పురుషాంగం వాపు లేదా బాలనిటిస్ అంటే ఏమిటి?
శిశ్నాగ్రం వాపు (లేక బాలనిటీస్/penile inflammation) అనేది పురుషాంగం యొక్క తలభాగం (glans penis) లో వాపు కలగడమే. పురుషాంగం యొక్క తలభాగంపై నున్న చర్మం వెనక్కి పోని పురుషులకొచ్చే సామాన్య పరిస్థితి లేక సమస్య ఇది. (శస్త్రచికిత్సలో తొలగించబడని శిశ్నాగ్ర భాగపు చర్మం). ఈ సమస్య సరిగా శుభ్రపరుచుకోని కారణంగా దాపురించొచ్చు. శిశ్నాగ్రపు చర్మం కింద ఫేనం (yeast), ఇతర సూక్ష్మంగజీవులు పేరుకుపోవడం వల్ల ఇది పురుషులకు సంభవిస్తుంది. ఇది శిశ్నాగ్రం వాపుకు (బాలనోపోస్తిటిస్) దారి తీస్తుంది. శిశ్నము ముందుభాగం, దాని పైనున్న చర్మం కూడా వాపుకు గురవుతుంది. శిశ్నాగ్రం మరియు దాని చుట్టుపక్కల పురుషాంగం కణజాలం యొక్క వాపుకు ఇది దారితీస్తుంది. ఇది ఎక్కువగా హెచ్ ఐ వి (HIV), డయాబెటిస్ మరియు క్యాన్సర్ వంటి రోగనిరోధక శక్తిలోపం కలిగిన వ్యక్తులలో కనిపిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా శిశ్నాగ్రం వాపు (లేక బాలనిటీస్) లో కనిపించే చికిత్సా-సంబంధ లక్షణాలు:
- దురద
- సున్నితత్వం
- వచ్చిన ప్రాంతంలో నొప్పి లేదా బాధాకరమైన అంగస్తంభనలు
- ఎరుపు మరియు దద్దుర్లు
- వాపు
- తీక్షణమైన వాసనతో కూడిన ఉత్సర్గ
శిశ్నాగ్రం వాపు (బాలనిటిస్) లో కనిపించే (బలనిటీస్ ను అనుకరించే) ఇతర లక్షణాలు/ పరిస్థితులు:
- ఫిమోసిస్ (శిశ్నాగ్రం పైన ఉండే చర్మం యొక్క బిగుతు లక్షణం)
- పారాఫిమోసిస్ (వెనక్కి పోయిన శిశ్నాగ్రపు చర్మాన్ని దాని అసలు స్థానానికి తిరిగి లాగడం సాధ్యం కాదు)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది సాధారణంగా శిశ్నాగ్రం (గ్లెన్) యొక్క చర్మంపై ఉండే సూక్ష్మజీవుల పెరుగుదలతో కలుగుతుంది. వెచ్చని తడి వాతావరణం వంటి పరిస్థితులు శిశ్నాగ్రం లో చర్మం కింద సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలమైనది. ఇది ప్రధానంగా ఫంగస్ కాండిడా అల్బికెన్స్ కారణంగా దాపురించిన సంక్రమణ. డయాబెటిస్ మరియు కొన్ని చర్మ పరిస్థితులు బాలనిటిస్కు కారణం కావచ్చు మరియు ఇది మరింత తీవ్రతరమూ కావచ్చు పరిశుభ్రత పాటించకపోవడం అనేది కూడా శిశ్నాగ్రం వాపుకు కారణమవుతుంది. చెమట, బాక్టీరియా, ఇతర సూక్ష్మ శిథిలాలు మరియు మృత చర్మం శిశ్నాగ్రాన్ని కప్పిన చర్మం కింద చేరి దురద మరియు చికాకు కలిగించవచ్చు. శిశ్నాగ్రంపై బిగుతుగుండే చర్మం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇట్టి సమయంలో శిశ్నాగ్రంభాగాన్ని సరిగా శుభ్రపరచడం సాధ్యం కాకపోవచ్చు.
ఇతర కారణాలు:
- చర్మశోథలు / అలెర్జీ పరిస్థితులు: సోప్, సుగంధ ద్రవ్యాలు, డిటర్జెంట్లు మరియు స్పెర్మిసైడ్ల కారణంగా చర్మం యొక్క వాపు, దద్దుర్లు మరియు చికాకు కలిగించడం.
- ఇన్ఫెక్షన్లు: గనేరియా, హెర్పెస్ మరియు సిఫిలిస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు శిశ్నాగ్రం వాపు (బాలనిటిస్) యొక్క లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి.
శిశ్నాగ్రం వాపు వ్యాధిని ఎలా నిర్ధరించేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
కింది వాటి ఆధారంగా శిశ్నాగ్రం వాపు వ్యాధి (బాలనిటిస్) ని నిర్ధారణ చేస్తారు:
- చికిత్సా-సంబంధ (క్లినికల్) లక్షణాలు: దురద మరియు నొప్పి తో కూడిన ఎరిథెమాటస్ దద్దుర్లు.
- స్వరూపం: చిన్న చిన్న మెరిసే మొటిమలతో గూడిన ఎర్ర రంగు మచ్చలు (రెడ్ పాచెస్).
- సూక్ష్మదర్శిని: సంక్రమణకు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించడానికి.
- స్కిన్ బయాప్సీ: నిర్ధారణ అస్పష్టంగా ఉన్నట్లయితే మాత్రమే.
- మూత్ర విశ్లేషణ: గ్లూకోజ్ ఉనికిని తనిఖీ చేయడానికి.
చికిత్స కింది వాటిని కలిగి ఉంటుంది:
- బ్యాక్టీరియల్ సంక్రమణ చికిత్సకు యాంటీబయాటిక్స్.
- వాపు కోసం స్టెరాయిడ్ క్రీమ్లు.
- ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి యాంటీ-ఫంగల్ ఔషధాలను ఉపయోగించవచ్చు.
- తీవ్రమైన వ్యాధి సందర్భాల్లో, సున్తీ లేక సున్నతి (circumcision) అనేది ఉత్తమ చికిత్స ఎంపికగా ఉండవచ్చు, ఎందుకంటే గట్టి చర్మం ప్రాంతాన్ని శుభ్రపరిచేలా చేస్తుందిది.
- వాపుకు గురైన శిశ్నాగ్రం ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సాధారణ ఉప్పునీరే (సెలైన్ తో కూడిన నీరు) ఉపయోగించొచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు (Self-care tips):
- నొప్పి పూర్తిగా తొలగిపోయే వరకు, లైంగిక సంబంధ చర్య మరియు హస్త ప్రయోగాన్ని చేసుకోకండి.
- అవసరమైనప్పుడు తీసుకునేందుకు నొప్పి-నివారణ ఔషధాలను నోట్ చేసుకోండి
- ఎర్రబడిన పురుషాంగం చివర ప్రాంతంలో ఐస్ ప్యాక్ ను ఉంచినట్లైతే వాపును, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
- పురుషాంగానికి అనువుగా ఉండేట్టు కుట్టబడిన సుడి కల్గిన చెడ్డీల్ని (snug-fitting underpants) ధరించడం ద్వారా బాధాకరమైన నొప్పి కల్గిన శిశ్నఅగ్రానికి మద్దతు ఇస్తుంది.
- పురుషాంగానికి చుట్టూ లేదా మూత్రంలో రక్తం పడుతుందేమో తనిఖీ చేయండి, అలా ఒకవేళ రక్తం గనుక కనబడితే ఇది తీవ్రమైన మంట లేదా గాయం అయ్యుండే అవకాశాన్ని సూచిస్తుంది మరియు ఇటువంటి సందర్భాల్లో వైద్యుడిని వెంటనే సంప్రదించడం అవసరం.
- కఠినమైన రసాయనిక పదార్థాలచే తయారు చేయబడిన సబ్బుల వాడకాన్ని నివారించండి. సబ్బు లేకుండా పురుషాఅంగాన్ని శుభ్రపరచుకోవడాన్ని మేము మీకు సిఫార్సు చేస్తున్నాం.
- మూత్రవిసర్జన సమయంలో శిశ్న-అగ్రం పైనుండే చర్మాన్ని (foreskin) తిరిగి సరి చేసేందుకు ప్రయత్నించండి. వాపుకు గురైన శిశ్న-అగ్రభాగాన్ని శుభ్రపరుస్తూండండి, దీనివల్ల మళ్ళీ అంటురోగం సోకకుండా ఉంటుంది.
- భాగస్వాములకు సాధారణంగా చికిత్స చేయరు. చికిత్స చేయాలంటే వాళ్ళకిద్దరికీ వ్యాధి లక్షణాలుండాలి.