహాయంతో మనకు అవసరమైన ఇన్సులిన్ మోతాదును సంగ్రహించడానికి ఉపయోగించవచ్చు. అలాంటపుడు, ఈ ఇన్సులిన్ తయారీని (preparation) మాత్ర రూపంలో తీసుకోవచ్చు. బాదం బంక ఈ అంశంలో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు అవసరమైన ప్రభావవంతమైన ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి పరిశోధన అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి.

గట్టిపరిచే (చిక్కబరిచే) ఏజెంట్‌గా బాదం బంక - Tragacanth gum (gond katira) as a thickening agent in Telugu

బాదం బంకను ద్రవరూప ఆహార పదార్థాలను చిక్కబరిచేందుకు (thickening) వాడతారు,   ఇంకా, బాదం బంక వేడికి మరియు ఆమ్లత్వానికి స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని సలాడ్ డ్రెస్సింగ్, ఊరగాయలు, కెచప్‌లు మరియు మయోన్నైస్‌లలో చిక్కబరిచే ఏజెంట్‌గా వాడటం జరుగుతుంది. బాదం బంక యొక్క స్థిరీకరణ గుణం దీన్ని తగిన సంరక్షణకారిగా (preservative) గా చేస్తుంది. అదనంగా, దీని ఆమ్లవ్యతిరేక గుణం దీన్ని కలిపిన ఖాద్య ఉత్పత్తుల యొక్క నిల్వ  ఉండే కాలాన్ని (ఖాద్య ఉత్పత్తిని తినడానికి ఉపయోగించడానికి సురక్షితమైన కాల వ్యవధి) పెంచడానికి సహాయపడుతుంది.

ఆస్ట్రాగలస్ జాతి చెట్ల వేర్ల నుండి బాదం బంకను సంగ్రహిస్తారు. మొక్క యొక్క వేర్లను ఒడిసిపట్టి నొక్కబడతాయి, అప్పుడు వాటి నుండి బాదం బంక రేకులు (సన్నని పలకలు) లేదా వక్రీకృత రిబ్బన్ల రూపంలో బయటకు వస్తుంది.  ఇలా సంగ్రహించిన బంకను ఎండబెట్టడమో లేదా ఆరబెట్టడమో జరుగుతుంది, తరువాత అలా ఎండిన బాదం బంక చూర్ణం చేయబడుతుంది. బాదం బంక ఎక్కువగా మార్కెట్లో పొడి రూపంలో లభిస్తుంది.

Spirulina Capsules
₹539  ₹599  10% OFF
BUY NOW

బాదం బంకను అనేక ఆరోగ్యపరమైన మరియు పారిశ్రామిక ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. బాదం బంకను సేవించడం సురక్షితమని ప్రకటించబడింది. అయితే, అప్పుడప్పుడు దీని వినియోగం కొంతమందిలో కొన్ని దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అలాంటి దుష్ప్రభావాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • బాదం బంకను ఎక్కువ మొత్తం నీటితో పాటు తినకపోతే కొంతమందిలో పొరబారడం సమస్యలు మరియు పేగుల్లో అడ్డుపడే సమస్యలు కల్గించవచ్చు.  
  • కొంతమంది వ్యక్తులు ఆహారం లేదా ఇతర ఔషధ ఉత్పత్తులలో ఉపయోగించే బంకకు సహజంగానే సున్నితత్వాన్ని కల్గి ఉంటారు. అటువంటి వ్యక్తులు బాదం బంకను తినకూడదు ఎందుకంటే ఇది వారిలో అలెర్జీ ప్రతిచర్యకు కారణం కావచ్చు.
  • బాదం బంక  తినడం వల్ల కొంతమందిలో శ్వాస సమస్యలను కలుగజేయవచ్చు.

Medicines / Products that contain Gond Kateera (Tragacanth)

వనరులు

  1. Zandleven J, Beldman G, Bosveld M, Benen J, Voragen A. Mode of action of xylogalacturonan hydrolase towards xylogalacturonan and xylogalacturonan oligosaccharides. Biochem J. 2005 May 1;387(Pt 3):719-25. PMID: 15560751
  2. Mokhamad Nur, Todor Vasiljevic. Insulin Inclusion into a Tragacanth Hydrogel: An Oral Delivery System for Insulin. Materials (Basel). 2018 Jan; 11(1): 79. PMID: 29304023
  3. E. Mayhew, E. M. F. Roe. Changes in the Permeability of Landschütz Ascites Tumour Cells to Vital Stains after Treatment with Tumour-Inhibitory or modified Samples of Gum Tragacanth or with Gum Karaya. Br J Cancer. 1964 Sep; 18(3): 537–542. PMID: 14219547
  4. Mehdi Atashkar, Mohammad Hojjatoleslamy, Leila Sedaghat Boroujeni. The influence of fat substitution with κ‐carrageenan, konjac, and tragacanth on the textural properties of low‐fat sausage. Food Sci Nutr. 2018 Jun; 6(4): 1015–1022. PMID: 29983965
  5. Heena Sharma, B. D. Sharma, S. Talukder, Giriprasad Ramasamy. Utilization of gum tragacanth as bind enhancing agent in extended restructured mutton chops. J Food Sci Technol. 2015 Mar; 52(3): 1626–1633. PMID: 25745233
  6. Seyyed Majid Bagheri, Leila Keyhani, Mehrangiz Heydari, Mohammad Hossein Dashti-R. J Ayurveda Integr Med. 2015 Jan-Mar; 6(1): 19–23. PMID: 25878459
Read on app