కర్పూరం కర్పూర చెట్టు యొక్క బెరడు నుండి సహజంగా ఏర్పడే ఒక రసాయన సమ్మేళనం. కర్పూర ముద్దలు  ప్రధానంగా టేర్పిన్ (మొక్కలు ఉత్పత్తి చేసే ఒక రకమైన ఆర్గానిక్ సమ్మేళనాలు) తో తయారు చేయబడతాయి, టేర్పిన్ నే  కర్పూరం యొక్క బలమైన వాసనకు కారణం. ఈ టేర్పిన్లు మొక్కలలోని సహజ రక్షణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగాలు. టేర్పిన్లు నేరుగా తినడానికి పనిచేయవు ఎందుకంటే అవి విషపూరితమైనవి.  దానికుండే వాసన శాకాహార జంతువులు కర్పూర చెట్టును తినకుండా కాపాడుతుంది. కానీ, కర్పూరానికి ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.

కర్పూరం సాంప్రదాయ మరియు పాశ్చాత్య వైద్య విధానాలలో దాని ఔషధ మరియు వైద్య లక్షణాలకి చాలా ప్రసిద్ధి చెందింది. ముక్కుదెబ్బేడ, నొప్పులు మరియు వాపు వంటి వివిధ సమస్యలకు ఇది ఒక వివిష్టమైన జానపద మందు. నిజానికి, కొన్ని అధ్యయనాలు, కాలిన గాయాలు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో ఇది చాలా ప్రభావంతంగా ఉందని సూచించాయి.

వాస్తవానికి కర్పూర చెట్టు భారతదేశం, చైనా మరియు జపాన్ యొక్క స్థానిక వృక్షం,అయితే, ప్రపంచంలోని అత్యధిక ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా కర్పూర చెట్టును విస్తృతంగా సాగు చేస్తారు. ఆసక్తికరంగా, ఇది 'గ్లోబల్ ఇన్వేసివ్ స్పీసిస్ డాటాబేస్' లో ఒక హానికర మొక్కగా పరిగణించబడింది.

కర్పూర చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఒక సతత హరిత చెట్టు. కర్పూర చెట్టు అడవులలో పెరుగుతుంది మరియు చాలా విస్తరించగలదు. దాని కొమ్మలు బాగా పెద్దగా విస్తరించి చెట్టు ఒక గొడుగు వంటి ఆకృతిని ఇస్తాయి. కర్పూర చెట్టు దీర్ఘవృత్తాకారంలో ఉండే ఆకులు మరియు చిన్న తెల్లని పూలను కలిగి ఉంటుంది. దీని పండు గుండ్రంగా ఉంటుంది మరియు సాధారణంగా అది నలుపు నుండి ఊదారంగులో ఉంటుంది.

మీకు తెలుసా?

కర్పూరం కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది ఒక నుండే మరియు ఒక రసాయన సమ్మేళనం. ఒక రసాయన సమ్మేళనంగా , దీనిని లావెన్డేర్, కర్పూర తులసి, మరియు రొస్మేరి వంటి మొక్కల యొక్క నూనెల నుండి పొందవచ్చు.

కర్పూరం చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: సిన్నమోమం కేంఫోరా (Cinnamomum camphora)
 • కుటుంబం: లారాసియే (Lauraceae)
 • సాధారణ నామాలు: కామ్ఫోర్ లారెల్, కర్పూరం, కర్పూర చెట్టు,
 • ఉపయోగించే భాగాలు: ఆకులు, బెరడు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: చైనా, భారతదేశం మరియు జపాన్ వంటి ఉష్ణమండల ప్రదేశాలలో కేంఫర్ రకాలు ఉన్నాయి, కానీ ఇది యూఎస్ఏ లో ఫ్లోరిడాలో కూడా ప్రవేశపెట్టబడింది.
 • శక్తి శాస్త్రం: శీతలీకరణ
 1. కర్పూరం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Camphor health benefits in Telugu
 2. కర్పూరం ఎలా ఉపయోగించబడుతుంది - How is camphor used in Telugu
 3. కర్పూరం మోతాదు - Camphor dosage in Telugu
 4. కర్పూరం దుష్ప్రభావాలు - Camphor side effects in Telugu

దురద, కాలిన గాయాలు, మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి అనేక చర్మ వ్యాధులకు కర్పూరం అనేది ఒక ఒక విశిష్ట పరిహారం. ఇది చర్మం ద్వారా సులభంగా శోషించబడుతుంది/గ్రహించబడుతుంది మరియు అందువలన వాపు, నొప్పి ఉపశమనం కోసం ప్రయోజనకరంగా ఉంటుంది. కర్పూరం యొక్క కొన్ని వైద్య యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం.

 • దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది: పరిశోధన అధ్యయనాల్లో గాయం వలన కలిగే దురదను కర్పూరం తగ్గిస్తుందని కనుగొనబడింది. దీర్ఘకాలిక దురదకు బాధ్యత వహించే అయాన్ ఛానల్ TRP1 చర్యను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది.
 • చర్మపు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది: కర్పూరం కొల్లాజెన్ సిన్థసిస్ ను పెంచి మరియు చర్మంపై గీతాలను మరియు ముడుతలతో తగ్గిస్తుందని సూచించబడింది. ఇది చర్మం లో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది తద్వారా మెరుగైన పోషణ మరియు మంచి ఆక్సిజన్ సరఫరా దారితీస్తుంది. అలాగే  చర్మాన్ని యవ్వనంగా మరియు తాజాగా చేస్తుంది.
 • ఆర్థరైటిస్ లక్షణాలు ఉపశమనం: పారంపరంగా, కర్పూరాన్ని ఆర్థరైటిక్ మంటను తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. కర్పూరం కొన్ని క్రియాశీలక సమ్మేళనాలను కలిగి ఉంటుందని, ఇది ఆర్థరైటిస్ విషయంలో వాపు మరియు నొప్పిని తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
 • దగ్గు మరియు ముక్కు దిబ్బేడను తగ్గిస్తుంది: దగ్గు కోసం తయారు చేసే కొన్ని సమయోచిత సూత్రీకరణల్లో (topical formulations) కర్పూరం ఒక ముఖ్యమైన పదార్ధంగా ఉంటుంది. కర్పూరాన్ని పీల్చడం వలన శ్వాస మార్గం తేలిక పడుతుందని భావిస్తారు.
 • యాంటీఫంగల్: పరిశోధనశాల అధ్యయనాలు కర్పూరం ఒక అద్భుతమైన యాంటీఫంగల్ సమ్మేళనం అని సూచిస్తున్నాయి. కర్పూరం యొక్క సమయోచిత పూత 48 వారాల లోపల కాలివేళ్ళ గొర్ల లో ఏర్పడే ఫంగస్ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
 • తలలో పేలను తొలగిస్తుందని:  ఇన్ వివో (జంతు-ఆధారిత) అధ్యయనాలు కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే తలలో పేలను తొలగించడంలో మరియు వాటి పునరావృత్తాన్ని కూడా నివారించడంలో సహాయపడుతుందని సూచించాయి.
 • సహజ దోమల వికర్షకం: పరిశోధనా అధ్యయనాలు  కర్పూర చెట్టు యొక్క ఎస్సెంషియల్ నూనెలు మరియు కర్పూరం సహజ దోమల వికర్షకాన్ని (repellent) కలిగి ఉంటాయని తెలిపాయి. పి-మీతెన్ వంటి బయోఆక్టివ్ సమ్మేళనాల యొక్క ఉనికి కారణంగా ఇది జరుగుతుంది.

దురద కోసం కర్పూరం - Camphor for itching in Telugu

పృరిటస్ (Pruritus) అంటే చర్మంపై అధిక దురదను సూచించే ఒక పరిస్థితి సాధారణంగా గోకడం ద్వారా ఉపశమన భావన కలుగుతుంది. ప్రస్తుతానికి, ఈ పరిస్థితి అభివృద్ధికి దారితీసే మెకానిజం (క్రియావిధానం) యొక్క కారణం తెలియదు. అందువలన, ప్రస్తుతం ఉపయోగించే చికిత్స ఇమ్యూన్ ఏంహాన్సర్స్ (immune enhancers) గా లేదా నాడీ వ్యవస్థ లక్ష్యంగా పనిచేసే సమయోచిత ఏజెంట్ల ఉపయోగం మాత్రమే. శరీరంలోని అయాన్ ఛానల్ అయిన TRPA1, దీర్ఘకాలిక దురద అభివృద్ధికి బాధ్యత వహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చర్మం మీద దురద స్పందనను కలిగించే మెదడు యొక్క సంకేతాన్ని ప్రారంభమయ్యేలా చేస్తుంది.

ఇటీవలి సమీక్ష వ్యాసం TRPA1 నిరోధ సిద్ధాంతాన్ని (TRPA1 inhibition theory) అంగీకరించింది. ఇంకా మెంథోల్ లేదా కర్పూరం గాయం వలన ఏర్పడే దురద విషయంలో చల్లదనాన్నిఅందిస్తుందని  చెప్పబడింది. 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కర్పూరం TRPA1 యొక్క చర్యను నిరోధించడం ద్వారా దురద యొక్క తీవ్రతను తగ్గిస్తుందని తెలిసింది.

కానీ మానవులలో కర్పూరం యొక్క యాంటిపృరిటిక్ ప్రభావం యొక్క భద్రత మరియు మోతాదును నిరూపించటానికి క్లినికల్ అధ్యయనాలు ఏమి జరుగలేదు.

(మరింత సమాచారం: దురద చికిత్స)

చర్మం కోసం కర్పూరం ప్రయోజనాలు - Camphor benfits for skin in Telugu

అలెర్జీలు మరియు చర్మ ఇన్ఫెక్షన్లు వంటి వివిధ చర్మ సమస్యలకు చికిత్సగా కర్పూరం చాలా కాలంగా ఉపయోగించబడుతుంది. దీనిని ఒక అద్భుతమైన యాంటీఏజింగ్ సమ్మేళనంగా భావిస్తారు. వాస్తవానికి, ముడతలు మరియు నలుపు మచ్చలు వంటి పలు వృద్ధాప్య సంకేతాలపై పోరాడే  వివిధ క్రీమ్లు మరియు లోషన్ల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు.

(మరింత సమాచారం: అలెర్జీ చికిత్స)

కర్పూరం చర్మం కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుందని మరియు మన శరీరంలో చర్మాన్నిబిగుతుగా చేసే ప్రోటీన్ ఐన కొల్లాజెన్ స్థాయిని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచించాయి. జంతువు నమూనాలలో నిర్వహించిన అధ్యయనం యువి (UV) కిరణాల వలన కలిగే నష్టాన్ని కర్పూరం యొక్క సమయోచిత పూత తగ్గిస్తుందని ప్రతిపాదించింది.

జపాన్లో నిర్వహించిన అధ్యయనం కర్పూరం చర్మపు కణజాలంలో రక్త ప్రసరణను పెంచుతుందని సూచించింది. తగినంత రక్త ప్రసరణ ఆక్సిజన్ మరియు పోషకాలను తగినంతగా అందిస్తుంది అది ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మానికి దారితీస్తుంది.

ప్రస్తుత పరిశోధనల ప్రకారం, కర్పూరం యొక్క ఉపయోగం కాస్మెటిక్ పరిశ్రమలో పెరుగుతుందని చెప్పవచ్చు.

ఆర్థరైటిస్ కోసం కర్పూరం - Camphor for arthritis in Telugu

ఆర్థరైటిస్ అంటే మోకాలు, వేళ్లు లేదా మణికట్టు వంటి జాయింట్లలో మరియు చుట్టూ వాపు మరియు నొప్పి కలిగే ఒక పరిస్థితి. ఇది క్రీడాకారులలో నిర్దిష్ట జాయింట్ల యొక్క అధిక బెణుకు (ఆస్టియో ఆర్థరైటిస్) వలన కానీ లేదా ఆటో ఇమ్యూన్ రుగ్మత (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వలన కానీ అభివృద్ధి చెందవచ్చు. ఆటో ఇమ్యూన్ రుగ్మతలో, శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ దాని స్వంత ఎముక కణజాలాలన్ని నాశనం చేస్తుంది. సంప్రదాయ మరియు జానపద ఔషధ విధానంలో, సుదీర్ఘకాలం నుండి కర్పూరాన్ని కీళ్ళనొప్పులు మరియు బ్రోన్కైటిస్ వంటి వివిధ వాపు రుగ్మతల చికిత్సకు వాడుతున్నారు.

సైటోకిన్స్ మరియు నైట్రిక్ ఆక్సైడ్ వంటి వాపును కలిగించే ఏజెంట్ల చర్యను కర్పూరం అడ్డుకుంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటీవలి జంతు ఆధారిత అధ్యయనం, కర్పూరం, మెంథోల్ మరియు థైమోల్లో తయారు చేసిన సూత్రీకరణ 250-500 mg / kg మోతాదులో ఇచ్చినప్పుడు అది గణనీయమైన వాపు నిరోధక శక్తిని చూపిందని తెలిపింది.

ఈ ఆధారం ఆర్థరైటిక్ ఇన్ఫలమేషన్ లో కర్పూరం యొక్క ఉపయోగానికి సంబంధించిన కొంత అవగాహనను అందిస్తుంది.

అంతేకాక, కర్పూరం వాపు తగ్గించడమే కాక, ఆస్టియో ఆర్థరైటిస్ రోగులలో బలమైన అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) గా కూడా పనిచేస్తుంది. 63 మంది రోగులపై ఒక ర్యాండమ్ క్లినికల్ ట్రయల్ ప్రకారం, కర్పూరం ఒక ముఖ్య పదార్ధంగా ఉన్నక్రీమ్ యొక్క సమయోచిత పూత ఒక గుర్తించదగిన నొప్పి-ఉపశమన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తెలిసింది.

కర్పూరం నొప్పిని తగ్గిస్తుంది - Camphor relieves pain in Telugu

సాంప్రదాయ ఔషధ విధానంలో కర్పూరం ఒక బాగా తెలిసిన అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) అని అంటారు. ఇది వివిధ నొప్పి నివారణ క్రీమ్లు మరియు లోషన్లలో ఒక ముఖ్య పదార్థాలలో ఒకటి. శరీరంలోని సిగ్నలింగ్ మార్గాలలో జోక్యం చేసుకోవడం ద్వారా కర్పూరం నొప్పి నివారిణిగా పనిచేస్తుందని పరిశోధనలు సూచించాయి. ఈ మార్గాలు నొప్పితో సహా పలు సెన్సారీ పెర్సెప్షన్లకు (sensory perceptions) బాధ్యత వహిస్తాయి, ఇవి కర్పూరం యొక్క అనాల్జేసిక్ చర్యను వివరిస్తాయి.

ఇటీవలి అధ్యయనాలు కర్పూరం ముఖ్య పదార్థంగా ఉన్న ఫార్ములేషన్లు/స్ప్రేలు శారీరక సమస్యలతో ముడిపడి ఉండే  నొప్పిని తొలగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని సూచిస్తున్నాయి.

దగ్గు మరియు ముక్కుదిబ్బేడ కోసం కర్పూరం - Camphor for cough and congestion in Telugu

ముక్కుదిబ్బేడ మరియు ఛాతీలో ఇబ్బంది అనేవి దగ్గు మరియు జలుబు వలన వచ్చే సాధారణ సమస్యలు. ప్రస్తుతం ఉపయోగించే చికిత్సలో యొక్క దగ్గును అణిచివేసే మందులు లేదా డీకొంగ్నిన్స్టెంట్లు (దిబ్బేడను తొలగించేవి) ఉంటాయి. ఒక రసాయన సమ్మేళనంగా కర్పూరం అనేక దగ్గు మరియు దెబ్బేడకు ఉపశమనం కలిగించే సమయోచిత మందుల (topical formulations) యొక్క ముఖ్య పదార్దాలలో ఒకటి. ఈ మందులు నిద్రలో దగ్గు మరియు ముక్కుదిబ్బేడను తగ్గించటంలో ప్రత్యేకించి పిల్లలలో, చాలా ఉపయోగపడతాయి. మరొక అధ్యయనం, కర్పూరాన్ని పీల్చడం/శ్వాసించడం వలన అది ముక్కు ద్వారా  గాలి ప్రసరణను పెంచుతుందని తెలిసింది.

అయితే, కర్పూరం ఒక్కటే డీకొంగ్నిన్స్టెంట్ ప్రయోజనాన్ని కలిగి ఉందని ధృవీకరించడానికి తగినన్ని సాక్ష్యాలు లేవు.

(మరింత సమాచారం: ముక్కుదెబ్బేడ కారణాలు)

ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం కర్పూరం - Camphor for fungal infection in Telugu

ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మ, గోరు మరియు జుట్టు ఇన్ఫెక్షన్ల యొక్క అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఫంగస్లు ఉష్ణ మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో సులభంగా పెరుగుతాయి మరియు వదిలించుకోవటం చాలా కష్టం. ఫంగల్ అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగించే అనేక గృహ చిట్కాలలో, కర్పూరం మొదటి స్థానంలో నిలుస్తుంది. వివిధ రకాలైన ఫంగస్లను నాశనం చేయడంలో కర్పూరం యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇన్ విట్రో (ప్రయోగశాల ఆధారిత) అధ్యయనాలు ఫుసేరియం (Fusarium), ఫైటోప్తోరా (Phytophthora) మరియు ఆస్పర్జిల్లస్ నైగర్ (Aspergillus niger) వంటి అనేక రకాల  మట్టిలో పెరిగే ఫంగస్లను చంపడంలో కర్పూరం సమర్థవంతమైనదిగా సూచిస్తున్నాయి. ఇది చర్మ ఫంగల్ ఇన్ఫెక్షన్లపై కూడా ఇదే విధమైన యాంటీ ఫంగల్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

'జర్నల్ ఆఫ్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్' లో ప్రచురించిన ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారం, కర్పూర-ఆధారిత క్రీమ్ యొక్క సమయోచిత పూత 48 వారాల లోపు కాలివేలి ఫంగస్ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా తొలగించినట్లు తెలిసింది.

అయినప్పటికీ, మానవులలో ఫంగస్ వ్యాధుల యొక్క చికిత్సలో ప్రత్యేకించి కర్పూరం యొక్క  ప్రభావాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతాయి.

(మరింత సమాచారం: ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్స)

కాలిన గాయాలకు కర్పూరం - Camphor for burns in Telugu

ఇన్ వివో (జంతువులపై ఆధారిత) అధ్యయనాలలో, కర్పూరం, నువ్వుల నూనె, తేనెతో తయారు చేసిన ఒక మందు (సూత్రీకరణ) రెండవ-డిగ్రీ (second-degree) కాలిన గాయాల యొక్క చికిత్సలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ మందు యొక్క ఉపయోగం గాయాన్ని వేగంగా నయం చేయడం మాత్రమే కాక, కాలిన చర్మంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుందని నివేదించబడింది.

భారతదేశంలో, తేలికపాటి కాలిన గాయాలు సంభవించిన 2000 మంది పై ఒక నిరంతర అధ్యయనం (చాలా సంవత్సరాల పాటు) జరిగింది. అధ్యయనం చివరన, కాలిన గాయాలు మరియు ఆ గాయం సంభందిత నొప్పులను నయం చేయడంలో కొబ్బరి నూనెతో కలిపిన కర్పూరానికి గుర్తించదగిన సామర్ధ్యంఉంటుంది.

జుట్టు కోసం కర్పూరం - Camphor for hair in Telugu

కర్పూరం వలన జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్.ఈ లక్షణాలు అన్ని జుట్టు పై ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాక, జుట్టు రాలిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి. తల దురదను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేయబడింది.

అయినప్పటికీ,తల మీద కర్పూరం యొక్క దీర్ఘకాలిక ఉపయోగం చర్మపు ఇర్రిటేషన్ తో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి, జుట్టు కోసం కర్పూరం ఉపయోగించే ముందు, వైద్యుడితో ఒకసారి మాట్లాడడం మంచిది.

తలలో పేలా కోసం కర్పూరం - Camphor for lice in Telugu

తలలో పేలు ఉండడం అనేది ఒక సామాజిక మరియు శారీరక సమస్య. వైద్యులు ప్రకారం, పేలు సంక్రమిత బట్టలు లేదా టోపీలు వంటి వాటి ద్వారా చాలా సులభంగా వ్యాప్తి చెందుతాయి. పేలా ఉనికిని సాధారణంగా తల యొక్క దురద ద్వారా గుర్తించవచ్చు, అవి జుట్టులో చిరాకు కలిగిస్తాయి.

ప్రస్తుతం పేలా నివారణకు ఉపయోగించే రసాయనాలు పేనుల నిరోధక జాతుల (resistant strains of lice) అభివృద్ధి కారణంగా వాటి సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభించాయి. కాబట్టి, పేనులను నివారించడానికి సహజ మరియు సేంద్రీయ విధానాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక ఇన్ విట్రో అధ్యయనం ప్రకారం, కర్పూరం మరియు కొబ్బరి నూనె పేలను తొలగించడానికి  ఒక అద్భుతమైన సూత్రీకరణ (formulation) అని తెలిసింది. ఇది పేనులను తొలగించడమే, వాటి పునరావృతతను కూడా నిరోధిస్తుందని సూచించబడింది.

అయితే, పైన చెప్పినట్లుగా కర్పూరం చర్మానికి చికాకు కలిగిస్తుంది. అంతేకాకుండా, జుట్టు కోసం కర్పూరం యొక్క సంరక్షణ చర్య యొక్క ఖచ్చితమైన మెకానిజం తెలిపే ఎటువంటి క్లినికల్ అధ్యయనాలు లేవు.

కాబట్టి, జుట్టు పేలను తగ్గించడంలో కర్పూరం యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకోవడానికి ఒక చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం.

(మరింత సమాచారం: తలలో పేల కోసం చికిత్స)

దోమల వికర్షకంగా కర్పూరం - Camphor as mosquito repellent in Telugu

కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రపంచంలో సంభవించే మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. WHO ప్రకారం, ప్రపంచంలోని కనీసం 91 దేశాలలో మలేరియా మరియు డెంగ్యూ వంటి వ్యాధులు ఎండమిక్ గా (కొన్ని పరిమిత ప్రాంతాలలో మాత్రమే సంభవిస్తాయి) ఉన్నాయి మరియు దోమల ద్వారా సంక్రమించే వ్యాధులలో డెంగ్యూ ఒకటి. ప్రస్తుతం ఉన్న దోమ వికర్షకాలకు నిరోధకత ఏర్పడడం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది, కాబట్టి, ఆధునిక శాస్త్రం సహజ మరియు మొక్కల ఆధారిత వికర్షకాలను తిరిగి ఉపయోగించాలని సూచిస్తుంది. కర్పూరం అటువంటి ఒక సమ్మేళనం. పారంపరంగా, కర్పూర ముద్దలను సాధారణ కీటకాలు మరియు తెగుళ్ళను తొలగించడానికి అలమారాలలో ఉంచుతుంటారు/పెడుతుంటారు. ఇది మూసివున్న పరిసరాలలో సూక్ష్మజీవుల అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది.

దోమల వికర్షకాలును తయారు చేసేందుకు లావెండర్, తులసి మరియు వేపలతో పాటు కర్పూరాన్ని కూడా ఉపయోగించవచ్చని ఇటీవలే ఒక పరిశోధన వెల్లడించింది. మరొక అధ్యయనంలో మొత్తం కర్పూరం కంటే కర్పూరం యొక్క ఎస్సెంషియల్ నూనె మరింత శక్తివంతమైన వికర్షకం అని సూచిస్తుంది.ఈ అధ్యయనం కర్పూరం యొక్క ఎస్సెంషియల్ నూనెలోని ఆక్టివ్ సమ్మేళనాలు బయటకు తీసి, వీటిని కూడా వాడవచ్చు అని తెలిపింది.

'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మస్కిటో రీసెర్చ్'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కర్పూరం నూనెలో పి-మీథేన్ (Menthane) మరియు ఛాంపేన్ (champene) అని పిలువబడే రసాయన సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఏడీస్ ఈజిప్టి (డెంగ్యూ మరియు చికున్‌గున్యాలను వ్యాప్తి చేసేవి) వంటి దోమలను నివారించడానికి కారణమవుతాయి అని తెలిసింది.

కాబట్టి, ఈ సాధారణ వ్యాధికారక వాహకాల నుండి కర్పూరం సంరక్షిస్తుందని సురక్షితంగా  చెప్పవచ్చు.

లైంగికవాంఛ కోసం కర్పూరం - Camphor for libido in Telugu

సాంప్రదాయిక నమ్మకం ప్రకారం, లైంగికవాంఛ లేదా కోరికను పెంచడంలో కర్పూరం చాలా ప్రభావవంతమైనది. కానీ శాస్త్రీయ ఆధార ద్వారా, ఫలితాలు స్పష్టంగా లేవు. రెండు వేరువేరు ఇన్ వివో అధ్యయనాలు కర్పూరం కొన్ని లైంగికవాంఛను పెంచే ప్రయోజనాలను కలిగి  ఉందని పేర్కొన్నాయి, అయితే 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ సెల్యులార్ మెడిసిన్' లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, కర్పూరం లైంగికవాంఛ లేదా సెక్స్ హార్మోన్లపై గణనీయమైన ప్రభావాలు ఏవి చూపలేదని సూచించాయి.

(మరింత సమాచారం: లైంగికవాంఛను పెంచడం ఎలా)

 • కర్పూరాన్ని నేరుగా తీసుకోవడం (తినడం) విషపూరితముగా భావించినప్పటికీ, దగ్గు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి వివిధ ఆరోగ్య పరిస్థితుల చికిత్స కోసం ఆయుర్వేదంలో కర్పూరపు పొడి యొక్క కషాయాలను (ఖాద) ఉపయోగిస్తున్నారు.
 • ముక్కుదెబ్బేడ, జలుబు మరియు దగ్గును నివారించడానికి తయారు చేసే వివిధ క్రీమ్లు  మరియు లోషన్లలోని ముఖ్య పదార్ధాలలో ఒకటిగా సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు.
 • వివిధ చర్మ మరియు జుట్టు సమస్యలకు కొబ్బరి నూనెతో పాటు కర్పూరం మరియు కర్పూర  నూనెను ఉపయోగిస్తారు.
 • కర్పూరం యొక్క ఎస్సెంషియల్ నూనెను ఒక స్టిములేంట్ మరియు ఒక యాంటీసెప్టిక్ రూపంలో వినియోగిస్తుంటారు.
 • సాధారణ కీటకాలు మరియు దోమలలను తొలగించడానికి కర్పూర మాత్రలు వికర్షకాలుగా  వాడబడుతున్నాయి.
 • మానవ వినియోగానికి దాని యొక్క టాక్సిసిటీ కారణంగా, కర్పూర సాధారణంగా తినబడదు. అయితే, మీకు ఆయుర్వేదంలో దాని ఉపయోగం గురించి తెలిసి లేదా/మరియు కర్పూరాన్ని నోటిద్వారా తీసుకావాలనుకుంటే, ఆయుర్వేద వైద్యునితో ఒకసారి మాట్లాడడం మంచిది.
 • భావ్‌ప్రకాష నిఘంటు (పురాతన ఆయుర్వేద గ్రంథం) ప్రకారం, 125-375 మి.గ్రా కర్పూరం రోజంతా చిన్న చిన్న మోతాదులుగా విభజించి తీసుకోవచ్చు.
 • ఎఫ్.డిఏ మార్గదర్శకాల (FDA guidelines) ప్రకారం, నొప్పి నివారణకు 3 - 10%ఫార్ములేషన్ కలిగిన కర్పూర పేస్ట్ను సురక్షితంగా ఉపయోగించవచ్చు.
 • చనుబాలిచ్చు తల్లులలో పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు ఇది ఒక గర్భస్రావకంగా గుర్తించబడింది. కాబట్టి, గర్భవతులు లేదా చనుబాలిచ్చేవారు కర్పూరం నుండి దూరంగా ఉండడం ఉత్తమము.
 • కర్పూరాన్ని సంతానోత్పత్తిని మెరుగుపరచేదిగా ఉపయోగించినప్పటికీ, అధ్యయనాలు కర్పూరం వీర్యకణాల సంఖ్య మరియు చలనం తగ్గుదలకి దారితీస్తుందని సూచిస్తున్నాయి.
 • వినియోగానికి (తినడానికి) కర్పూరం అత్యంత విషపూరితమైనది. 2 గ్రాముల కన్నా తక్కువ మోతాదు కూడా మానవులలో విషప్రక్రియకు దారితీస్తుంది. విషప్రయోగం (టాక్సిసిటీ) యొక్క ప్రారంభ లక్షణాలు వికారం, తలనొప్పి, వాంతులు, కడుపులో వేడి వంటివి. సాధారణంగా, ఈ లక్షణాలు కర్పూరం తిన్న మొదటి 5 నుండి 10 నిమిషాల లోపు కనిపిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది మూర్ఛలు, కోమా మరియు తీవ్ర సందర్భాల్లో, మరణానికి కూడా దారితీస్తుంది. అదృష్టవశాత్తూ, కర్పూర విషప్రక్రియకు  మొదటి 24 గంటల్లోనే సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. కాబట్టి, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
 • శిశువులకు కర్పూరం ఎప్పుడూ ఉపయోగించరాదు ఎందుకంటే అది వారికి “సురక్షితం కానీ” జాబితా ఉంటుంది.
 • కర్పూరం యొక్క దీర్ఘకాలిక వాడకం తీవ్రమైన కాలేయ టాక్సిసిటీతో సంబంధం కలిగి ఉంటుంది.

उत्पाद या दवाइयाँ जिनमें Camphor है

వనరులు

 1. Abdul Rashid War et al. Mechanisms of plant defense against insect herbivores. Plant Signal Behav. 2012 Oct 1; 7(10): 1306–1320. PMID: 22895106
 2. Sarina B. Elmariah, Ethan A. Lerner. Topical Therapies for Pruritus. Semin Cutan Med Surg. 2011 Jun; 30(2): 118–126. PMID: 21767774
 3. Ansari MA, Razdan RK. Relative efficacy of various oils in repelling mosquitoes. Indian J Malariol. 1995 Sep;32(3):104-11. PMID: 8936292
 4. Tran TA et al. Camphor Induces Proliferative and Anti-senescence Activities in Human Primary Dermal Fibroblasts and Inhibits UV-Induced Wrinkle Formation in Mouse Skin. Phytother Res. 2015 Dec;29(12):1917-25. PMID: 26458283
 5. Xu H1, Blair NT, Clapham DE. Camphor activates and strongly desensitizes the transient receptor potential vanilloid subtype 1 channel in a vanilloid-independent mechanism. J Neurosci. 2005 Sep 28;25(39):8924-37. PMID: 16192383
 6. Yosuke Kaneko, Arpad Szallasi. Transient receptor potential (TRP) channels: a clinical perspective. Br J Pharmacol. 2014 May; 171(10): 2474–2507. PMID: 24102319
 7. Nawaz A et al. Clinical efficacy of polyherbal formulation Eezpain spray for muscular pain relief. Pak J Pharm Sci. 2015 Jan;28(1):43-7. PMID: 25553684
 8. Cohen M, Wolfe R, Mai T, Lewis D. A randomized, double blind, placebo controlled trial of a topical cream containing glucosamine sulfate, chondroitin sulfate, and camphor for osteoarthritis of the knee. J Rheumatol. 2003 Mar;30(3):523-8. PMID: 12610812
 9. Ian M. Paul et al. Vapor Rub, Petrolatum, and No Treatment for Children With Nocturnal Cough and Cold Symptoms. Pediatrics. 2010 Dec; 126(6): 1092–1099. PMID: 21059712
 10. Subajini Mahilrajan et al. Screening the antifungal activity of essential oils against decay fungi from palmyrah leaf handicrafts. Biol Res. 2014; 47(1): 35. PMID: 25287894
 11. Toxicology Data Network. CAMPHOR. National Institutes of Health, Health & Human Services, U.S. National Library of Medicine
 12. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Executive summary.
 13. Ansari MA, Razdan RK. Relative efficacy of various oils in repelling mosquitoes. Indian J Malariol. 1995 Sep;32(3):104-11. PMID: 8936292
 14. Sima Shahabi et al. Central Effects of Camphor on GnRH and Sexual Hormones in Male Rat. Int J Mol Cell Med. 2012 Autumn; 1(4): 191–196. PMID: 24551777
ऐप पर पढ़ें