myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

బ్లాస్టోమైకోసిస్ అంటే ఏమిటి?

బ్లాస్టోమైకోసిస్ అనేది బ్లాస్టోమైసిస్ డెర్మటిటిడిస్ (Blastomyces dermatitidis) అనే ఫంగస్ వలన సంభవించే ఒక అరుదైన వ్యాధి. తడి నెల పై ఉన్న ఫంగల్ బీజాంశాలను (fungal spores) శ్వాసించడం వలన ఫంగస్ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు చర్మం, మూత్ర వ్యవస్థను, ఎముకలు మరియు నాడీ వ్యవస్థలను బ్లాస్టోమైకోసిస్ ప్రభావితం చేస్తుంది. వ్యాధి యొక్క లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి, తరువాతి దశలో చర్మం (దద్దుర్లు మరియు పులిపిరులూ వంటివి) మీద ప్రభావం ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బ్లాస్టోమిటోసిస్ యొక్క లక్షణాలు వల్ల ఫంగస్ బీజాంశాన్ని ((fungal spores) పీల్చుకున్న తర్వాత 3 వారాలు మరియు 3 నెలల మధ్య కనిపిస్తుంది. లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి మరియు కొన్ని రోజులలోనే పరిష్కరించబడతాయి. చాలామంది వ్యాధి సోకిన వ్యక్తులలో లక్షణాలు కనిపించవు కూడా. అయినప్పటికీ, అంటువ్యాధి శరీర వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతున్నప్పుడు, ప్రత్యేకంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో అవి కనిపిస్తాయి.

 • జ్వరం
 • రాత్రుళ్లు చెమటలు పట్టడం లేదా శరీరం నుండి వేడి ఆవిర్లు
 • దగ్గు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తున్నప్పుడు రక్తంతో కలిసిన కఫం
 • ఛాతి నొప్పి
 • కీళ్ళు నొప్పి మరియు కండరాల నొప్పి
 • తీవ్రమైన అలసట మరియు అసౌకర్యం
 • ఎటువంటి ఖచ్చితమైన కారణం లేకుండా బరువు తగ్గుదల
 • న్యుమోనియా మరియు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (respiratory distress syndrome) వంటివి ఊపిరితిత్తుల బ్లాస్టోమైకోసిస్ యొక్క తీవ్రమైన సందర్భాలలో సంభవిస్తాయి.
 • చర్మానికి సంబంధించిన లక్షణాలు మొటిమలు లేదా పుండ్లులా కనిపిస్తాయి మరియు అవి బూడిద రంగు లేదా ఊదా రంగులో ఉంటాయి. అవి ముక్కు లేదా నోటి లోపల కూడా కనిపిస్తాయి మరియు సాధారణంగా నొప్పిలేకుండా ఉంటారు. మొటిమలు లేదా పుండ్లు సులభంగా రక్తస్రావం చేయవచ్చు.
 • ఎముకులలోకి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నప్పుడు ఎముక కణజాల నష్టం మరియు చీము సంభవిస్తుంది.
 • వృషణాలు, ప్రోస్టేట్ మరియు ఎపిడైమిస్ కూడా బ్లాస్టోమైకోసిస్ వలన ప్రభావితం అవుతాయి.
 • మెనింజైటిస్ (Meningitis) అనేది నాడీ వ్యవస్థలోకి బ్లాస్టోమైకోసిస్ చేరినప్పుడు సంభవిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

బ్లాస్టోమైసీస్ (blastomyces) అనే ఫంగస్ బ్లాస్టోమైకోసిస్ కు కారణమవుతుంది. ఇది సాధారణంగా తడిగా ఉన్న నేలలో, కుళ్ళుపోతున్న కలపలో లేదా పొడి ఆకులపై ఉంటుంది. శ్వాసించినప్పుడు, ఉన్నప్పుడు, ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు వివిధ బాగాలకు వ్యాపిస్తుంది. బ్లాస్టోమైసీస్ (blastomyces) యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ఆఫ్రికాలలో సర్వసాధారణం.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు ఆరోగ్య చరిత్ర, లక్షణాలు, శారీరక పరీక్ష మరియు వివిధ పరీక్షల ఆధారంగా బ్లాస్టోమికోసిస్ను నిర్ధారణ చేస్తారు.

ప్రయోగశాల పరీక్షలు:

 • చర్మం లేదా గొంతు నుండి తీసిన పదార్దాల నుండి ప్రయోగశాలలో కృత్రిమ మాధ్యమంలో ఫంగస్ యొక్క సాగు లేదా ఉత్పత్తిని చేస్తారు.
 • ఒక ప్రత్యేక రసాయనం (10% పొటాషియం హైడ్రాక్సైడ్) తో కఫం కలపడం ద్వారా ఫంగస్ను గుర్తించడంలో కఫ పరీక్ష సహాయపడుతుంది.
 • సూక్ష్మదర్శినిలో ప్రభావితమైన కణజాలం నమూనాలో ఫంగస్ను గుర్తించడానికి హిస్టోలాజిక్ పరీక్ష (histologic test) జరుగుతుంది.
 • సంక్రమణ (infection) కారణంగా ఊపిరితిత్తులలో అసాధారణతను గుర్తించటానికి ఛాతీ X- రే.
 • వెన్ను మరియు మెదడులో ఫంగస్ను గుర్తించడానికి సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (cerebrospinal fluid) విశ్లేషణ.

బ్లాస్టోమికోసిస్ను సాధారణంగా యాంటీ ఫంగల్ మందులతో చికిత్స చేస్తారు. ఇట్రాకోనజోల్ (itraconazole) మరియు అమఫోటెరిసిన్ B (amphotericin B) అనేవి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి బ్లాస్టోమిటోసిస్ చికిత్సకు సాధారణంగా ఉపయోగించే యాంటీ ఫంగల్ మందులు. రోగనిరోధక స్థితి మరియు సంక్రమణ యొక్క తీవ్రతను బట్టి 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు చికిత్స విధానం ఉంటుంది.

 1. బ్లాస్టోమైకోసిస్ की दवा - Medicines for Blastomycosis in Hindi

బ్లాస్టోమైకోసిస్ की दवा - Medicines for Blastomycosis in Hindi

బ్లాస్టోమైకోసిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
CanditralCANDITRAL 100MG CAPSULE 4S157
SyntranSYNTRAN 200MG CAPSULE 4S350
Candiforce CapsuleCandiforce 100 Capsule38
OnitrazONITRAZ 100MG CAPSULE 10S156
Onitraz ForteOnitraz Forte Capsule145
PanitraPanitra 200 Mg Capsule0
ZyitraZYITRA 100MG CAPSULE 7S0
LantrazLANTRAZ 100MG CAPSULE 10S125
SiditraSiditra 100 Mg Capsule26
SporanoxSporanox 100 Mg Capsule260
TinitrazTINITRAZ 100MG CAPSULE 10S156
TitraTitra 100 Mg Capsule0
Traco GoldTraco Gold 100 Mg Capsule69
CanditzCANDITZ 200MG TABLET 10S215
Ceastra XlCeastra Xl 100 Mg Tablet73
EntozoleEntozole Eye Drops57
FixtralFIXTRAL 100MG CAPSULE 7S140
FungeehealFungeeheal 100 Mg Capsule102
IntranilIntranil 100 Mg Capsule216
Fungiforce itraFUNGIFORCE ITRA 100MG CAPSULE 4S0
ItaproItapro 100 Mg Tablet38
ItasporITASPOR 100MG CAPSULE 4S176
ItrabondITRABOND 100MG CAPSULE 7S81
ItracutisITRACUTIS 200MG CAPSULE 10S240

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Blastomycosis
 2. U.S. Department of Health & Human Services. Symptoms of Blastomycosis. Centre for Disease and Prevention
 3. Miceli A, Krishnamurthy K. Blastomycosis. Blastomycosis. StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-
 4. Michael Saccente, Gail L. Woods. Clinical and Laboratory Update on Blastomycosis. Clin Microbiol Rev. 2010 Apr; 23(2): 367–381. PMID: 20375357
 5. Michael Saccente, Gail L. Clinical and Laboratory Update on Blastomycosis. American Society of Microbiology
और पढ़ें ...