అయోర్టిక్ స్టెనోస్సిస్ - Aortic Stenosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

అయోర్టిక్ స్టెనోస్సిస్
అయోర్టిక్ స్టెనోస్సిస్

అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?

అయోర్టిక్ స్టెనోసిస్ అనేది మహాధమని (aorta) సన్నబడడం వలన సంభవించే ఒక పరిస్థితి, మహాధమని (aorta) గుండెలో అతిపెద్ద రక్తనాళి. ఒక సన్నబడిన మహాధమని (aorta) రక్త ప్రసరణని కష్టతరం చేస్తుంది మరియు సాధారణంగా గుండె నుండి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది గుండె కండరములను గట్టిపర్చడం వలన గుండె పై అదనపు భారాన్ని మోపి గుండెపోటుకు దారి తీయవచ్చు. అయోర్టిక్ స్టెనోసిస్ యొక్క ప్రాబల్యం 65 సంవత్సరాలు దాటిన పురుషులలో 7% వరకు ఉంది మరియు పురుషుల్లో (80%) సర్వసాధారణంగా ఉంటుంది అని అంచనా. పిల్లలలో, ఆడపిల్లల కంటే మగపిల్లలో ఎక్కువగా సంభవిస్తుంది. భారతదేశంలోని ఏదైనా కావటం (వాల్వ్) (valve) యొక్క వ్యాధి ప్రాబల్యం 2.8%, దీనిలోఅయోర్టిక్ స్టెనోసిస్ శాతం 0.4%.

అయోర్టిక్ స్టెనోసిస్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు వయస్సు మరియు అడ్డంకుల యొక్క తీవ్రతతో మారవచ్చు. గుండెకు రక్త ప్రవాహం తక్కువై పరిస్థితి తీవ్ర దశకు చేరుకునే వరకు రోగులు ఏ లక్షణాలను అనుభవిస్తారు.

తీవ్ర స్టెనోసిస్ లో ఈ కింది సంకేతాలు మరియు లక్షణాలు ఉండవచ్చు:

శిశువులులో పాలు తాగడంలో సమస్యలను కలిగి ఉండవచ్చు మరియు బరువు పెరగకపోవచ్చు. అలసట మరియు శ్వాస తీసుకోవడంలో కష్టాలను చూపుతారు, ఇది పుట్టిన కొన్ని రోజులలో లేదా వారాలలో అభివృద్ధి చెందుతుంది. చిన్న పిల్లలలో వయసు పెరిగేకొద్దీ ఈ పరిస్థితి స్వల్పమైన స్టెనోసిస్ నుండి మరింత తీవ్రంగా మారవచ్చు, మరియు ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదానికి కూడా కారణమవుతాయి.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది పుట్టుకతో సంభవించవచ్చు లేదా సాధారణంగా సంభవించవచ్చు

  • పుట్టుకతో
    • మహాధమని (aorta) కవాటాల(valves) వైకల్యం చిన్ననాటి అయోర్టిక్ స్టెనోసిస్ కు కారణం కావచ్చు.
    • ఇవి తీవ్రమైన సమస్యలను కలిగించకపోవచ్చు, కానీ వయస్సుతో కవాటాలు (valves) సన్నబడడం లేదా కన్నాలు పడడం జరుగవచ్చు, అప్పుడు బాగుచెయ్యడం లేదా భర్తీ చేయడం కష్టమవుతుంది.
  • ఆర్జిత/ సాధారణం (acquired)
    • పెద్దలలో, స్ట్రెప్టోకోకల్ (streptococcal) సంక్రమణ (రుమాటిక్ జ్వరము) వలన గాయం మరియు చివరికి స్టెనోసిస్ ఏర్పడుతుంది.
  • కాల్షియం బిల్డ్-అప్
    • కవాటాల (వాల్వ్)చుట్టూ కాల్షియం డిపాజిట్లు స్టెనోసిస్ కు దారి తీయవచ్చు.
    • ఇది బాహ్యంగా కాల్షియం తీసుకోవడంతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు.
    • ఛాతీ రేడియేషన్ కాల్షియం డిపాజిట్లను ప్రోత్సహిస్తుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

అసాధారణ రక్త ప్రవాహానికి ప్రధాన సూచనలు గుండెలో గందరగోళం, కటుక్కు అనే శబ్దము లేదా స్టెతస్కోప్ తో చూసినప్పుడు ఒక అసాధారణ ధ్వని, బలహీనమైన నాడి స్పందంనం లేదా మెడ ద్వారా ఉన్న నాడి నాణ్యతలో మార్పు వంటివి ఉంటాయి. రక్తపోటు తక్కువగా ఉంటుంది.

వైద్యులు ఈ క్రింది పరీక్షలను సిఫార్సు చేయవచ్చు:

  • ఛాతీ ఎక్స్ - రే (X - ray) 
  • ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) (Electrocardiogram)
  • వ్యాయామం ఒత్తిడి పరీక్ష (Exercise stress test)
  • ఎడమ కార్డియాటిక్ కాథెటరైజేషన్ (Left cardiac catheterisation)
  • గుండె యొక్క అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI) (Magnetic resonance imaging)
  • ట్రాన్స్సోఫాజినల్ ఎఖోకార్డియోగ్రామ్ (TEE) (Transoesophageal echocardiogram)

సమస్య యొక్క తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వబడుతుంది. సూచించిన మందులు ప్రధానంగా గుండె వైఫల్యం కోసం లేదా క్రమం లేని హృదయ స్పందన లక్షణాలకు చికిత్స చేస్తాయి. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచాలి. ఏవైనా దంత ప్రక్రియలు లేదా కోలోనోస్కోపీ (colonoscopy) చేయించుకోవాలనుకుంటే, ఆరోగ్య సంరక్షకులతో యాంటీబయాటిక్ ఉపయోగం కోసం పరీక్ష చేసుకోవడం మంచిది. ఆసుపత్రి నుండి విడుదల తర్వాత బాక్టీరియల్ ఎండోకార్డిటిస్ నివారించడానికి పిల్లలకు యాంటీబయాటిక్స్ సూచించబడవచ్చు. శస్త్రచికిత్స అనేది కవాటాలను బాగుచెయ్యడం లేదా భర్తీ చేయడం కోసం సాధారణంగా పెద్దలలో లేదా పిల్లలలో లక్షణాలను కలిగి ఉన్నవారికి చేస్తారు. యాంత్రిక కవాటాలను (mechanical valve) భర్తీ చేసిన రోగులకు కవాటాలలో గడ్డ నిర్మాణాన్ని నివారించడానికి రక్తాన్ని పల్చచబార్చే మందులు తీసుకోవాలి. వోల్వోలోప్లాస్టీ (valvuloplasty) అని పిలవబడే ఒక చిన్న గాఢమైన బుడగ శస్త్రచికిత్సకు బదులుగా లేదా ముందుగానే నిర్వహించవచ్చు.

గుండె సమస్యల నిర్వహణ కోసం నాన్-డ్రగ్ పద్ధతులు:

  • కఠినమైన లేదా పోటీ క్రీడలను నివారించాలి
  • దూమపానం వదిలేయాలి
  • కొలెస్ట్రాల్ పరీక్ష
  • రక్తం గడ్డ కట్టే స్థితిని పర్యవేక్షించాలి
  • క్రమమైన చెక్ అప్స్

జీవనశైలి మార్పులతో పాటు చికిత్సలో అయోర్టిక్ స్టెనోసిస్ యొక్క తీవ్రతను తగ్గించవచ్చు.



వనరులు

  1. Open Access Publisher. Aortic Valve Stenosis. [internet]
  2. Nath, Kumar NN. Valvular Aortic Stenosis: An Update. (2015). J Vasc Med Surg 3: 195.
  3. American Heart Association, American Stroke Association [internet]: Texas, USA AHA: Problem: Aortic Valve Stenosis
  4. niversity of Rochester Medical Center [Internet]. Rochester (NY): University of Rochester Medical Center; Aortic Stenosis in Children
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Aortic stenosis