అధిక రక్తపోటు - High BP (High Blood Pressure) in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 14, 2018

March 06, 2020

అధిక రక్తపోటు
అధిక రక్తపోటు

సారాంశం

అధిక రక్తపోటు అంటే శరీరంలోని రక్తం యొక్క ఒత్తిడి  అనారోగ్య స్థాయిలకు చేరిందన్నమాటే. అధిక రక్తపోటును “హైపర్ టెన్షన్” అని కూడా అంటారు. రక్తపోటు అనేది రక్తనాళాల (ధమనుల) గోడలపై రక్తం  తన ప్రసారంలో పెంచే శక్తి మరియు గుండె రక్తాన్ని పంపు చేసినపుడు రక్తం అందుకునే నిరోధకవిస్తరణా శక్తి. దీర్ఘకాలిక అధిక రక్తపోటు గుండె-సంబంధిత (హృదయ) ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అధిక రక్తపోటు విస్తృతంగా రెండు ప్రధాన రకాలుగా విభజించబడుతుంది-ప్రాధమిక లేదా అత్యవసర రక్తపోటు మరియు ద్వితీయ రక్తపోటు. స్వల్ప రక్తపోటు ఏ లక్షణాలను పొడ జూపకుండా (వ్యాధిలక్షణ రహితంగా) ఉండచ్చు, అందువల్ల, రక్తపోటులో తేలికపాటి పెరుగుదల ఉన్నవారు తమకేర్పడిన పరిస్థితి గురించి వారికి తెలియదు. అయితే, అధిక రక్తపోటు కల్గినవారిలో, తలనొప్పి వంటి భయపెట్టే రోగలక్షణాలు ఉంటాయి. అధిక రక్తపోటు అనేది కొన్ని అంతర్లీన లేదా సంబంధిత ఆరోగ్య సమస్యల ఫలితంగా దాపురించి ఉండవచ్చు. అయితే, కొన్నిసార్లు, అధిక రక్తపోటుకు గల కారణం తెలియకుండానే ఉంటుంది. ప్రధానంగా, ఆహారంలో ఉప్పును నియంతరించడం, నిత్యశారీరక వ్యాయామం చేయడం మరియు తగిన మందులు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును సమర్థంగా నియంత్రించవచ్చు.

రోగిలో అధిక రక్తపోటును కనుగొనడంలో ఆలస్యం చేసినా, కనుగొన్న తర్వాత చికిత్సను ఆలస్యంగా మొదలుపెట్టినా, గుండెకు రక్త సరఫరా తక్కువై లేదా పూర్తిగా నిల్చిపోయి, తీవ్రమైన గుండెపోటు, (తీవ్రమైన మయోకార్డియల్ ఇంఫార్క్షన్) మరియు కంటి సమస్యలు (రెటినోపతీ) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలా అధిక రక్తపోటును ఆలస్యంగా కనుగొన్నపుడు, దాని తదుపరి పరిణామం అంతర్లీనంగా ఉండే వ్యాధికారకం మరియు స్వీకరించిన చికిత్సపై ఆధారపడి ఉంటుంది. అధిక రక్తపోటు, చక్కెరవ్యాధి లేదా డయాబెటిస్ ఉన్నవారికి వచ్చినట్లైతే అది వారిపై ప్రభావం చూపి కీడు చేసే ప్రమాదముంది. జీవితాంతం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మరియు జీవితాంతం నిబద్ధతగా ఔషధాలను తీసుకోవడం అధిక రక్తపోటు సక్రమ నిర్వహణకు చాలా అవసరం. పరిస్థితి అలాగున్నపుడు, అధిక రక్తపోటు ఉన్నవారు ఔషధాలకు కట్టుబడి జీవనం సాగించడం కష్టం. అందుకే, నియతకాలికంగా ఆసుపత్రులకెళ్లి వైద్యులను సందర్శించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం మరియు వైద్యుని సలహాలను పాటించి ఎప్పటికప్పుడు తగిన జీవనశైలి మార్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నిర్వహించడంలో రోగులు కృతకృత్యులవుతారు.

అధిక రక్తపోటు (హై బిపి) అంటే ఏమిటి? - What is High Blood Pressure in Telugu

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో సంభవించే మరణాలకు అధిక రక్తపోటు ప్రధాన కారణంగా పరిణమించింది. అధిక రక్తపోటునే “హైపర్ టెన్షన్” గా పిలుస్టారు. ఇది చాలా సాధారణ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. మీకు అధిక రక్తపోటు ఉందని తేలిన తర్వాత, ఇక జీవితాంతం “యాంటీ-హైపర్ టెన్సివ్ ట్రీట్మెంట్” చికిత్సను తీసుకొంటూ తగిన జీవనశైలి మార్పులను చేసుకోవడం అవసరమవుతుంది. గుండె వ్యాధులు, స్ట్రోకులు, ఇస్కీమిక్ కార్డియాక్ వ్యాధులు మరియు మూత్రపిండ వైఫల్యాలకు అధిక రక్తపోటు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. అందువల్ల, అధిక రక్తపోటును బాగా నియంత్రించకపోతే అది ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు మరియు దాని చికిత్సా పరిణామ-ఫలితాలు ఆ వ్యక్తి యొక్క జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు అధిక రక్తపోటు కల్గిన ఆ వ్యక్తి యొక్క కుటుంబ చరిత్రకు సంబంధించినవి.  30 ఏళ్ల వయస్సు తరువాత సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల రక్తపోటును అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలకు సమర్థమంతంగా పర్యవేక్షించేందుకు సహాయపడతాయి. ఇందుగ్గాను, ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రక్తపోటు పర్యవేక్షణా యంత్రాల’ను ఇంట్లోనే వాడవచ్చు. ఈ రక్తపోటు పర్యవేక్షణా యంత్రాలు ఉపయోగించడం సులభం మరియు వాటి రీడింగులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అధిక రక్తపోటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి మరియు 2020 నాటికి ఇది వైకల్యం మరియు మరణానికి ప్రధాన కారణమని అంచనా వేయబడింది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Hridyas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like high blood pressure and high cholesterol, with good results.
BP Tablet
₹899  ₹999  10% OFF
BUY NOW

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క లక్షణాలు - Symptoms of High Blood Pressure in Telugu

అధిక రక్తపోటు యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు పొడజూపకుండా ఎంత కాలం కావాలో అంత కాలాన్ని గడిపేయగలదు. అధిక రక్తపోటును కలిగిఉన్న చాలా మందికి తమకు అధిక రక్తపోటు దాపురించిందన్న సంగతి అసలు తెలియదు. కనుక,, మీరు మీ డాక్టర్ను క్రమం తప్పకుండా సందర్శించండి, అలా వైద్యుడి సందర్శనం, వైద్యపరీక్షలు చేయిం కోవడం వల్ల మీ రక్తపోటు స్థాయిలలో ఎటువంటి మార్పులు వస్తున్నాయనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది.

మీకు నియంత్రించలేని రక్తపోటు గనుక ఉంటే, మీరు ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:

  • తీవ్రమైన తలనొప్పి - అధిక రక్తపోటు వలన మీకు తల చాలా భారమైనట్లు తోచవచ్చు, లేదా తలానొప్పితో మీరు బాధపడవచ్చు.
  • అలసట లేదా గందరగోళం- మీరు బలహీనమైన లేదా అసౌకర్యం లేదా నిర్లక్ష్యం కావచ్చు.
  • దృష్టి సమస్యలు - మీకు దృష్టి మసకబారడం, లేదా  వస్తువులు రెండుగా కనబడ్డం జరగొచ్చు.
  • ఛాతీ నొప్పి - మీకు ఛాతీలో పదునైన నొప్పి ఉన్నట్లు, లేదా ఎదలో భారంగా ఉన్నట్లు అనిపించవచ్చు.
  • శ్వాస సమస్య - మీరు సరిగ్గా శ్వాస తీలుకోలేకపోతున్నట్లు మీకు అనిపించొచ్చు.
  • గుండె దడ (palpitation) - మీరు మీ గుండె ఎక్కువగా కొట్టుకోవడాన్ని మీరే వినగలరు. దీన్నే “గుండె దడ” అని కూడా అంటారు.
  • మూత్రంలో రక్తం - మీకు అరుదుగా నలుపు రంగు మూత్రం పోతున్నట్లు అనిపించొచ్చు  లేదా కొద్దిగా గోధుమ రంగు మూత్రాన్ని గమనించవచ్చు.

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క కారణాలు - Causes of High Blood Pressure in Telugu

అధిక రక్తపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అధిక రక్తపోటుకు గురైనట్లైతే అందుకు కారణాలు తెలుసుకునేందుకు మీ డాక్టర్ మీ వ్యక్తిగత చరిత్రను అడగొచ్చు. మీకున్న అధిక రక్తపోటును గుర్తించేందుకు,  గల కారణాన్ని పసిగట్టేందుకు మీ ఆహారం గురించి, అలవాట్లు గురించి , మరియు మీ కుటుంబ చరిత్ర వంటివాటిని డాక్టర్ అడుగుతాడు. మీకున్న అధిక రక్తపోటుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు.

  • చాలా సార్లు, అధిక రక్తపోటు గుర్తించబడకుండా పోతుంటుంది. మరియు అధికరక్తపోటుకు కారణం తెలియకుండా పోతూఉంటుంది.
  • పెరిగిన బరువు, డయాబెటిస్ (చక్కెరవ్యాధి), మూత్రపిండ వ్యాధి మరియు నిద్రపోతున్నప్పుడు శ్వాసలో కష్టపడడం వంటి జబ్బులకు అధిక రక్తపోటు ద్వితీయమవుతుంది.
  • ఊబకాయం - ఊబకాయంతో కూడిన అధిక బరువు రక్తపోటుకు కారణమవచ్చు.
  • ఒత్తిడి - ఒత్తిడితో కూడిన జీవితం రక్తపోటును ప్రభావితం చేయవచ్చు.
  • జన్యు కారణాలు - అధిక రక్తపోటు కుటుంబాలలో వంశ పారంపర్యంగా  వస్తుంటుంది.
  • అనారోగ్యకరమైన జీవన విధానం - పొగాకు ధూమపానం మరియు లోనికి పొగాకును నమిలి సేవించడడం, అధిక మద్యపానం, జంక్ ఫుడ్ తినడం వంటివి అధిక రక్తపోటుకు కారకాలవచ్చు.
  • గర్భం - గర్భప్రేరిత అధిక రక్తపోటు కొందరు ఆడవాళ్ళలో చూడవచ్చు.
  • డ్రగ్స్- మీరు తీసుకొంటున్న కొన్ని మందులు అధిక రక్తపోటు ప్రబలడానికి కారణం వహిస్తాయి.

ప్రమాద కారకాలు / Risk factors

అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే పలు అంశాలు ఉన్నాయి. అవి ఏవంటే:  

  • వయస్సు - మీ వయస్సు పెరుగుతున్నకొద్దీ మీ రక్తపోటు పెరుగుతుంది.
  • సెక్స్ - ఇది మహిళల కంటే పురుషులలోనే చాలా సాధారణం.
  • కుటుంబ చరిత్ర - మీ తండ్రి తరపు లేదా తల్లి తరపు కుటుంబ సభ్యులు గనుక అధిక రక్తపోటు చరిత్రను కలిగి ఉంటే, మీరు క్రమం తప్పకుండా రక్తపు ఒత్తిడి పరీక్షల్ని చేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కుటుంబ చరిత్రను బట్టి అధిక రక్తపోటు మీకు కూడా రావచ్చు కాబట్టి.
  • ఊబకాయం - ఎవరైతే బరువెక్కువుంటారో, వారు బరువు పెరగేకొద్దీ వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంటాయి.
  • కూర్చునివుండే నిశ్చల స్థితి జీవనశైలి/Sedentary lifestyle - ఎలాంటి శారీరక కార్యకలాపాలు లేకుండా ఎప్పుడూ కూర్చునే ఉండే నిశ్చల జీవనశైలి మీ బరువును పెంచుతుంది, తద్వారా మీ రక్తపోటు కూడా  పెరుగుతుంది. కాబట్టి, మీ రక్తపోటును నిర్వహించడానికి వ్యాయామం మరియు శారీరక శ్రమ ముఖ్యమైనవి.
  • పొగాకు సేవనం - పొగాకు సేవనం (అంటే పొగాకు నమిలి మింగడం) అధిక రక్తపోటుకు చాలా ప్రమాదకరమైన ప్రమాదకారకంగా ఉంటుంది, ఎందుకంటే, పొగాకు సేవనం వల్ల ధమనుల (నరాల) గోడల మందం పెరిగి తద్వారా మనిషి ధమనులు మూసుకుపోవడం జరుగుతుంది.
  • అధిక ఉప్పు తీసుకోవడం - అధిక రక్తపు ఒత్తిడికి ఆహారంలో తీసుకునే ఉప్పు ప్రమాణం పెరగడం ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంటుంది, ఎందుకంటే మన శరీరంలోకెళ్ళే ఉప్పు ద్రవాలను కలిగి ఉంటుంది, కనుక ఆలా పెరిగిన ఉప్పు ప్రమాణం గుండె మీద బరువును పెంచుతుంది.
  • మద్యపానం - మితం మించిన మద్యపానం అనేది గుండెకు ప్రమాదకరమే. మహిళలైతే ఒకటి కంటే ఎక్కువ పానీయాలు తీసుకోవడం మరి పురుషులైతే రెండింటి కంటే ఎక్కువ మధ్య పానీయాలు తీసుకోవడం రక్తపోటును పెంచి ప్రమాదాన్ని దాపురింపజేస్తాయి.
  • ఒత్తిడితో కూడిన జీవితం - మీ జీవితంలో ఒత్తిడిని ఎంత ఎక్కువగా పెంచుకుంటారో, అంతే ఎక్కువగా అధిక రక్తపోటు వలన మీరు బాధపడతారు అప్రధాన/గౌణ పరిస్థితులు- చక్కెరవ్యాధి/మధుమేహం వంటి పరిస్థితులు హైపర్ టెన్షన్ ను మరింత పెంచే ప్రమాదముంది.
  • గర్భం - ఇది కొందరు స్త్రీలలో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
Spirulina Capsules
₹539  ₹599  10% OFF
BUY NOW

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క నివారణ - Prevention of High Blood Pressure in Telugu

మీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా అధిక రక్తపోటును నివారించడం లేదా ఈ వ్యాధి మనకు దాపురించడాన్ని ఆలస్యం చేయడం సాధ్యపడుతుంది. ఇక్కడ అధిక రక్తపోటును దూరంగా ఉంచడంలో సహాయపడే పలుకారకాలను వివరిస్తున్నాం. ఇవి అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడతాయి:

  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
    చెత్త తిండి (జంక్ ఫుడ్) తినడం మానుకోండి మరియు బయట తినడం పరిమితం చేయండి. ఎల్లప్పుడూ అనారోగ్యకరమైన వాటి కంటే ఆరోగ్యకరమైన వాటినే  ఎంచుకోండి. మీరు ఏమి తింటున్నారు ఎంత తింటున్నారు అనే దానిపై నిఘా ఉంచేందుగ్గాను ఆహార ప్యాకేజీలపై రాసిఉండే వివరణలను (కంటెంట్లను) చదవండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
     
  • తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా క్రమమైన వ్యాయామాలు
    ఓ 30 నిమిషాల నడక లేదా 15 నిమిషాల వేగవంతమైన (జాగింగ్) గమనం  మీ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సరిపోతుంది. కాబట్టి, మీ దినచర్యలలో ఈ వ్యాయామాలు పాటించేలా చూసుకోండి.
     
  • మద్యపానం, ధూమపానం మానుకోవడం లేదా పరిమితం చేయడం
    మద్యపానం, ధూమపానం మానుకోవడంవల్ల లేదా  పరిమితం చేయడం వల్ల మన శరీరంలో అధిక రక్తపోటు ముదరకుండా లేదా మరింత పెరక్కుండా నివారించవచ్చు. ధూమపానం మరియు మద్యం సేవిందడం అధిక రక్తపోటుకు ప్రమాద కారకాలు,  అందువల్ల, వాటిని పరిమితం చేయడానికి లేదా వీలైతే వాటిని పూర్తిగా విసర్జించేందుకు ప్రయత్నించండి.
 

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క వ్యాధినిర్ధారణ - Diagnosis of High Blood Pressure in Telugu

అధిక రక్తపోటు నిర్ధారణకు, మీరు మీ రక్తపోటుపరిమాణాన్ని కొలవడం కోసం డాక్టర్ను సందర్శించాలి. రక్తపోటును స్పిగ్మోమానోమీటర్ అని పిలవబడే ఒక పరికరం ఉపయోగించి కొలుస్తారు. ఈ పరికరం మీ ఎగువ చేయి అంటే భుజం కింది భాగమైన రెట్ట చుట్టూ ఒక గుడ్డ పట్టీని (కఫ్) బిగుతుగా మడవటం, ఆ తర్వాత చుట్టిన ఆ పట్టీ మడతలోనికి చేతితో గాలిని పంపు చేసే పరికరంతో గాలిని పంపు చేసి పంపడం ద్వారా రక్తపోటును కొలిచేందుకు రూపొందించబడింది. ప్రత్యామ్నాయంగా, ఎలక్ట్రానిక్ మెషీన్ను ఉపయోగించి కూడా రక్తపోటును అంచనా వేయవచ్చు. ఎగువ భుజంపై పట్టీ/కఫ్ ఉంచడానికి కారణం ఏమంటే ఇది బ్రాచియల్ ధమని అని పిలువబడే ఒక రక్తనాళాన్ని కలిగి ఉంది. చేతిలోని బ్రాచైయల్ ధమని కింద, అణఁగియున్నస్థితిలో ఇమిడిఉన్న సంపీడన పెద్ద ధమని ఉంది. రక్తపోటు కొలత సమయంలో, బిగుతుగా కట్టిన పట్టీలోనికి గాలిని పంపు చేసే పరికరంతో గాలి ఒత్తిడిని పెంచి రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. పెంచిన గాలి ఒత్తిడిని రిలీజ్ చేయడం ద్వారా వాయు ప్రసరణను మీ వైద్యుడు స్టెతస్కోప్ ను  ఉపయోగించి వినడానికి వీలవుతుంది. ఇంకా, సంఖ్యా కొలతలు కలిగిన పాదరసంతో కూడిన రక్తపోటు రీడింగ్స్ ని చూస్తాడు. రక్తపోటు కొలత యంత్రం ఆటోమేటిక్ అయితే, అది పాదరసం సంఖ్యాత్మక స్కేలును కలిగి ఉండదు, కానీ ప్రత్యక్ష ఎలక్ట్రానిక్ పఠన ప్రదర్శనను కలిగి ఉంటుంది. ప్రదర్శన తెర నేరుగా రక్తపోటు రీడింగ్స్ చూపిస్తుంది.

రక్తపోటును సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటుగా నమోదు చేస్తారు. సిస్టోలిక్ రక్త పీడనం అనేది హృదయ స్పందనల సమయంలో కొలుస్తారు, అయితే, డయాస్టొలిక్ రక్త పీడనం అంటే గుండె యొక్క సడలింపు కాలంలో కొలుస్తారు. రక్తపోటును  కొలిచినప్పుడు డయోస్టోలిక్ ఒత్తిడి ద్వారా సిస్టోలిక్ ఒత్తిడిగా సూచించబడుతుంది మరియు యూనిట్ పాదరసం యొక్క మిల్లిమీటర్ అంటే, mm యొక్క Hg గా కొలుస్తారు కొలిచిన రక్తపోటు యొక్క ఫలితాలను ఇలా అంచనా వేయవచ్చు:

  • సాధారణ రక్తపోటు - 120/80 mm Hg లేదా అంతకంటే తక్కువ
  • సాధారణ రక్తపోటు కంటే ఎక్కువ - 120/80 mm Hg పైన

మీరు డాక్టరు వద్దకు మొదటిసారి వెళ్ళినపుడు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీ డాక్టర్ మిమ్మల్ని అధిక రక్తపోటు రోగిగా నిర్ధారించడానికి మరియు చికిత్సా విధానాన్ని ప్రారంభించటానికి ముందు స్థిరమైన ఫలితాల కోసం మరిన్ని రీడింగ్స్ తీసుకుంటాడు. మీ మొదటి సందర్శన సమయంలో ఆందోళన లేదా భయము వలన మీ రక్తపోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందువల్ల, అనేక రీడింగ్లు అవసరమవుతాయి. మీరు అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలితే  డాక్టరు (అతను / ఆమె) ప్రారంభించిన చికిత్సలో రక్తపోటు యొక్క ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి, దానికి అనుగుణంగా చికిత్సను సవరించడానికి మీ డాక్టర్ మిమ్మల్ని తరచుగా తనను సందర్శించమని కోరతాడు.

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క చికిత్స - Treatment of High Blood Pressure in Telugu

అధిక రక్తపోటుకు పూర్తిగా చికిత్స చేయబడదు. కానీ వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా నివారించేందుకు తగిన జాగ్రత్తలు, సరైన సంరక్షణ మరియు అధికరక్తపోటు-వ్యతిరేక ఔషధాలతో వ్యాధిని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు చికిత్స మీ డాక్టర్ తీసుకున్న రక్తపోటు రీడింగులపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా చికిత్స ప్రారంభించటానికి ముందు రెండు లేదా అంతకంటే ఎక్కువ రీడింగులు తీసుకోవాలి.

  • మీకు 120/80 mm Hg లేదా అంత కంటే తక్కువ రీడింగ్ కల్గిన సాధారణ రక్తపోటు ఉంటే, మీ డాక్టర్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని, క్రమమైన వ్యాయామం చేయమని మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించమని మీకు సలహా ఇస్తారు.  
  • మీ సిస్టోలిక్ బిపి (బ్లడ్ ప్రెషర్) 120-129 mm Hg గా ఉంది, అయితే, డయాస్టొలిక్ BP 80 mm Hg కన్నా తక్కువ ఉంటే, మీ డాక్టర్ మిమ్మల్ని ప్రి-హైపర్టెన్షన్ వర్గంలోకి చేరే గంభీరమైన రక్తపోటు రోగిగా మిమ్మల్ని నిర్ధారిస్తారు. ఈ దశలో, మీరు మందులు వాడాల్సిన అవసరం లేదు, కానీ, మీ రోజువారీ దినచర్యలో కొన్ని ఆహారాలు మరియు వ్యాయామాలు చేర్చడం అవసరం కావచ్చు. ఇంట్లో ఎలక్ట్రానిక్ మెషీన్స్ ద్వారా ప్రతి 15 రోజులకు  ఒకసారి బిపిని పర్యవేక్షించమని లేదా అందుకోసం వైద్యశాలకు వెళ్ళమని మీ డాక్టర్ మిమ్మల్ని అడగవచ్చు.
  • మీ సిస్టోలిక్ బిపి 130-139 mm Hg మరియు డయాస్టొలిక్ బిపి 80 - 89 mm Hg కంటే తక్కువ ఉంటే, మీరు 1వ దశ- రక్తపోటును కలిగి ఉన్నారన్నమాట. ఈ సందర్భంలో, మీ వైద్యుడు మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ యాంటీ-హైపర్టెన్సివ్ ఔషధాలు తీసుకొమ్మని సలహా ఇస్తారు. అలాగే,  ఆహారంలో మార్పులు, వ్యాయామం, మరియు ఖచ్చితమైన బిపి పర్యవేక్షణ పట్ల శ్రద్ధ వహించమని మీ డాక్టర్ మీకు సూచిస్తారు. 
  • మీ సిస్టోలిక్ BP 140 mm Hg లేదా అంతకన్నా ఎక్కువ మరియు డయాస్టొలిక్ BP 90 mm Hg లేదా అంతకంటే తక్కువ ఉంటే, మీరు 2వ దశ రక్తపోటు లేదా అధిక రక్తపోటు కలిగి ఉన్నారన్నమాట. ఈ సందర్భంలో, కఠినమైన BP పర్యవేక్షణతో పాటు, మీ డాక్టర్ మీకు ఒకటి కంటే ఎక్కువ హైపర్టెన్షివ్ ఔషధాలు మరియు ఖచ్చితమైన ఆహారం మార్పు మరియు నిత్యవ్యాయామ నియమాలను  పాటించమని సలహా ఇస్తారు.
  • కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ACE ఇన్హిబిటర్స్, బీటా-బ్లాకర్స్ మరియు మూత్రవర్ధకాల్లాంటి (డైయూరెటిక్స్) మందుల్ని అధిక రక్తపోటు నివారణ (లేదా   యాంటీహైపెర్టెన్సివ్) ఔషధంగా మీరు ఉపయోగిస్తారు. ఈ మందులలో ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను చేర్చిన కలబోత మందుల్ని (combination medicines) మీ అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. మీ రక్తపోటు వ్యాధి తీవ్రత, రక్తపోటు రీడింగ్స్, మీ వయస్సు, మరియు మందుల లభ్యత ఆధారంగా మీ చికిత్స కోసం కావాల్సిన ఔషదాల ఎంపికను మీ వైద్యులే నిర్ణయిస్టారు.
  • మీ వైద్యుడు సలహా ఇచ్చినట్లుగా, అధిక రక్తపోటు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే, ఆహారంలో ఉప్పు పరిమితిని పాటిస్తూ, ఒత్తిడిని దరి చేరనీయకుండా రోజువారీ సాధారణ వ్యాయామాలను చేస్తూంటే మీ రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. పేర్కొన్న ఈ చర్యల్ని క్రమం తప్పకుండా పాటిస్తే అధిక రక్తపోటు వలన సంభవించే మరేఇతర  సంక్లిష్టతల్ని కూడా నివారిస్తాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు గురించి

  • ఆరోగ్యకర ఆహారసేవనం
    వేయించిన ఆహారపదార్థాలు, ఇతర చెత్త తిండ్లు (జంక్ ఫుడ్) తినడం ఆపి, మీ దిననిత్య ఆహారంలో పచ్చికూరగాయలు, తాజా పళ్ళు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర పదార్థాలను తినడం ప్రారంభించండి.
     
  • మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి
    మీకు మద్యపానం మరియు పొగాకుసేవనం అలవాటుంటే వాటిసేవనాన్ పరిమితం చేయడం లేదా వీలైతే అవి రెండింటినీ పూర్తిగా త్యజిస్తే గనుక మీ రక్తపోటు నియంత్రణకు ఎంతో సహాయపడుతుంది.
     
  • తక్కువ ఉప్పును ఉపయోగించడం, డబ్బాల్లో తినడానికి సిద్ధంగా ఉంచిన (canned foods) ఆహారాలు తినడాన్ని పూర్తిగా ఆపేయడం. 
     
  •  దృఢంగా ఉండటం (staying fit)
    మీరు నడవడం మరియు జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుంటే మీరు దృఢంగా ఉండడమే కాకుండా మీ అధిక రక్తపోటు కూడా నిరోధించబడుతుంది. మీరు ఈత, తీవ్రతరమైన వ్యాయామం వంటి కసరత్తుల్ని చేయచ్చు కానీ, మీ డాక్టర్ అనుమతితో మరియు నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలి.
     
  • ఒత్తిడి నిర్వహణ
    ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. యోగా, ధ్యానం, లోతైన శ్వాస-వ్యాయామాలు వంటి ఒత్తిడినిర్వహణా చర్యలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మరియు మీ రక్తపోటునూ నిర్వహించుకోవచ్చు.

జీవనశైలి నిర్వహణ

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు పాటించే జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ రోజువారీ జీవితంలో మీరు చేసుకునే మార్పులు అధిక రక్తపోటును నియంత్రించడానికి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆరోగ్యకరమైన చర్యలు మీ మందుల మోతాదు తగ్గింపుకు కూడా దారితీస్తుంది, అంటే కాదు, మరింత సంక్లిష్టతను నివారించి రక్తపోటును నియంత్రించవచ్చు. అటువంటి జీవనశైలి మార్పులు కొన్ని ఇక్కడ మీకోసం సూచిస్తున్నాం :

  • మీ బరువును గమనించండి  
    మీ శరీరబరువు వైపు ధ్యాస ఉంచి, జాగ్రత్తపడడం అనేది మీ రక్తపోటును నియంత్రించే అత్యంత ప్రభావవంతమైన మార్గం. బరువు పెరగడం వలన రక్తపోటూ పెరుగుతుంది, అలాగే బరువు తగ్గితే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఊబకాయం అనేది పెరిగిన రక్తపోటు మరింత విపరీతమయ్యేందుకు ఓ ప్రమాద కారకంగా ఉంటుంది. మీరు మీ ఎత్తు మరియు వయస్సుకు తగిన బరువును కల్గి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆదర్శ శరీర ద్రవ్యరాశి సూచిక ప్రకారం మనిషి బరువు “18 మరియు 24.5 kg /m2” మధ్య ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం
     
  • నిత్య వ్యాయామం:
    అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీ రోజువారీ దినచర్యలో  వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల నడక వంటి చర్యలు మీ రక్తపోటును నియంత్రించడంలో మీకు సహాయపడతాయి. ముఖ్యంగా, మీరు మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇతర వ్యాయామాలైన ఈత, నృత్యం, జాగింగ్, పరుగు మొదలైనవాటిని మీ రోజువారీ కార్యకలాపాలలో భాగంగా చేసుకోవచ్చు. ఏదైనా వ్యాయామం చేసే ముందు మీ డాక్టర్ లేదా భౌతిక వ్యాయామ నిపుణుడి (fitness expert) ని సంప్రదించండి.
     
  • నియమితమైన DASH ఆహారాన్ని అనుసరించండి
    మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కీలకమైనది. ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి ఏమొస్తాయంటే తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు తక్కువ కొవ్వు కల్గిన డెయిరీ, పాల ఉత్పత్తులు. ఇంకా, మంచి కొలెస్ట్రాల్ తో కూడిన ఆహారాలు మరియు సంతృప్త కొవ్వులు (saturated fats) కూడా ఆరోగ్యకర ఆహారాల జాబితాలోకి వస్తాయి. ఈ నియమిత ఆహారాన్ని “DASH-ఆహారం” అని పిలుస్తారు. DASH అంటే Dietrary Approaches to Stop Hypertension.  ఎప్పటికప్పుడు మీరు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను మార్చడం కష్టంగా ఉన్నందున మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కోసం ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. వంటగదిలో అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంచవద్దు, ఎందుకంటే అలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మీరు ఏర్పరుచుకున్న నియమితఆహారాన్నిచెదరగొట్టవచ్చు.
     
  • ఉప్పు తినడాన్ని పరిమితం చేయండి  
    రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి తినే ఉప్పును తగ్గించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ ఆహారపదార్థాల ప్యాక్ లపై ఉండే లేబుల్స్ లో ఏమి రాసుందో చదవండి.  మీ డాక్టర్ మీకు మీరు తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించమని సూచిస్తారు. తినే ముందు, వండి సిద్ధం చేసిన వంటలకు/ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పును చిలకపోవడం మీకే లాభదాయకం.  
     
  • మద్యపానాన్ని పరిమితం చేయండి
    మద్యపానాన్ని ఓ మోస్తరు మోతాదులో తీసుకుంటే గుండెకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, అధికంగా తీసుకుంటే అది గుండెకు హానికరం కావచ్చు. మీరు మద్యపానం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవటానికి మీ వైద్యుడితో సంప్రదించవచ్చు. మీరు మద్యపానాన్ని పరిమితం చేసే దిశగా, ఎంత (తక్కువ)  పరిమాణంలో మద్యం పుచ్చుకోవచ్చో వైద్యుడ్ని అడిగి తెల్సుకుని ఆ ప్రకారం మాత్రమే తీసుకోవచ్చు.
     
  • ధూమపానం వదిలేయండి
    ధూమపానం (smoking) రక్తపోటును పెంచుతుంది. బీడీ/సిగరెట్ ధూమపానాన్ని మీరు నెమ్మదిగా తగ్గించొచ్చు, అటుపై ధూమపానాన్ని పూర్తిగా మానేయొచ్చు, దీనివల్ల గుండెజబ్బులొచ్చే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కూడా మీరు ధూమపానం నిలిపివేయవచ్చు.
     
  • ఒత్తిడిని నిర్వహించండి
    ఒత్తిడితో కూడిన జీవనశైలి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించుకొని, నెమ్మదిని అలవర్చుకుని,  ధ్యానం చేయడం నేర్చుకొని దాన్ని క్రమంగా అభ్యసించడం ద్వారా మీ రక్తపోటును నియంత్రించడం సాధ్యపడుతుంది.
     
  • మీ డాక్టర్ని సందర్శించండి
    వైద్యుడితో క్రమమైన సందర్శనలు మరియు వైద్యుడి చేత వ్యాధి నయం చేసుకునే క్రమంలో వస్తున్న పురోగతిని తనిఖీ చేయించుకోవడం లాంటి చర్యలు మీ రక్తపోటును పర్యవేక్షించేందుకు సహాయపడుతాయి. అంతే కాక,  మీ డాక్టర్ మీకు కొనసాగుతున్న చికిత్స ప్రభావాన్ని గమనించగల్గుతారు. మరియు చికిత్సలో అవసరమైన మార్పులను చేయవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మీకు వ్యాధిలక్షణాలు లేకుంటే కూడా, సాధారణ రక్తపోటు పరీక్ష చేయించుకోవడం వల్ల మీరు ఇంకా అధిక రక్తపోటుతో బాధపడుతున్నదీ లేనిదీ నిర్ధారణ అవుతుంది. 
     
  • హితుల మద్దతు కోరండి
    ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మరియు మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మద్దతు చాలా ముఖ్యమైనది కాబట్టి వారి మద్దతును తీసుకోండి.
L-Arginine Capsule
₹599  ₹695  13% OFF
BUY NOW

అధిక రక్తపోటు (హై బిపి) యొక్క చిక్కులు - Complications of High Blood Pressure in Telugu

రోగ నిరూపణ

అధిక రక్తపోటు యొక్క నిరూపణ అనేది రోగి అంతర్లీన వ్యాధికారణం మరియు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అత్యవసర రక్తపోటున్న రోగి   విషయంలో, రోగ నిర్ధారణ బలహీనంగా ఉంటుంది మరియు అధిక రక్తపోటు బాగా నియంత్రించబడకపోతే మరింత సంక్లిష్టతలకు దారితీయవచ్చు. ద్వితీయ రక్తపోటు విషయంలో, వ్యాధికి గల కారణానికి చికిత్స చేస్తే, రోగనిర్ధారణ క్రమంగా మెరుగుపడుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వయస్సు పెరుగుదలతో, రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇంకా, గుండె జబ్బులు మరియు మూత్రపిండ వైఫల్యం వంటి సమస్యలు కూడా వయస్సు పైబడిన వారిలో వస్తాయి. రక్తపోటులో స్వల్ప తగ్గింపు తీవ్రమైన వైకల్యాలు మరియు సమస్యలను నివారించవచ్చు. అందువల్ల, మీరు మీ అధిక రక్తపోటును పర్యవేక్షించుకుంటూనే దాన్ని  నియంత్రణలో ఉంచడానికి మీ డాక్టరు యొక్క సూచనలను ఎల్లప్పుడూ అనుసరించాలి.

ఉపద్రవాలు
ఔషధసేవనం మరియు జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటును బాగా నియంత్రించకపోతే, పక్షవాతం వంటి పలు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఆ సమస్యలేవంటే:  

  • బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం  
    మెదడు కణాలు ఆకస్మికంగా మరణానికి గురవ్వడం మూలంగా మారణాంతకమైన పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ దాపురిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మెదడురక్తనాళాల్లో అడ్డంకులేర్పడ్డం  లేదా ఆ రక్తనాళాలు మూసుకుపోవడమో లేదా సంకోచించుకుపోవడమో జరుగుతుంది. ఇది పక్షవాతం లేదా మాట పడిపోవటానికి దారి తీస్తుంది.
     
  • గుండె-ధమనుల వ్యాధులు
    హృదయ సంబంధమైన వ్యాధులలో రక్తపోటు పెరుగుదల కారణంగా, గుండె-ధమనులు దెబ్బతినడం,  ధమనుల సంకోచానికి కారణమయ్యే రక్త కణాల నష్టం జరుగుతుంది. ఫలితంగా, గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది.
     
  • గుండెపోటు
    గుండెకు రక్త ప్రవాహంలో ఆకస్మిక క్షీణత ఏర్పడి గుండెపోటుకు దారి తీస్తుంది. దీన్నే “మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్” అని కూడా పిలుస్తారు.
     
  • దీర్ఘకాల మూత్రపిండ వైఫల్యం
    దీర్ఘకాల రక్తపోటు మీ మూత్రపిండాలను దెబ్బ తీస్తుంది.
     
  • మరణం  
    రక్తపోటు చాలా ఎక్కువగా పెరిగిపోయి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది, అందుకు తక్షణమే  తీవ్రమైన వైద్య సంరక్షణ, సపర్యల్ని (intensive care) అందించకపోతే మరణానికి దారితీస్తుంది.


వనరులు

  1. Roy A, Praveen PA, Amarchand R, et al. Changes in hypertension prevalence, awareness, treatment and control rates over 20 years in National Capital Region of India: results from a repeat cross-sectional study. BMJ Open 2017;7:e015639. doi: 10.1136/bmjopen-2016-015639
  2. Kayce Bell, June Twiggs, Bernie R. Olin. Hypertension: The Silent Killer. Alabama pharmacy Association; 2015.
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; High Blood Pressure
  4. Whelton PK, He J, Appel LJ, Cutler JA, Havas S, Kotchen TA, Roccella EJ, Stout R, Vallbona C, Winston MC, Karimbakas J. Primary prevention of hypertension: clinical and public health advisory from The National High Blood Pressure Education Program.. National High Blood Pressure Education Program Coordinating Committee. JAMA. 2002 Oct 16;288(15):1882-8. PMID: 12377087.
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Preventing High Blood Pressure: Healthy Living Habits
  6. Chobanian AV, Bakris GL, Black HR, Cushman WC, Green LA, Izzo JL Jr, Jones DW, Materson BJ, Oparil S, Wright JT Jr, Roccella EJ. Seventh report of the Joint National Committee on Prevention, Detection, Evaluation, and Treatment of High Blood Pressure.. Joint National Committee on Prevention, Detection, Evaluation, and Treatment of High Blood Pressure. National Heart, L
  7. Thasvi Kareem, Sudha M J, Ramani PT, Ashkar Manakkalavalappil, Parvathy G. Prescription pattern of antihypertensive drugs in a tertiary care hospital in Kerala and adherence to JNC-8 guidelines.. Universal Journal of Pharmaceutical Research. 2018; 3(3): 1-3.

అధిక రక్తపోటు కొరకు మందులు

Medicines listed below are available for అధిక రక్తపోటు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for అధిక రక్తపోటు

Number of tests are available for అధిక రక్తపోటు. We have listed commonly prescribed tests below: