శరీరం‌లో ఉండే అత్యంత సమృద్ధికరమైన ఖనిజం కాల్షియం మరియు ఇది ఒక సాధారణ ఆహార అంశం కూడా.  ఇది మొత్తం శరీర బరువులో 1 నుండి 2 శాతం వరకు ఉంటుంది, ఎముకలు మరియు దంతాలలో సమృద్ధిగా ఉంటుంది, ఇది మొత్తం కాల్షియం‌లో దాదాపు 90% వరకు ఉంటుంది.

మిగిలిన 1% కాల్షియం రక్తం, శరీర ద్రవాలు, నరాల కణాలు, కండర కణాలు మరియు ఇతర కణాలు మరియు కణజాలాలు లోపల ఉంటుంది, ఇది వాటి సరైన పనితీరులో సహాయపడుతుంది.  కాల్షియం అన్నది మీ జీవితానికి చాలా ముఖ్యమైన ఒక ఖనిజం.  ఇది ఒక సూక్ష్మపోషకారిగా పరిగణించబడినప్పటికీ, ఆహారంలో తక్కువ మొత్తంలో వినియోగించబడుతుంది, తగినంత కాల్షియం  పొందకుండా మీరు దూరంగా ఉండలేరు.

బలమైన ఎముకలు మరియు వాటి ఆరోగ్యకరమైన నిర్మాణం కోసం ఇది ముఖ్యమైనది, శరీరం‌లో దాని ప్రాథమిక పనితీరు.  ఇది అనేక ఇతర విధులను నిర్వహిస్తుంది మరియు అన్ని వయస్సుల వ్యక్తులకు ఇది ముఖ్యమైనది.  మోతాదు మరియు కాల్షియం లోపం‌తో పాటుగా ఈ విధులు ముందుకు చర్చించబడతాయి.

  1. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మరియు వనరులు - Calcium rich foods and sources in Telugu
  2. కాల్షియం యొక్క రోజువారీ అనుమతుల సిఫార్సు - Recommended daily allowance of calcium in Telugu
  3. కాల్షియం ప్రయోజనాలు - Calcium benefits in Telugu
  4. కాల్షియం లోపం - Calcium deficiency in Telugu
  5. కాల్షియం దుష్ప్రభావాలు - Calcium side effects in Telugu

కాల్షియం సహజంగా వివిధ ఆహార ఉత్పత్తుల్లో అధిక మొత్తాలలో  ఉన్నది.  శరీరం యొక్క రోజువారీ కాల్షియం అవసరాల కోసం మీ ఆహారం‌లో ఈ వనరులను చేర్చవలసినదిగా సిఫార్సు చేయడమైనది.  కాల్షియం యొక్క సప్లిమెంట్లు సాధారణంగా కౌంటరు మందులకు పైగా కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ వయస్సుల వారికి విభిన్నంగా ఉంటాయి.  మీ కోసం సరైన సప్లిమెంట్లు ఎంచుకోవడానికి మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

కాల్షియం యొక్క ఉత్తమ ఆహార వనరులు ఇక్కడ ఉన్నాయి:

  • పాలు: సాధారణమైనవి/పూర్తిగా కొవ్వు కలిగినవి/వెన్న తీసినవి
  • జున్ను (అన్ని రకాలు)
  • యోగర్ట్
  • పెరుగు లేదా దహి
  • కాటేజ్ చీజ్ లేదా పనీర్
  • టోఫూ
  • క్రీ‌మ్ మరియు ఐస్‌క్రీ‌మ్ ల వంటి ఇతర పాల ఉత్పత్తులు.
  • బచ్చలికూర, కాలే, స్క్వాష్, క్యాబేజీ లేదా బ్రోకలీ వంటి ఆకుపచ్చ ఆకులు కలిగిన కూరగాయలు
  • తాజా నారింజపండ్లు లేదా వాటి రసం.
  • బలవర్థకమైన తృణధాన్యాలు మరియు కొన్ని ఇతర ప్యాకేజీ ఆహారాలు కూడా కాల్షియం కలిగిఉంటాయి.

ఒకవేళ మీకు లాక్టోజ్ సరిపడకుంటే (పాల ఉత్పత్తులు జీర్ణం చేసుకోలేక యుంటే) లేదా ఒక శాకాహారిగా మీరు ఉంటే, పండ్లు మరియు కూరగాయలు వంటి పాల-సంబంధం కాని వనరుల నుండి కాల్షియం వినియోగాన్ని ఎంచుకోవచ్చు.   బాదం పాలు లేదా సోయా పాలు వంటి పాల-సంబంధం కాని ప్రత్యామ్నాయాలను కూడా మీరు ఎంచుకోవచ్చు, అదే పోషక విలువలు మరియు అదే రుచిని ఇవి అందిస్తాయి.  సప్లిమెంట్ల పైన ఆధారపడకుండా మీ రోజువారీ కాల్షియం అవసరాన్ని కాపాడుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

(మరింత చదవండి: సోయాబీన్ ప్రయోజనాలు)

శరీరం ద్వారా కాల్షియం రోజువారి అవసరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో ఇమిడిఉన్నాయి.  అయితే, మీరు, ఈ విలువలు ఒక అంచనా అని గమనించండి మరియు మీ ఎత్తు, బరువు మరియు పోషక స్థితి పైన వినియోగించాల్సిన అసలు మొత్తం ఆధారపడి ఉంటుంది.

గర్భధారణ మరియు పాలివ్వవలసిన సమయంలో అధిక శరీర డిమాండ్లను చేరడానికి మరియు శిశువులలో లోపాలను నివారించడానికి అధిక మొత్తంలో కూడా అవసరమవుతాయి. మీరు ఈ పట్టికను ఒక ప్రాథమిక గైడ్‌గా ఉపయోగించవచ్చు, అయితే, మీ వైద్యుడి సలహా లేకుండా, ఏవిధమైన అదనపు సప్లిమెంట్లు తీసుకోకూడదని మీకు సిఫార్సు చేయడమైనది.

వయస్సు మరియు సిఫార్సుచేయబడిన రోజువారీ కాల్షియం వినియోగం

  • పుట్టినప్పటి నుండి 6 నెలల వయస్సు వరకు: 200 మి.గ్రా.
  • 7 నెలల నుండి 1 సంవత్సరం వరకు: 260 మి.గ్రా.
  • 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు: 700 మి.గ్రా.
  • 4 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు: 1000 మి.గ్రా.
  • 9 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు: 1300 మి.గ్రా.
  • పెద్ద వయస్సు వారి మోతాదు (50 సంవత్సరాల వరకు): 1000 మి.గ్రా.
  • గర్భధారణ మరియు చనుబాలిచ్చే సమయం‌లో మోతాదు: 1000 మి.గ్రా.
  • పరిపక్వ యుక్తవయస్సు (51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు): పురుషుల కోసం1000 మి.గ్రా.; మహిళల కోసం 1200 మి.గ్రా.
  • లేట్ వృద్దాప్యం (71 సంవత్సరాలు మరియు ఆ సంవత్సరాలు దాటిన వయస్సు): 1200 మి.గ్రా.

బలమైన ఎముకలు మరియు ఆరోగ్యకరమైన దంతాలకు కాల్షియం అవసరమని, మనకందరికీ తెలుసు, అయితే అన్ని వయస్సుల వారి కోసం కాల్షియం యొక్క ఇతర ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

  • బలమైన ఎముకల కోసంకాల్షియం అన్నది ఎముకల ప్రాథమిక నిర్మాణం యొక్క ముఖ్యభాగము.  కాల్షియం యొక్క లోపం ఎముకలు బలహీనంగా తయారుకావడానికి మరియు పగుళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు.  అయితే, శరీరం తన స్వంతంగా కాల్షియం తయారుచేసుకోలేదు కాబట్టి అది బయటి వనరుల నుండి కాల్షియంను తీసుకోవాలి.
  • పిల్లల కోసం: బాల్యం‌లోనే అధికంగా ఎముకల నిర్మాణం ఏర్పడుతుంది కాబట్టి, కాల్షియం పిల్లలకు మరింత ముఖ్యమైనది.  తగినంత మొత్తంలో విటమిన్ డి తో పాటు కాల్షియం‌ను తీసుకున్నప్పుడు, అది పిల్లలలో రికెట్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • మహిళల కోసం: ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళలు కాల్షియం లోపం మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదానికి ఎక్కువగా గురవుతారని తెలుపబడింది.  కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ఋతుక్రమం ఆగిన మహిళల్లో ఎముక పగుళ్లు మరియు పొట్టితనం సమస్యలను నివారించడం‌లో కూడా సహాయపడుతుంది. 
  • వృద్ధుల కోసం: వృద్దులకు వారిలో ఆకలి తగ్గడం మరియు తక్కువ పోషక సంగ్రహణం వల్ల, వారికి ఎక్కువ కాల్షియం అవసరం ఉంటుంది.  అయితే, వారికి సిఫార్సు చేసిన రోజువారి కాల్షియంను సప్లిమెంట్లకు బదులుగా ఆహారం నుండి తీసుకోవడం ఉత్తమం.
  • పళ్ల కోసం: మీ దంతాల యొక్క ప్రాథమిక నిర్మాణం కోసం కాల్షియం అవసరం.  ఈ ఖనిజం యొక్క లోపం మీ దంతాలను పెళుసుగా చేస్తుంది మరియు దంతక్షయానికి గురిచేస్తుంది.  మీ నోటి కుహరంలో పళ్లు సకాలం‌లో విస్ఫోటనం చెందడానికి కూడా కాల్షియం సహాయపడుతుంది.

బలమైన ఎముకల కోసం కాల్షియం - Calcium for strong bones in Telugu

ఆరోగ్యకరమైన మరియు బలమైన ఎముకలు రూపొందించడానికి, మరియు వాటి మంచి నిర్మాణం నిర్వహించడానికి, మీ శరీరానికి తగినంత కాల్షియం అవసరం.  తగినంత కాల్షియం లేకుంటే, మీ ఎముకలు బలహీనంగా, మృదువుగా మారతాయి మరియు విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.  శరీరం తనంతట తానుగా స్వయంగా కాల్షియం సంశ్లేషణ చేయలేదు కాబట్టి, ఆహారం ద్వారా తగినంత మొత్తం‌లో తీసుకోవడం చాలా అవసరం.  విస్తారమైన మొత్తంలో పైన పేర్కొన్న ఆహార పదార్థాలు మీ ఆహారంలో మీరు చేర్చుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.  ఒకవేళ మీ వైద్యుడు సూచించినట్లయితే, మీరు అదనపు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

ఒక వ్యక్తి యొక్క పెరుగుతున్న దశ సమయం‌లో కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం, అయితే, ఇది జీవితాంతం అవసరం, ఎందుకంటే స్థిరంగా ఎముక పునర్నిర్మాణం మరియు మార్పులు మీ శరీరం‌లో జరుగుతాయి, పాత ఎముక నిర్మాణం స్థానం‌లో కొత్త కణజాలం‌తో ఎముక పునర్నిర్మాణం జరుగుతుంది, ఇది బలంగా ఉంటుంది.  ఇతర కారణాలు లేదా మీ వయస్సుతో సంబంధం లేకుండా కాల్షియం యొక్క తగినంత ఆహారం తీసుకోవడం చాలా అవసరమైనదిగా ఇది చేసింది.

మీరు మీ ఆహారం‌లో తగినంత కాల్షియం తీసుకుంటుండగా, అందుబాటులో ఉండే కాల్షియాన్ని మీ శరీరం గ్రహించడం మరియు ఉపయోగించుకోవడం అవసరమని కూడా మీరు నిర్ధారించుకోవాలి.  ఈ కారణాల వల్ల, మీ ఆహారం‌లో కాల్షియం‌తో పాటు, విటమిన్‌ డి ని తగినంత మొత్తంలో తీసుకోవాలని మీకు సిఫార్సు చేయబడింది.

(మరింత చదవండి: విటమి డి వనరులు)

పిల్లల కోసం కాల్షియం - Calcium for kids in Telugu

బలమైన ఎముకలకు కాల్షియం ఒక కీలకమైన పోషకాహారం.  మీ జీవితమంతా కూడా కాల్షియం అవసరం అవుతుంది, అయితే ఇది పిల్లలకు మరింత అవసరం.  ఎందుకంటే బాల్యం మరియు యుక్తవయస్సు సమయం‌లో ప్రధాన ఎముకలు ఏర్పడటం జరుగుతుంది, ఇందులో నుండి ఒక బలమైన సాధ్య ఎముకల శరీర నిర్మాణం బయటకు వస్తుంది, ఈ నిర్మాణం జీవితకాలం పాటు నిర్వహించబడుతుంది.  ఒకవేళ పిల్లలు తగినంత కాల్షియం పొందకపోతే, ఈ ప్రక్తియ ప్రభావితమవుతుంది, ఇది మృదువైన లేదా సరైన ఆకృతి కూడా లేని ఎముకల నిర్మాణం యొక్క అభివృద్ధికి దారితీస్తుంది.

విటమిన్ డి యొక్క లోపం మరియు కాల్షియం లోపం పిల్లల శరీరం‌లో  రికెట్స్ కు కారణమని తెలుపబడింది, కాళ్లు, విల్లు ఆకారం‌లో కనిపించడం మరియు ఎముకల వైకల్యం ద్వారా ఇది వర్గీకరించబడింది. ఈ పరిస్థితి నివారించడానికి మరియు యుక్తవయస్సు ద్వారా ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణ పనితీరుకు పునాదివేయడానికి, పిల్లలు మరియు యుక్తవయస్సు గల వారి ఆహారంలో కాల్షియం మరియు విటమిన్ డి తగినంత‌ ఉండేలా నిర్ధారించుకోవడం అవసరం.

మహిళల కోసం కాల్షియం - Calcium for women in Telugu

అందరిలో అత్యుత్తమ ఎముక ఆరోగ్యానికి కాల్షియం అవసరమైనది అయిననూ, మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత,  అధిక మొత్తం‌లో ఇది అవసరమవుతుంది.  ఇది ఎందుకంటే, ఈ వయస్సులో ఉండే మహిళల శరీరం‌లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వలన, వారిలో బోలు ఎముకల వ్యాధి అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుంది.  బోలు ఎముకల వ్యాధి అన్నది వేగవంతం చేయబడిన ఎముక నష్టం కలిగిఉంటుంది, ఎముకలు బలహీనంగా తయారుకావడానికి మరియు ఈ వయసులో మరింత పెళుసుగా మారడానికి ఇది బాధ్యత వహిస్తుంది.   ఈ ఎముక నష్టం కటి వెన్నెముకలో మరింతగా గుర్తించబడింది, ఇది తరచుగా భంగిమను ప్రభావితం చేస్తుంది మరియు ఈ మహిళల్లో  ఒక గూని ఉండే వ్యక్తి ఆకారం వారిలో కనబడేలా చేస్తుంది.  

పోస్ట్-మెనోపాజల్ గుంపు కంటే ఇతర మహిళల్లో కూడా ఈ బోలు ఎముకల వ్యాధి కనిపిస్తుంది.  ఋతుక్రమ లేమి గల మహిళలు (ఋతు చక్రం లేకపోవడం), వారి శరీరంలో ఈస్ట్రోజెన్ యొక్క తక్కువ స్థాయిల కారణంగా, ఈ వ్యాధి వల్ల అధిక ప్రమాదాన్ని వారు కలిగి ఉన్నారు.

మహిళలు అనోరెక్సియా నెర్వోసా మరియు బులీమియా, వంటి పోషణ-సంబంధిత రుగ్మతలు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కలిగిఉన్నారని గణాంకాలు కూడా వెల్లడించాయి, ఇవి అబ్సెస్సివ్ రుగ్మతలు, అధికంగా సన్నగా మారడానికి, తినాలన్న కోరిక తక్కువగా కలిగిఉండడం ద్వారా ఇది వర్ణించబడింది. కాల్షియం మరియు విటమిన్ డి లతో కలుపుకొని, ఈ మహిళలు తరచుగా పోషకాహార లోపం గలవారిగా ఉంటారు, ఇది వారికి బలహీనంగా ముందుకు వంగిన ఫ్రేమును ఇస్తుంది మరియు పగుళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.   కావలసిన ఫ్రేమ్ మరియు భంగిమను పొందడానికి, మీ ఆహారంలో తగినంత కాల్షియం స్థాయిలు ఉండేలా చూసుకోవడం అవసరం. మహిళల్లో ప్రమాదాలను నిరోధించడానికి 50 సంవత్సరాల్లోపు మహిళలకు 1000 మి.గ్రా. కాల్షియం మరియు 50 సంవత్సరాలకు పైగా వయస్సు గల మహిళలకు 1200 మి.గ్రా. కాల్షియం సిఫార్సు చేయబడింది.

(మరింత చదవండి: విరిగిన ఎముకల చికిత్స)

వృద్ధుల కోసం కాల్షియం - Calcium for the elderly in Telugu

తక్కువ ఆహారం తీసుకోవడం, సూర్యకాంతికి తక్కువగా బయటకు రావడం మరియు సాధారణంగా తగ్గిన ఆకలి వల్ల, వృద్ధులు కాల్షియం మరియు విటమిన్ డి యొక్క తక్కువ స్థాయిలు తరచుగా కలిగిఉంటారు.  పడిపోయే ఎక్కువ ప్రమాదంతో పాటుగా, పగులు యొక్క అధిక ప్రమాదం వారికి సంభవిస్తుంది. అలాగే, వృద్దులు తరచుగా జీర్ణ రుగ్మతలతో బాధపడుతుంటారు, ఇది ఆహారం నుండి తగినంత కాల్షియం సంగ్రహించుకోకుండా  అడ్డుకుంటుంది.

దీనిని ఎదుర్కొనేందుకు, యువకులతో పోలిస్తే వృద్ధులలో, అధిక కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం సిఫార్సు చేయబడింది.  మీ వయస్సు మరియు లింగం కోసం ఆర్‌.డి.ఎ. ను గుర్తించడానికి మీరు పట్టికను సూచించవచ్చు.  అయితే, సప్లిమెంట్లకు వ్యతిరేకంగా కాల్షియం ఆహారం తీసుకోవడం పెంచాలని సూచించబడింది, ఎందుకంటే, వృద్ధులలో ఎముకల పెళుసుదనం మరియు పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సప్లిమెంట్లు దోహదం చేసే అవకాశం తక్కువగా ఉంది.  ఇవి అనేక దుష్ప్రభావాలు కూడా కలిగిఉన్నట్లు తెలుస్తుంది, ఇవి ముందుకు చర్చించడం జరుగుతుంది.

(మరింత చదవండి: బోలు ఎముకల వ్యాధి చికిత్స)

పళ్ల కోసం కాల్షియం - Calcium for the teeth in Telugu

ఆరోగ్యకరమైన మరియు బలమైన ఎముకల కోసం ఎంత ఎక్కువగ కాల్షియం అవసరమో, మీ దంతాలకు కూడా ఇది అంత అవసరం.  కాల్షియం దవడ ఎముకల ఏర్పడటం మరియు వాటి పెరుగుదలలో సహాయపడుతుంది, ఇది దంతాలు కలిగి ఉంటుంది.  దంతాల యొక్క ఎనామిల్ శరీరం యొక్క అత్యధిక ఖనిజ పదార్థం కలిగిఉందని (96%) మీకు తెలుసా, ఇది ఎముక కంటే ఎక్కువగా ఉంటుంది?  మీ ఎముకల కంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి, ఇది గట్టి నిర్మాణమును తయారుచేస్తుంది.

కాల్షియం అన్నది కాల్షియం ఫాస్ఫేట్ రూపం‌లో పళ్లలో ఉంటుంది, ఇది పళ్ల యొక్క గట్టితనానికి బాధ్యత వహిస్తుంది, మరియు ఫాస్ఫరస్ ద్వారా కూడా సహాయం‌ చేయబడుతుంది.  శరీరంలో కాల్షియం యొక్క తక్కువ సీరం స్థాయిలు, దంతక్షయానికి మరింత అవకాశం ఇస్తాయని మరియు దంతాలను పెళుసుగా చేస్తాయని తెలుస్తుంది.  ఇది నోటి కుహరం‌లో దంతాల విస్ఫోటనం ఆలస్యం చేస్తుందని కూడా తెలుస్తుంది. అందువల్ల, కాల్షియం యొక్క తగినంత ఆహారం తీసుకోవడం అవసరమని ఇది నిర్ధారిస్తుంది, అత్యధిక దంత ఆరోగ్యం కోసం విటమిన్ డి మరియు కాల్షియం అవసరం.

(మరింత చదవండి: దంత విస్ఫోటన చక్రం)

కాల్షియం యొక్క పాత్ర - Role of calcium in Telugu

పైన పేర్కొన్నవి కాల్షియం యొక్క ప్రయోజనాలు మరియు ఎముకలు మరియు దంతాల కోసం అవసరమైన ఖనిజం‌గా దాని పాత్ర ఉంది, అయితే కాల్షియం శరీరం‌లో అనేక ఇతర విధులను నిర్వహిస్తుంది.  రక్తం గడ్డకట్టడానికి ఇది చాలా అవసరం, రక్తస్రావం లేదా బ్లీడింగ్  ఆపివేయడానికి ఇది అవసరం.  ఫైబ్రిన్ లేదా రక్తగడ్డ కట్టే ఏర్పాటులో ఇది పాల్గొనడం ద్వారా అలా ఆపివేయడం జరుగుతుంది.

కండరాల సం‌కోచం‌లో కూడా కాల్షియం ముఖ్యమైన పాత్రను  కలిగిఉంది.  కండరాల ప్రొటీన్లతో కలవడం ద్వారా కండరాల సంకోచం మరియు సడలింపుకు ఇది సహాయపడుతుంది.

(మరింత చదవండి: కండరాల నొప్పి చికిత్స)

ఇది కాకుండా, శరీరం‌లోపల హోమియోస్టాసిస్ (స్థిర అంతర్గత వాతావరణం)‌ ను నిర్వహించడం‌లో కూడా ఇది అవసరమని తెలుస్తుంది.

గుండె ఆరోగ్య నిర్వహణలో కాల్షియం యొక్క పాత్రను అధ్యయనాలు కూడా నిరూపించాయి.  ఇది గుండె కండరాల యొక్క సంకోచం నియంత్రిస్తుందని తెలుస్తుంది, ఇది హృడయ స్పందనను రూపొందించడంలో సహాయపడుతుంది.  ఇదిఅధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) మరియు ఎథెరోస్క్లెరోసిస్ (లిపిడ్ నిర్మాణం యొక్క క్లాట్ ఏర్పాటు కారణంగా ధమనులు సంకుచితం కావడం) యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా తెలుస్తుంది.  అయితే, ఈ ప్రయోజనాలు కాల్షియం యొక్క ఆహారం తీసుకోవడంతో సంబంధం కలిగిఉంటాయి, మరియు ఇటువంటి సందర్భాలలో సప్లిమెంట్ల పాత్ర ప్రతికూలంగా ఉన్నట్లు గుర్తించబడింది.  ఒకవేళ సూచించకపోతే, సప్లిమెంట్ల పైన ఆధారపడకుండా, రోజువారీ అవసరాలు తీర్చడానికి, ఆహార వనరుల నుండి కాల్షియం తీసుకోవాలని సూచించబడింది.

ఈ పాత్రలే కాకుండా, పెద్ద ప్రేగు క్యా‌న్సర్ మరియు కొన్ని ఇతర రకాల క్యా‌న్సర్ ప్రమాదాన్ని నివారించడంలో ప్రయోజనకరమైనదిగా కూడా, కాల్షియం సప్లిమెంటేషన్ సూచించబడింది. అయితే, ఈ ఫలితాలు వైరుధ్యంగా ఉన్నాయి.

శరీరం చేత కొవ్వు జీవక్రియలో పాల్గొనడం ద్వారా ఒక బరువు తగ్గించే సప్లిమెంటుగా కాల్షియం పాత్రను అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి.  కాల్షియం సమృద్దిగా ఉండే ఆహారం, బరువు తగ్గించే ప్రభావాలు విస్తరించేందుకు అవకాశం ఉందని ఈ అధ్యయనాలు సూచించాయి, అయితే, స్వతంత్రంగా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుందని కనుగొనబడలేదు.

(మరింత చదవండి: బరువు తగ్గడం కోసం సమతుల్య ఆహారం)

కాల్షియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం స్వల్పకాలిక లోపాలు ఏర్పడటానికి కారణం కాదు.  హైపోకాల్షేమియా అన్నది మూత్రపిండ వైఫల్యం, కడుపు శస్త్రచికిత్స తొలగింపు లేదా  మూత్రవిసర్జనను ఎక్కువ చేయు మందును అధికంగా తీసుకోవడం వంటి ఇతర కారకాలతో కలయిక వల్ల ఏర్పడుతుంది, ఇది వ్యవస్థ నుండి అదనపు కాల్షియం‌ను బయటకు పంపివేసే అవకాశం ఉంది. ఇది కండరాల తిమ్మిరి, మూర్ఛలు, వేళ్లలో స్పర్శరహిత మరియు జలదరింపు సంచలనాలు ద్వారా గుర్తించబడింది, ఇవి దాని లక్షణాలలో కొన్ని. ఆస్టియోమలాసియా, ఎముకల యొక్క మృదుత్వం ద్వారా వర్ణించబడింది, ఇది ఎముకల వైఫల్యం లేదా పగుళ్లకు దారితీస్తుంది, ఇది కూడా కాల్షియం లోపం వలన సంభవించవచ్చు.

(మరింత చదవండి: కాల్షియం లోపం యొక్క లక్షణాలు)

ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు, ఋతుస్రావం లేనటువంటి స్త్రీలు, ఆకలి మందగించిన రోగులు,  పోషకాహార లోపం కలిగిన పిల్లలు మరియు వృధ్ధులు వంటి వ్యక్తులు మరియు కొన్ని సమూహాలలో కాల్షియం లోపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. కాల్షియం‌ కలిగిన ఆహారాన్ని తగినంతగా తీసుకోవడం ద్వారా ఇది నివారించబడుతుంది.  వ్యక్తి అనుభవించిన లక్షణాలు మరియు సంబంధిత రుగ్మత పైన నిర్వహణ మరియు చికిత్స ఆధారపడి ఉంటుంది.

(మరింత చదవండి: దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి చికిత్స)

Vitamin C Capsules
₹599  ₹999  40% OFF
BUY NOW

నోటి మార్గం ద్వారా కాల్షియం యొక్క వినియోగం సాధారణ పరిమితుల్లో తీసుకున్నప్పుడు,  ఏ విధమైన ముఖ్యమైన దుష్ప్రభావాలను కలిగించదు, కాల్షియం సప్లిమెంట్లు వాటిని కలిగించే అవకాశం ఉంది.  సప్లిమెంట్ల యొక్క మోతాదు మరియు చికిత్స యొక్క వ్యవధి పైన ఆధారపడి ఈ దుష్ప్రభావాలు తేలికపాటివిగా లేదా తీవ్రంగా ఉంటాయి.

సప్లిమెంట్ల నుండి అధిక కాల్షియం తీసుకోవడం అన్నది  మలబద్ధకం మరియు ఇతర జీర్ణాశయాంతర లోపాలకు కారణం కావచ్చు. ఇది ఇనుము లేదా జింకు యొక్క శోషణను కూడా తగ్గించవచ్చు.  ఆహార వనరుల నుండి కాల్షియం తీసుకుంటున్నప్పుడు, ఇటువంటి అధిక మోతాదు సాధారణంగా సాధ్యపడదు.

అధిక మోతాదులో, కాల్షియం సప్లిమెంట్లు కిడ్నీలో రాళ్లను మరింత ఉధృతం చేస్తాయి లేదా ఏర్పడటానికి కారణం కావచ్చు.  అధిక మోతాదులు ఎథెరోస్క్లెరోసిస్ యొక్క పెరిగిన ప్రమాదం‌తో కూడా ముడిపడి ఉంటాయి, ధమనుల గోడల లోపల కాల్షియం అయాన్ల అధిక నిక్షేపణగా ఇది ప్రారంభం‌లో కనిపిస్తుంది.

అధికంగా కాల్షియం‌ను తీసుకోవడం ఇతర హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

సప్లిమెంట్ల యొక్క ఈ దుష్ప్రభావాల కారణంగా, రోజువారీ కాల్షియం అవసరాలకు తగినట్లుగా ఆహార వనరుల నుండి తీసుకోవాలని సిఫార్సు చేయబడింది, కాబట్టి మీరు అధిక మోతాదులో కాకుండా తక్కువగా తీసుకుంటారు.  సిఫార్సు చేసిన రోజువారీ భత్యాన్ని పరిధిలోపలనే తినాలని మీకు సిఫార్సు చేయబడింది, అది సాధారణ పెద్దలకు 1000 మి.గ్రా.ల వరకు ఉంటుంది. అన్ని సందర్భాలలో, సప్లిమెంట్ల ద్వారా 3000 మి.గ్రా.ల గరిష్ట పరిమితిని దాటి వెళ్లకూడదని ఇది సిఫార్సు చేయబడింది.

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Calcium in diet
  2. Institute of Medicine (US) Standing Committee on the Scientific Evaluation of Dietary Reference Intakes. Dietary Reference Intakes for Calcium, Phosphorus, Magnesium, Vitamin D, and Fluoride. Washington (DC): National Academies Press (US); 1997. 4, Calcium.
  3. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; Calcium.
  4. National Osteoporosis Foundation I 251 18th St. S, Suite #630 I Arlington, VA 22202 I (800) 231-4222. Calcium/Vitamin D.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Calcium and bones
  6. Center for Young Women’s Health. Calcium. Boston Children's Hospital [Internet]
  7. International Osteoporosis Foundation. Why seniors are more vulnerable to calcium and vitamin D deficiency. Switzerland
  8. Heaney RP et al. Calcium nutrition and bone health in the elderly. Am J Clin Nutr. 1982 Nov;36(5 Suppl):986-1013. PMID: 6765074
  9. A G Szent-Györgyi. Calcium regulation of muscle contraction.. Biophys J. 1975 Jul; 15(7): 707–723. PMID: 806311
  10. Health Harvard Publishing, Published: January, 2017. Harvard Medical School [Internet]. Calcium and heart disease: What is the connection?. Harvard University, Cambridge, Massachusetts.
  11. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Calcium supplements
Read on app